విముక్తి విధాత…ప్రగతి ప్రధాత!

https://epaper.netidhatri.com/

` అరవై ఏళ్ల అమావాస్య చీకటిని పారద్రోలాడు.

` తెలంగాణ కు వెలుగులు పంచిన సూర్యుడు.

 

`సమైక్య పాలకులు ఎడారి చేస్తే, తెలంగాణ తెచ్చి సస్యశ్యామలం చేశాడు.

`పచ్చదనం లేని తెలంగాణను వన రాష్ట్రం చేశాడు.

` తెలంగాణను హరితహారంతో పచ్చని పందిరి చేశాడు.

`తొండల గుడ్లు తప్ప పంటలా? అన్న చోటును మాగాణం చేశాడు.

`తెలంగాణ కు నీళ్లు తెచ్చి పాడి పంటల సిరులు కురిపించాడు.

`నిత్యం చీకట్లలో గడిపిన తెలంగాణ కు కరంటు జిలుగులు తెచ్చాడు.

`పగలంతా, రేయంతా వెలుగులు నింపాడు.

`రైతుకు ఇరవై నాలుగు గంటల ఉచిత కరంటు ఇస్తున్నాడు.

`ఆసరా ఫెన్షన్లతో పెద్దకొడుకయ్యాడు.

`కళ్యాణ లక్ష్మి తో మామయ్యగా మారాడు.

`తెలంగాణ తెచ్చి తెలంగాణ పితగా కీర్తి నందుకున్నారు.

`మా సారు అని వేనోళ్ల కొనియాడబడుతున్నాడు.

` కేసిఆర్‌ చేతిలోనే తెలంగాణ పదిలమని ప్రజలు నమ్ముతున్నారు.

`మరో సారి కూడా మన సారునే గెలిపించుకుంటామంటున్నారు.

`సారు సర్కారే కావాలనుకుంటున్నారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

చీకటోళ్ల లోకంలో కొత్త పొద్దు పొడుపురా! అమావాస్య చీకటిలో దీపావళి జాతరా!! అంటూ ఓ కవి రాసిన జీవనచిత్రం సరిగ్గా తెలంగాణ పడిన గోసను తెలియజేస్తుంది. అయితే తెలంగాణకు చీకట్లు సహజంగా రాలేదు. తెలంగాణ చీకటోళ్ల లోకం ఒట్టిగనే కాలేదు. పరాయి పాలకులు పగబట్టి చేశారు. తెలంగాణ జీవితాలను చీకటి చేశారు. బతుకులు ఆగంచేశారు. ఒకనాడు ఎటు చూసినా ఏమున్నది నా తెలంగాణ. ఊర్లన్నీ వలసపోయి, ఇళ్లన్నీ కూలిపోయి, చేతివృత్తులు మాయమైపోయి, దిక్కులేని బతుకుల కాలం చూసి గొడగొడ ఏడ్చిన తెలంగాణ. ఎటు చూసినా బీడువారి నోర్లు తెరిచి నీటి చుక్క కోసం ఎదురుచూసిన తెలంగాణ. దుబ్బలుగా మారి, పంటలకు పనికి రాకుండాపోయిన తెలంగాణ. ఏ చెలక చూసినా ఎడారే…ఏ చెరువు చూసినా మొలిచిన తుమ్మలే…పల్లెల్లో నీటి కటకటలే… సగటు తెలంగాణ వాది కడుపు రగిలినా, ఆకలి ముందు కోపం దిగమింగుకొని బతికిన రోజులవి. నేడు నీటి జాడలకు కొత్త నడకలు నేర్పిన తెలంగాణ. నీటి పరవళ్ల తెలంగాణ. పంటల పరవశంలో తెలంగాణ. కరువు పారిపోయిన తెలంగాణ. బీడుకానరాని తెలంగాణ. చెరువులు బాగు పడ్డ తెలంగాణ. చెరువులు గంగాళాలైన తెలంగాణ. కాళేశ్వరం నీరు కాలువల్లో పరుగులు పెడుతున్న తెలంగాణ. సాగు సస్యశ్యామల తెలంగాణ. పడావు బడ్డ భూముల్లో పుష్కలమైన పంటల తెలంగాణ. పల్లె మురుస్తున్న తెలంగాణ. పచ్చదనం వెల్లివిరిసిన తెలంగాణ. అరవైఏళ్ల గోసను తెలంగాణ పొలిమేరలకు తరిమిన తెలంగాణ. సంక్షేమ తెలంగాణ. సాధికారిత సాధించిన తెలంగాణ. చేతి వృత్తులకు మళ్లీ జీవమైన తెలంగాణ. పల్లెబతుకుల్లో వెలుగులు నిండిన తెలంగాణ. పల్లె మరుస్తున్న తెలంగాణ. పట్నం ప్రగతి తెలంగాణ. పల్లెల్లో వెలుగుల తెలంగాణ. వేకువలో వెండి వెన్నెల తెలంగాణ. ప్రగతి తెలంగాణ. బంగారు తెలంగాణ. పదేళ్లలో దార్శనికుడు కేసిఆర్‌ ఆవిష్కరించిన బంగారు తెలంగాణ. బాగు పడిన తెలంగాణ. బంగారు మాగాణం నా తెలంగాణ. పాడ పంటల తెలంగాణ. పచ్చదనంతో మురుస్తున్న తెలంగాణ.

