₹5 Lakh Insurance Aid to Victim’s Family
మృతుని కుటుంబానికి రూ. 5 లక్షలు జీవన సురక్ష బీమా చెక్కు పంపిణీ…
రామచంద్రపురం(నేటిధాత్రి:
రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన లెక్కల రామ్మూర్తి భార్య లెక్కల శశికళకు ఎస్ జి బి సురక్ష బీమా రూ.5 లక్షల రూపాయల చెక్కును పంపిణీ చేశారు. బుధవారం కుప్పం బాదూరులోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ లో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ రీసన్ మేనేజర్ కామేశ్వరరావు, కుప్పం బాదూరు బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాసులు, యూనివర్సల్ సోంపో బీమా ప్రతినిధి హేమాద్రిలు నామినీకి బీమా చెక్కును అందజేశారు. గతంలో సప్తగిరి గ్రామీణ బ్యాంక్, యూనివర్సల్ సోంపో బీమా కంపెనీల ఒప్పందం మేరకు ఖాతాదారుల నుండి ఎస్ జి బి సురక్ష బీమా ను లెక్కల రామ్మూర్తిచే చేయించారు, ఎస్ జి బి సురక్ష పాలసీదారుడైన లెక్కలు రామ్మూర్తి పాలసముద్రం వద్ద 13/5 /2025 సంవత్సరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రమాదవశాత్తు మృతి చెందారు.ఈ సందర్భంగా ఏపీ గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ కామేశ్వరరావు మాట్లాడుతూ ప్రమాద బీమా మృతుని కుటుంబాన్నికి ఆర్థిక భరోసాను కల్పించడమే కాకుండా ఆర్థికంగా ఆదుకునేందుకు సహాయపడిందని అన్నారు. ప్రతి ఒక్కరికి భీమానే.
ఒక ధీమా అనే లక్ష్యంతో ప్రతి ఒక్కరూ ప్రధానమంత్రి జీవనజ్యోతి యోజన, అటల్ పింఛన్ యోజన పథకాలలో బీమా చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు…
