పకృతి విపత్తుల్లో ఇల్లు దెబ్బతిన్న కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు
సాయద్ ఇక్బాల్ హుస్సేన్
కరకగూడెం,, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా,,నేటిధాత్రి..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం కరకగూడెం గ్రామపంచాయతీ బొడ్రాయి సమీపంలో ఇటీవల వీచిన ఈదురుగాలులు మరియు భారీ వర్షాల కారణంగా షేక్ హైమద్ ఇంటి పైకప్పు పూర్తిగా ధ్వంసమై తీవ్ర నష్టం జరిగింది ఈ విషయం తెలుసుకున్న కరకగూడెం మండలం కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ప్రదేశానికి చేరుకొని బాధిత కుటుంబాన్ని పరామర్శించే అనంతరం వారికి 25 కేజీల బియ్యం మరియు నిత్యవసర సరుకులు అందజేయడం జరిగింది ఈ సందర్భంగా బాధ్యత కుటుంబానికి ధైర్యం చెబుతూ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రభుత్వం ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు తరఫున అవసరమైన సహాయం అందించేందుకు ఎల్లప్పుడూ ముందుంటానని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఎగ్జిక్యూటివ్ మెంబర్ నాగబండ వెంకటేశ్వర్లు, గ్రామస్తులు, కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
