ఐటీడీఏ పీవో ప్రతీక్ జైన్ గారి స్ఫూర్తితో విప్ప మొక్కలు నాటిన గ్రీన్ భద్రాద్రి సభ్యులు

భద్రాచలం నేటి ధాత్రి

అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ట సందర్భంగా శ్రీరామచంద్ర వారికి వృక్షార్చనలో భాగంగా గ్రీన్ భద్రాద్రి, భద్రాచలం వారు, పిఓ ప్రతీక్ జైన్ గారి స్ఫూర్తితో విప్ప మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన పాకాల దుర్గాప్రసాద్ గారు మాట్లాడుతూ, భారతదేశం శతాబ్దాల నాటి నుండి ఎదురుచూస్తున్న అయోధ్యలో రాములవారి ప్రాణప్రతిష్ట సందర్భంగా గ్రీన్ భద్రాద్రి సభ్యులు సీతారామచంద్ర స్వామి వారికి వృక్షార్చనలో భాగంగా నేడు భద్రాచలంలో విప్ప మొక్కలు నాటడం జరిగిందని , విప్ప పువ్వును రాములవారికి ఎంతో ఇష్టమైన ప్రసాదంగా భక్తులు భావిస్తారని, అదే కాక ఆదివాసీలు ఈ విప్ప చెట్టును తమ దేవతగా కొలుస్తారని, విప్ప చెట్లు నాటడం ద్వారా రాములవారికి సేవ చేసిన వారిమి అవుతామని భద్రాచలం ఐటీడీఏ పీ.వో. ప్రతీక్ జైన్ గారు కూడా ఈ విప్ప మొక్కల గురించి విస్తృతంగా ప్రచారం చేయడం శుభసూచికమని కొనియాడారు.
ఈ సందర్భంగా గ్రీన్ భద్రాద్రి గౌరవ అధ్యక్షులు జి.ఎస్ .శంకర్రావు మాట్లాడుతూ ప్రతి ఒక్క మనిషి భోజనం ఎలా చేస్తామో, నీరు ఎలా తాగుతామో, ధైనందిన జీవితంలో మనం క్రమం తప్పకుండా ఏవిధంగా పనులు చేసుకుంటామో అదేవిధంగా మొక్కలు నాటడం కూడా చేయాలని, మొక్కలు భావితరానికి ప్రణాధారమని కనుక ప్రతి ఒక్కరు మొక్కలు తప్పనిసరిగా నాటాలని హితవు పలికారు.
ఈ కార్యక్రమంలో గ్రీన్ భద్రాద్రి కార్యదర్శి శ్రీరంగం సంపత్, కోశాధికారి విష్ణు మొలకల సుబ్రహ్మణ్యం, గౌరవ సలహాదారు పాకాల దుర్గాప్రసాద్, గౌరవాధ్యక్షులు జి.ఎస్ .శంకర్రావు, డాక్టర్ గోళ్ల భూపతిరావు, బోనాల నాగ సూర్యనారాయణ, కామిశెట్టి కృష్ణార్జునరావు, అజీమ్, గంగాధర వీరయ్య, ఉప్పాడ రాంప్రసాద్ రెడ్డి, పామరాజు తిరుమలరావు, ఎల్ వెంకటేశ్వర్లు, డాక్టర్ కృష్ణ ప్రసాద్, తేజ ,అశోక్ తదితరులు పాల్గొన్నారు

గ్రీన్ భద్రాద్రి –  భద్రాచలం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!