ఎదురులేని నాయకత్వం. తిరుగులేని ప్రభంజనం.

https://epaper.netidhatri.com/

`లక్షన్నర మెజారిటీ దిశగా…

`పేదల గుండెలకు దగ్గరగా…

`ప్రతి కుటుంబానికి తోడుగా…

`ఆపదలో వున్న వారికి అండగా…

`ప్రతి వ్యక్తికి తోడుగా…

`తానే పెద్ద దిక్కుగా…

`అందరికీ భరోసాగా…

`ఆపన్నులకు చేయూతగా…

`రైతన్న మోములో చిరునవ్వుగా…

`పచ్చని పొలాలో సిరి వెలుగులా…

`పల్లెల్లో వెండి వెలుగులా…

`ప్రతి గుండెలో ఆరని తడిగా…

` ‘‘హరీష్‌ అన్న’’..పదమే ఒక ధైర్యం గా…

హైదరాబాద్‌,నేటిధాత్రి:
నాయకుడికి ప్రజలంటే ప్రేమ కావాలి. ప్రజల మీద మమకారం వుండాలి. అవి రెండు నిండుగా వున్న మనసున్న నాయకుడు మంత్రి హరీష్‌రావు. ఎదురులేని రాజకీయం. బెదురులేని ఉద్యమ ప్రాస్దనం…తెగించి పోరాడే తత్వం…నిరంతరం అభివృద్ది మంత్రం…సిద్దిపేటలను తీర్చిదిద్దిన వైనం…హరీష్‌రావు మార్క్‌ ప్రగతి ప్రయాణం..తెలంగాణకే తలమానికం…నాయకులకు ఆదర్శం…ప్రజలకు ఎంతో సంతోషం. ఈ రోజ సిద్దిపేట ఇంత అందంగా ముస్తాబైందంటే కారణం మంత్రి హరీష్‌రావు. సాక్ష్యాత్తు ముఖ్యమంత్రి కేసిఆరే సిద్దిపేటను నేను కూడా ఇంత అభివృద్ది చేయకయపోదునేమో! అన్నారంటే హరీష్‌రావు చిత్తశుద్ది ఎంత గొప్పదో అర్ధం చేసుకోవచ్చు. తన ప్రాంతం మీద ఆయనకు వున్న ఇష్టం, అభిమానం సిద్దిపేటను సుందరవనంగా తీర్చిదిద్దేలా చేసింది. సిద్దిపేటలో అడుగడుగునా హరీష్‌రావు మార్కు అభివృద్ది స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈసారి ఎన్నికల్లో మెజార్టీ ఎంత అన్నదానిపై ప్రజల్లో రకరకాల చర్చలున్నాయి. ఎన్ని వున్నా అందరూ మాట్లాడుకునే మాట మాత్రం లక్షన్నర…మెజార్టీ అన్నదే ఎక్కువగా ఫోకస్‌ అవుతోంది. అలా సిద్దిపేటన తీర్చిదిద్దడం వల్లనే ఇలాంటి చర్చ జరుగుతోంది.

ALSO WATCH:

