Drainage Issue in Mancherial
మంచిర్యాల జాఫర్ నగర్ లో డ్రైనేజీ సమస్య
దుర్వాసనతో ఇబ్బందులకు గురవుతున్న కానీవాసులు
మంచిర్యాల,నేటి ధాత్రి:
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని హైటెక్ సిటీ,జాఫర్ నగర్ లోని 52వ వార్డు కాలనీవాసులు డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు.కాలనీలో మురుగు నీరు నిలిచిపోవడంతో దుర్వాసన వెదజల్లుతుందని,సంబంధిత అధికారులకు చెప్పినప్పటికీ ఎలాంటి చర్యలు చేపట్టడం లేదని వారు ఆరోపిస్తున్నారు.ఇలాంటి సమస్యల వల్ల దోమలు,ఇతర ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం ఉందని అన్నారు.ఇంటి కిటికీ డోర్లు తీయగానే దుర్వాసన ఇంటిలోకి వెదజల్లి వాంతులు అవుతున్నాయని ఆగ్రహ వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా సంబంధిత అధికారులు చొరవ తీసుకొని కాలనీవాసులు ఎదుర్కొంటున్న డ్రైనేజ్ సమస్యకి పరిష్కారం చూపాలని వారు కోరారు.
