తేమ,తాలు అంటూ…. తరుగు తీస్తే కఠినచర్యలు
పరకాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ మారపెల్లి రవీం దర్
శాయంపేట నేటిధాత్రి:
రైతులను తాలు తేమ పేరుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠినచర్యలు.రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యంలో తేమ,తాలు పేరుతో ఇష్టానుసారంగా కోత విధిస్తే కఠిన చర్యలు తీసుకుం టామని పరకాల ఏఎంసీ వైస్ చైర్మన్ మారపల్లిరవీందర్ అన్నారు గంగిరేణి గూడెం గ్రామంలో పిఎసిఎస్ ఆధ్వ ర్యంలో ఏర్పాటుచేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు అనంతరం ఆయన మాట్లాడుతూ కొను గోలు కేంద్రం నిర్వాహకులు మరియు మిల్లర్లు రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని రైతులు ప్రభుత్వం ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాల్లో అమ్ముకొని ప్రభుత్వం కల్పి స్తున్న మద్దతు ధర పొందా లని ప్రవేటు వ్యక్తులకు తక్కు వ ధరకు అమ్ముకొని మోస పోవద్దన్నారు ఈ కార్యక్ర మంలో నోడల్ ఆఫీసర్ రాధిక కాంగ్రెస్ మండల పార్టీ అధ్య క్షులు దూదిపాల బుచ్చిరెడ్డి సర్పంచులు కుమారస్వామి హింగేభాస్కర్ చిందంరవి శానంకుమారస్వామి రమేష్ తదితరులు పాల్గొన్నారు
