చిట్యాల, నేటీ దాత్రి:జయశంకర్ భూపాలపల్లి జిల్లా చిట్యాల మండల కేంద్రంలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో జిల్లా ప్రచార కార్యదర్శి గుర్రపు రాజేందర్ తో కలిసి మాట్లాడారు. గ్రామాల్లో ఉన్న దళితులంతా సంఘటితంగా ఏకం కావాలని పిలుపునిచ్చారు. దళితులపై జరుగుతున్న సంఘటనలను అరికట్టుటలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమైనందున కులాల పేరుతో దూషించి దాడులు దౌర్జన్యాలు అవమానాలు మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయని, అందులో భాగంగానే మండలంలో ఒక దళితున్ని కులం పేరుతో దూషించి దాడి చేసి కొట్టారన్నారు. రాజ్యాంగం ప్రకారం, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును గౌరవించి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలన్నారు. దళితులకు సరియైన న్యాయం జరుగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దళితుల మనో భావాలు దెబ్బతినకుండ వివిధ రాజకీయ పార్టీలలో ఉన్న దళిత నాయకులంతా ఐక్య మత్యంతో కలిసి కట్టుగా జరుగుతున్న సంఘటనలను అరికట్టేందుకు ఏకమై ముందుకు రావాలని మల్లయ్య కోరారు.ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రచార కార్యదర్శి గుర్రపు రాజేందర్ జిల్లా సాంస్కృతిక కార్యదర్శి జన్నే యుగేందర్ చిట్యాల మండల అధ్యక్షుడు బొడ్డు ప్రభాకర్ మండల నాయకులు సరిగొమ్ముల రాజేందర్ బొట్ల ఆనందం గుర్రం తిరుపతి గురుకుంట్ల కిరణ్ తదితరులు పాల్గొన్నారు.