Praveen Reddy Extends Help to Poor Families
నిరుపేద మృతుల కుటుంబాలకు ప్రవీణ్ రెడ్డి చేయూత
మానవత్వం చాటుకున్న డాక్టర్ సత్యనారాయణ తనయుడు
గణపురం నేటి ధాత్రి
గణపురం మండల కేంద్రానికి చెందిన నిరుపేద మృతుల కుటుంబాలకు హైదరాబాద్లో నివసిస్తున్న ప్రవీణ్ రెడ్డి తన మానవతా దృక్పథంతో ఆర్థిక సహాయం అందించారు. డాక్టర్ సత్యనారాయణ కుమారుడు ప్రవీణ్ రెడ్డి ఆ కుటుంబాల కష్టాలు తెలుసుకుని స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు.ప్రవీణ్ రెడ్డి సూచన మేరకు వారి మిత్రబృందం దిండు ప్రకాష్_, పోషల మహేష్ గౌడ్ గడ్డమీది హరీష్ బీసీ సంఘం జిల్లా నాయకులు అవుసుల దేవేందర్_ ఈ కార్యక్రమంలో పాల్గొని మృతుల కుటుంబ సభ్యులకు నేరుగా ఆర్థిక సహాయం అందజేశారు.
సహాయం అందుకున్న కుటుంబాలు ప్రవీణ్ రెడ్డి తో పాటు సహకరించిన మిత్రబృందానికి కృతజ్ఞతలు తెలిపాయి. దుఃఖంలో ఉన్న కుటుంబాలకు అండగా నిలిచి మానవత్వం చాటుకోవడం అభినందనీయమని గ్రామస్తులు కొనియాడారు.
