భద్రాచలం నేటి దాత్రి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్
భద్రాచలం సిటీ స్టైల్ జిమ్ కు చెందిన మోడెం వంశీ అనే పవర్ లిఫ్టింగ్ క్రీడాకారుడు, ఇటీవల యూరప్ ఖండంలోని మాల్టా దేశంలో జరిగిన అంతర్జాతీయ స్థాయి పవర్ లిఫ్టింగ్ పోటీలలో ఇండియాకు బంగారు పతకాన్ని సాధించడం జరిగింది. కాగా అక్టోబర్ 4 నుంచి 13 వరకు సౌత్ ఆఫ్రికా లోని సన్ సిటీలో జరిగే కామన్వెల్త్ పవర్ లిఫ్టింగ్ పోటీలకు ఎంపిక ఇవ్వడం జరిగింది. ఈ పోటీలకు రానుపోను ఖర్చులకు గాను 1,60,000 రూపాయలు పవర్ లిఫ్టింగ్ ఆఫ్ ఇండియా వారికి చెల్లించవలసి ఉండగా రాష్ట్ర స్పోర్ట్స్ చైర్మన్ శివ సేనా రెడ్డి చొరవతో, పట్నం అనుషా రెడ్డీ ఒక లక్ష ఆర్థిక సాయం అందించడం జరిగింది. మిగతా 60 వేల రూపాయలు అవసరం ఉండగా, ఎటపాకలో మేడ్వాయి కు చెందిన రామకృష్ణ రాజు ద్వారా వసుధ ఫౌండేషన్ వారికి,
19 -09 -24 న వ్రాత పూర్వకంగా అసోసియేషన్ సభ్యులు తెలియపరచడం జరిగింది.ఇంతకుముందు వసుధ ఫౌండేషన్ ద్వారా క్రీడాకారులకు సహాయం చేయటం అనేది లేకపోయినా కానీ, మోడెం వంశీ యొక్క ప్రతభ గురించి రామకృష్ణ రాజు మరియు అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ శివరామకృష్ణప్రసాద్ ప్రత్యేక చొరవ తీసుకుని వసుధ ఫౌండేషన్ చైర్మన్ మంతెన వెంకటరమరాజు దృష్టికి తీసుకుని రావడం జరిగింది. ఈ రోజు వసుధ ఫౌండేషన్ చైర్మన్ మంతెన వెంకటరామరాజు సిటీ స్టైల్ జిమ్ క్రీడాకారుడు మోడెం వంశీకి 30 వేల రూపాయల ను హైదరాబాద్ వారి కార్యాలయం లో అందించడం జరిగింది.
ఈ చెక్కును అందించినందుకు గాను, ఎటపాక రామకృష్ణ రాజు ని, వసుధ ఫౌండేషన్ చైర్మన్ మంతెన వెంకటరమరాజు ని, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ సభ్యులు కృతజ్ఞతలు తెలపడం జరిగింది.