ప్రజల గుండెలకు దగ్గరైన నాయకుల్లో హరీష్‌రావు ఒకరు.
దేశంలో ఇలాంటి నేతలు చాలా అరుదు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్‌ రాజకీయాల్లో కూడా ఇలాంటి నాయకుడు మరొకరు లేరు. ఎన్నికల సమయం వచ్చిందంటే ఆయనపై పోటీకి నిలిచే నాయకుడికి గురించి ప్రజలు ఎవరూ ఆలోచించరు. అలా ప్రజల గుండెల్లో గూడు కట్టుకొన్న నాయకుడు హరీష్‌రావు. సిద్దిపేట నియోజకవర్గంలోని ప్రతి కుటుంబానికి ఏదో రకంగా ఏదో ఒక ప్రభుత్వ సాయం అందించిన నాయకుడు హరీష్‌రావు. ప్రభుత్వ సంక్షేమ ఫథకాలు, సింఎం. రిలీఫ్‌ ఫండ్లు, ఎల్‌వోసిలు, ఆసుపత్రుల్లో వైద్యాలు. ఇలా చెప్పుకుంటూ పోతే ఉద్యోగ అవకాశాలు, ప్రైవేటు కంపనీలలో కూడా ఉద్యోగాలు. ఏదో ఒక మేలు ప్రతి కుటుంబానికి జరిగింది. లబ్ధిదారుల ఓట్లే ఆయన మెజార్టీని పెంచుతూ పోతున్నాయంటే అతిశయోక్తి కాదు. ఆపదలో వున్న వారికి అండగా నిలవడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. తాను నిత్యం ప్రజలకు అందుబాటులో వుంటూ రోజుకు కనీసం పది మందికైనా ఏదో రకమైన సేవ అందించాలన్న ఆలోచనతోనే దినచర్య ప్రారంభించే నేత బహషా ఒక్క హరీష్‌రావే కావొచ్చు. ఎందుకంటే రాజకీయ నాయకులంటే ఎలా వుంటున్నారో..ఇటీవల కాలంలో చూస్తూనే వున్నాం. కాని వాళ్లందరికీ భిన్నమైన నాయకుడు హరీష్‌రావు. తాను ఉద్యమ నేపధ్యం నుంచి వచ్చిన నాయకుడు. ప్రజల కష్టాలు తెలుసు. కన్నీళ్లు తెలుసు. అందకు ప్రజలకు దగ్గరగా వుండాలని ఎప్పుడూ కోరుకుంటాడు. ప్రజలను మేలు చేసే పనులు మాత్రమే చేపడుతుంటాడు. తన నియోకజవర్గంలో ప్రతి వ్యక్తికి ఉపయోగపడే పనులు చేయాలనుకుంటాడు. ప్రతి కుటుంబానికి పెద్దదిక్కుగా మారిపోయాడు. నియోజకవర్గంలో ఏ వ్యక్తికి ఏ సమస్య వచ్చినా ముందు తలుపు తట్టేది హరీష్‌రావు ఇంటినే…ఆయన ఇల్లు నిత్యం ఉదయమే జన సందోహంతో నిండిపోతుంది. ఎంత మంది వచ్చినా ఎంతోఓపికతో వారి సమస్యలు వింటారు. వారి సమస్యలు అక్కడిక్కడే పరిష్కరిస్తారు. వారికి మేలు చేస్తుంటారు. తన వద్దకు వచ్చినవారందరిలో భరోసా నింపి పంపిస్తుంటారు. మళ్లీ,, మళ్లీ తిరగాల్సిన పరిస్ధితి రానివ్వరు. ఆపన్నులకు చేయూతనిందిస్తారు.

హరీష్‌రావు మంత్రి అయ్యాకే ప్రజలకు సేవ చేయడం లేదు.

ఆయన ఉద్యమ నాయకుడిగా, ఎమ్మెల్యేగా వున్న సమయం నుంచే విశేషమైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఉద్యమ కాలంలో ఓ వైపు రాష్ట్రమంతా తిరుగుతూనే, నియోజకవర్గ బాగోగులు చూసుకుంటుంటేవారు. నిత్యం తన ప్రజలకు అందుబాటులో వుంటుండేవారు. ఉమ్మడి రాష్ట్రంలోనే అప్పటి ప్రభుత్వంతో కొట్లాడి కూడా అనేక నిధులు తెచ్చి, సిద్దిపేటను తీర్చిదిద్దారు.ఇదీ ఆయన అంకితభావానికి నిదర్శనమని చెప్పాలి. ఉద్యమ సమయంలో తెలంగాణ ప్రాంతపరిస్దితి ఎలా వుండేదో ప్రత్యేకంగా చెప్పాల్సినపనిలేదు. ఎటు చూసినా ఏడారిని తలపించేది. ఎక్కడా నీటి చుక్క జాడ వుండేది కాదు. నీడ కూడా కానరాని పరిస్ధితి. బాట సారులే కాదు, కనీసం పశువులకు కూడా నీడ లేకుండాపోయిన రోజులను తెలంగాణ చూసింది. సాగు లేక, పాడి లేక తెలంగాణ పల్లెలు చిద్రమైన కాలంలో సిద్దిపేట నియోజకవర్గ రైతులను ఆదుకున్న ఏకైక నాయకుడు హరీష్‌రావు. అప్పటి ప్రభుత్వం తెలంగాణను నిర్లక్ష్యం చేసినా, ఎమ్మెల్యేగా హరీష్‌రావు దగ్గరుండి ఎన్నో చెరువులను ప్రజల బాగస్వామ్యంతో శ్రమదానం చేసి బాగు చేయించాడు. తాను పలుగు పట్టి తవ్వి,పార పట్టి మట్టిని తట్టలో వేసి, ఆ తట్ట మట్టిని ట్రాక్టర్లో పోసి శ్రమ విలువ తెలిసిన నాయకుడు హరీష్‌రావు. సహజంగా ఇలాంటి కార్యక్రమాల్లో ఫోటోలకు ఫోజులిచ్చే నాయకులను చూస్తుంటాం. కాని రోజంతా చెరువు పనులు చేసిన నాయకుడు ఒక్క హరీష్‌రావు మాత్రమే. ఇలా చెప్పుకుంటూ పోతే ఉద్యమ కాలంలో కూడ ఆయన ప్రజలకు చేసిన సేవ అంతా ఇంతా కాదు. ఒక దశలో కరవు విలయతాండవం చేసి, కనీసం పశువులకు గడ్డి కూడా లేని కాలం చూసింది తెలంగాణ. ఆ సమయంలో కోన సీమ పచ్చగా, ఆంద్ర అంత నిండుగా వుంది. అక్కడి నుంచి తన సొంత ఖర్చులతో పశుగ్రాసం తెప్పించి, తన నియోకజవర్గ రైతులకు అందించిన నాయకుడు హరీష్‌రావు.

ఎడారిలా ఒకనాడు జీవం కోల్పోయిన తెలంగాణ నేల ఇప్పుడు సస్యశ్యామలమైంది.

కాలువల నిండా నీళ్లు. మిషన్‌ కాకతీయతో చేసిన చెరువుల అభివృ ద్దితో ప్రతిపల్లె ఒక గంగాళం. ప్రతి బావి నిండుగా, ప్రతి బోరు ఎల్లబోసేంత నీటితో తెలంగాణ జలకళ సంతరించుకున్నది. సిద్దిపేట కూడా సాగు, తాగు నీటిని నింపుకొని, రైతుకు మేలు చేస్తోంది. ఆడబిడ్డలకు మంచినీళ్లందిస్తోంది. ఒకప్పుడు సిద్దిపేట ప్రాంతంలో మంచినీటికి కూడా ఎంతో కటకట. ఎన్ని గజాల చేదబావులైనా నీళ్లు వుండేవి కాదు. ఎన్ని వందల ఫీట్లు బోర్లు వేసినా చుక్క నీరొచ్చేది కాదు. కాని సిద్దిపేట ప్రాంతలో భూ గర్భ జాలలు విపరీతంగా పెరిగాయి. ఫ్లోరైడ్‌ సమస్య పూర్తిగా పోయింది. తెలంగాణలో ప్రాజెక్టుల నిర్మాణంతో సమృద్దిగా నీటి సంపదను పెంచుకున్నట్లైంది. ఇదంతా హరీష్‌రావు వల్లనే సాధ్యమైంది. ఎందుకంటే ఆయన భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా చేసిన కృషి అమోఘం. అందుకే ఆయనను మాజీ గవర్నర్‌ నర్సింహన్‌ మంత్రి హరీష్‌రావును కాళేశ్వరరావు అంటూ కీర్తించారు. తెలంగాణకే తలమానికమైన కాళేశ్వరం ప్రాజెక్టును దగ్గరుండి నిర్మాణం చేయించాడు. రాత్రి పగలు అక్కడే నిద్ర చేసి, ప్రాజెక్టు పూర్తి చేయించారు. అంతలా తెలంగాణ మీద మమకారం ఆయనకు వుంది. అందుకే ఆయన భారీ నీటిపారుదల మంత్రిగా కాళేశ్వరమేకాదు, మల్లన్న సాగర్‌తోపాటు అనేక రిజర్వాయర్ల నిర్మాణాన్ని దగ్గరుండి పర్యవేక్షించి తెలంగాణనే నీటి గంగాళం చేసిన నాయకుడు హరీష్‌రావు. అటు రాష్ట్ర సమస్యలు,ఇటు తన నియోకవర్గ వర్గ సమస్యలు తీర్చుకుంటూ, నాయకుడిగా అందిరికీ ఆదర్శమయ్యాడు. జాతీయస్దాయిలో ఏ అవార్డు వచ్చినా అందులో సిద్దిపేట వుంటుంది. తన నియోజకవర్గాన్నే ప్రగతి నమూనాగా తీర్చిదిద్డారు. మోడల్‌ అభివృద్ది అంటే ఏమిటో చూపించారు. అందుకే దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి ప్రజా ప్రతినిధులు, ఉన్నతాదికారులు, సిద్దిపేటను సందర్శిస్తునే వుంటారు. ఇక్కడి అభివృద్ధి ఫలాలు తమ రాష్ట్రాలలో అమలు చేసేందుకు అధ్యయనం చేస్తూ వుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే సిద్దిపేట అభివృద్దికి ఒక ప్రయోగశాలగా మార్చి, ప్రగతికి చిరునామా చేసిన నాయకుడు హరీష్‌రావు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *