Students Honored at Akshara School Awards Ceremony
అక్షర విద్యార్థులకు బహుమతుల ప్రధానం
రామడుగు, నేటిధాత్రి:
కరీంనగర్ జిల్లా రామడుగు మండలం గోపాలరావుపేట గ్రామంలోని అక్షర హై స్కూల్ లో “అన్వల్ స్పోర్ట్స్ మీట్” లో బహుమతులు సాధించిన విద్యార్థులకు, అకాడమిక్ లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు మరియు ఐఐటిలో ర్యాంక్ లు సాధించిన విద్యార్థులకు బహుమతుల ప్రదానం జరిగింది. ఈకార్యక్రమానికి రామడుగు మండల విద్యాధికారి రంగనాథ్ శర్మ ముఖ్య అథితిగా హాజరై వివిధ కేటగిరీలలో బహుమతులు గడిచిన విద్యార్థులకు మెడల్స్ మరియు ప్రశంస పత్రాలు అందించారు. విద్యార్థిల జీవిత లక్ష్యాలను తెలుసుకోని,వారి ప్రతిభను కొనియాడారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ ఉన్నత లక్ష్యాలతో ముందుకు వెళ్లాలని, తల్లిదండ్రులకు, పాఠశాలకు మంచి పేరు తీసుకు రావాలని ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
