New CITU Committee Formed for Parakala Workers
కార్మికుల సీఐటీయూ కమిటీ ఏర్పాటు
అధ్యక్షుడిగా మడికొండ ప్రమోద్ కుమార్
పరకాల,నేటిధాత్రి
పరకాల మున్సిపాలిటీ కార్మికుల సీఐటీయూ కమిటీని నూతనంగా ఏర్పాటు చేసి అధ్యక్షుడిగా మడికొండ ప్రమోద్ కుమార్ను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.ఈ కార్యక్రమం సీఐటీయూ జిల్లా నాయకులు తలారి ఉప్పలయ్య బోట్ల చక్రపాణి ఆధ్వర్యంలో నిర్వహించబడింది.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సీఐటీయూ సంస్థ కార్మికుల హక్కుల కోసం నిరంతరం కృషి చేస్తుందని పేర్కొన్నారు.కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నూతన కమిటీ చురుకుగా పనిచేస్తుందని తెలిపారు.గౌరవ అధ్యక్షుడిగా బొచ్చు ఐలయ్య,గౌరవ సలహాదారుడిగా పసుల సారయ్య నియమితులయ్యారు.అధ్యక్షుడిగా మడికొండ ప్రమోద్ కుమార్,కార్యదర్శిగా చెరుకునాగరాజు,కోశాధికారిగా మడికొండ వసంత బాధ్యతలు స్వీకరించారు.వర్కింగ్ ప్రెసిడెంట్గా గుర్రం సరోజన, ఉపాధ్యక్షులుగా కోకిల సుమన్,మంద మహేష్, దుప్పటి తిరుమల నియమితులయ్యారు.సలహాదారులుగా మడికొండ సుధాకర్,ఒంటేరు సరోజన, సహాయ కార్యదర్శులుగా సుదమల్ల సతీష్,సాంబరాజు బాధ్యతలు చేపట్టారు.కార్యవర్గ సభ్యులుగా బొచ్చు సుశీల,బొచ్చు సురేష్,ఎర్ర సదయ్య,చిలువేరు శుభకళ, బుస రవి,ఇనుగాల తిరుపతి,ఒంటేరు ప్రకాష్ ఎంపికయ్యారు.ఈ కమిటీని కార్మికులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు.సహకరించిన మున్సిపాలిటీ కార్మికులకు నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
