Vijay vs BJP Clash
మాతో పెట్టుకోకు..!
సీఎం కుర్చీ దగ్గర బీజేపీ బ్రేక్..?”
దేవుడు వరమిచ్చాడు..!
ప్రజలు గెలిపించారు..!
కాంగ్రెస్ తోడైంది..!
కానీ… సీఎం కుర్చీ దగ్గరికి వచ్చేసరికి… ఢిల్లీ బ్రేక్ వేసిందా..?
తమిళనాడు రాజకీయాల్లో ఇప్పుడు వినిపిస్తున్న ఒక్క పేరు… విజయ్..!
సినిమాల్లో మాత్రమే కాదు… రాజకీయాల్లోనూ “బ్లాక్‌బస్టర్ ఓపెనింగ్” ఇచ్చిన హీరో..!
పార్టీ పెట్టి చాలా తక్కువ టైమ్‌లోనే… ప్రజాదరణను ఓట్లుగా మార్చి… సీఎం కుర్చీ దాకా చేరుకోవడం దేశ రాజకీయాల్లోనే హాట్ టాపిక్‌గా మారింది..!
అన్నీ సెట్ అనుకున్న టైమ్‌లోనే…
ఒక్కసారిగా గవర్నర్ ట్విస్ట్..!
అక్కడే మొదలైంది అసలు పొలిటికల్ సినిమా..!
ప్రశ్న ఒక్కటే..!
ఇది రాజ్యాంగ ప్రక్రియనా..?
లేక ఢిల్లీ రాసిన స్క్రిప్టా..?
ఎందుకంటే…
తమిళనాడులో బీజేపీకి క్షేత్రస్థాయిలో బలం ఎంతుందో అందరికీ తెలుసు..!
సొంతంగా అధికారానికి వచ్చే సీన్ లేదు..!
ప్రాంతీయ పార్టీల భుజాలపై కూర్చుంటే తప్ప అక్కడ కమలం వికసించే పరిస్థితి లేదు..!
అలాంటి చోట… విజయ్‌పై ఇంత అగ్రెసివ్ స్టాండ్ ఎందుకు..?
ఇక్కడే ఉంది అసలు ట్విస్ట్..!
విజయ్ బీజేపీ వైపు చూడలేదు..!
ఎన్నికల ముందు ఎంత ప్రయత్నించినా NDAలోకి రాలేదు..!
అదే కాదు… ఇప్పుడు రాహుల్ గాంధీతో కలిసి నడవడానికి సిద్ధమయ్యాడు..!
అదే ఢిల్లీ పెద్దలకు మండించిన పాయింట్ అంటున్నారు విశ్లేషకులు..!
“మాతో లేకపోతే… ఎదురుగా ఉన్నట్టే”
ఇదే మెసేజ్ ఇవ్వాలనుకుందా బీజేపీ..?
దేశమంతా విస్తరిస్తున్న తమ శక్తిని చూసీ…
తమ ప్రత్యర్థితో చేతులు కలుపుతావా..?
అనే ఆగ్రహమే ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక ఉందన్న చర్చ జాతీయ రాజకీయాల్లో వినిపిస్తోంది..!
కానీ ఇక్కడ విజయ్ చేసిన పని… చాలామంది సీనియర్ రాజకీయ నేతలకే షాక్ ఇచ్చింది..!
ఎక్కడా ఎమోషన్ కాలేదు..!
ఎక్కడా హడావిడి చేయలేదు..!
అందరి మద్దతు కూడగట్టుకుని…
“నాకు సంఖ్యాబలం ఉంది” అని సైలెంట్‌గా పవర్ చూపించాడు..!
గవర్నర్‌ను కలవడం..!
అసెంబ్లీలో మెజారిటీ నిరూపిస్తానని చెప్పడం..!
బ్యాక్‌డోర్ డ్రామాకి… ఫ్రంట్డోర్ ఆన్సర్ ఇవ్వడం..!
ఇవి అన్నీ చూసి… “ఇతను కొత్త పొలిటీషియన్ కాదు… ఫ్యూచర్ పవర్ సెంటర్” అన్న అభిప్రాయం బలపడింది..!
అయితే ఈ మొత్తం ఎపిసోడ్ తర్వాత దేశ రాజకీయాల్లో ఒక విషయం మాత్రం క్లియర్ అయింది..!
విజయ్ ఇక కేవలం సినిమా హీరో కాదు..!
ఢిల్లీని కూడా అలర్ట్ చేసే స్థాయికి ఎదిగిన “పొలిటికల్ పవర్ సెంటర్”..!
