Prevention of Water Crisis in Gudibanda Village
గ్రామంలో నీటి ఎద్దడి లేకుండా ముందస్తు చర్యలు: సర్పంచ్ మందుల నాగయ్య.
కోదాడ,నేటి ధాత్రి:
మండలం గుడిబండ గ్రామంలో వేసవికాలంలో త్రాగునీటి కొరత ఏర్పడకుండా గ్రామ సర్పంచ్ మందుల నాగయ్య ముందు జాగ్రత్తగా గ్రామంలోనీ పాత బోర్లను పైప్ లైన్లను రిపేర్ చేయించి అవసరమైన చోట కొత్త బోర్లను వేయించడం ద్వారా ఇంటింటికి త్రాగునీరు సక్రమంగా అందేలా చూస్తున్నారు. గ్రామస్తులు సర్పంచ్ ముందస్తు స్పందనతో గ్రామంలో నీటి కష్టాలకు చేస్తున్నటువంటి కృషికి గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
