Officials Re-Survey Illegal Construction
అక్రమ నిర్మణలకు మళ్ళీ సర్వే చేసిన అధికారులు
స్థానిక అధికార నాయకుల అండదండలతో కార్యదర్శులకు బెదిరింపులు
మొగుళ్ళపల్లి నేటి దాత్రి
భూపాలపల్లి జిల్లా మొగుళ్ళపల్లి మండలం ఇప్పలపల్లి గ్రామం అకినపల్లి రెవెన్యూ పరిధిలో 7/05/2026 రోజున ఇప్పలపల్లి గ్రామంలో ప్రైవేట్ స్కూల్ అక్రమ నిర్మాణం చేసినటువంటి 207&281 సర్వే నంబర్ల పైన సర్వే చేయుటకు భూపాలపల్లి ఏడి ఆదేశాలమేరకు భూపాలపల్లి డిఐ సతీష్ చంద్ర గారు రావడం జరిగింది మరియు మండల సర్వేయర్, ఎస్ ఆర్ ఎస్ పి అధికారులు,ఆర్ అండ్ బి అధికారులు ఏఈ రావడం జరిగింది అన్నివిధాలుగా సర్వేలు చేసి పూర్వపు బండ్లబాటను ప్రభుత్వ భూమిని చూపించ కుండానే వెళ్ళిపోయారు.అనుమతి లేకుండా భవన నిర్మాణం చేపడుతూ,పూర్వపు బండ్లబాటను ఆక్రమించుకున్నాడని దూడపాక పోషయ్య దూడపాక రాజేశం గార్లు జిల్లా మండల ప్రజావాణిలో ఎన్నోసార్లు విన్నవించుకున్న పట్టించుకోవడంలేదు.

అక్రమ కట్టడాన్ని నిలిపివేయాలని అకినపల్లి పంచాయతీ కార్యదర్శి మంజుల గారు ఇప్పలపల్లి పంచాయతీ కార్యదర్శి దివ్య గారు పలుమార్లు సబ్బానీ రవికుమార్ స్కూల్ యజమానికి నిలిపివేయాలని నోటీసులు ఇచ్చిన పట్టింపు లేనట్టుగా చింపి వేయడం జరిగింది అదేవిధంగా స్థానిక అధికార రాజకీయ నాయకుల అండదండలతో కార్యదర్శులను దురుసుగా మాట్లాడుతూ బెదిరింపులకు గురిచేస్తున్నారు. ఆర్&బి అధికారులు అక్రమ నిర్మాణం భవనము కబ్జా అయిన భాగంను మార్కింగ్ ఇచ్చి కార్యదర్శి గారిని కూల్చివేయాలని చెప్పడం జరిగింది. ఈయొక్క కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు
