Grand Wedding for Peepal and Neem Trees
రావి,వేప చెట్లకు వైభవంగా వివాహం
పరకాల,నేటిధాత్రి
https://youtu.be/RZpL3c89hkw?si=TOQIaFM2ZDP_yM6h
మండలంలోని పైడిపల్లి గ్రామ శివారు వనంలో ఉన్న రావి చెట్టు మరియు వేప చెట్టుకు స్థానిక గీత కార్మికుల సంఘం నాయకులు సంప్రదాయబద్ధంగా వివాహ కార్యక్రమం నిర్వహించారు.శివపార్వతుల స్వరూపాలుగా ఈ చెట్లను భావిస్తూ పూజలు నిర్వహించడం విశేషం.ప్రకృతి సిద్ధంగా పక్కపక్కనే పెరిగి పెద్దవిగా ఎదిగిన రావి, వేప చెట్లు గ్రామస్తుల దృష్టిని ఆకర్షించాయి.దేవాలయ పరిసరాల్లో ఇలాంటి చెట్లు కలిసి ఉండటం సాధారణమని గుర్తుచేసుకున్న కొందరు, వాటికి వివాహం జరిపించాలని నిర్ణయించారు.అనంతరం పురోహితులను సంప్రదించి శుభముహూర్తంలో వివాహ వేడుకను నిర్వహించారు.ఈ సందర్భంగా వేద మంత్రోచ్చారణల మధ్య కంకణ బంధనం,తాళిబొట్టు కట్టడం వంటి కార్యక్రమాలు నిర్వహించగా,స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరై వేడుకను వీక్షించారు.ఈ వివాహం నిర్వహించడం వల్ల కుజదోషం వంటి గ్రహదోషాలు తొలగుతాయని నిర్వాహకులు తెలిపారు. ప్రకృతి పట్ల భక్తి,ఆచారాల పట్ల నమ్మకాన్ని ప్రతిబింబించే ఈ కార్యక్రమం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

శివపార్వతుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న సోదా రామకృష్ణ
గౌడ సంఘం ఆధ్వర్యంలో పైడిపల్లిలోని(తాటివనంలో)నిర్వహించిన శ్రీ శివ పార్వతి(రావి చెట్టు వేప చెట్టు)కళ్యాణ మహోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న పరకాల పట్టణ కాంగ్రెస్ పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు సోదా రామకృష్ణ,పరకాల గౌడ సంఘ నాయకులు బండి సదానందం,బండి కుమార్, దొమ్మటి సదానందం,మార్క సంపత్,దేశిని శ్రీను,దేశిని రాజమౌళి,గుర్రం సదానందం, బైరి సదానందం,మార్క రఘుపతి,దూలం వేణు, బండి రాజు,రాజేష్ సమన్వయ కమిటీ సభ్యులు ఏకు రాజు,నల్లల అనిల్ కుమార్,బొచ్చు జెమిని తదితరులు పాల్గొన్నారు.
