చేర్యాల నేటిధాత్రి
నూతనంగా రాష్ట్ర మత్స్యశాఖ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన ప్రియాంక అలా ను శనివారం హైదరాబాద్ లోని ఆమె కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసినట్లు టి పీసీసీ ఫిషర్ మెన్ కమిటీ జనరల్ సెక్రటరీ మంజె మల్లేశం తెలిపారు. ఈ సందర్భంగా కమిషనర్ కు పుష్పగుచ్ఛం అందించారు. మత్స్యకారుల సమస్యలు ఆమె దృష్టికి తీసుకెళ్లినట్లు మల్లేశం తెలిపారు. చేప పిల్లల పంపిణీకి టెండర్లు వేయాలని కమిషనర్ కు చెప్పమని అయన సూచించారు. పలు అంశాల పట్ల సానుకూలంగా స్పందించిన కమీషనర్ ప్రియాంక ఆలా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని, ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ నేరుగా వారి దృష్టికి తీసుకురావచ్చునని ఆమె తెలిపినట్లు మల్లేశం చెప్పారు.