Implement Promises to Telangana Activists: Bhaskarachari
ఉద్యమకారులకు హామీలు అమలు చేయాలి-భాస్కరాచారి
పరకాల,నేటిధాత్రి
తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయడం పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి బీజేపీ సీనియర్ నాయకులు,తెలంగాణ ఉద్యమకారుడు మారేడుగొండ భాస్కరాచారి హర్షం వ్యక్తం చేశారు.ఉద్యమకారులు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎన్నో త్యాగాలు చేశారని పేర్కొన్న ఆయన,గత ప్రభుత్వం ఉద్యమకారులను విస్మరించిందని విమర్శించారు.ప్రస్తుత ప్రభుత్వం మేనిఫెస్టోలో హామీ ఇచ్చిన 250 గజాల ఇంటి స్థలం,డబుల్ బెడ్రూమ్ ఇల్లు,నెలవారీ ఆర్థిక సహాయం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.అర్హులైన ఉద్యమకారులను గుర్తించి వారికి తగిన గౌరవం ల్,న్యాయం చేయాలని భాస్కరాచారి కోరారు.
