Modi Public Meeting
ప్రధాని నరేంద్ర మోడి భారీ బహిరంగ సభను జయప్రదం చేయండి
బిజెపి జిల్లా మీడియా కన్వీనర్ ఊరటి మునెందర్
భూపాలపల్లి నేటిధాత్రి
https://www.youtube.com/live/NVKn6LK99Oc?si=nYqwNtvDwcnRbt1Q
భారత ప్రధాని నరేంద్ర మోడీ మూడోసారి గెలిచిన తరువాత తెలంగాణకు మొదటిసారిగా విచ్చేస్తున్న సందర్భంగా రేపు హైదరాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో నిర్వహించ తలపెట్టిన భారత ప్రధాని నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభకు భూపాలపల్లి జిల్లా ప్రజలు,పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని భారతీయ జనతా పార్టీ జయశంకర్ భూపాలపల్లి జిల్లా మీడియా కన్వీనర్ ఊరటి మునేందర్ ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్రాన్ని దేశాభివృద్ధిలో భాగస్వామ్యం చేయడమే లక్ష్యంగా ప్రధాని మోదీ ఈ సభకు వస్తున్నారని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,అభివృద్ధి పనులకు ఆకర్షితులై ప్రజలు స్వచ్ఛందంగా బీజేపీ వైపు వస్తున్నారని ఆయన పేర్కొన్నారు.ఈ బహిరంగ సభ పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుందని, జిల్లాలోని అన్ని మండలాలు, గ్రామల నుంచి బీజేపీ రాష్ట్ర నాయకులు జిల్లా నాయకులు మండల నాయకులు,శక్తి కేంద్ర ఇన్చార్జిలు,బూత్ అధ్యక్షులు, కార్యకర్తలు,అభిమానులు పెద్ద ఎత్తున తరలిరావాలని ఆయన కోరారు.
