భూపాలపల్లి నేటిధాత్రి
అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ నూతన సంవత్సర క్యాలెండర్ ను జిల్లా కేంద్రంలో రావి నారాయణ రెడ్డి భవన్ లో ఆవిష్కరించడం జరిగింది…
ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి వేముల శ్రీకాంత్ మాట్లాడుతూ యువజనుల హక్కులకై ఏఐవైఎఫ్ ఉద్యమిస్తుందని అన్నారు…. కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మాట తప్పిందని మండిపడ్డారు …గత బిఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఇంటికో ఉద్యోగం మరియు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇవ్వక జీవితాలతో చెలగాటం ఆడుకున్నారని అన్నారు.. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసింది కానీ ఉద్యోగాల భర్తీ లో జాప్యం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేసారు…. కొత్తగా వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇకనైనా ఉద్యోగాలన్నీ భర్తీ చేసి యువతి యువకులను ఆదుకోవాలని అన్నారు…
ఈ కార్యక్రమంలో సిపిఐ పట్టణ కార్యదర్శి సోతుకు ప్రవీణ్ కుమార్ మాజీ ఏఐవైఎఫ్ నాయకులు క్యాతరాజు సతీష్, నేరెళ్ల జోసఫ్, కూనూరి భగత్, పంగ మహేందర్, జోగేష్,సింహాద్రి, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.