Use Self Census Facility
ప్రతి ఒక్కరు స్వీయ గణన సద్వినియోగం చేసుకోవాలి
* మున్సిపల్ చైర్ పర్సన్ దేవర సమతావెంకట్ రెడ్డి,
•ప్రతి ఒక్కరూ బాధ్యతగా జనగణనలో పాల్గొని దేశాభివృద్ధికి సహకరించాలి
* కమిషనర్ యాదగిరి
నేటిధాత్రి, చేవెళ్ళ :
2027 జనగణనలో భాగంగా స్వీయ గణన చేసుకునేందుకు ఈ నెల 10 వరకు మాత్రమే అవకాశం ఉందని, అందువల్ల జిల్లాలోని ప్రతి ఒక్కరు స్వీయ గణన చేసుకోవాలని చేవెళ్ల మున్సిపల్ చైర్ పర్సన్ దేవర సమతావెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. స్వీయ జనగణనపై ప్రజల్లో అవగాహన కల్పించే నిమిత్తం శుక్రవారం చేవెళ్ల మున్సిపల్ కమిషనర్, సెన్సస్ ఛార్జ్ ఆఫీసర్ ఆధ్వర్యంలోచేవెళ్ల మున్సిపల్ చైర్ పర్సన్ దేవర సమతావెంకట్ రెడ్డి పిలుపునిచ్చారు. స్వీయ జనగణనపై ప్రజల్లో అవగాహన కల్పించే నిమిత్తం శుక్రవారం చేవెళ్ల మున్సిపల్ కమిషనర్, సెన్సస్ ఛార్జ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయం నుండి చేవెళ్ల ప్రధాన కూడలి బస్టాండ్, శంకర్పల్లి చౌరకస్తావరకు నిర్వహించిన జనగణన నడకలో సిబ్బంది బ్యానర్లతో ప్రదర్శన నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించారు. మున్సిపల్ చైర్ పర్సన్ దేవర సమతావెంకట్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ బి. యాదగిరి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా మున్సిపల్ ఛైర్పర్సన్ సమతావెంకట్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 10 లోగా ప్రతి ఒక్కరు స్వీయ గణన చేసుకోవాలన్నారు. దీనిపై విద్యావంతులు, అధికారులు ప్రజలకు అవగాహనా కల్పించాలన్నారు.ప్రజలు సులభంగా వివరాలు నమోదు చేసుకునేందుకు వీలుగా ప్రకటన పత్రాలపై ఉన్న QR కోడ్లను వినియోగించుకోవాలని సూచించారు. ఈ పద్ధతి ద్వారా సమయం ఆదా అవ్వడమే కాకుండా, తప్పులు లేకుండా ఖచ్చితమైన గణాంకాలు నమోదవుతాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ B. యాదగిరి, అధికారులు, వార్డు ఆఫీసర్లు, సిబ్బంది మహిళా సంఘాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది, కౌన్సిలర్లు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు
