నర్సంపేట,నేటిధాత్రి:
ఉన్నత చదువుల కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వికలాంగ విద్యార్థికి నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి తనయుడు,కాంగ్రెస్ పార్టీ యున నాయకుడు దొంతి అవియుక్త్ రెడ్డి ఆర్థిక సహాయం అందజేసి మనోధైర్యాన్ని కల్పించాడు.వివరాల్లోకి వెళ్తే నర్సంపేట పట్టణానికి చెందిన రాజేందర్ అనే వికలాంగ యువ విద్యార్థి యూనివర్సిటీ కళాశాలలో పీజీ విద్యాబ్యాసం చేస్తూ ఆర్థిక ఇబ్బందులతో సతమవుతున్నాడు. వికలాంగుడు రాజేందర్ నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిని కలిసి తన గోడును వెళ్ళబోసుకోగా వెంటనే స్పందించిన ఎమ్మెల్యే మనోధైర్యాన్ని కల్పించారు.తన కుమారుడు దొంతి అవియుక్త్ రెడ్డితో రూ.12 వేల ఆర్థిక సాయం అందచేశారు.