కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కడియం కావ్య ను గెలిపించండి.

మతోన్మాద కార్పోరేట్ విధానాలు అనుసరిస్తున్న బిజెపిని ఓడించండి.

సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు పిలుపు.

భూపాలపల్లి నేటిధాత్రి

భారత కమ్యూనిస్టు పార్టీ మారుస్తూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శ్రామిక భవన్లో శాఖ కార్యదర్శిల విస్తృత సమావేశం జరిగింది. సమావేశానికి పార్టీ జిల్లా నాయకుడు వెలిశెట్టి రాజయ్య అధ్యక్షత వహించగా, పార్టీ జిల్లా కార్యదర్శి బందు సాయిలు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. మే 13న జరిగే పార్లమెంట్ ఎన్నికలలో ఇండియా కూటమి తరపున పోటీ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని డాక్టర్ కడియం కావ్యము అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని మోడీ అమలు చేయలేదు. లేని పేదలందరికీ 10 లక్షలు ఇచ్చి ఇంటి స్థల మిత్రమన్న మాట గాలిలో కలిసింది. జీరో అకౌంట్ లో 15 లక్షల రూపాయలు ఇస్తామని జీరో అకౌంట్ ఓపెన్ చేసి ఒక్క రూపాయి బిళ్ళ ఇవ్వకుండా ప్రజలను మోసం చేసిండు మోడీ సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలని ఒక్కరి కూడా ఉద్యోగం ఇవ్వకుండా నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమయ్యిండు. రైతు వ్యతిరేక 3 అగ్రి చట్టాలు తెచ్చి రైతాంగం పెద్ద ఎత్తున ఉద్యమించటం వలన ఆ తప్పనిసరి పరిస్థితులలో రద్దు చేసుకోవాల్సిన దౌర్భాగ్య పరిస్థితి మోడీ సర్కార్ కి ఎదురయింది. అయినా ఇంకా కనీసం మద్దతు ధర ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది చట్టం కూడా చేయలేదు. ఉపాధి హామీ చట్టంలో రోజుకు 600 రూపాయలు సంవత్సరానికి ₹200 రోజుల పనిగా అనిపిస్తామని నిధులు కేటాయించలేదు మున్సిపాలిటీ ఏరియాలలో ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయలేదు. అటవీ హక్కుల చట్టాన్ని నిర్వీర్యం చేసి పోడు భూములకు పట్టకుండా పోడు రైతులు అందరికీ అన్యాయం చేసిండు మోడీ సర్కారు. మోడీ పాలనలో దళితుల మీద గిరిజనుల మీద మహిళల మీద మైనార్టీల మీద చిన్న పిల్లల మీద దాడులు హత్యలు, అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా కార్మిక చట్టాల్ని మార్చి పెట్టుబడుదారులకు అనుకూలంగా కార్మిక వర్గానికి వ్యతిరేకంగా చట్టాలను నాలుగు కోట్లుగా మార్చి కార్మిక వర్గానికి వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నాడు. మోడీ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని రద్దుచేసి మనధర్మ శాస్త్రాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నాడు. లో భాగంగానే న్యూటన్ సిద్ధాంతాన్ని రద్దు చేసింది. చరిత్రను వక్రీకరించిండు. బీజేపీని ఓడించి మతోన్మాదాన్ని ఎండగట్టాలని చెప్పి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య ను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.
బిజెపిని ఓడించండి. ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించండి. కూటమి తరపున కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న డాక్టర్ కడియం కావ్య చేతి గుర్తుకు ఓటేసి అధిక మెజార్టీతో గెలిపించాలని జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు ఆకుదారి రమేష్,మేకల మహేందరూ, శేఖర్, శ్రీధరు,లక్ష్మక్క,రాజీని, గోవర్ధన్, కోసరి రమేష్,నరేష్, మహేశ్వరి, ఇతరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *