Drainage Issue Inspected Near Mosque in Parakala
మసీదు ప్రాంతంలో డ్రైనేజీ సమస్య పరిశీలన
పరకాల,నేటిధాత్రి
https://youtu.be/FvRqDzK6-PU?si=GmJNZqNGTnfJ2N_K
పట్టణంలోని 22వ వార్డులో మసీదు ప్రాంతాన్ని స్థానిక కౌన్సిలర్ అల్లే దశరథం, మున్సిపల్ అధికారులు కలిసి సందర్శించారు. మసీదు పెద్దల విజ్ఞప్తి మేరకు ఈ పరిశీలన చేపట్టినట్లు తెలిపారు.సందర్శన సందర్భంగా అక్కడ కొనసాగుతున్న డ్రైనేజీ సమస్యను మున్సిపాలిటీ కమిషనర్ అంజయ్య, ఏఈ రంజిత్ లు ప్రత్యక్షంగా పరిశీలించారు.సమస్య తీవ్రతను గుర్తించిన అనంతరం తక్షణ చర్యలు తీసుకుని పరిష్కారం కల్పిస్తామని హామీ ఇచ్చారు.ప్రాంత ప్రజలకు ఇబ్బందులు లేకుండా అవసరమైన చర్యలు త్వరితగతిన చేపడతామని అధికారులు వెల్లడించారు.
