విద్యా వ్యాపారంలో ప్రైవేటు స్కూళ్ల పెడధోరణులు

https://epaper.netidhatri.com/

`ఆర్భాటం తప్ప నాణ్యతపై పట్టింపులేదు

`రొడ్డకొట్టుడు విద్యతో దెబ్బతింటున్న విద్యార్థుల భవిష్యత్తు

`ఫీజులపై ప్రభుత్వ నియంత్రణ కరువు

`సృజనాత్మకతను ప్రోత్సహించని విద్యతో విద్యార్థులకు ఇబ్బందులు

`అంతర్జాతీయ మార్కెట్‌లో పోటీపడలేని దుస్థితి

`న్కెపుణ్యం నేర్పని విద్య పిల్లలకు శాపం మాత్రమే

`లక్షల్లో ఫీజులు కట్టినా ఏమిటి ఫలితం?

`తల్లిదండ్రుల వేలంవెర్రి కూడా ఇందుకు కారణం!

`పెడత్రోవ పడుతున్న ప్రైవేటు విద్యాసంస్థల వ్యాపార ధోరణులు

హైదరాబాద్‌,నేటిధాత్రి:

విద్య ఎంతో పవిత్రమైంది…దాన్ని వ్యాపార దృక్పథంతో చూడకూడదు అనేది ఒకప్పటిమాట! ఇప్పుడు అది పక్కా వ్యాపారంగా మారిపోయింది. వ్యాపార దృక్పథం లేకపోతే ప్రైవేటు స్కూళ్లు ఏవిధంగా అభివృద్ధి చెందుతాయనేది, ‘ప్రైవేటు విద్య’ను సమర్థించేవారు చెప్పేమాట. అంతేకాదు లాభాలు పెరిగేకొద్దీ అవి మరింత నాణ్యమైన విద్యను అందిస్తాయనేది వారి వాదన! నేటితరం తల్లిదండ్రులు ప్రధానంగా వారి పిల్లలకు నాణ్యమైన విద్యను కోరుకుంటున్నారనేది వాస్తవం.పై తరాలకు చెందిన తల్లిదండ్రులు కూడా ఇదే కోరుకున్నప్పటికీ, నేటి కాలంలో ఉన్నన్ని విస్తృత వి ద్యావకాశాలు అప్పట్లో ఉండేవికావు. అయినప్పటికీ అందుబాటులో ఉన్న విద్యను తమ పిల్లలకుఅందించడానికి వారు ఎంతో తపనపడ్డారు. ఇక ప్రస్తుత కాలానికి వస్తే ప్రభుత్వ పాఠశాలలు నేటికాలానికి అవసరమైన స్థాయి విద్యను అందించడంలో విఫలం కావడమే తల్లిదండ్రులు ప్రైవేటు విద్యవైపు మొగ్గుచూపడానికి ప్రధాన కారణంగా చెప్పాలి. నాణ్యమైన విద్యపట్ల వారుచూపు తున్న ఆసక్తికి అనుగుణమైన విద్యను ప్రభుత్వ పాఠశాలలు అందించలేకపోవడమనే కార ణం, ప్రైవేటు స్కూళ్లు ‘నాణ్యమైన విద్య’ పేరుతో దోపిడీకి పాల్పడే దశకు తీసుకెళ్లింది. విద్య, వైద్య రంగాలు కేవలం ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలని వాదించేవారున్నారు. ఇది సహే తుకమే. కానీ ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే వైద్యరంగం ఎంత నిప్పచ్చరంగా పనిచేస్తున్నదీ, ప్రభుత్వ రంగ సంస్థలు ఏవిధంగా నష్టాల ఊబిలో కొనసాగుతున్నదీ మనకు తెలుసు. అదేమాదిరిగా విద్యారంగం కూడా ఆశించిన ఫలితాలివ్వడంలేదు. ప్రభుత్వ పాఠశాలలు తెలివైన విద్యార్థులకు అనువైన విద్యను అందించడంలో విఫలమవుతుండటమే ఈ విషాదానికి కారణం. అంతర్జాతీ యంగా ఎప్పటికప్పుడు అన్నిరంగాల్లో వస్తున్న మార్పులకు అనుగుణమైన విద్యను విద్యార్థులకు అందించడం తక్షణావసరం. కానీ అది వాస్తవరూపం దాల్చడంలేదు. ఇది విద్య ప్రైవేటీకరణకు ప్రధాన కారణం. 