కొండా…పెద్ద అనకొండ!

https://epaper.netidhatri.com/view/245/netidhathri-e-paper-25th-april-2024%09/3

-సబ్‌ కాంట్రాక్టర్లను నిలువునా ముంచిన ‘కొండా’!

-ఒక్క సిద్దిపేట జిల్లాలోనే 20 మంది సబ్‌ కాంట్రాక్టర్ల ను దోచిన జలగ కొండా

-సబ్‌ కాంట్రాక్టర్ల కోట్లాది రూపాయలు ఎగ్గొట్టిన కొండా!

-సబ్‌ కాంట్రాక్టర్ల జీవితాలు నాశనం చేసిన కొండా!

-ఫైళ్లు తగలబడి పోయాయని మోసం చేసిన కొండా!

-కాంట్రాక్టర్ల బిల్లులు ఎగ్గొట్టేందుకు కార్యాలయాలు మార్చిన కొండా!

-నమ్మించి నట్టెట ముంచే రకం కొండ

-మోసం మొదటి నుంచి వున్న లక్షణం.

-సబ్‌ కాంట్రాక్టర్ల సొమ్ము కొండార్పణం.

-సబ్‌ కాంట్రాక్టర్ల జీవితాలతో ఆడుకున్న దుర్మార్గం.

-చెప్పేవి శ్రీరంగ నీతులు… చేసేవి కొండా దగుల్భాజీ పనులు.

-తియ్యటి మాటల వెనుక కనిపెట్టలేనన్ని కొండా గోతులు.

-కొండా బాధితులు నిత్యం పెడుతున్న శాపాలు.

-కొండా మూలంగా బాధితులు పడుతున్న అరిగోసలు.

-ఇప్పటికీ కాళ్లరిగేలా తిరుగున్న కొండా బాధితులు.

-అప్పులు చెల్లించలేక కొండా మూలంగా అవస్థలు పడుతున్న అభాగ్యులు.

-నేటిధాత్రిని ఆశ్రయిస్తున్న బాధితులు.

-కొండాకు వ్యతిరేకంగా ప్రచారానికి బయలుదేరుతున్నారు.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

నీతులు చెప్పేవాడే గోతులు తీస్తాడు. తియ్యిటి మాటలు చెప్పేవాడే చేదును మింగిస్తాడు. న్యాయం, ధర్మం గురించి పదే పదే మాట్లాడేవాడే అన్యాయానికి తెగబడతాడు. నిత్యం సుద్దులు చెప్పేవాడే మోసాలకు సాగిస్తుంటాడు. నమ్మించి గొంతులు కోస్తుంటాడు. జీవితాలను ఆగం చేస్తుంటారు. అలాంటి వారిలో ఆరితేరని వ్యక్తి కొండా విశ్వేశ్వరరెడ్డి అని కొందరు బాధితులు అంటున్నారు. ఆయనను నమ్మి నిండా మునిగిన వారు దుమ్మెత్తిపోస్తున్నారు. తమను పిలిచి మరీ కొండా మోసం చేసిన తీరును తట్టుకోలేక కొన్నేళ్లుగా శాపాలు పెడుతున్నారు. పాపి చిరాయువు అన్నట్లు వారి తిట్లు కొండాకు తగడం లేదు. కాని ఏనాటికైనా పాపం పండకపోదా? అని ఆయన బాదితులు దినదినగండం నూరేళ్ల ఆయుష్షుగా ఎదురుచూస్తున్నారు. కొండా పతనం చూస్తామంటున్నారు. తమను మోసం చేసిన కొండాకు ఏనాటికైనా పాపం పండకపోదు. తమకు అన్యాయం చేసిన కొండాను దేవుడు శిక్షిస్తాడంటూ అంటూ తిడుతున్నారు. ఎలాగూ కొండా దోచుకున్న తమ సొమ్ము రావడం లేదు…మా లాగా ఇంకా ఎవరూ మోసపోవద్దు. కొండా చేసిన దురాగతాలు ప్రపంచానికి తెలియాలి. ప్రజలందరికీ తెలియాలి. ప్రజా సేవ పేరుతో కొండా చేస్తున్న దోపిడీ అందరికీ తెలియాలి. అది తెలిస్తే ఆయనను వద్దకు వెళ్లడానికి ఎవరూ ఇష్టపడరు. ప్రజల కష్టం దోచుకునే దుర్మార్గుడుగా , దోషిగా నిలబడతాడు. తాను చేసిన తప్పేంటో తెలిసి కూడా గొప్పవాడిగా నీతులు వల్లించే కొండా విశ్వేశ్వరరెడ్డి అసలు రూపమే కాదు, స్వరూపంలో దాగి వున్న అమానవీయ కోణాన్ని ఆవిష్కరించేదుకు ఎంతో మంది ముందుకొస్తున్నారు. చేవెళ్ల పార్లమెంటు పరిధిలో కొండాకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తామంటున్నారు. ఇంతకీ ఇంతలా కొండా వల్ల నష్టపోయిన వారు ఎవరు? అనే విషయం తెలియాలంటే ఐదేళ్లుగా నరకం చూస్తున్న బాధితుల జీవితాల గురించి అందరకీ తెలియాల్సి వుంది.
తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రం మొత్తం మంచినీటి సరఫరా కోసం అప్పటి ప్రభుత్వం మిషన్‌ భగీరధ కార్యక్రమం ప్రారంభించింది.
నేను సుద్దపూసని. నాకు ఎలాంటి వ్యాపారాలు లేవు. ఆసుపత్రుల నిర్వహణ కూడా నేను చూసుకోను. నాకు ప్రజా సేవ అంటే ఇష్టం. నాకు వేరే వ్యాపకమే లేదు. అంటూ సొల్లు పురాణాలు చెప్పే కొండా విశ్వేశ్వరరెడ్డి చేసే చీకటి వ్యాపారాలు అనేకం వున్నాయి. మిషన్‌ భగీరధలో కొంత భాగం ఎవరెస్టు పేరుతో కాంట్రాక్టు తీసుకున్నాడు. సహజంగా ఎమ్మెల్యేలు, ఎంపిలు చెప్పే సుద్దులే ఇక్కడ కొండా విశ్వేశ్వరరెడ్డి చెప్పాడు. ఎంపి కావడంతో తనపై ఎలాంటి వ్యాపార లావాదేవీలకు చెందిన కంపనీలు లేకుండా చూసుకున్నాడు. కాని రాతపూతలు వేరుగా వున్నా, మాట ముచ్చట్లన్నీ చెప్పాల్సింది కొండా విశ్వేశ్వరరెడ్డే. సిద్దిపేట జిల్లాలో మిషన్‌ కాకతీయ పనులు ఎవరెస్టు కంపనీ పేరు మీద కొండా విశ్వేశ్వరరెడ్డి చేపట్టారు. ప్రతి మండలాన్ని మరికొందరికి సబ్‌ కాంట్రక్టర్లుగా ఏర్పాటు చేసుకున్నారు. కొంత మందిని ఎంపిక చేసుకొని, రమ్మని పిలిపించుకొని మరీ సబ్‌ కాంట్రాక్టర్లు ఇచ్చాడు. అంటే బిల్లులు చెల్లించాల్సిన బాధ్యత మొత్తం కొండా విశ్వేశ్వరరెడ్దిదే. సుమారు సిద్దిపేట జిల్లాకు చెందిన ఓ 20 మందిని, ఆంధ్రాప్రాంతానికి చెందిన దాదాపు ఓ ఐదుగురుకి కాంట్రాక్టులిచ్చాడు. మాటలు గొప్పగా వుండే, చేతలు చెత్తగా వుండే విశ్వేశ్వరరెడ్డి మాటలు వారు నమ్మారు. ఆయనకు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. ఆయన తియ్యని మాటలకు పడిపోయారు. అంతే కోట్లుకు కోట్లు అప్పులు తెచ్చి పనులు చేయడం మొదలు పెట్టారు. కొంత కాలం కొంత నమ్మకం కుదిరే దాకా బిల్లులు సకాలంలో చెల్లించినట్లు నటించాడు. పనుల వేగం పెంచడం కోసం సబ్‌ కాంట్రాక్టర్లకు మరిన్ని ఆశలు కల్పించాడు. దాంతో వాళ్లు కొండా విశ్వేశ్వకరెడ్డిని గుడ్డిగా నమ్మారు.
అప్పటి నుంచి కొండా విశ్వేశ్వరరెడ్డి తన అసలు స్వరూపం చూపించడం మొదలు పెట్టాడు.
పనులు పూర్తయ్యే దాకా ఇదిగో,అదిగో అంటూ కాలయాపన చేశాడు. ఈ పనులు పూర్తయిన వెంటనే మరిన్ని పనులు అంటూ మరిన్ని ఆశలు కల్పించాడు. దాంతో పూర్తిగా సబ్‌ కాంట్రాక్టర్లు కొండాను పూర్తిగా నమ్మడం మొదలు పెట్టారు. అయితే మిషన్‌ భగీరధ పనులు చేసిన ఇంత కంపనీలు కాంట్రాక్టర్లుకు కొన్ని వెసులుబాటులు కల్పించేవి. అవసరమైన మెటీరియ్‌ సప్లయ్‌ చేసేది. అవసరమైన యంత్రాలు కూడా సబ్‌ కాంట్రాక్టర్లకు సమకూర్చేవి. కాని ఎవరెస్టు కంపనీ కనీసం ఒక చిన్న బోల్ట్‌ కూడా సప్లయ్‌ చేయలేదు. అయినా ఎంపిగా వున్న కొండా విశ్వేశ్వరరెడ్డి వల్ల తమకు భవిష్యత్తులో మరిన్ని పనులు వస్తాయన్న నమ్మకం వారి జీవితాలను ఆగం చేసింది. అదిక వడ్డీలకు అప్పులు తెచ్చి మరీ సబ్‌ కాంట్రాక్టర్లు మిషన్‌ భగీరధ పనులు పూర్తి చేశారు. పనులన్నీ పూర్తయిన తర్వాత కొండా అసలు రంగు బైట పడిరది. కాంట్రాక్టర్లను కొంత కాలం మభ్య పెట్టాడు. ఇక మభ్య పెట్టే వీలు కావడం లేదని గ్రహించి, తన ఎవరెస్టు కార్యాలయాన్ని మరో చోటకు తరలించాడు. ఆ కార్యాలయం అడ్రస్‌ తెలుసుకున్న కాంట్రాక్టర్లు వస్తుండడంతో మరో చోటకు కంపనీ కార్యాలయం మార్చుతూ ఇలా కాంట్రాక్టర్లను మాయ చేయడం మొదలు పెట్టాడు. సబ్‌ కాంట్రాక్టర్లకు అప్పులు పెరుగుతున్నాయి. కాని కొండా అప్పాయింటు మెంటులేదు. కార్యాలయాల్లో సమాధానం ఇచ్చేవారు లేరు.
ఒకప్పుడు సమాజంలో మంచి వ్యక్తులుగా గుర్తింపు, పేరు వున్నవాళ్లుంతా అప్పులు చేసి దివాళా తీసే పరిస్దితి వారికి తెచ్చింది కొండా విశ్వేశ్వరరెడ్డి.
ఇందులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బాల సుబ్బయ్య అనే వ్యక్తి పడుతున్న కష్టాలు అన్నీ ఇన్నీ కావు. పొరుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తి. బాలసుబ్బయ్యను నమ్మించి, ఇక్కడికి రప్పించి, మరీ పనులు చేయించుకున్నాడు. సబ్‌ కాంట్రాక్టు ఇచ్చాడు. లేబర్‌ బాధ్యతలను కూడా పాపం బాల సుబ్బయ్య నెత్తినేసుకున్నాడు. కొండాను నమ్మి నిండా మునిగాడు. సొంత పెట్టుబడితో అప్పటి ప్రభుత్వం విధించిన గడువు లోగా పనులు పూర్తి కావడంలో ఎంతో మంది సబ్‌ కాంట్రాక్టర్లు కృషి చేశారు. పెద్దఎత్తున పెట్టుబడులు పెట్టారు. ఇప్పుడు వాళ్లంతా దివాలా తీశారు. కాంట్రాక్టర్లుగా పనిచేసిన వాళ్లు ఇప్పుడు కూలీలుగా మారిపోయారు. తమ జీవితాలు అంతలా దిగజారిపోతాయని కలలో కూడా ఊహించలేదు. నమ్మించి తమ గొంతులు కొండా విశ్వేశ్వర రెడ్డి కోశాడని సిద్దిపేట జిల్లాకు చెందిన రాము అనే కాంట్రాక్టర్‌ తమ గోడును చెప్పుకుంటున్నాడు. బిల్లుల కోసం ఐదారేళ్లు కాళ్లరిగేలా తిరుగుతున్నామని అంటున్నారు. గత ఆరు నెలల క్రితం వరకు అదిగో ఇదిగో అంటూ చెప్పుకొచ్చిన కొండా విశ్వేశ్వరరెడ్డి బిల్లులు అడినందుకు ఎంతో మంది సబ్‌ కాంట్రక్టర్లను విపరీతంగా కొట్టించాడని అంటున్నాడు. తమకు బిల్లులు రావాల్సిన విషయం ఎక్కడా చెప్పుకున్నా ప్రాణాలతో వుండరంటూ బెదిరించేవాడట. ఇలా కొంత కాలం భయం గుప్పిట్లో కూడా కాంట్రాక్టర్లు బతకాల్సివచ్చింది. అయినా తెగించి తమకు రావాల్సిన బిల్లులు ఇవ్వాలంటే ఒక దశలో వందలాది మందిని తీసుకొచ్చి మరీ బెదింపులకు గురిచేసినట్లు కూడా తెలుస్తోంది. పైగా ఫైళ్లు కాలిపోయాయాని ఒకసారి, అసలు మీకు బిల్లులు ఇవ్వను.. మీ దిక్కున్న చోట చెప్పుకోండి! అని కొండా విశ్వేశ్వరెడ్డి బెదిరింపులు సర్వసాధారణమైపోయాయి. అప్పటి పాలకపెద్దలతో సబ్‌కాంట్రాక్టర్లు ఫోన్‌లు చేయిస్తే ఇచ్చేస్తామంటూ చెప్పడం,తర్వాత సబ్‌కాంట్రాక్టర్లను బెదిరిస్తూ, ఆఖరుకు వారి జీవితాలను ఆగం చేసి, కోట్ల రూపాయలు ముంచిన చరిత్ర కొ ండా విశ్వేశ్వరరెడ్డిది.
హుజూరాబాద్‌లో ఈటెల రాజేందర్‌కు ఉప ఎన్నిక సమయంలో కొండా విశ్వేశ్వరెడ్డి ప్రచారానికి వచ్చినప్పుడు అక్కడి కాంట్రాక్టర్లు బాలసుబ్బయ్య తో కలిసి వేలాది కరపత్రాలు ముద్రించి ప్రజలకు పంచారు.
ఎప్పుడైతే కరపత్రాలు పంచడం మొదలు పెట్టారో..ఆ రోజు నుంచి విశ్వేశ్వరరెడ్డి ప్రచారం చేయడం మానుకున్నాడు. ప్రజల ముందుకు రావడం మానేశాడు. ఇప్పుడు మళ్లీ చెవెళ్లనుంచి పార్లమెంటుకు పోటీచేస్తున్నాడు. నిజానికి చెవెళ్లలో కొండా బాధితులు ఆయనకు వ్యతిరేకంగా ఎన్నికల బరిలో నిలిస్తే గాని ఆయన అసలు బండారం బైట పడదని అనుకున్నారు. కాని బండ కింద రాయి చిక్కుకున్నది. అందుకే ఈసారి కొండా విశ్వేశ్వరరెడ్డి చేసిన దురాగతాలను బైట పెడుతూ, ప్రచారం చేయడానికి బాధితులు సిద్దమయ్యారు. ఇక ఇంటింటికీ తిరిగి కొండా విశ్వేశ్వరరెడ్డి ఎంత దుర్మార్గుడో వివరిస్తామంటున్నారు. ఎంపిగా ఒక వేళ పొరపాటను ఎన్నుకుంటే ఇక్కడ కూడ మళ్లీ ఎంత మందిని మోసం చేస్తాడని, తమకు జరిగిన అన్యాయం మరెవరకీ జరగొద్దని ప్రచారం చేస్తామంటున్నాడు. కొండాకు వ్యతిరేకంగా ఆట మొదలుపెట్టనున్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *