encounter chesthava…, ఎన్‌కౌంటర్‌…చేస్తావా…?

ఎన్‌కౌంటర్‌…చేస్తావా…?

వరంగల్‌ పార్లమెంట్‌ నుంచి కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేస్తున్న అభ్యర్థి దొమ్మాటి సాంబయ్య, పరకాల సీఐ మధు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తన స్వగ్రామం అయిన పరకాల మండలం మల్లక్కపేట గ్రామంలో సీఐ టిఆర్‌ఎస్‌కు సహకరించాడని దొమ్మాటి సాంబయ్య ఆరోపించారు. తమ కార్యకర్తలను ఎందుకు బూతులు తిడుతున్నావని గ్రామంలో విధులు నిర్వహిస్తున్న సీఐతో దొమ్మాటి వాగ్వాదానికి దిగాడు. గ్రామంలో డబ్బులు పంచుతున్నారని ఫిర్యాదు చేసిన ఎందుకు స్పందించలేదని ప్రశ్నించాడు. దీంతో సీఐ తాను ఎవరిని దూషించలేదని స్పష్టం చేశారు. దొమ్మాటి సీఐతో వాగ్వాదానికి దిగుతూనే కలెక్టర్‌కు ఫోన్‌ చేసి రాతపూర్వకంగా తాను ఫిర్యాదు చేస్తానని సీఐ మధు అభ్యంతరకరంగా వ్యవహరిస్తున్నాడని చెప్పారు. దీంతో మరోసారి కలగజేసుకుని సీఐ తాను అమర్యాదగా ఎంతమాత్రం ప్రవర్తించలేదని, వీడియో సాక్ష్యాలు ఉన్నాయన్నారు. సీఐ వివరణతో సంతృప్తి చెందని దొమ్మాటి ఎన్‌కౌంటర్‌ చేస్తావా…? చెయ్యి అంటూ ముందుకు వెళ్లారు. తాను అలా అనలేదని సీఐ చెప్పిన అదేం పట్టించుకోని దొమ్మాటి తీవ్ర స్వరంతో సీఐతో వాగ్వాదానికి దిగారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *