గొల్లపల్లి నేటి ధాత్రి :
ప్రభుత్వ విప్, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆదేశాల మేరకు ప్రజల వద్దకు ప్రజా ప్రభుత్వ పాలన లో ప్రజల ఇంటికి వెళ్లి సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. జగిత్యాల జిల్లాలోని గొల్లపల్లి మండలం దమ్మన్నపేట గ్రామానికి చెందిన లబ్ధిదారులకు ప్రభుత్వం నుండి మంజూరైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు మామిడిపెల్లి రమేష్ చేతుల మీదుగా లబ్ధిదారులు మిల్కూరు కిషన్ 15000 వేల రూపాయల చెక్కును అలాగే బురుగు పెళ్లి రాజయ్య 25000, కొమటెడ్డి తిరుపతి 25000,దీకొండ రవీందర్ 11000 వేల రూపాయల విలువగల సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ధర్మపురి ఎమ్మెల్యే లక్ష్మణ్ కుమార్ కు లబ్ధిదారులు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ డైరెక్టర్ అత్తెన శివయ్య, మాజీ ఉపసర్పంచ్ అత్తెన శివరాజ0, కాంగ్రెస్ నాయకులు బొలిశెట్టి నరేష్, రాజు మల్లేశం, రాజు రెడ్డి, బంగుడపు తిరుపతి, బంగుడపు రాజిరెడ్డి, రాజం మొండయ్య, రాజం కొమురయ్య, మల్లేశం, పరశురాం, రేగుంట బాబు, రాజం రాజమల్లు తదితరులు పాల్గొన్నారు.