శాయంపేట నేటిధాత్రి:
తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభాపతి ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనా చారి జన్మదిన వేడుకలు మండల కేంద్రంలో ఘనంగా జరిగాయి. మండలంలో అన్ని గ్రామాల్లో మధుసూదనా చారి అభిమానులు బీఆర్ఎస్ కార్యకర్తలు కేకు కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం గ్రామ గ్రామాన స్వీట్లు పంపిణీ చేసి ఆయన అభిమానాన్ని చాటుకున్నారు ఈ కార్యక్రమంలో మదన్న కార్యకర్తలు, గ్రామ గ్రామాన బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు ప్రజలు అధిక మొత్తంలో పాల్గొన్నారు.