సమైక్య పాలకుల దాష్టికానికి కకావికలమైన తెలంగాణ కేసిఆర్‌ రూపంలో తిరిగి వెలుగులు నింపుకున్నది.

ఆగమైన చెరువులు నీళ్లునింపుకున్నవి. . ఆనవాలు లేకుండాపోయిన చెరువులు గంగాళాలైనవి. రూపు చెదిరిపోయిన పల్లెలు పండగ చేసుకుంటున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో పరాయి బతుకులైన తెలంగాణ జీవితాలు ఆత్మ గౌరవాన్ని నిలుపుకున్నాయి. పరాయి పాలనలో బిక్కుబిక్కు జీవితాలు వెలుగులు నింపుకున్నాయి. మన రాష్ట్ర్రం మన తెలంగాణ అని తలెత్తుకున్నాయి. నాడు విద్య లేదు.విలువ లేదు. నేడు తెలంగాణ వ్యాప్తంగా 1000 గురుకులాలు. నాడు ఉపాధి లేదు. నేడు తెలంగాణ యువతుక ఐటి కొలువులు. నాడు పంటలకు దిక్కులేదు. నేడు కరువుకు తెలంగాణలో చోటు లేదు. నాడు ఆకలి తీరింది లేదు. నేడు దేశానికి అన్నం పెడుతున్నాం. నాడు కరువు కాటుకు బతికింది లేదు. నేడు కరువునే కాటేసేంత అన్నపూర్ణ అయ్యింది. నాడు కొట్లాడినా లాభం లేదు. పల్లెల్లో ఎండుటాకుల అలజడి…పట్టణాల్లో కానరాని ప్రగతి. ఇదీ నాటి తెలంగాణ దుస్దితి. సమైక్య పాలనలో తెలంగాణ పల్లెల్లో కరంటు లేక, రాక, సాగుకు ఎప్పుడొస్తుందో తెలియక, ఎండుతున్న పంటలను చూసిన విలవిలలాడిన తెలంగాణ.
ఉమ్మడి పాలకుల చీకటి నుంచి తెలంగాణ విముక్తి చెందింది.
కేసిఆర్‌ పట్టుదల ముందు, పంతం ముందు, ఆత్మగౌరవ నినాదం ముందు ముందు, ఉద్యమం ముందు, పోరాటం తట్టుకోలేక సమైక్య పాలన విరగడైంది. తెలంగాణ రాష్ట్రం సిద్దించింది. పారే ఏరు ఎండిపోయి వెక్కిరిస్తుంటే తెలంగాణ గుండె పగిలిపోయింది. ఒట్టిపోయి వాగు చుక్క నీరు మోసుకుపోలేక పోతే కేసిఆర్‌ కంట తడినుంచి కన్నీరొలికింది. ఆ క్షణం జై తెలంగాణ అని ఆ కన్నీరు నినదించింది. కేసిఆర్‌ గొంతులో నుంచి ప్రపంచానికి వినిపించింది. కేసిఆర్‌ కంటి నుంచి జారి పడిన కన్నీటి చుక్క పోరాటం మొదలు పెట్టింది.

ఆ చుక్కే తెలంగాణ భూమిని తడిపేందుకు మొదటి చినుకైంది.

