మిరప రైతులకు అనుకూలంగా చర్యలు తీసుకుంటాం.

# త్వరలో మిర్చిపంటల పట్ల మరిన్ని రైతు అవగాహన సదస్సులు నిర్వహిస్తాం.
# వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
# వ్యవసాయ, మార్కెటింగ్, ఉద్యానవనశాఖల ఆధ్వర్యంలో మదన్నపేటలో అవగాహన సదస్సు..

#ఉద్యానవన శాఖ అధికారులు అందుబాటులో లేరు?

#మిర్చి పంటలో నల్ల పురుగు వల్ల తీవ్ర స్థాయిలో నష్టపోతున్నాం..

# మిర్చి కొనుగోళ్లలో వ్యాపారులు సిండికేట్?

# అవగాహన సదస్సులో కలెక్టర్ కు ఫిర్యాదు చేసిన రైతులు.

నర్సంపేట నేటిధాత్రి:

మిర్చి పంటలు పండించే రైతులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించేందుకు, మార్కెటింగ్ విధానంలో అనుకూలంగా ఉండే విధంగా రైతులకు అనుకూలంగా ఉండేందుకు తగిన చర్యలు తీసుకుంటామని వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు.
శనివారం వ్యవసాయ, మార్కెటింగ్, ఉద్యానవన శాఖల సంయుక్త ఆధ్వర్యంలో నర్సంపేట మండలం మాదన్నపేట గ్రామ రైతు వేదిక వద్ద మిరప పంటలు,మిరప పంటల కోత అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల ఏర్పాటుచేసిన రైతు అవగాహన, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద
పలు సూచనలు చేశారు.అనంతరం క్షేత్రస్థాయిలో అధికారులు,రైతులతో కలిసి మిర్చి,కూరగాయల పంటలను వ్యవసాయ శాఖ ,ఉద్యానవన శాఖ,మార్కెటింగ్ శాఖ అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు. గతంలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో రైతు శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని చెప్పాము.వాటిని సకాలంలో ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులకు ఇబ్బందులు తలెత్తాయి. ఇకనుండి జూన్ జూలై మాసాలలో శిక్షణ అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తామని కలెక్టర్ వివరించారు.
రైతులు పండించిన పంటపై మెళకువలు పాటిస్తే ఉత్పత్తులకు మార్కెట్లో మంచి ధర దక్కి, సాగు లాభసాటిగా వుంటుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా పేర్కొన్నారు.శనివారం వ్యవసాయ, మార్కెటింగ్, ఉద్యానవనాల శాఖల సంయుక్త ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా నర్సంపేట మండలం మాదన్నపేట గ్రామ రైతు వేదిక వద్ద మిరప కోత అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఏర్పాటుచేసిన రైతు అవగాహన మరియు శిక్షణ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ సత్య శారద ముఖ్యఅతిథిగా హాజరై పలు సూచనలు చేశారు.ఎన్నో వ్యయప్రయాసలకోర్చి, పంట పండించిన రైతన్నలు,కోతల సమయంలో కూడా తప్పనిసరిగా కొన్ని మెళకువలు పాటించాలని, లేనిచో తాలు అధికంగా వచ్చి, నిల్వలో అఫ్లోటాక్సిన్స్ వల్ల నాణ్యత దెబ్బతినే ప్రమాదం వుందని.ఈ సమస్యలను అధిగమించి, నాణ్యమైన దిగుబడులు,అధిక ధర పొందాలంటే కోతలు, అనంతరం కాయలు ఆరబెట్టే సమయంలో కూడా శాస్ర్తీయ విధానాలను పాటించాల్సిన అవసరం ఉందని కలెక్టర్ తెలిపారు.
మిరప పంట సాగు చేసిన రైతులు పంట కోత తరువాత ఎండలో ఆరబెట్టి నాన తాప రవాణా ప్రకారం కాల పరిమాణం రంగు ఆధారంగా గ్రీటింగ్ చేసుకొని వేరువేరుగా మార్కెట్లకు తీసుకెళ్లడం ద్వారా అధిక ధరలు పొందే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.రైతులు వాడే క్రిమిసంహారక మందుల విషయంలో వ్యవసాయ శాఖ తో పాటు ఉద్యానవన శాఖ అధికారుల సూచనలు పాటించడం ద్వారా ఇతర దేశాలకు ఎగుమతి ప్రమాణాలు గల మిరప వంటను పండించవచ్చునని, ఉద్యాన శాఖ అధికారులు ఈ ఉద్యాన పంటలు సాగు చేయు రైతులకు ఎప్పటికపుడు సూచనలు మరియు సలహాలు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా గాని లేదా యూట్యూబ్ల ద్వారా గాని నేరుగా రైతులు మొబైల్ కి పంపించాలని కలెక్టర్ సూచించారు.నర్సంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పాలాయి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రతి గ్రామంలో మిరప పంట సాగు సీజన్ కంటి ముందు జూన్ జూలై మాసాలలో ఏర్పాటు చేయడం వలన రైతులకు పెట్టుబడి భారం తగ్గించడంతోపాటు నాణ్యతమైన దిగుబడులు సాధించి అధిక మార్కెట్ ధరలు పొందే అవకాశం ఉందన్నారు.ఉద్యానవన శాస్త్రవేత్తలు నాగరాజు, వీరన్న పాల్గొని మిరప పంటలో పీడల నివారణ చేపట్టాల్సిన చర్యలపై కూలంకషంగా వివరించారు.

ఉద్యానవన శాఖ అధికారులు అందుబాటులో లేరు?

మిర్చి పంటల సాగుపట్ల సలహాలు సూచనల కోసం ఉద్యానవన శాఖ అధికారులు అందుబాటులో ఉండడం లేదు వ్యవసాయ శాఖ అధికారులను అడుగుతే నాకు సంబంధం లేదు అని అంటున్నారు అని పలు రైతులు కలెక్టర్ కు విన్నవించుకున్నారు.అలాగే పండించిన పంటను మార్కెట్ కు తీసుకపోతే అక్కడి వ్యాపారులు సిండికేట్ గా మారి ఒకటి రెండు కూట్లకు జెండా పాట పెట్టి మిగతా సరుకును తక్కువ ధరలకు కొనుగోలు చేస్తున్నారని దీంతో తీవ్రస్థాయిలో నష్టపోతున్నామని పలువురు రైతులు కలెక్టర్ వద్ద వాపోయారు. మిరప పంట సాగుపట్ల ఉద్యానవన శాఖ అధికారులు అందుబాటులో లేక అవగాహన కల్పించకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నామని సంబంధిత అధికారులను వెంటనే నియమించాలని ఈ సందర్భంగా పలువురు రైతులు కోరారు. మిర్చి పంటలో నల్ల పురుగు సోకడం వల్ల భారీ ఎత్తున నష్టపోవాల్సిన పరిస్థితి ఎదురవుతున్నదని పలు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వరంగల్ జిల్లాలో మిర్చి పంట సాగు శాతం తక్కువ ఉందని అన్నారు. ఉద్యానవన శాఖ అధికారుల కొరత ఉన్నదని తెలిపిన కలెక్టర్ ఉన్నత స్థాయి అధికారుల సహకారంతో అందుబాటులోకి తీసుకొస్తామని పేర్కొన్నారు. మిర్చి పంటలో నల్ల పురుగుల నివారణ కోసం సంబంధిత అధికారుల సలహాలు సూచనలు పాటించాలని తెలిపారు. రైతులు మార్కెట్ లో మిర్చి అమ్మకాలు చేపట్టే సమయంలో జరుగుచున్న పరిణామాల పట్ల పరిశీలించి రైతులకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ సత్య శారద తెలియజేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అనురాధ,జెడ్పి సీఈఓ రామిరెడ్డి, ఆర్డిఓ రమాదేవి, మార్కెటింగ్ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్ డిప్యూటీ డైరెక్టర్ పద్మావతి, ఏనుమాముల మార్కెట్ కార్యదర్శి నిర్మల, మార్కెటింగ్ ఆధికారి సురేఖ, ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి,నర్సంపేట మండల వ్యవసాయ శాఖ అధికారి కృష్ణ కుమార్, సంబంధిత శాఖల అధికారులు సిబ్బంది రైతులు తదితరులు పాల్గొన్నారు.

ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ను ముక్తకంఠంతో వ్యతిరేకించిన కేయూ విద్యార్థి సంఘాలు

హన్మకొండ, నేటిధాత్రి :

ఈ డబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనార్టీ విద్యార్థులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో తీవ్రమైన నష్టం జరుగుతుందని సమాజంలో వెనుకబడి ఉన్న బడుగు బలహీన వర్గాలకు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల వల్ల ఆర్థిక సామాజిక రాజకీయ రాజకీయ రంగాలలో తీవ్ర నష్టం జరుగుతుందని, జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలని వివిధ విద్యార్థి సంఘల నాయకులు అన్నారు.
ఈరోజు కాకతీయ యూనివర్సిటీ లోనీ జాఫర్ నిజాం సెమినార్ హాల్లో జరిగిన ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వల్ల ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ మరియు మైనారిటీ వర్గాలకు అన్యాయం అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న ఎంఎస్ఎఫ్ సీనియర్ నాయకులు మంద భాస్కర్ , ఏబిఎస్ఎఫ్ ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు మంద నరేష్, బిఎస్ఎఫ్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు కాకతీయ యూనివర్సిటీ ఇంచార్జ్ బొట్ల మనోహర్, కాకతీయ యూనివర్సిటీ కురుస ప్రెసిడెంట్ హుస్సేన్ నాయక్, ఎస్ ఎస్ బి ఎం బి ఎం వ్యవస్థాపక అధ్యక్షులు కంటెస్టెంట్ ఎమ్మెల్సీ గాదపాక అనిల్ కుమార్,బీసీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆల్ యూనివర్సిటీస్ ఇన్చార్జ్ అరగంటి నాగరాజు, డిఎస్ఎ రాష్ట్ర కన్వీనర్ కామగోని శ్రావణ్, స్వేరోస్ పీపీఎల్ రాష్ట్ర కో కన్వీనర్ చాతర్ల సదానందం, పి డి ఎస్ యు కాకతీయ యూనివర్సిటీ ఇంచార్జ్ వంశీకృష్ణ , డి ఎస్ యు కాకతీయ యూనివర్సిటీ ఇంచార్జ్ మహారాజ్ , స్వేరోస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అమ్మఒడి సుభద్ర శ్యామల ,సేవాలాల్ రాష్ట్ర ఉపాధ్యక్షులు తిరుపతి నాయక్, టీఎస్ ఎఫ్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు శ్రీధర్ ,స్వేరోస్ సీనియర్ నాయకులు ,బోట్ల కార్తీక్ ,వేణుగోపాల్ వివిధ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

ఘనంగా అయ్యప్ప స్వామి పడిపూజ

శాయంపేట నేటిధాత్రి

శాయంపేట మండల కేంద్రంలో ఘనంగా అయ్యప్ప స్వామి మహా పడిపూజ మహోత్సవం జరిగింది హరిహర క్షేత్ర అయ్యప్ప స్వామీ దేవాలయ ప్రధాన అర్చకులు పద్మనాభ స్వామి ఆధ్వర్యంలో లోకల బోయిన కుమారస్వామి అనురాధ దంపతులు అయ్యప్ప స్వామి అభిషేకాలు చేసి భజనలతో పడి పూజ జరిగింది.భక్తులు నిర్వహించిన పూజా కార్యక్రమాలను అధిష్టించి స్వామి వారికి పూజలు నిర్వహించారు. భక్తుల ఆధ్యాత్మిక ఆరాధనను అభినందిస్తూ, భక్తి ప్రధానమైన భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామి మాలధారణ దివ్యత్వాన్ని ప్రశంసిస్తూ, భక్తుల సంకల్పం, ఆధ్యాత్మిక ఆరాధన భజనలు చేసి పడిని వెలిగించారు ఈ. కార్యక్రమంలో మచ్చ గిరి స్వామి దేవాలయ చైర్మన్ సామల బిక్షపతి, ప్రజలు, అయ్యప్ప భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

రబీ ధాన్యంపై రైస్ మిల్లింగ్ పై సమీక్ష అదనపు కలెక్టర్ అశోక్ కుమార్

భూపాలపల్లి నేటిధాత్రి

రబీ 2022-23 వేలం ధాన్యం రబీ 2023-24 కస్టమ్ మిల్లింగ్ రైస్ పై సమీక్ష అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రబీ 2022-23లో వేలం వేసిన ధాన్యాన్ని 2024 డిసెంబర్ 31లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. అలాగే, రబీ 2023-24 కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) ప్రక్రియను వేగవంతం చేయాలని మిల్లర్లకు సూచించారు. ప్రభుత్వ నిబంధనలు మరియు సమయ పరిమితులను పాటిస్తూ అన్ని ప్రక్రియలను సకాలంలో పూర్తి చేయాలని ఆయన స్పష్టం చేశారు.
రైస్ మిల్లర్లు తగిన చర్యలు తీసుకోవాలని నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు.
ఈ సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి శ్రీనాధ్, డిఎం రాములు, రైస్ మిల్లర్లు తదితరులు పాల్గొన్నారు.

మాట నిలబెట్టుకున్న మంత్రిసీతక్క

గురుకులంలో నిద్రకార్యక్రమం సందర్బంగా నీటి సమస్య తీరుస్తామని హామీ…

కొత్తగూడ నేటిధాత్రి:

కొత్తగూడ మండల కేంద్రం లోని ట్రైబల్ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలో గత బుధవారం రోజు తెలంగాణ రాష్ట్ర పంచాయతీ రాజ్ &గ్రామీణభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ ధనసరి సీతక్క గురుకుల పాఠశాలను సందర్శించి విద్యార్థుల తో మాట్లాడారు ఈ సందర్బంగా పాఠశాల విద్యార్థుల గురుకులంలో నీటి సమస్య ఉందని మంత్రి సీతక్క దృష్టికి తీసుకువచ్చారు వెంటనే స్పందించిన మంత్రి గారు మాట్లాడుతూ అతి త్వరలో నే మీకు నీటి సమస్య తీరుస్తామని ఆ బాధ్యత కొత్తగూడ మాజీ సర్పంచ్ మల్లెల రణధీర్ చేపిస్తారని విద్యార్థులతో మంత్రి సీతక్క అన్నారు మాట ఇచ్చిన మూడు రోజులు కాకముందే మల్లెల రణధీర్ ఆధ్వర్యంలో శనివారం రోజు బోర్ వేయించారు ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సీతక్క గారు మాట ఇచ్చారు అంటే కచ్చితంగా పని చేస్తారని అనడానికి ఇదొక నిదర్శనం అని రేవంతన్న సర్కార్ చేతల ప్రభుత్వం ఈ సందర్బంగా అన్నారు…
ఈ కార్యక్రమం లో గురుకులం ప్రిన్సిపాల్ కల్పనా మాజీ సర్పంచ్ &కాంగ్రెస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు గుమ్మడి సమ్మయ్య. వజ్జ బాలరాజు. సిరిగిరి సురేష్. ఈర్ప చందు. బోరు శీను. గురుకుల పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

జిల్లాలో జనవరి 1 నుండి 31 వరకు ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

2025 జనవరి 1 నుండి 31 వరకు నిర్వహించబడుతున్న ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని పురస్కరించుకుని,శనివారం మహబూబ్ నగర్ జిల్లా పోలీసు కార్యాలయం కాన్ఫరెన్స్ హాల్‌లో సమావేశం నిర్వహించరు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సభ్యురాలు శ్రీమతి ఇందిరా దేవి హాజరయ్యారు.
ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం ద్వారా తప్పిపోయిన పిల్లలను గుర్తించడం, బాల కార్మికులుగా పని చేస్తున్న చిన్నారుల సమస్యలను పరిష్కరించడం, అక్రమ రవాణాకు గురైన చిన్నారులను రక్షించడం, వారికి పునరావాసం కల్పించి, చట్టపరమైన హక్కులు మరియు రక్షణ అందించడం జరుగుతుందన్నారు.
ఈ సంధర్భంగా శ్రీమతి ఇందిరా దేవి మాట్లాడుతూ పిల్లల హక్కులను కాపాడేందుకు పోలీసు విభాగం మరియు ఇతర విభాగాలు కలిసి బృందాలుగా ఏర్పడి రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, ఫ్యాక్టరీలు, వాణిజ్య సంస్థలు, మరియు ఇతర ప్రదేశాలను సందర్శించి బాల కార్మికులుగా పని చేస్తున్న పిల్లలను గుర్తించేందుకు చర్యలు చేపడరని తెలిపారు. గల్లంతైన మరియు బాల కార్మికులుగా బాధపడుతున్న పిల్లలను రక్షించడం సమాజ పునాదులను బలోపేతం చేయడంలో కీలకమైన చర్య అని, “పిల్లల భవిష్యత్తును రక్షించడం ద్వారా సమాజంలో ఒక శక్తివంతమైన మార్పును తీసుకురావచ్చు” అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమం పిల్లల హక్కులను కాపాడుతూ, వారి భవిష్యత్తు మెరుగ్గా తీర్చిదిద్దే దిశగా ముందడుగు వేస్తోందని పేర్కొన్నారు.
చైల్డ్ లైన్ 1098, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, మరియు స్వచ్ఛంద సంస్థల సహకారంతో పిల్లలకు తక్షణ సాయం అందించబడుతుంది. పిల్లల పేర్లు, సమాచారం, కుటుంబ కట్టుబాట్ల గురించి పూర్తి వివరాలు సేకరించి వారిని వారి కుటుంబాలకు తిరిగి చేర్చేందుకు చర్యలు తీసుకుంటారు.
ఈ కార్యక్రమములో అదనపు ఎస్పీ రాములు, సి డబ్ల్యూ సి చైర్మెన్ నయీముద్దీన్, జేజేబి చైర్పర్సన్ శ్రీమతి గ్రెస్స్ మరియు పోలీసు అధికారులు పాల్గొన్నారు..

డిఎస్పి జిల్లా కన్వీనర్ గా శ్రీకృష్ణ మహారాజు నియామకం

భూపాలపల్లి నేటిధాత్రి

జిల్లా ధర్మసమాజ్ పార్టీ ఆఫీసులో భూపాలపల్లి జిల్లా ధర్మ స్టూడెంట్స్ యూనియన్ జిల్లా కన్వీనర్ గా దూడపాక శ్రీకృష్ణ మహారాజు నియామకం
ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉమ్మడి జిల్లా ధర్మ స్టూడెంట్స్ యూనియన్ ఇన్చార్జి పూరెల్ల విష్ణు మహారాజ్ మాట్లాడుతూ భూపాలపల్లి జిల్లాలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికై ధర్మ స్టూడెంట్స్ యూనియన్(DSU) పోరాటానికి సిద్ధంగా ఉందని మాట్లాడారు. దూడపాక శ్రీకృష్ణ మాట్లాడుతూ
ధర్మ స్టూడెంట్స్ యూనియన్ జిల్లా కన్వీనర్ గా నాపై నమ్మకం నమ్మకం ఉంచి అవకాశం కల్పించినందుకు ధర్మ సమాజ్ పార్టీ జిల్లా ఇన్చార్జి విష్ణు మహారాజ్ గారికి జిల్లా అధ్యక్షుడు కొత్తూరు రవీందర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు ధర్మసమాజ్ పార్టీ అధినేత డాక్టర్ విశారదన్ మహారాజ్ ఆదేశాల మేరకు తూచ తప్పకుండా పనిచేస్తాను అని అన్నారు
ఈ కార్యక్రమం లో భూపాలపల్లి జిల్లా కమిటీ నాయకులు చిట్యాల శ్రీనివాస్, బండారి దశరథo, మెకిడి అశోక్ ,విద్యార్థులు దూడపాక హరీష్, బోయిని ప్రసాద్ పాల్గొన్నారు

అయ్యప్ప ఆలయంలో లక్ష మంత్రార్చన.

