గొల్లపల్లి నేటి ధాత్రి:
భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు ప్రజల తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కణిక తెలంగాణ వీర వనిత చాకలి( చిట్యాల) ఐలమ్మ 129 వ జయంతి సందర్భంగా జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండల కేంద్రంలో రజక సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు కలకోట సత్యం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలేసి జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ తొలి తరం సాయుధ ఉద్యమ కారురాలని తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలకంగా పని చేశారని దొరల పెత్తందారుల ఎదిరించి దున్నేవాడికి భూమి కావాలని నినాదంతో పేదలందరికీ భూములు పంచే విధంగా ఉద్యమం చేపట్టారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసి చైర్మన్ భీమ సంతోష్, వైస్ చైర్మన్ పురపాటి రాజిరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ ఆవుల సత్యం, బిజెపి మండల అధ్యక్షులు కట్ట మహేష్,నర్సాపురం రవీందర్, మారం రాజశేఖర్, ముస్కు లింగారెడ్డి, రజక సంఘం సభ్యులు నేరెళ్ల మహేష్, సాతల సత్యనారాయణ, సాతల మహేష్, భూమయ్య, తిరుపతి, నరసయ్య, పెదరామయ్య, కటుకూరు రాములు, చంద్రయ్య మాజీ సర్పంచ్ లు, మాజీ ఉప సర్పంచ్ లు, ఏఎంసీ డైరెక్టర్లు, మాజీ ప్రజా ప్రతినిధులు నాయకులు తదితరులు పాల్గొన్నారు.