మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
శాయంపేట నేటిధాత్రి:
శాయంపేట మండలం పత్తి పాక గ్రామంలో నిరుపేద కుటుంబానికి చెందిన కంద గట్ల నరహరి ఇటీవల మృతి చెందిన విషయం తెలుసు కున్న పలువురు చలించి పోయి 5500 రూపాయల ఆర్థిక సహాయంతో పాటు ,50 కేజీల బియ్యాన్ని బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పెద్దిరెడ్డి రాజిరెడ్డి, వార్డ్ మెంబర్ కందగట్ల ప్రవీణ్ కుమార్,గడ్డి రవి, రావుల తిరుపతి, వంగ రమేష్, వంగ అశోక్, పల్లెబోయిన శ్రీనివాస్, దండేపోయిన కట్టయ్య, అన్నే బోయిన వెంకటేష్, బాబు, రాజు పాల్గొన్నారు.
