హన్మకొండ,వరంగల్(మెడికల్), నేటిధాత్రి:
తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యుల ఫిర్యాదు మేరకు హనుమకొండ జిల్లా వైద్య మరియు ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఏ అప్పయ్య గారు ఈరోజు హెల్పింగ్ హ్యాండ్ డి అడిక్షన్ సెంటర్ ని తన బృందంతో కలిసి తనిఖీ చేయడం జరిగింది .ఆరోగ్య శాఖ ఇచ్చినటువంటి రిజిస్ట్రేషన్ నిబంధనలకు విరుద్ధంగా సంస్థను నడిపిస్తున్నాడని ,అదేవిధంగా ఆల్కహాల్ బాధితులకు తగినట్టుగా వసతులు కల్పించలేదని ,మరియు రిజిస్ట్రేషన్ లో చూపించిన విధంగా రెసిడెంట్ డాక్టర్ అందుబాటులో లేకపోవడం లాంటి ఉల్లంఘనలను గమనించి శోకాజ్ నోటీస్ ఇచ్చి మూడు రోజులలో అన్ని సంబంధిత ధ్రువపత్రాలతో సమాధానం అందించాలని, నిబంధనలను సరిగా పాటించాలని ఆదేశించడం జరిగింది. సైక్రియా ట్రిస్టుతో సేవలు అందించాలని సూచించడమైనది. ఈ విషయాన్ని గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లడం జరుగుతుందని అలాగే జిల్లాలోని మిగతా డి అడిక్షన్ సెంటర్స్ ని కూడా ఆకస్మికంగా తనిఖీ చేయడం జరుగుతుందని డాక్టర్ అప్పయ్య గారు తెలియజేశారు. డిఎంహెచ్వో గారితో పాటు ,జి ప్రసన్నకుమార్ ,విప్లవ కుమార్ పాల్గొన్నారు.