
ముఖ్యమంత్రి కేసిఆర్ పుట్టిన రోజున అనాధపిల్లలకు పాలు, పండ్లు పంపిణీ చేసిన 51 మంది గృహ నిర్మాణ శాఖ బాధితులు.
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పుట్టిన రోజు సందర్భంగా గృహ నిర్మాణ శాఖ నుంచి తొలగించబడిన 51 మంది బాధితులు అనాధ పిల్లలకు పాలు, పండ్లు పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి కేసిఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కేసిఆర్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్ళు ఇలాంటి పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని మనసారా ఆకాంక్షిస్తున్నట్లు వారు తెలిపారు. కేసిఆర్ కారణజన్ముడని కొనియాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ సాధన కోసం పద్నాలుగేళ్లు నిర్విరామ పోరాటం సాగించి, తెలంగాణ…