నర్సంపేట,నేటిధాత్రి :
ప్రభుత్వ నియమాల పాటించని మాస్టర్ మైండ్ ప్రైవేట్ పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏబిఎస్ఎఫ్, పిడిఎస్యు,డివైఎఫ్ఐ, ఎంఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పాఠశాల ముందు నిరసన వ్యక్తం చేశారు.ఆయా సంఘాల ఏబిఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి బోట్ల నరేష్,పిడిఎస్యు జిల్లా అధ్యక్షుడు అల్వాల నరేష్,డివైఎఫ్ఐ పట్టణ అధ్యక్షుడు గడ్డమీది బాలకృష్ణ ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు చింతాం సిద్దు,మాట్లాడుతూ నర్సంపేట పట్టణంలోని మాంటిస్సోరి స్కూల్ పేరుతో నిర్వహించాల్సిన ప్రైవేట్ పాఠశాల యాజమాన్యం మాస్టర్ మైండ్ పాఠశాల పేరుతో నర్సంపేట పట్టణంలోని మరి వివిధ గ్రామాలలో ఎక్కడపడితే అక్కడ ఫ్లెక్సీలు బ్యానర్లు ఏర్పాటు చేసుకొని ప్రచారం నిర్వహిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. సంబంధిత మండల విద్యాశాఖ అధికారికి గత వారం రోజుల క్రితం వినతి పత్రం ఇచ్చినప్పటికీ కూడా స్పందించకుండా మాస్టర్ మైండ్ పాఠశాలతో ప్రచారం నిర్వహిస్తూ ప్రభుత్వ నియమాలను పాటించని పాఠశాల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారులు కోరారు.