హసన్ పర్తి నేటిధాత్రి:
హసన్ పర్తి మండలంలోని వంగపహాడ్ ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు పిల్లలను బడిలో చేర్పించుటకు గ్రామంలో ప్రత్యేకంగా నమోదు కార్యక్రమం నిర్వహించనైనది. ఇందులో భాగంగా గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ పాఠశాల విద్యార్థులను నమోదు చేసుకోవడం జరిగినది. అన్ని ఆధునిక సౌకర్యాలతో గల పాఠశాలకు విద్యార్థులను పంపి తల్లిదండ్రులు చదువును కొనడం ప్రైవేటు పాఠశాలకు పంపించడం మానుకోవాలని తల్లిదండ్రులను కోరారు. విద్యార్థులకు ఉదయం అల్పాహారము, మధ్యాహ్న భోజనము , రాగిజావ ,వారానికి మూడు గ్రుడ్లు వంటి పౌష్టికాహారం అందిస్తున్నామని తెలిపారు. విద్యార్థులకు ఒక జత ఉచిత యూనిఫామ్ మరియు ఉచిత పాఠ్యపుస్తకాలు , వర్క్ బుక్స్ అందిస్తామని తెలిపారు. విద్యార్థులకు ఆటపాటలతో విద్యను అందిస్తూ క్రమశిక్షణ కలిగిన భావి భారత పౌరులను తయారు చేసేది ప్రభుత్వ పాఠశాల అని తెలిపారు. విద్యార్థులకు చదువుతోపాటు ఈ సంవత్సరము కంప్యూటర్ విద్య అందిస్తున్నట్లు తెలిపారు. గత విద్యా సంవత్సరంలో నాలుగో తరగతి నుండి గురుకులం పాఠశాలకు 13 మంది విద్యార్థులు ప్రతిభ ఆధారంగా సీట్లను పొందారని పేర్కొన్నారు. పై విషయాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వ పాఠశాలను బలోపేతం చేయుటకు గ్రామస్తులు సహకరించాలని పాఠశాల ప్రధానోపాధ్యాయులు తాడూరి శ్రీనివాస్ కోరారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు అరుణకుమారి, ఏఎల్ఎఫ్ రాణి, మాలతి, శ్రీ వర్ధన్ రెడ్డి, బాను మొదలగు వారు పాల్గొన్నారు.