26వ తేదీన యాత్ర ప్రారంభం కాబోతుంది-మచ్చ దేవేందర్
పరకాల నేటిధాత్రి
విముక్త చిరుతల పార్టీ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ జిలుకర శ్రీనివాస్ పరకాల మండల కేంద్రంలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటుచేసారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ జనవరి ఇరవై ఆరు నుండి ప్రతి ఎస్సీ కాలనీని గ్రామపంచాయతి చేయాలని విముక్త చిరుతల పార్టీ ఆధ్వర్యంలో పాదయాత్ర చేపడుతున్నట్టు ఆయన తెలిపారు.నడికుడ మండలం నర్సక్కపల్లి అంబేద్కర్ కాలనీ నుండి ఈ యాత్ర మొదలవుతుందని,రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మచ్చ దేవేందర్,జనరల్ సెక్రటరీ చెరిపల్లి ఆనంద్ లు యాత్రకు నాయకత్వం వహిస్తారని ఆయన తెలిపారు.ఈ సందర్భంగా మచ్చ దేవేందర్ మాట్లాడుతూ రాజ్యాంగం అమల్లోకి వచ్చిన అనేక దశాబ్దాల పిదప కూడా ఊరు వాడ అనే విభజన స్పష్టంగా కొనసాగుతూనే వుంది. వూరిలో ఎస్సీ వాడ ఎప్పుడూ దూరంగానే వుందని అన్నారు. ఎస్సి రిజర్వుడు గ్రామ పంచాయతీలలో సర్పంచులుగా,ఎంపిటిసిలుగా గెలిచినా కూడా ఎలాంటి అధికారం లేనివాళ్లుగా,వూరి పెద్దల కింద నలిగి పోతున్నారని.అందుకే తండాలను గ్రామ పంచాయతీలను చేసిన తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం 2018 ప్రకారం ప్రతి ఎస్సీ కాలనీని గ్రామ పంచాయతీ చేయాలని విసిపి తెలంగాణ రాష్ట్రములో ఉద్యమిస్తున్నదని తెలిపారు.ఈ యాత్రకు పార్టీలకు అతీతంగా మద్దతు ఇవ్వాలని ఆయన కోరారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి ఐరబోయిన బిక్షపతి,ఉమ్మడి వరంగల్ జిల్లా ఇంచార్జీ అంబాల అనిల్,భూపాలపల్లి జిల్లా నాయకులు జన్ను శేఖర్, రాజు తదితరులు పాల్గొన్నారు.