Awareness Key for Govt Schemes Success
ప్రభుత్వ పథకాల పట్ల అవగాహన కలిగివుండాలి
త్వరలో కొత్త పథకాలు అమలు.. జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి
దుగ్గొండిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మండల స్థాయి సమావేశం
నర్సంపేట/దుగ్గొండి,నేటిధాత్రి:
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రభుత్వ పథకాల పట్ల ప్రజా ప్రతినిధులు,అధికారులు అవగాహన కల్గి ఉండి ప్రజలను చైతన్య వంతులను చేయాలని వరంగల్ జిల్లా అడిషనల్ కలెక్టర్ సంధ్యారాణి అన్నారు.
99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పట్ల దుగ్గొండి మండల స్థాయి సమావేశం మండల కేంద్రంలోని రైతు వేదికలో ఎంపీడిఓ లెక్కల అరుంధతి,మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు అధ్యక్షతన నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి హాజరై మాట్లాడారు.ముందుగా మండల ప్రగతి పట్ల ఆయా శాఖల అధికారులు వివరించారు. 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక పట్ల మండల పరిధిలోని గ్రామపంచాయతీ నిర్వహించిన గ్రామసభలు ఫిర్యాదుల పట్ల చర్చించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ సంధ్యారాణి మాట్లాడుతూ ప్రజల సంక్షేమం కోసం అందిస్తున్న పథకాల సందర్భంగా పది రకాల పథకాల టీమ్స్ పై ప్రభుత్వం 99 రోజుల కార్యాచరణ రూపొందించిందన్నారు.రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో కొత్త స్కీం లు ప్రవేశ పెడుతూ తీర్మానాలు చేసిందని పేర్కొన్నారు.
“అరైవ్ అలైవ్” కార్యక్రమం కింద ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రత నియమాలు పాటించాలని తెలిపారు.ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలలో
రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లు,మహాలక్ష్మి, గృహజ్యోతి, సన్నరకం బియ్యం, వడ్లబోనస్, చేయూత పెన్షన్స్, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, మహిళా శక్తి బ్యాంకు లింకేజ్ మట్టిలేని రుణాలు ఇందిరమ్మ చీరలు, కొత్త రేషన్ కార్డుల పథకాలు అమలవుతున్నాయి వాటిని ప్రతీ గ్రామంలో ఉన్న రైతులు,ప్రజలు ఉపయోగించుకుంటున్నారు.ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ లో కొత్త పథకాలు అమలు చేయాలని ఉద్దేశంతో
రాబోయే రోజుల్లో అల్పాహార పథకం, కుటుంబ జీవిత భీమా, ఇంటర్మీడియట్ మధ్యాహ్న భోజనం వికలాంగ విద్యార్థులకు వాహనాలు, పంటల మార్పిడి. సేంద్రియ వ్యవసాయం వంటి పథకాలు రాబోతున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ సంధ్యారాణి తెలిపారు.ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల పట్ల అవగాహన చేసుకొని ప్రజలకు అందజేసే విధంగా కృషి చేయాలని అధికారులకు సర్పంచ్లకు ఆదేశించారు. ప్రజా అవసరాల దృశ్య మండల స్థాయిలో తీర్మానం చేపట్టితేనే
అభివృద్ధి జరుగుతుందని తెలిపారు.“అరైవ్ అలైవ్” కార్యక్రమంలో భాగంగా హెల్మెంట్ లేకుండా గ్రామాల్లో వాహనాలు రావద్దని తీర్మానాలు చేసుకోవాలని గ్రామ పంచాయతీ కార్యదర్శులు సర్పంచ్ లకు ఆదేశాలు..
తడి పొడి చెత్తను వేరు చేసి గ్రామ పంచాయతీలకు అప్పజెప్పాలని చెత్త సేకరణ తర్వాత తప్పని సరిగా రీసైక్లింగ్ చేసి సేంద్రియ ఎరువులు తయారు చేయాలని తెలిపారు.చెత్తను రీసైక్లింగ్ చేసేందుకు ప్రణాళికలు చేయాలని సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు ఆదేశాలు చేశారు.
మండల స్పెషల్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు మాట్లాడుతూ గ్రామాలలో పారిశుద్ధం లోపించకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి.
వేసవి కాలలంలో డ్రింకింగ్ వాటర్ పట్ల అధికారులు శ్రద్ధ చూపాలి.ఉపాధి కూలీలు ఉదయాన్నే పనులకు వెళ్లాలి.. ఎండ పట్ల జాగ్రత్తలు పడాలి.వారికి నీడ ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.రోడ్డు భద్రత పట్ల నియమాలు పాటించాలి.10 శాతం వివిధ రకాల మరణాలు జరుగగా
ప్రమాదాల వలన 90 శాతం మరణాలు జరుగుతున్నాయని ఎస్సై రావుల రణధీర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి పుష్పలత,ఎమ్మార్వో ముస్కు సమ్మక్క,ఎంపిడిఓ డాక్టర్ లెక్కల అరుంధతి,మండల వ్యవసాయ శాఖ అధికారి శ్యామ్,మార్కెట్ డైరెక్టర్ హింగే రామారావు,మండల విద్యాశాఖ అధికారి వెంకటేశ్వర్లు,ఎస్సై రావుల రణధీర్ రెడ్డి, ఎంపీఓ శ్రీధర్ గౌడ్,సర్పంచ్ లు,గ్రామ పంచాయతీ కార్యదర్శులు,జీపి స్పెషల్ ఆఫీసర్స్, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
