MCPI(U) Workers Rally for Onkar Meeting
చట్టసభల్లో ఓంకార్ పాత్ర సభకు తరలిన ఎంసిపిఐ(యు) కార్యకర్తలు
జెండా ఊపి వాహన ర్యాలీని ప్రారంభించిన జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్
నర్సంపేట,నేటిధాత్రి:
చట్టసభల్లో ఓంకార్ పాత్ర అనే అంశంపై మంగళవారం హైదరాబాదులోని రవీంద్రభారతిలో జరగనున్న సభకు నర్సంపేట నుండి ఎంసిపిఐ (యు) కార్యకర్తలు తరలివెళ్లారు.ఈ వాహన ర్యాలీ ని పార్టీ వరంగల్ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ పెద్దారపు రమేష్ జెండా ఊపి ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో నీతి నిజాయితీ విలువలను పెంపొందించడానికి అసెంబ్లీ టైగర్ ఓంకార్ స్ఫూర్తిని భవిష్యత్తు తరాలకు అందించే లక్ష్యంతో వారి శతజయంతి వార్షికోత్సవాల సందర్భంగా చట్టసభల్లో ఓంకార్ పాత్ర అనే అంశంపై రవీంద్రభారతి ఆడిటోరియంలో సభ నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఓంకార్ గారి స్ఫూర్తితో నీతివంతమైన రాజకీయాల కోసం మార్క్సిజాన్ని , లెనినిజాన్ని పుణికిపుచ్చుకొని వర్గ సామాజిక ఉద్యమాలను ప్రజా ఉద్యమాలను నిర్మించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు కామ్రేడ్ వంగాల రాగసుధ ,కుసుంబ బాపూరావు,నాగేల్లి కొమురయ్య ,డివిజన్ సహాయ కార్యదర్శి కొత్తకొండ రాజమౌళి ,జిల్లా కమిటీ సభ్యులు సంగతి మల్లికార్జున్ ,ఎల్ల బోయిన రాజు, ఎండి మా షూక్ , డివిజన్ నాయకులు అనుమాల రమేష్ బుడిమే సురేందర్ , ఎండి హుస్సేన్ ,పకిడే చందర్రావు , డాక్టర్ ఘటికే కోటేశ్వర్ గణిపాక బిందు రాకేష్ మార్త నాగరాజు,సుధా,విజయ సిహెచ్ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు.
