Buy Quality Paddy as Per Rules
నిబంధనల ప్రకారం రైతుల వద్ద నుండి నాణ్యమైన ధాన్యం కొనుగోలు చేయాలి
జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు
మంచిర్యాల,నేటి ధాత్రి:
https://www.youtube.com/live/I8TAiTEzfEk?si=9ETzhzTfT3omt0my
ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మద్దతు ధర చెల్లించి రైతుల వద్ద నుండి దాన్యం కొనుగోలు చేస్తుందని,ఈ క్రమంలో కొనుగోలు కేంద్రాల నిర్వహకులు ప్రభుత్వ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) వి.రాములు అన్నారు.గురువారం జిల్లాలోని జైపూర్ మండల కేంద్రం,చెన్నూర్ మండలం సోమనపల్లి,ఆస్నాద్ లలో ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శించి కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు.ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం మద్దతు ధర చెల్లించి రైతుల వద్ద నుండి ధాన్యం కొనుగోలు చేయడం జరుగుతుందని తెలిపారు.ఈ క్రమంలో రైతులు నిబంధనల ప్రకారం వరి ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకువచ్చేలా రైతులకు అవగాహన కల్పించి, నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని తెలిపారు.అకాల వర్షాల కారణంగా తడిసిన ధాన్యాన్ని ఆరబెట్టి త్వరగా మిల్లులకు తరలించాలని నిర్వాహకులకు సూచించారు.ఆయా కేంద్రాలలో రైతులతో మాట్లాడి ధాన్యం కొనుగోలు ప్రక్రియలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందని, రైతులు తాలు,తప్ప,మట్టి గడ్డలు, తేమ లేని ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని తెలిపారు.రైతుల కోసం కొనుగోలు కేంద్రాలలో త్రాగునీరు,నీడ,తూకం యంత్రాలు,ప్యాడి క్లీనర్లు,ఇతర సదుపాయాలు ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.జైపూర్ మండలం ఇందారం లోని జయలక్ష్మి రైస్ మిల్,భీమారం మండల కేంద్రంలోని సమత ఆగ్రో ఇండస్ట్రీస్ రైస్ మిల్లులను సందర్శించి కొనుగోలు కేంద్రాల నుండి కేటాయించిన ప్రకారంగా రైస్ మిల్లులకు తరలించిన ధాన్యాన్ని త్వరగా దిగుమతి చేసుకోవాలని తెలిపారు.ఒకరోజులో కనీసం 10 లారీల ధాన్యాన్ని దిగుమతి చేసుకోవాలని,అవసరం మేరకు హమాలీల సంఖ్య పెంపొందించుకోవాలని సూచించారు.అనంతరం చెన్నూర్, భీమారం లలో గల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఇంటర్మీడియట్ గోదాములను పరిశీలించారు.ఈ కార్యక్రమంలో ఆయా మండలాల తహసీల్దార్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