ఆ నాడు ఎత్తిన పిడికిలి కేసిఆర్‌ తెలంగాణ తెచ్చేదాకా విప్పలేదు. ఎత్తిన జెండా దించలేదు. ఎన్ని అవాంతరాలు ఎదురైనా చలించలేదు. బెదిరింపులకు అదరలేదు. కేసులకు బెదరలేదు. ప్రాణాలను సైతం లెక్క చేయలేదు. తెలంగాణ సాదనే జీవిత పరమావధి చేసుకున్నాడు. తెగించి కొట్లాడి తెలంగాణ తెచ్చి వీరుడయ్యాడు. తెలంగాణ తల రాత మార్చిన విధాతయ్యాడు. పట్టిన పట్టు విడవకుండా, ఒక్కడుగా మొదలై, ఒక్కటే అడుగై, ఒకరినొకరు ఆయనలో అడుగులో అడుగై, లక్షల మంది కేసిఆర్‌లను తయారు చేసిండు. పద్నాలుగేళ్ల నిరంతర పోటారం చేశాడు. రక్తపు చుక్క చిందించకుండా తెలంగాణ సాధించాడు. అరవై ఏళ్ల తెలంగాణ కల నెరవేర్చాడు. తెచ్చిన తెలంగాణ బంగారు తెలంగాణ చేశాడు. సాగుకు ఇరవైనాలుగు గంటల కరంటు ఇచ్చి రైతన్నను రాజునే చేశాడు. నా తెలంగాణ కోటిన్నర సాగు మాగాణ చేశాడు. మిషన్‌ కాకతీయతో 46వేల చెరువులకు మళ్లీ జీవం పోశాడు. కాకతీయుల కాలం కళ్ల ముందుకు తెచ్చాడు. చెరువులన్నీ నిండగ, ఎండాకాలంలో మత్తళ్లు దుంకంగ, వాగులు ఒర్రెలు గోదారి జలాలు పారంగ, జలజలగలగలలు కళ్ల ముందు కదలాడంగా తెలంగాణ నిజప్రపంచమైంది. సంక్షేమంలో మేటిగా అడుగులేస్తోంది. ప్రగతిలో పరుగులు పెడుతోంది.

ఆకుపచ్చ తెలంగాణ ఆవిష్కారమైంది.

మిషన్‌ భగీరధతో తెలంగాణ పల్లెల్లోకి గోదారి పరవళ్లు పరుగులు తీసి, ఆడ పడుచుల కాళ్లు కడుగుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టుతో తెలంగాణ చరిత్రను పదిలం చేసి, పది కాలాలపాటు తెలంగాణకు నీటి గోస తీరింది. సస్యశ్యామల తెలంగాణలో బంగారు సిరులు పండుతున్నాయి. స్వపరిపాలనతో ఆత్మ గౌరవం వెల్లివిరిస్తోంది. నోటితో నవ్వి, నొసటితో వెక్కిరించిన వారు కూడా అబ్బుర పడేలా తెలంగాణ తలెత్తుకొని నిలబడిరది. పల్లెలు ప్రగతికి పట్టుగొమ్మలు. పల్లె వికాసమే దేశ వికామని నాయకులు నమ్మితే చాలు…పల్లె సింగారించుకుంటుంది. పచ్చదనంతో సిరులారబోసుకుంటుంది. పసిడి పంటలకు నెలవౌతుంది. పాడి పంటలకు కొదువ లేకుండాపోతుంది. దేశానికి అన్నం పెట్టే ధైర్యం రైతన్నలో కనిపిస్తుంది. వారి మోములో ఎప్పుడూ చిరునవ్వు తొనికిసలాడుతుంది. సాగు అనగానే పులకించేంది…తరించేది రైతే…ఆ రైతు మేలు కోరిన రాజ్యాలు కళకళలాడాయి.
పల్లె కష్టం, పాడి కష్టం, ఆకలి వేధనలు, ఆక్రందనలు తెలిసిన నాయకుడు పాలకుడైతే కరువు పారిపోతుంది.
కష్టం పొలిమేర దాటి రావాలంటే భయపడుతుంది. సంతోషం ఇంటింటా వెల్లివిరిస్తుంది. అది మన తెలంగాణలా వుంటుంది. పల్లె శోభితమై మురుస్తోంది. పంటల రాశులు చూసి పరవశిస్తుంది. పారుతున్న నీళ్లు, పచ్చని చేలు, సంబురపడుతుంది. పాడి పంటలతో తెలంగాణ కళకళలాడుతోంది. తన కన్నీటి పొరల్లో నాలుగు దశాబ్దాల పాటు దాచుకున్న తెలంగాణ స్వప్నం నిజంచేసిన ముఖ్యమంత్రి కేసిఆర్‌, సువర్ణ పాలనతో స్వర్ణయుగం తెచ్చాడు. బీడు వారిన భూములను సస్యశ్యామం చేశాడు. తొండలు కూడా గుడ్లు పెట్టవని ఎగతాళి చేసిన భూములకు కోట్ల ధరలు పలికేలా చేశాడు. అటు సాగు, ఇటు నీరు, కరంటు, ఉపాధి, సంక్షేమ, ప్రగతి రంగాలన్నీ ఏకకాలంలోనే సాక్ష్యాత్కరించాడు. ఒక్క తెలంగాణలోనే…పచ్చని ప్రకృతిలో తెలంగాణ పుడమి పులకించుతోందిజ తెలంగాణ జాతి సగర్వంగా బతుకుతన్నది. కేసిఆర్‌ చేతుల్లోనే తెలంగాణ పదిలంగా వుంటానని పాఠం నేర్పిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *