భద్రాచలం నేటి ధాత్రి
భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిసి కళాశాల సంబంధించిన సమస్యలను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు కి తెలియజేశారు.
ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రాక్టికల్ బిల్డింగ్ కోరకు, ల్యాబ్ & ఎక్యూమెంట్స్ , గ్రంధాలయం బుక్స్ గురించి తెలియజేయగా
వెంటనే స్పందించిన ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తో మాట్లాడి మంజూరు చేయాలని కోరారు.
అనంతరం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు ని శాలువాతో సన్మానించారు
ఈ కార్యక్రమంలో మండల నాయకులు రత్నం రమాకాంత్, బొంబోతుల రాజీవ్, నర్రా రాము, పుల్లగిరి నాగేంద్ర,
కళాశాల సిబ్బంది జిల్లా నోడల్ ఆఫీసర్ ఇంటర్ విద్య H వెంకటేశ్వర రావు, ఇంచార్జి ప్రిన్సిపాల్ D. సుధాకర్ రెడ్డి , లైబ్రేరియన్ K. గరుడా చలం, సీనియర్ అసిస్టెంట్
B రత్న, ల్యాబ్ అసిస్టెంట్
చిన్న వెంకట నారాయణ,
తదితరులు పాల్గొన్నారు.