Sarpanch Birthday Celebrations
జన్మదిన సందర్భంగా మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ
పోతిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ గజ్జల మొగిలయ్య
వీణవంక, నేటి ధాత్రి:
వీణవంక మండల పరిధిలోని పోతిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ గజ్జల మొగిలయ్య జన్మదిన వేడుకలను ఉపాధి హామీ కూలీల వద్ద ఘనంగా నిర్వహించుకున్నాడు ఉపాధి కూలీలకు మజ్జిగ ప్యాకెట్లతో పాటు స్వీట్లు పంపిణీ చేశారు అనంతరం పోతిరెడ్డిపల్లి యూత్ నాయకులు వొల్లాల శ్రీకాంత్ గౌడ్ ఆధ్వర్యంలో బస్టాండ్ కూడలి వద్ద కేక్ కట్ చేసి పంపిణీ చేశారు అనంతరం పలువురు మాట్లాడుతూ…

గజ్జల మొగులయ్య జన్మదినాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేయడం చాలా సంతోషకరమని మరిన్ని జన్మదిన వేడుకలు ఆయన జరుపుకోవాలని గ్రామ అభివృద్ధికి తన వంతు సహకారాలు అందివ్వాలని ఆ భగవంతుని ఆశీర్వాదం ఉండాలని వారు కోరారు ఈ కార్యక్రమంలోయూత్ నాయకులు ఐలవేణి కుమార్,సుమన్, రమేష్, తిప్పని ప్రశాంత్, గజ్జల శ్రీకాంత్, ప్రకాశ్,సునీల్, రాకేష్, వివేక్,అభిలాష్,నితిన్, అరవింద్, బబ్బులు, శ్రీధర్, శాంతికుమార్, శ్రీనాథ్ తదితరులు పాల్గొన్నారు.
