నర్సంపేట,నేటిధాత్రి :
సర్పంచులకు,ఎంపిటిసిలకు పెండింగ్ లో ఉన్న బిల్లులను వెంటనే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయాలని నర్సంపేట పట్టణంలోని పద్మశాలి ఫంక్షన్ హాల్ లో 6 మండలాలకు సంబంధించిన మాజీ ప్రజాప్రతినిధులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచుల ఫోరం గౌరవ ఆధ్యక్షులు నామాల సత్యనారాయణ మాజీ మార్కెట్ చైర్మన్ బత్తిని శ్రీనివాస్ మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం అప్పు సప్పు చేసి పనులు చేస్తే ఇప్పటివరకు బిల్లులు రాకపోవడంతో కుటుంబాలు ఆర్థికంగా చితికెలబడి రోడ్డున పడాల్సిన పరిస్థితి వచ్చిందని అన్నారు. పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరుతూ ఈ నెల 26న ఎంపీడీవో కార్యాలయాల ముందు శాంతియుతంగా ధర్నా నిర్వహించి 27న జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించడం జరిగిందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు మాదాసి రవి,తిరుపతి రెడ్డి,అనుముల కుమారస్వామి,నానబోయిన రాజారాం,మొగ్గం మహేందర్, పలువురు మాజీ సర్పంచులు, తదితరులు పాల్గొన్నారు.