1980 దశకాల్లో క్రమంగా ప్రారంభమైన ఈ విద్యప్రైవేటీకరణ క్రమంగా వటవృక్షం మాదిరిగా రూపొందింది. ఇప్పుడు పాఠశాలలను సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా సంస్థలుగా గుర్తించి రుణాలు మంజూరు చేయాలన్న స్థాయికి ప్రైవేటు విద్యారంగం చేరుకోవడ మే విచిత్రం!
విద్యారంగం కార్పొటీకరణ
ఇవే పరిణామాలు వైద్యరంగంలో కూడా చోటుచేసుకున్నాయి. ప్రభుత్వ వైద్యం, ప్రైవేటు డాక్టర్ల స్థాయినుంచి ఇప్పుడు కార్పొరేట్‌ స్థాయికి వైద్యరంగం చేరుకొని ఫీజులుగా లక్షల రూపాయలు వసూలు చేస్తున్న విధంగానే, విద్యారంగం కూడా కార్పొరేటీకరణకు గురయి ఇప్పుడు లక్షల్లో ఫీజులు నిర్దేశించే దశకు చేరుకోవడం అశ్చర్యం కలిగించినా ఆమోదించాల్సిన వాస్తవం! ప్రభుత్వాలు కోట్లల్లో విద్యకు నిధులు కేటాయించి ‘క్వాలిఫైడ్‌’ టీచర్లను నియమించినా, ప్రభుత్వ బడులు నాణ్యమైన విద్యను అందించలేకపోవడానికి ప్రధాన కారణం, పనిచేస్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుల్లోచాలామంది ‘క్వాలిఫై’కు మాత్రమే పరిమితమై, పాఠ్యాంశాలపై పట్టులేకపోవడం, మారుతున్న పరిణామాలకు అనుగుణంగా తమను తాము అప్‌డేట్‌ చేసుకోకపోవడం! ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఇంత మంది క్వాలిఫైడ్‌ టీచర్లు ఉన్నప్పటికీ, తగిన విద్యార్హతలు లేని ఉపాధ్యాయులతో ప్రైవేటు పాఠశాలలు ఉత్తమ ఫలితాలు సాధించడానికి ప్రధాన కారణమేంటో గుర్తించాల్సిన అవసరం వుంది.
వ్యాపారంగా మారిన ప్రామాణిక విద్య
ప్రాచీనకాలంలో గురుకులాలుండేవి. కేవలం ప్రతిభ ప్రామాణికంగానే విద్యాబోధన జరిగేది. ధ నార్జన కాదు కేవలం జ్ఞానార్జనకే ప్రాధాన్యత! రాజు, ధనిక, పేద అనే తరతమ భేదాలు లేకుం డా అందరూ గురుశుశ్రూష చేసి విద్యను గడిరచేవారు. అది అప్పటి పద్ధతి! కాలక్రమేణా పరిస్థి తులు మారుతూ వచ్చాయి. విదేశీ దండయాత్రలు, పాశ్చాత్య ప్రభావం మన విద్యారంగంపై ప డిరది. క్రమంగా సంస్కృతంతో పాటు దేశీయ భాషల స్థానాన్ని ఆంగ్లం ఆక్రమించింది. ముఖ్యంగా ఉద్యోగాలకు ఆంగ్లవిద్య అవసరం కావడంతో, దేశీయ విద్య అడుగంటిపోయింది. గురుకు లాల స్థానాన్ని ప్రభుత్వ పాఠశాలలు ఆక్రమించాయి. ఇవి క్రమంగా