మొక్కల కొనుగోలు కేంద్రాలను పెంచాలని సీపీఎం పార్టీ ధర్నా
నర్సంపేట, నేటిధాత్రి:
https://youtu.be/0nRB-Xx_k3A?si=cHTOLx8tYGUXzZVg
మొక్కల కొనుగోలు కేంద్రాలు పెంచాలని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో
నర్సంపేట ఆర్డిఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. పార్టీ వరంగల్ జిల్లా కార్యదర్శి చింతమల్ల రంగయ్య మాట్లాడుతూ గత నెల రోజులుగా మొక్కజొన్న రైతులు మండలానికి ఒకటి రెండు కేంద్రాలు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించడం వల్ల కొనుగోలు కేంద్రాలకు మొక్కలు తీసుకొచ్చిన రైతాంగం కాంటాలు కాక రైతాంగం తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు.ఈ సంవత్సరం మొక్కజొన్న పంట సాగు విస్తీర్ణం పెరిగి అధిక దిగుబడులు వచ్చిందని ప్రభుత్వం ముందుచూపు అంచనా లేకుండా కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతాంగం తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని అన్నారు.రబీ సీజన్ వరి పంట కోతరకొచ్చిందని ఈ పరిస్థితులలో మొక్కజొన్నను అమ్మడం కోసం ఇబ్బందులు పడుతున్నారని మరోవైపు ధాన్యం కేంద్రాలు ప్రకటించినప్పటికీ కొనుగోలు కేంద్రాల్లో దాన్యం నింపడానికి గన్ని సంచులు అందుబాటులో లేవని ఆరోపించారు.పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని ఆర్డిఓ కార్యాలయ సిబ్బందికి అందజేశారు.ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లాకమిటీ సభ్యులు ఈసంపల్లి బాబు కోరబోయిన కుమార్ స్వామి అనుమకొండ శ్రీధర్ సంఘం జిల్లా అధ్యక్షుడు పుచ్చకాయల కృష్ణ రెడ్డి సిపిఎం పట్టణ కమిటీ సభ్యులు గడ్డమీద బాలకృష్ణ, ఉదయగిరి నాగమణి , బిట్ర స్వప్న, జినుకల చంద్రమౌళి, బెంబేలి మలహలరావు, రుద్రారపు లక్ష్మి, జగన్నాథం కార్తీక్, ఉదయగిరి,సరిత,యాకలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