బెల్లంపల్లి నేటిధాత్రి :

బెల్లంపల్లి పట్టణంలోని అయ్యప్ప స్వామి దేవాలయంలో శనివారం రోజున ఆలయ మండపంలో అయ్యప్ప స్వామి సహస్ర నామాల లోని ఒక మంత్రమైన ఓం వేట శాస్రే నమః అనే పదంతో అయ్యప్ప దీక్ష చేపట్టిన స్వాములతో లక్ష సార్లు ఈ మంత్రాన్ని 1.30 గంటల పాటు ఏక ధాటిగా విరామం లేకుండా నామ స్మరణ శ్లోకాలు పారాయణం చేశారు ఈ కార్యక్రమంలో పండితులు కుటుంబరావు,అనిల్ కోటేశ్వర రావు,అయ్యప్ప దీక్ష చేపట్టిన స్వాములు సత్యం.రఘు.అనుదీప్, సాయి.రాజు. రాజేష్,స్థానిక భక్తులు పాల్గొన్నారు,అనంతం తీర్థ ప్రసాదాలు అందజేశారు.

ఉద్యానవనంలో అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ

భూపాలపల్లి నేటిధాత్రి

జయశంకర్ ఉద్యానవనంలో సౌకర్యాలు కల్పించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అన్నారు.

శనివారం భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధి సుభాష్ కాలనిలోని ఆచార్య జయశంకర్ ఉద్యాన వనాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ పరిశీలించారు.
ఉద్యానవనంలోని ఓపెన్ జిమ్, పిల్లలు ఆటలు ఆడుకోవడానికి ఏర్పాటు చేసిన ఆట వస్తువులను పరిశీలించారు. పిల్లల ఆటవస్తువులు శిధిలావస్థకు చేరుకున్నాయని వాటి స్థానంలో కొత్త ఆటవస్తువులు ఏర్పాటు చేయాలని సూచించారు. ఓపెన్ జిమ్ ప్రాంగణంలో వేసిన రబ్బరు టైల్స్ పాడైపోయాయని వాటిని మార్చాలని, ఓపెన్ జిమ్ పరికరాలను మరమ్మత్తులు చేయించాలని మున్సిపల్ అధికారులకు సూచించారు. ఉద్యానవనంలో మొక్కల పెంపకాన్ని పరిశీలించిన కలెక్టర్ నిర్వహణ బావుందని సంతృప్తి వ్యక్తం చేశారు. జయశంకర్ ఉద్యానవనం అభివృద్ధికి కావలసిన ప్రతిపాదనలు రూపొందించాలని మున్సిపల్ అధికారులను అదేశించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విజయ లక్ష్మి, మున్సిపల్ కమిషనర్ రాజేశ్వర్, పట్టణ ప్లానింగ్ అధికారి సునీల్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజలందరికీ పెద్దమ్మతల్లి ఆశీస్సులండాలి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి

భూపాలపల్లి నేటిధాత్రి

టేకుమట్ల మండలం, పంగిడి పల్లి గ్రామ ముదిరాజ్ సోదరులు ఘనంగా నిర్వహిస్తున్న ముదిరాజ్ ల కుల దైవం పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకట రమణా రెడ్డి
ఈ కార్యక్రమంలో మండల పార్టీ ప్రెసిడెంట్ సట్ల రవి, మాజీ ఎంపీపీ రెడ్డి మల్లారెడ్డి,నరేష్, మాజీ వైస్ ఎంపీపీ అయిలయ్య,మాజీ ఎంపీటీసీ లు వేంకటేశ్వర్ రెడ్డి,ఆది రఘు, మాజీ సర్పంచ్ రవీందర్, మాజీ కో ఆప్షన్ అబ్జల్,సీనియర్ నాయకులు మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ మారం లింగారెడ్డి,పెరిక నర్సింగరావు,సోషల్ మీడియా కో ఆర్డినేటర్ దేవేందర్ ముదిరాజ్ సోదరీ సోదరులు తదితరులు పాల్గొన్నారు.

పీ యూ అధ్యాపకుడు జ్ఞానేశ్వర్ కు డాక్టరేట్

వీపనగండ్ల మండలంలో వికసించిన విద్యా కుసుమం

• జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు తట్టుకొని నిలబడిన వైనం, ఎంతోమంది నిరుపేద విద్యార్థులకు ఆదర్శం

మహబూబ్ నగర్ జిల్లా ::నేటి ధాత్రి

పాలమూరు యూనివర్సిటీలో రసాయన శాస్త్ర విభాగంలో అధ్యాపకునిగా పనిచేస్తున్న జ్ఞానేశ్వర్ ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్ పార్థసారథి పర్యవేక్షణలో *సింతసిస్ ఆఫ్ న్యూ ఆర్గానిక్ ఛార్జ్ ట్రాన్స్ఫర్ కంప్లెక్స్ (నూతన కర్బన ఛార్జ్ ట్రాన్స్ఫర్ కాంప్లెక్స్ ల సంశ్లేషణ) అనే అంశం పై పీహెచ్డీ పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వీసీ ఆచార్య శ్రీనివాస్ మాట్లాడుతూ నూతనంగా తయారు చేసిన కర్బన ఛార్జ్ సమ్మేళనాలు వైద్య రంగంలో ముఖ్య భూమిక వహిస్తాయని, జీవ కణంలోని జన్యు పదార్థాల అనుసంధానం కోసం ఉపయోగపడతాయని, ఈ సమ్మేళనాలకు కాన్సర్ నిరోధక శక్తి ఉంటుందని, మెటీరియల్ సైన్స్ లో అద్భుత వాహకాలుగా పని చేస్తాయని,యూనివర్సిటీలో పరిశోధనలకు పెద్ద పీటలు వేస్తున్నామని,గ్రామీణ ప్రాంత విద్యార్థులను కూడా పరిశోధనల వైపు మళ్లించాలని అన్నారు. రిజిస్ట్రార్ చెన్నప్ప డాక్టర్ జ్ఞానేశ్వర్ ని అభినందిస్తూ నూతన ఆవిష్కరణలు మానవాళి మనుగడకు ఉపయోగపడతాయని అన్నారు.
కుటుంబ నేపథ్యం
రెక్కాడితే గాని డొక్కాడని నిరుపేద కుటుంబంలో జన్మించిన జ్ఞానేశ్వర్ తల్లిదండ్రులు మీసాల రాముడు మరియు గంగమ్మ.
ఈయన స్వస్థలము వీపనగండ్ల మండలము, వనపర్తి జిల్లా.

విద్యాభ్యాసం

జ్ఞానేశ్వర్ 1 నుంచి 4వ తరగతి వరకు వీపనగండ్ల ప్రాథమిక పాఠశాలలో చదివారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో గురుకుల పరీక్షలో అర్హత సాధించి ఐదవ తరగతి నుంచి 12వ తరగతి వరకు గురుకుల పాఠశాల, లింగాల లో చదివారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సిల్వర్ జూబ్లీ డిగ్రీ కాలేజ్ కర్నూల్ లో డిగ్రీ పూర్తి చేశారు. అనంతరం హోం ట్యూషన్స్ చెబుతూ పీజీ అర్హత పరీక్షకు ప్రిపేర్ అయి ఉస్మానియా యూనివర్సిటీ కెమిస్ట్రీ విభాగంలో పీజీ పూర్తి చేసి, ఏకంగా యూనివర్సిటీ టాపర్ గా నిలిచారు. పీజీ టాపర్ గా రావడం తో ఉస్మానియా యూనివర్సిటీ గోల్డ్ మెడల్ తో సత్కరించింది. ఉస్మానియా యూనివర్సిటీలో పిహెచ్డి పూర్తి చేశారు. అంతర్జాతీయ కాన్ఫరెన్స్ లో బెస్ట్ పోస్టర్ అవార్డు సాధించి, నగదు బహుమతి పొందారు. ఈయన చేసిన పరిశోధనా పత్రాలు పలు జాతీయ అంతర్జాతీయ జర్నల్స్ లో ప్రచురితమయ్యాయి.

అదనపు బాధ్యతలు
జాతీయ సేవ పథకం ప్రోగ్రాం అధికారిగా, పీజీ బాయ్స్ హాస్టల్ వార్డెన్ గా కొనసాగుతున్నారు. ఈ కార్యక్రమంలో ఓ ఎస్ డి డాక్టర్ మధుసూదన్ రెడ్డి , ప్రిన్సిపల్ డాక్టర్ చంద్ర కిరణ్ ,ఎన్ ఎస్ ఎస్ కోఆర్డినేటర్ డా ప్రవీణ ,అధ్యాపకులు డాక్టర్ అర్జున్ కుమార్ , డాక్టర్ రవి కుమార్ , డా పర్వతాలు, సుదర్శన్ రెడ్డి ,డాక్టర్ రాజశేఖర్ , రాంమోహన్ , డా సిద్దరామ గౌడ్ ,స్వాతి , మాధురి మోహన్గారు , కల్పన,ఉమ్మడి పాలమూరు జిల్లా లోని మిత్రులు, అధ్యాపకులు తదితరులు జ్ఞానేశ్వర్ ని అభినందించారు.

కార్మికులను కష్టపెట్టిన ప్రభుత్వాలు కొనసాగిన చరిత్ర లేదు

భద్రాచలం నేటిదాత్రి

సిఐటియు పట్టణ కన్వీనర్ ఎంబి నర్సారెడ్డి

*రెండో రోజు కొనసాగిన పంచాయితీ కార్మికుల టోకెన్ సమ్మె…..!

గ్రామపంచాయతీ కార్మికులను ఇబ్బందులకు గురిచేసి పస్తులించిన ఏ ప్రభుత్వం కొనసాగిన చరిత్ర లేదని సిఐటియు పట్టణ కన్వీనర్ ఎం బి నర్సారెడ్డి అన్నారు.
కనీస వేతనం ఉద్యోగ భద్రత కోసం సిఐటియు ఆధ్వర్యంలో గ్రామపంచాయతీ కార్మికులు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన సమ్మె రెండవ రోజు యధా విధంగా కొనసాగింది. ఈ సందర్భంగా పంచాయతీ కార్యాలయం ముందు ఏర్పాటు చేసిన సమ్మె శిబిరం వద్ద వివిధ రకాల నిరసనలు నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు పట్టణ కన్వీనర్ ఎంబీ నర్సారెడ్డి మాట్లాడుతూ సమాజంలో ఎవరూ చేయలేనటువంటి పనులను గ్రామపంచాయతీ కార్మికులు ఎంతో ఇష్టంగా పని చేస్తున్నప్పటికీ వారి ఖాళీ కడుపుతో ఇబ్బందులు పెట్టడం సరైనది కాదని అన్నారు. సరైన వేతనం రాక అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటూ అప్పుల పాలవుతూ అనారోగ్యాల గురవుతూ అనేకమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో పాలించిన ప్రభుత్వం కార్మికులను పట్టించుకోకపోవడం వలన ఆ ప్రభుత్వం మట్టి కొట్టుకుపోయిందని గుర్తు చేశారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పంచాయతీ కార్మికుల సమస్యలను పట్టించుకోకపోతే ఈ ప్రభుత్వానికి కూడా అదే గతి పడుతుందని హెచ్చరించారు. కనీస వేతనం 26 వేల రూపాయలు ఇవ్వాలని, మల్టీపర్పస్ విధానాన్ని రద్దు చేయాలని ,ప్రమాద బీమా పథకాన్ని 10 లక్షలు చేయాలని అదేవిధంగా,పని భద్రత కల్పించాలని ,అధికారుల వేధింపులను ఆపాలని, డిమాండ్ చేశారు. అర్హులైన వారిని పర్మినెంట్ చేయాలని, తదితర డిమాండ్లతో కార్మికులు చేస్తున్న ఈ సమ్మెను ప్రభుత్వం అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకుని సమస్యలు వెంటనే పరిష్కరించాలని కోరారు. సమస్యలను పరిశీలించకపోతే రాబోయే కాలంలో నిరవధిక సమ్మె చేయటానికి కూడా వెనకాడా పోమని హెచ్చరించారు. పంచాయతీ కార్మికుల న్యాయమైన పోరాటానికి ప్రజలు కూడా సంఘీభావాన్ని తెలియజేస్తున్నారని స్పష్టం చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి చర్చలకు పిలిచి వారి సమస్యలను డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని నర్సారెడ్డి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు పట్టణ నాయకులు N నాగరాజు ,ఏ రత్నం, మనోజ్ రెడ్డి, వీరన్న, విజయ, భాను, అనసూయ, సుశీల, ప్రసాద్ రెడ్డి పీ, భద్రమ్మ ,మరియు కార్మికులు పాల్గొన్నారు

సీనియర్ జర్నలిస్టుకు సమ్మయ్యకు డాక్టర్ ప్రధానం

భూపాలపల్లి నేటిధాత్రి

అవార్డుప్రధానంచేసిన ఏషియన్ ఇంటర్నేషనల్ అండ్ రీసెర్చ్ స్ఫూర్తిఅకాడమీ న్యూఢిల్లీ,చైర్మన్ డాక్టర్ ఆకుల రమేష్

సీనియర్ జర్నలిస్ట్ ,రచయిత తాళ్లపల్లివెంకటసమ్మయ్య గౌడు రాజధానిలోనిసిటీ కల్చర్ సెంటర్ వేదికపైశనివారం అరుదైనగౌరవడాక్టర్ పురస్కారాన్నిఅందజేయడం జరిగింది.ఏషియన్ వేదికకల్చరల్ అండ్ రీసెర్చ్ స్ఫూర్తి(న్యూఢిల్లీ)ఫౌండర్ అండ్ చైర్మన్ డాక్టర్ ఆకు రమేష్ చేతులమీదుగా ఆయనఈపురస్కారాన్ని అందుకున్నారు. ముషీరాబాద్(హైదరాబాద్) సిటీకల్చరల్ వేదికపైఈ అవార్డునుఆయనకుడాక్టర్ ఆకులరమేష్ అందజేశారు.జయశంకర్ భూపాలపల్లిజిల్లామండల కేంద్రమైనగణపురంకుచెందిన ఆసీనియర్ జర్నలిస్టుగత మూడుదశాబ్దాలకుమించి వివిధపత్రికలకుఅంకితభావం నిస్వార్థంతో సేవలందించారు.సమాజ చైతన్యానికి,మానవతాస్ఫూర్తి కిజనశ్రేయస్సు కోసంసంచలనాత్మకకథనాలతోఆయనతనవంతుగా కలిగించినచైతన్యానికి, రగిలించినస్ఫూర్తితో విశేషకృషిచేశాడన్నారు. సీనియర్ జర్నలిస్టుగా ఇంతకాలంతనుచేసినసేవలకు స్పందించితమసంస్థఈ సత్కారంచేసిoదన్నారు.
ఇది ఒకపాత్రికేయుడిగాఆయనకు దక్కినఅరుదైనగౌరవన్నారు.
.

ప్రజాపాలన పై సారథి కళాకారుల ఆరు గ్యారంటీలపై కళా ప్రదర్శన

ములుగు జిల్లా నేటిధాత్రి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న 6 గ్యారంటీల పథకాల ప్రజల్లో చైతన్యం కల్పిస్తూ నిర్వహిస్తున్న ప్రజా పాలన లో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాలు మేరకు ములుగు సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి పర్యవేక్షణలో తెలంగాణ సాంస్కృతిక సారధి బోడ కిషన్ కళా బృందం శనివారం ములుగు మండలం జాకారం గ్రామంలో ఆరు గ్యారంటీల పథకాలను వివరిస్తూ కళాయాత్ర నిర్వహించారు.
ఒక్కొక్క పథకాన్ని వివరిస్తూ ఆటపాటలతో చైతన్యం కల్పించారు ప్రజలు మూఢనమ్మకాలను నమ్మొద్దని పరిసరాల పరిశుభ్రత వ్యక్తిగత పరిశుభ్రత పాటించి ఆరోగ్యం కాపాడుకోవాలని పాటల ద్వారా వివరించారు ప్రభుత్వ పథకాలపై అవగాహన కలిగి సద్విని పరుచుకోవాలి అనే ఉద్దేశంతో ప్రజాపాలన కళాజాత నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమంలో రహీముద్దీన్ మార్త రవి రాగుల శంకర్ రేలా విజయ్ రెల కుమార్ అమ్మ పాట తిరుపతి గోల్కొండ బుచ్చయ్య నరేష్ రామంచి సురేష్ ఈర్ల సాగర్ కనకం రాజేందర్ భాస్కర్ దీపక్ రాము శ్రీలత శోభ పాల్గొన్నారు

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కు.. ఎమ్మెల్యేల ఘన నివాళి.

మహబూబ్ నగర్/ నేటిధాత్రి

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని MUDA కార్యాలయంలో మాజీ ప్రధాని స్వర్గీయ మన్మోహన్ సింగ్ కు జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి, మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి, మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు మాట్లాడుతూ.. దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ దేశంలో పలు ఆర్థిక సంస్కరణలు ప్రవేశపెట్టారన్నారు. దేశానికి చేసిన సేవలు మరువలేనివన్నారు. మన్మోహన్ సింగ్ మరణించిన.. ఆయన చేసిన సంస్కరణలు దేశ అభివృద్ధికి బాటలు వేశాయన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సమగ్ర శిక్షా ఉద్యోగులు చెవిలో పువ్వుతో నిరసన

ములుగు జిల్లా నేటిధాత్రి

ములుగు జిల్లా కేంద్రంలో సమగ్ర శిక్షా ఉద్యోగుల సమ్మె పంతొమ్మిదో రోజుకు చేరుకుంది శనివారం రోజు సమ్మెలో భాగంగా వినూత్నంగా ఉద్యోగులంతా చెవిలో పువ్వు పెట్టుకొని నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చల్లా భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ తమ సమస్యలు వెంటనే పరిష్కరించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గత సంవత్సరం టీపీసీసీ అధ్యక్షులుగా ఉండి సమగ్ర శిక్షా ఉద్యోగులకు ఇచ్చిన వాగ్దానాన్ని చెవిలో పువ్వు పెట్టినట్టుగా చేసి మాట తప్పకూ డదని ప్రస్తుత ముఖ్యమంత్రిగా ఉన్నారు గనుక వెంటనే స్పందించి ఉద్యోగాలను క్రమబద్దీకరించాలని ఆలస్యమైతే ఆలోపు పేస్కేల్ మరియు ప్రభుత్వ ఉద్యోగుల వలె సిసిఎల్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్షా ఉద్యోగులందరినీ విద్యాశాఖలో విలీనం చేయాలని పిటిఐలకు 12 నెలల వేతనం ప్రతీ ఉద్యోగికి జీవిత భీమా 10 లక్షలు ఆరోగ్య భీమా 5లక్షలు మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు 61 సం.లు నిండిన వారికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఇట్టి కార్యక్రమంలో బంజారా ఐక్యవేదిక ములుగు జిల్లా అధ్యక్షులు సోమానాయక్, ఆల్ పెన్షనర్స్ ములుగు జిల్లా జనరల్ సెక్రెటరీ దేవ్ సింగ్, కోశాధికారి బాలు నాయక్ మాజీ డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ పోరిక రవీందర్ ములుగు జిల్లా సాంస్కృతిక కార్యదర్శి డాక్టర్ పోరిక శ్యామల నాయక్ బంజారా ఐక్యవేదిక సభ్యులు కొర్ర రాజన్న, అజ్మీర భావ్ సింగ్ లు పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా సమగ్ర శిక్షా ఉద్యోగుల సంఘం అధ్యక్షులు చల్లా భాస్కర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి సోమిడి కరుణాకర్ కోశాధికారి కుమార్ పాడియా ఉపాధ్యక్షులు ఎండీ ఫిరోజ్ కార్యవర్గ సభ్యులు సుజాత రమేష్ సమన్వయకర్తలు రాజేశ్వరి స్వప్నలత ప్రవీణ్ దేవేందర్ సుబ్బారెడ్డి తిరుమల చందన స్పెషల్ ఆఫీసర్లు భాగ్యలక్ష్మి పుష్పనీల అశ్విని వెంకటలక్ష్మి లలిత ఉమాదేవి ప్రతిభ శాంత విజయలక్ష్మి రమణి తదితరులు పాల్గొన్నారు

వనపర్తి లో మిగిలి పోయిన రోడ్ల విస్తరణ పనులు చేపట్టాలి

వనపర్తి నేటిధాత్రి
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి మున్సిపల్ కౌన్సిల్ సంతానం తెలిపారు వనపర్తి జిల్లా కేంద్రంలో మున్సిపల్ సాధారణ సమావేశం అధికారులు చైర్మన్ ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ మృతికి సంతాప సుస్కంగా రెండు నిమిషాలు మౌనం పాటించారు ఈ సందర్భంగా ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణ మున్సిపల్ కౌన్సిలర్లు బండారు కృష్ణ సత్యం పెండం నాగన్న యాదవ్ బ్రహ్మం కో ఆప్షన్ సభ్యులు గులాం ఖాదర్ ఖాన్ సానిటరీ ఇన్స్పెక్టర్ ఉమామహేశ్వర రెడ్డి అధికారులు పాల్గొన్నారు గాంధీ విగ్రహం అంబేద్కర్ విగ్రహం గత ప్రభుత్వంలో రోడ్ల విస్తరణలో భాగంగా విగ్రహాలను తీసి చౌరస్తాల కాకుండా కొద్ది దూరంలో ఏర్పాటు చేశారు మున్సిపల్ చైర్మన్ పుట్టపాకల మహేష్ గాంధీ విగ్రహం అంబేద్కర్ విగ్రహం పాత స్థలములనే ఏర్పాటు చేయిస్తామని తెలపడంతో బీఆర్ఎస్ కౌన్సిలర్లు చైర్మన్ తో వాదానికి దిగారు .వనపర్తి పట్టణంలో కర్నూల్ రోడ్ కొత్తకోట రోడ్ పానగల్ రోడ్డులో ఇంతవరకు రోడ్ల విస్తరణ చేయక పోవడపై మండిపడ్డారు . పానగల్ రోడ్డులో విస్తరణ బాధితులకు బీ ఆర్ ఎస్ ప్రభుత్వం లో డబుల్ బెడ్ రూమ్ లు కేటాయించారని అయినా రోడ్ల విస్తరణ చేయకపోవడం విడ్డూరమని 15 అవార్డు మున్సిపల్ కౌన్సిలర్ బండారు కృష్ణ పెండెం నాగన్న యాదవ్ సభలో నిలదీశారు దివంగత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సంతాప సూచికంగా సమావేశం ఫస్ట్ లోనే సంతాపాము తెలుపకుండా సమావేశం వాయిదా వేయాలని మున్సిపల్ అధికారులకు పాలకులకు తెలియకపోవడంపై దివంగత దేశ ప్రధానిని మన్మోహన్ సింగ్ అవమానపరిచినట్లు అవుతుందని బండారు కృష్ణ నాగన్న యాదవ్ ఆవేదన వ్యక్తంచేశారు

భద్రాద్రిలో నేటి నుంచి నెహ్రు కప్ సంబురాలు 

భద్రాచలం నేటి ధాత్రి

– ఏర్పాట్లను పూర్తిచేసిన నిర్వాహకులు.

– రాష్ట్ర నలుమూలల నుంచి భద్రాద్రికి తరలి రానున్న క్రీడాకారులు.

నెహ్రూ కప్ ను విజయవంతం చేయండి : నెహ్రు కప్ వ్యవస్థాపకులు తోటమల్ల బాలయోగి.
భద్రాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానంలో ఆదివారం నుంచి 29 వ నెహ్రూ కప్ తాళ్లూరి భారతీదేవి స్మారక అంతర్రాష్ట్ర ప్రైజ్ మనీ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. తాళ్లూరి పంచాక్షరయ్య ట్రస్ట్, ఐటిసి పి.ఎస్.పి.డి, బత్తినేని ప్రకాష్, డాక్టర్ పాల్ రాజ్ ఇంజనీరింగ్ కాలేజ్, పాకాల దుర్గాప్రసాద్ ల సౌజన్యంతో పట్టణ ప్రముఖుల సహకారంతో ఈ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు నెహ్రూ కప్ వ్యవస్థాపకులు తోటమల్ల బాలయోగి, వాతాడి దుర్గా అశోక్ లు తెలిపారు.

1994లో నెహ్రూ కప్ క్రికెట్ టోర్నమెంటును తోటమళ్ళ బాలయోగి (లెక్చరర్, గిరిజన గురుకులం) భద్రాచలం, వాతాడి దుర్గా అశోక్ (కేటీపిఎస్ ఉద్యోగి ) ప్రారంభించడం జరిగింది. మారుమూల ఏజెన్సీ ప్రాంతం భద్రాచలం పుణ్యక్షేత్రంలో భారతదేశ తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పేరు మీదుగా ఈ టోర్నమెంట్ ప్రారంభించటం గమనార్హం. నాటి నుంచి నేటి వరకు నిరాటంకంగా కొనసాగుతూ 29వ సంవత్సరం కూడా నెహ్రూ కప్ క్రికెట్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. భద్రాచలం ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానమును ఇందుకోసం అందంగా తీర్చిదిద్దారు. గ్రౌండ్ లో నలుదిక్కుల షామీయనాలు ఏర్పాటు చేశారు. ప్రత్యేకంగా పిచ్ నిర్మాణం చేశారు. సైడ్ వాల్ స్క్రీన్ ల మధ్య ఈ టోర్నమెంట్ జరగనుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాల నుంచి మొత్తం 21 జట్లు ఈ టోర్నమెంట్ లో పాల్గొననున్నాయి. స్థానికుల యొక్క సహాయ సహకారాలతో ఈ టోర్నమెంటును నిర్వహిస్తున్నారు. భారతదేశంలోనే తొలి ప్రధాని నెహ్రూ పేరు మీదుగా ఇన్ని సంవత్సరాలు టోర్నమెంట్ నిర్వహించిన చరిత్ర లేదని, ఆ ఘన కీర్తి భద్రాచలంలో నిర్వహిస్తున్న నెహ్రూ కప్ కే దక్కిందని నెహ్రు కప్ వ్యవస్థాపకులు తోటమల్ల బాలయోగి, వాతాడి దుర్గా అశోకులు వెల్లడించారు. ఈ టోర్నమెంట్ నిర్వహణ ద్వారా ఎంతోమంది యువతి, యువకులు క్రికెట్ లో రాణించి ఉన్నత స్థానాలను అధిరోహించారని తెలిపారు.

నెహ్రూ కప్ క్రికెట్ టోర్నమెంట్ విజయవంతానికి అందరూ కృషి చేయాలని, నెహ్రూ కప్ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభ వేడుకకు భద్రాచలం శాసనసభ్యులు డాక్టర్ తెల్లం వెంకటరావు, తాళ్లూరి పంచాక్షరయ్య ట్రస్ట్ సభ్యులు, ఐటీసీ అధికారులు,పట్టణ ప్రముఖులు తదితరులు హాజరు కానున్నారని, ఈ వేడుకకు పట్టణ ప్రజలు, క్రికెట్ అభిమానులు తదితరులు తరలి రావాలని నెహ్రూ కప్ టోర్నమెంట్ గౌరవ సలహాదారులు ఎస్.కే అజీం, నెహ్రూ కప్ అధ్యక్షులు అట్లూరి శ్రీధర్, ప్రధాన కార్యదర్శి దాట్ల శ్రీనివాసరాజు, కన్వీనర్ ఎస్ కే సలీం, కోశాధికారి కుంచాల సదానందం, ఉపాధ్యక్షులు గుమ్ములూరు శ్రీనివాస్, సహాయ కార్యదర్శి ఎం నాగార్జున, నిర్వాహక కమిటీ సభ్యులు పూనెం ప్రదీప్ కుమార్ తదితరులు వెల్లడించారు.

ఉచిత మెడికల్ క్యాంపును ప్రారంభించిన మున్సిపల్ చైర్మన్

పరకాల నేటిధాత్రి
పట్టణంలోని 20వవార్డులో ప్రతిమ క్యాన్సర్ ఇనిస్టిట్యూట్ వరంగల్ వారిచే నిర్వహించిన ఉచిత మెడికల్ క్యాంపును మున్సిపల్ చైర్మన్ సోదా అనిత రామకృష్ణ మున్సిపల్ చైర్మన్ అనిత రామకృష్ణ ప్రారంభించారు.ఈ సందర్బంగా మాట్లాడుతూ పట్టణంలోని ప్రజలందరూ ఉచిత మెడికల్ క్యాంపును సద్వినియోగం చేసుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు.అలాగే ఆరోగ్యశ్రీ ద్వారా వైద్య చికిత్సలు ఈ హాస్పిటల్ సౌకర్యం కలదని ఈ మెడికల్ క్యాంపులో సర్జికల్ అంకలాజిస్ట్,హిపటో క్యాన్సర్, గ్యాస్ట్రో,ఎంటరాలజీ,లివర్ వ్యాధిల కొరకు వైద్య చికిత్సలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో పరకాల మున్సిపల్ కౌన్సిలర్ ఏకు రాజు,మాజీ ఎంపీపీ ఎన్కతల్ల రవీందర్,స్పెషలిస్ట్ డాక్టర్లు తిప్పని అవినాష్,మద్ది నారాయన్,తిప్పని సువిత్ర, కాంగ్రెస్ పార్టీ నాయకులు బొచ్చు మహేష్ తదితరులు పాల్గొన్నారు.

మరణించిన ఆటో డ్రైవర్ కుటుంబానికి ఆటో యూనియన్ ఆర్థిక చేయూత

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

రామకృష్ణాపూర్ పట్టణంలోని అశోక్ నగర్ ఏరియా కు చెందిన ఆటో డ్రైవర్ రాజబాబు డిసెంబర్ 14న అనారోగ్యంతో మృతి చెందడంతో పట్టణ ఆటో డ్రైవర్ యూనియన్ సంఘం స్పందించి కుటుంబానికి ఆర్థిక చేయూతనందించింది. నిరుపేద కుటుంబానికి చెందిన ఆటో డ్రైవర్ రాజ బాబు కుటుంబ సభ్యులను ఆటో యూనియన్ గౌరవ అధ్యక్షులు గాండ్ల సమ్మయ్య, అధ్యక్షులు ఎనగంటి సంపత్ లు సందర్శించి పదివేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. మృతి చెందిన ఆటో డ్రైవర్ రాజబాబు కుటుంబ సభ్యులకు ప్రభుత్వం నుండి వచ్చే పథకాలను అందించేలా కృషి చేస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆటో యూనియన్ ఉపాధ్యక్షులు పాక అంజయ్య, జనరల్ సెక్రెటరీలు రవి ,రాజిరెడ్డి, కోశాధికారి కున్సోత్ సీతారాం, చెన్నాల సారయ్య, సభ్యులు నరసయ్య, శంకర్ ,రాజు, భాస్కర్ ,అంజయ్య, వంశీ తదితరులు పాల్గొన్నారు.

error: Content is protected !!
Exit mobile version