ఉద్యోగార్థులను తయారుచే సే కర్మాగారాలుగా మారిపోయి, సృజనాత్మతకు ప్రాధాన్యమే లేకపోయింది. క్రమంగా పెరుగుతు న్న విద్యావంతుల్కెన నిరుద్యోగులకు, అందుబాటులో ఉన్న ఉద్యోగాలకు పొంతనే లేకపోవడం, సామాజిక అస్థిరతకు దారితీసింది. ఉపాధి దొరకని నిరుద్యోగులు ఉద్యమాలపేరుతో ఆవిర్భవించిన రాజకీయపార్టీలకు ఆకర్షితులయ్యారు. ఇక ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా యూనియన్ల పేరుతో రాజకీయాల్లో మునిగిపోయి, తమ వృత్తి ధర్మాన్ని విస్మరించడం మొదల్కెంది. క్రమంగా విద్యాసంస్థల్లోకి రాజకీయాలు చేరుకొని విద్యార్థుల మధ్య సైద్ధాంతిక సంఘర్షణలు ప్రారంభమై, విద్యావ్యవస్థ అస్థిరతకు లోన్కెంది. ఈ పరిణామాలు సహజంగానే ప్రతిభావంతుల్కెన విద్యార్థులపై, నిబద్ధతకలిగిన బోధకులపై ప్రతికూల ప్రభావాన్ని కలిగించాయి. సైద్ధాంతిక ముసుగులో విద్యా ర్థులు తమ విద్యకు తిలోదకాలిచ్చే దుస్థితి ఏర్పడిరది. విద్యాసంస్థలు రాజకీయ చ్కెతన్యం పేరుతోసంఘర్షణలకు ఆలవాలంగా మారాయి. ఈ పరిస్థితే క్రమంగా విద్యారంగంలోకి ప్రైవేటు సంస్థలు రంగ ప్రవేశం చేయడానికి దోహదం చేసింది.
అక్రమాల దిశగా ప్రైవేటు విద్య
తొలినాళ్లలో ప్రైవేటు విద్యారంగం, ఎప్పటికప్పుడు ప్రభుత్వ బోధనతో సరిపోల్చుకొని తమను తాము సరిదిద్దుకోవడం లేదా మరింత మెరుగైన విద్యను అందించేందుకు కృషిచేయడం చేశాయి. కానీ క్రమంగా ఈరంగంలో కూడా పోటీ పెరిగిపోవడంతో ఇక్కడ కూడా అక్రమాలు చోటుచేసుకోవడం ప్రారంభమైంది. విద్యార్థి సహజ ప్రతిభకు సంబంధించిన వాస్తవాలను మరుగుపరుస్తూ పరీక్షల్లో వారి సహజ పరిజ్ఞానంకంటే ఎక్కువ మార్కులు వేస్తూ తల్లిదండ్రులను మభ్యపెట్టడం మొదల్కెంది. నిజం తెలిస్తే విద్యార్థిని వేరే సంస్థలో చేర్పిస్తారన్న భయమే ఇందుకు కారణం! ఈవిధంగా అధికమార్కులు వేయడం ద్వారా ప్రారంభమైన అన్కెతికత క్రమంగా, వివిధ ప్రభుత్వ పాఠశాలల్లో లేదా ఇతర ప్రైవేటు విద్యాసంస్థల్లో ర్యాంకర్లను తమ జూనియర్‌ కళాశాలల్లో చేర్పించ కునేందుకు వేట స్థాయికి చేరుకుంది. దీని తర్వాతి పరిణామం ఏజెంట్లను నియమించుకొని మరీ పదవతరగతి ర్యాంకర్లకోసం ఎరవేసే ప్రక్రియ దాకా వెళ్లింది. ర్యాంకర్లకు రాయితీలిస్తూ, మ ధ్య స్థాయి అంతకంటే తక్కువ ర్యాంకులు వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద ముక్కుపిండి మరీ అధిక ఫీజులు వసూలుచేసే ప్రక్రియ మొదల్కెంది. ఈ విధంగా అధిక ర్యాంకులు వచ్చిన వి ద్యార్థులను చూపుతూ, పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులను ఆకర్షించే తర్వాతి దశ ప్రారంభమైంది. ఇదే సమయంలో కాన్సెప్ట్‌ స్కూళ్ల పేరుతో కొత్త పోకడలు మొదలయ్యాయి. ఐఐటీలు, ఐఏఎస్‌ కో చింగ్‌లు, టెక్నో, ఇంటర్నేషనల్‌, సెంట్రల్‌ సిలబస్‌ ఇలా ఎన్నోరకాల స్కూళ్లు కుప్పలుతెప్పలుగా వెలిసాయి. వీటికి తోడు జూనియర్‌, ఇంజినీరింగ్‌ కళాశాలలు కూడా పెరిగిపోవడంతో, విద్యార్థుల వేట నిత్యకృత్యంగా మారిపోయింది.
క్రమంగా విద్యారంగాన్ని ప్రైవేటు యాజమాన్యాలు శాసించేస్థాయికి వచ్చిన తర్వాత, క్రమంగా ప్రభుత్వాలపై కూడా తమ పట్టును సాధించడం మొదలుపెట్టాయి. ముఖ్యంగా తాము వసూలు చేసే ఫీజులపై నియంత్రణ లేకుండా చూసుకునేందుకు రాజకీయపార్టీలకు అనుకూలంగా వుండ టం, మీడియాకు అవసరమైన ప్రకటనలు జారీచేస్తూ తమ తప్పిదాలు బయటకు రాకుండా జా గ్రత్త పడటం దాకా ప్రైవేటు విద్యాసంస్థలు తమ సహస్రబాహువులను విస్తరించాయి.
నాణ్యతకు తిలోదకాలు
విద్యార్థి రాజకీయాల పేరుతో ప్రభుత్వ విద్య భ్రష్టుపట్టిన తర్వాత రంగంలోకి వచ్చిన ప్రైవేటు విద్యా సంస్థలు క్రమంగా తమ లాభాలను కాపాడుకునేందుకు, విద్యాబోధనలో తమద్కెన శ్కెలిని అనుసరించడం మొదలుపెట్టాయి. ముఖ్యంగా విద్యార్థులను ఎ,బి,సి గ్రేడ్‌లుగా విడగొట్టి ఒక్కొక్కరికి ఒక్కోరకమైన విధానంలో బోధన కొనసాగించాయి. వీటి లక్ష్యం ఒక్కటే ఎ గ్రేడ్‌ విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తే ప్రకటనల రూపంలో ప్రచారం చేసుకోవచ్చు. ఇది టెన్త్‌క్లాస్‌, ఇంటర్మీ డియట్‌ స్థాయిల్లో ఇప్పటికీ కొనసాగుతోంది. వీరు బోధించే తీరువల్ల విద్యార్థులకు వాటిల్లిన ప్రధాన నష్టం సృజనాత్మకత లోపించడం. కేవలం తాము చదివిన ప్రశ్నలు వస్తేనే సమాధానాలు రాసే పరిస్థితి! సబ్జెక్టు అవగాహనపై ఇచ్చే ప్రశ్నలకు సమాధానాన్ని టాప్‌ ర్యాంక్‌ విద్యార్థులు కూడా రాయలేకపోవడంతో, ఇంజినీరింగ్‌ స్థాయి దాటిన తర్వాత కంపెనీలు అడిగే సృజనాత్మక ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ఎంతోమంది విద్యార్థులు తాము చదివిన చదువు స్థాయికంటే తక్కువ స్థాయి ఉద్యోగాల్లో సరిపుచ్చుకోవాల్సి వచ్చింది. ఇక బి, సి గ్రేడ్‌ విద్యార్థులు కేవలం ప్రైవే టు పాఠశాలలు, కళాశాలల ర్యాంకుల చట్రంలో ఇరుక్కుపోయి, ఏదో ర్యాంకుతో బయటకు వచ్చి, ఏరంగంలో స్థిరపడాలో దిక్కుతోచని స్థితికి లోన్కె, తమ విద్యకు సంబంధంలేని ఏదో ఒక ఉద్యోగం లేదా ఉపాధిలో సర్దుకుపోవడం కొనసాగుతోంది.
లక్షలు దండుకుంటున్న ప్రైవేటు స్కూళ్లు
ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఐదేళ్లు దాటితేనే పాఠశాలల్లో చేర్పించాలి. కానీ ఇప్పుడు ప్లే స్కూల్స్‌, కిండర్‌ గార్డెన్‌ అంటూ రకరకాల స్కూళ్లను నెలకొల్పి లక్షలు దండుకుంటున్నారు. కేవలం ప్లే స్కూల్‌లో చేర్పించడానికి రూ.4లక్షలు ఫీజు కట్టాల్సి వచ్చిందంటూ ఒక తండ్రి వాట్సప్‌లో పోస్ట్‌ పెట్టి వాపోవడం తాజా పరిణామం. ప్రైవేటు సంస్థలు ఈవిధంగా రెచ్చిపోవడానికి తల్లిదం డ్రులు కూడా కారణమే! తమ పిల్లల్ని పెద్ద స్కూళ్లలో చేర్పించాలన్న వీరిలోని బలహీనతను అ టువంటి సంస్థలు సొమ్ము చేసుకుంటున్నాయి. కొన్ని పాఠశాలలు ఎ.సి. సదుపాయాన్ని కల్పిస్తు న్నామంటూ పెద్దమొత్తంలో తల్లిదండ్రులనుంచి ఫీజులు వసూలు చేస్తున్నాయి. వీరు కూడా తమ పిల్లలు ఎ.సి. పాఠశాలలో చదువుతున్నారని గొప్పలు పోతారు తప్ప, అక్కడ విద్యాప్రమాణాల ను పట్టించుకోరు. ప్రభుత్వ ఉద్యోగాలన్నది ఒకప్పటి మాట! ఇప్పుడు ఎవరూ ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రాధాన్యత ఇ వ్వడంలేదు. ఐ.టి, సెమికండక్టర్స్‌, చిప్స్‌, స్పేస్‌ వంటి వివిధ రంగాల్లోకి వెళ్లడానికే యువకులు ఉత్సాహం చూపుతున్నారు. మరి సృజనాత్మకతకు పెద్దపీటవేసే ఈ రంగాల్లోకి ఈ ‘రొడ్డకొట్టుడు’ విద్యను అభ్యసించినవారు ఎంతమేర పనికొస్తారు? ఇక్కడే వస్తున్నది అసలు సమస్య! ఇవ్వాళ నేర్చుకున్న న్కెపుణ్యం రేపటికి పనికిరావడంలేదు. ఎప్పటికప్పుడు అప్‌డేట్‌గా ఉన్నవారు మాత్రమే నేటి ప్రపంచంలో మనగలుగుతారు. ఈ నేపథ్యంలో ఈ ప్రైవేటు సంస్థలు అందిస్తున్న విద్య నాణ్యతపై తప్పనిసరిగా పర్యవేక్షణ ఉండాలి. ప్రభుత్వాలు ఈ దిశగా చర్యలు తీసుకొని, ముందుగా ప్రభుత్వ పాఠశాలలను సృజనాత్మక విద్యను అందించే విధంగా సమూలంగా మార్పులు చేపడితేనే ఈ ప్రైవేటు వేలంవెర్రికి అడ్డుకట్ట పడుతుంది. విద్యార్థి దశలో రాజకీయాలపట్ల అవగాహన కలిగించడంలో తప్పులేదు కానీ, సైద్ధాంతిక రాజకీయాల పేరుతో వారిలో సంఘర్షణాత్మక వైఖరిని ప్రోత్సహిస్తే, పరిస్థితి మళ్లీ మొదటికే వస్తుంది! ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో వీటిని నియంత్రించి, సృజనాత్మకు పెద్దపీట వస్తేతప్ప ఈ ప్రేవేటు వేలంవెర్రికి అడ్డుకట్టవేయడం సాధ్యంకాదు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *