ప్రభుత్వ కళాశాలలో డిజిటల్ క్లాస్ రూమ్స్ ప్రారంభం.
చిట్యాల, నేటిదాత్రి :
చిట్యాల మండలం కేంద్రంలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాలలో భాగంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ,కళాశాల ప్రిన్సిపాల్ శ్రీదేవి ఆహ్వానం మేరకు ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ను ప్రారంభించిన స్థానిక సర్పంచ్ తౌటం లక్ష్మి అంతయ్య .ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రపంచం వేగంగా డిజిటల్ దిశగా ముందుకు సాగుతోంది. విద్యా వ్యవస్థ కూడా కాలానుగుణంగా మారాలి. పాతకాలంలో బ్లాక్‌బోర్డు మరియు పుస్తకాలతోనే బోధన జరిగేది. కానీ ఇప్పుడు డిజిటల్ టెక్నాలజీ ద్వారా బోధన మరింత సులభంగా, ఆసక్తికరంగా మారుతోంది , కావున ఈ అవకాశాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు, అలాగే ఈ సంవత్సరం ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు, వారి తల్లిదండ్రులు మరియు కళాశాల బృందానికి అభినందలు తెలియజేశారు.కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శ్రీదేవి గారు మాట్లాడుతూ డిజిటల్ క్లాస్రూమ్ వల్ల విద్యార్థులలో ఆసక్తి పెరుగుతుంది. వారు పాఠాల్లో చురుకుగా పాల్గొంటారు. ఇది వారి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అలాగే గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు కూడా నాణ్యమైన విద్య అందే అవకాశం కలుగుతుంది కావున ప్రభుత్వ కళాశాలలలో విద్యార్థులను చేర్పించడానికి ఆసక్తి చూపాలని అని తెలిపారు.అనంతరం 2025 -2026 విద్యా సంవత్సరం లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థుల జాబితా పత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం సర్పంచ్ ని శాలువతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఉపాధ్యాయులు,సిబ్బంది మరియు 4 వ వార్డ్ మెంబెర్ తౌటం నవీన్ పాల్గొన్నారు.
