Hope Foundation Annadanam
నిరంతరాయంగా హోప్ ఫౌండేషన్ అన్నదానం: 183వ వారానికి చేరిన వైనం
శేరిలింగంపల్లి, నేటి ధాత్రి :-
మానవ సేవయే మాధవ సేవ అనే నినాదంతో హోప్ ఫౌండేషన్ చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. శనివారం చందానగర్ పరిధిలో హోప్ ఫౌండేషన్ చైర్మన్ కొండ విజయ్ కుమార్ ఆధ్వర్యంలో 183వ వారం అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా చైర్మన్ కొండ విజయ్ కుమార్ స్వయంగా ప్రజలకు అన్న ప్రసాదాన్ని వడ్డించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..

సమాజం పట్ల బాధ్యతతో, ఆకలితో ఉన్నవారికి అండగా నిలవాలనే లక్ష్యంతో గత 183 వారాలుగా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. భోజనానికి విచ్చేసిన వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఫౌండేషన్ సభ్యులు అన్ని ఏర్పాట్లు చేశారని, ప్రజలు అధిక సంఖ్యలో వచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించడం సంతోషకరమని ఆయన పేర్కొన్నారు.
మృదు స్వభావి, సేవా తత్పరుడైన విజయ్ కుమార్ చేస్తున్న ఇలాంటి మరెన్నో సామాజిక కార్యక్రమాలు విజయవంతం కావాలని అభిమానులు, స్థానికులు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు మరియు స్వచ్ఛంద కార్యకర్తలు పాల్గొన్నారు.
