500 నోటుకు కాలం చెల్లనుందా?

`2000 నోటు దారిలో నడవనుందా?

`కొద్ది రోజులలో కనుమరుగు కానుందా?

`అప్పుడే నూకలు చెల్లిపోనున్నాయా?

`మళ్లీ నోట్ల ఉపసంహరణ సంకేతాలు ?

`200 నోటుకు కూడా కష్టకాలం రానుందా?

`100 తోనే ఆర్థిక లావాదేవీలు జరుపోవాల్సి వస్తుందా?

`50 ఇంకా కొంత కాలం ఆయువు వుండేనా?

`300 నోటు రానుందంటున్నారు నిజమేనా? 

`నోట్ల రద్దుతో బ్లాక్‌ మనీ పోయినట్లే అన్నారు!

`బ్లాక్‌ మనీ గురించి మాట్లాడడం మానేశారు.

`పాకిస్తాన్‌ నుంచి విచ్చలవిడిగా నకిలీ నోట్లు వస్తున్నాయని నోట్లు రద్దు చేశారు.

`ఇక కొత్త నోట్ల ప్రవేశంతో నకిలీ తయారీ అసాధ్యమన్నారు.

`నకిలీ నోట్ల చెలామణి వ్యవస్థకు పాతరే అన్నారు.

`అకస్మాత్తుగా రాత్రికి రాత్రి నోట్లు రద్దు చేసేశారు.

`డిజిటల్‌ లావాదేవీలు అమలు చేశారు.

`నోట్ల రద్దు కాగానే వెంటనే 2000 నోట్లు తెచ్చారు.

`విపరీతంగా విమర్శలు రావడంతో క్రమంగా దానిని కనుమరుగు చేశారు.

`తర్వాత 200 నోట్లు తెచ్చారు.

`దేశంలో పెద్ద ఎత్తున 500 నోట్లు నకిలీ చెలమణి జరుగుతుందంటున్నారు.

`ఇలా ఉపసంహరణలు చేసుకుంటూ పోతే జనం సహనాన్ని కూడా మర్చిపోతారు

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

మార్కెట్‌లో త్వరంలో రూ.500 నోటు ఉప సంహరణ జరగుతుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. పెద్దనోట్ల వల్ల నల్ల దనం ఆగడం లేదన్న మాటలు వినిపిస్తున్నాయి. అసలు నల్లదనమే లేదని నోట్ల రద్దు మూలంగా తేలిపోయింది. మళ్లీ నలధనం వార్తలు ఎందుకు సృష్టించబడుతున్నాయి. అంటే సమాదానం చెప్పేవారు లేరు. దేశమంతా ఒకే పన్ను విధానం వుంటే ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ధరల వ్యత్యాసం వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. జిఎస్టీ తెచ్చారు. దానిని అమలు చేసిన రోజు దేశానికి నిజమైన స్వాతంత్య్రం వచ్చినట్లైందన్నారు. అందుకే జీఎస్టీ అమలు అర్ధరాత్రి చేపట్టారు. అర్ధరాత్రి ఆర్ధిక స్వాతంత్య్రం అన్నారు. ఏమైంది? దేశ ఖజానాను పన్నుల వరద పారింది. సగటు వ్యక్తి జీవితం తలకిందులైంది. అంతకు ముందు నోట్ల రద్దు చేశారు. యాభై రోజులు సమయం ఇవ్వండి. నోట్ల రద్దు వల్ల దేశానికి మేలు జరక్కపోతే అడగండి అన్నారు. కాని ప్రజలు బాదపడుతుతంటే చూశారు. జనం విలవిలలాడుతుంటే చూస్తూ మౌన వ్రతం చేశారు. నోట్ల రుద్ద చేపట్టి, పెద్ద నోట్లను ముందు తెచ్చారు. అన్ని నోట్లు రద్దుచేసి, కొత్తగా రెండువేల నోటు తెచ్చారు. డిజిటల్‌ మనీ వ్యవస్ధను ప్రవేశపెట్టారు. నోట్లు లేని ఆర్ధిక వ్యవస్ధను సృష్టించారు. ఇది కొంత మేలు జరిగిందనుకున్నా నోట్లు పూర్తిగా లేకపోతే కూడా ఇబ్బందులే అన్నది తెలుసుకున్నారు. కాకపోతే రెండు వేల నోట్లు తెచ్చారు. దాని వల్ల పేదలకు ఏమైనా మేలు జరిగిందా? అంటే అదీ లేదు. ఆ నోటును కూడా కొంతకాలం తర్వాత ఉపసంహంరించుకున్నారు. అప్పుడు పేదలు పెద్దగా స్పందించలేదు. కారణం వారి ఆర్ధిక సానుకూలతకు ఆ నోటుకు పెద్దగా సంబంధం లేదు. కాని ఇప్పుడు మళ్లీ ఐదు వందలరూపాయల నోటును కూడా ఉపసంహరించుకోవాలనుకుంటున్నారు. అనే వార్త సగటువ్యక్తికి పిడుగులాంటి వార్తే. ఎందుకంటే ఎంత డిజిటల్‌ పేమెంట్లు పెరిగినా చాలా సంస్ధలు నగదు లావాదేవీలు జరుపుతున్నాయి. ముఖ్యంగా విద్య, వైద్య, ఆరోగ్య , దేవాదాయ రంగాలలో డిజిటల్‌మనీ లావాదేవీలు జరగడం లేదు. ఈ విషయం పాలకులకు తెలియదా? పెద్ద పెద్ద ఆసుపత్రులలో నగదు ఇస్తే తప్ప వైద్యం చేయడంలేదు. నగదు చెల్లిస్తేనే వైద్యం చేస్తున్నారు. ఇక ప్రైవేటు విద్యా సంస్ధల్లో కూడా నగదు లావాదేవీలకు ఆస్కారం లేదు. అంటే అవి జీఎస్టీ ఎగ్గొడుతుంటే మాత్రం పాలుకలు చేష్టలుడిగి చూస్తుంటారు. సామాన్యుల నుంచి మాత్రం ముక్కుపిండి వసూలుచేస్తారు. అంతెందుకు నూటానలభైకోట్ల మన దేశ జనాభాలో నూటా ఇరవై కోట్ల మంది హిందువులే. హిందువులు ఏ గుడికి వెళ్లినా నగదు లావాదేవీలే నిర్వహిస్తున్నారు. తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాలలో కూడా నిర్వహించే హోటళ్లు, దర్శనం ప్రసాదాలు ఇలా అనేక రకాల సేవలు నగదు వుంటేనే అంగీకరిస్తున్నారు. అలాంటప్పుడు డిజిటల్‌ చెల్లింపుల వల్ల లాభం ఏం జరుగుతోంది? ఇక ఐదువందలనోట్ల ఉప సంహకరణకు ఇప్పుడు మరో కారణం చెబుతున్నారు. దేశంలో నకిలీ ఐదు వందలనోట్లు చెలామణిలోవున్నాయంటున్నారు. మరి నోట్ల రద్దు సమయంలో తెచ్చిన కొత్త నోట్లను తయారు చేయడం ఎవరి వల్ల కాదన్నారు? ఆ నోట్లలో వుండే చిప్‌లు కూడా వుంటాయన్నారు. వాటిని తయారు చేయడం అంత సులువైన పని కాదన్నారు. ఇప్పుడు ఆ నోట్లను ఎలా తయారు చేస్తున్నారు. నోట్లను రద్దు చేసి ప్రభుత్వం సాదించిన విజయమేమింటంటే ఏం సమాదానం చెబుతారు? ఐదు వందల నోటుతోపాటు, రెండు వందల నోటు కూడా ఉపసంహరించుకుంటారన్న వర్తాలు కూడా చెక్కర్లు కొడుతున్నాయి. వాటి స్ధానంలో మూడువందల రూపాలయ నోటు వస్తుందంటున్నారు. అసలు ఈ నోట్ల ఉప సంహకరణ వల్ల కొత్తగా నోట్ల ప్రింటింగ్‌ ఎంత భారమౌతుందో తెలిసి కూడా పదే పదే ప్రయోగాలు చేస్తూ, జనం నెత్తిన పన్నుల భారం రుద్దడం తప్ప మరేం లాభం లేదు. ఎందుకంటే సంచి నోట్లు తీసుకుపోతే ఒక మూలన సరిపడే సరుకులు రాకపోవడమే ద్రవ్యోల్భనం. ఈ లాజిక్‌ను మర్చిపోయి పదే పదే నోట్ల రద్దు వల్ల జనాన్ని విసిగించడం, వారి వద్దనున్న సొమ్మును పన్నుల రూపాలంలో లేకుండా చేయడం తప్ప ప్రజలకు ఒరిగేదేమీ వుండదు. పేదలు మరింత పేదలుగా మారడం తప్ప, ధనవంతులు కావడం దుర్లభం. మధ్య తరగతి ప్రజలు కూడా పేద వర్గాలుగా మారుతున్నారు. అయినా పాలకులు మారడం లేదు. పేదలకు న్యాయం జరగడం లేదు. ధనం మూలం ఇదమ్‌ జగత్‌ అన్నారు. ప్రతి వ్యక్తి తనచేతిలో చిల్లి గవ్వైనా వుండాలనుకుంటాడు. కానీ గవ్వలేకుండా పాలకులు చేస్తున్నారు. నోటు లేని ఆర్ధిక వ్యవస్ధను సృష్టిస్తున్నారు. ఇంత వరకు బాగానే వుంది. కాని పూర్తిగా నోట్లు లేకుండా చేయడం సాద్యం కాదు. పదే పదే నోట్లను అందుబాటులోలేకుండా చేస్తే మాత్రం ఆర్దిక వ్యవస్ధ కుదేలు. ఇదంతా పాలకులు అర్దం చేసుకోరు. వారికి అర్దం కాదు. అవును దేశంలో నోట్ల రద్దు మూలంగా జరిగిన ఇబ్బందులు జనానికి తెలుసు. కాని పాలకులకు వాటి కష్టం తెలిస్తే బాగుండు. సామాన్యుడు నోట్ల రద్దు మూలంగా పడిన ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. దేశ ఆర్ధిక వ్యవస్ధను గాడిలో పెట్టడంకోసం, నకిలీ నోట్ల చెలామణి ఆపడం కోసం ఐదేళ్లకో, ఆరెళ్లకో నోట్లలో మార్పులు తీసుకురావడం సహజమే. కాని ఎవరైనా ఒక్కొ మెట్టు ఎక్కి పైకి వెళ్లాలలనుకుంటారు. కాని పై నుంచి కిందికి రావడమే పురోగమనం అని ఎవరూ అనుకోరు. నోట్ల రద్దు మూలంగా జరిగిందదే…నోట్ల రద్దుకు ముందు వున్న ఆర్ధిక వ్యవస్ధకు, ఇప్పటికీ తేడా చాలా వుంది. ఆర్దిక వ్యవస్ధ పనతనమైంది. కాని పాలకులు మాత్రం గొప్పలు చెప్పుకుంటారు. ట్రిలియన్‌ డాలర్లు అంటూ పెద్ద పెద్ద లెక్కలు చెబుతారు. వారికి కూడా వాటి సంగతి తెలియదు. వాటి విలువ అసలే తెలియదు. కాని ఆర్దిక వేత్తలు చెప్పమంటే చెబుతారు. కాని పేదల జీవితాలు చూడాల్సిన పాలకులు, పెద్దల మాటలు వింటే ప్రగతి కారకులు కాదు. ప్రగతి నిరోధకులౌతారు. పది మంది దగ్గర ఆర్దిక వ్యవస్ధ బందీ అయితే, మిగతా వర్గాలకు కుదేలౌతాయి. వంద మందిలో తలో రూపాయి వుంటే అందరికీ ఉయోపగడుతుంది. కాని పది మంది దగ్గ పదిరూపాయలు వుంటే ఆ పది మందికే ఉపయోగపడుతుంది. ఇంత చిన్న లాజిక్‌ను పాలకులు మిస్‌ అతుంటారు. జనాన్ని ఇబ్బందులు పెడుతుంటారు. గతంలో మురార్జీ దేశాయి అదికారంలోకి వచ్చినప్పుడు ఇదే జరిగింది. ఎంత సేపు పక్కన దేశాల మూలంగా మనం నష్టపోతున్నామంటూ లెక్కలు చెప్పి నోట్లు అప్పడూ రద్దు చేశారు. ఇప్పుడూ ఆ కారణం ఒకటిగాచేసి నోట్లు రద్దు చేశారు. ఏమైంది. ఆర్ధిక వ్యవస్ధ కోలుకోనేంత దూరం వెళ్లిపోయింది. దేశంలో నల్లధనం పెరిగిపోయింది. దాంతో దేశ ఆర్ధిక వ్యవస్ధ ఆగమౌతుందన్నారు. నల్ల దనం మొత్తం తీస్తే దేశానికి ఆదాయం సమకూరుతుందన్నారు. ఏమైంది? ఒక్క రూపాయి కూడా రాలేదు. ఆపరేషన్‌ సక్సెస్‌ బట్‌ పేషెండ్‌ డెడ్‌ అని వార్త వినాల్సి వచ్చింది. నోట్ల రద్దు వల్ల ఏర్పడినసమస్యల వల్ల కూడా జనం దేశంలో అనేక మంది చనిపోయారు. కాని లాభమేమైనా జరిగిందా? అంటే శూన్యం. ఒక వేళ నిజంగానే నోట్ల రద్దు వల్ల మన దేశానికి మేలు జరిగితే బిజేపి పార్టీ ఈ పాటికి చేసే ప్రచారం మామూలుగా వుండేది కాదు. కాని నోట్ల రద్దు వల్ల పాకిస్తాన్‌ గిలగిలాడిపోతోంది..ఆ దేశ ఆర్ధిక వ్యవస్ద కుప్పకూలింది. తినడానికి తిండి లేకుండా జనం మలమల మాడిపోతున్నారు. అని వాట్సాప్‌ యూనివర్సిటీ చేసే అబద్దపు ప్రచారాలను నమ్మే వాళ్లు కూడా మనదేశంలో కోట్ల మంది వున్నారు. అందుకే నోట్ల రద్దు ప్రభావం బిజేపి మీద పడకుండాపోయింది. లేకుంటే ఈ పాటికి ప్రజలు బిజేపిని సర్ధేశేవారు. కాని ఎంత సేపు పక్క దేశాల రాజకీయాలను గురించి ప్రజల్లో ఏవగింపు నింపాలి. మన దేశ ఆర్ధిక విధనాల వల్ల పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లో ఆకలి రాజ్యమేలుతుందని చెప్పాలి. మనదేశంలో ముస్లింల సంఖ్య పెరగుతుందని చెప్పాలి. మేకిన్‌ ఇండియా అని నినాదాలు చేయాలి. చైనా వస్తువులు వాడకూడదు అని పదే పదే బిజేపి నాయకులు ప్రచారం చేస్తుంటారు. ప్రభుత్వం మాత్రం ఇప్పటీకీ ప్రపంచంలో ఇతర దేశాలకన్నా ఎక్కువ వాణిజ్యం చైనాతోనే ముడిపడి వుందన్న సంగతిని చెప్పదు. అసలు మనం చైనా వస్తువులు కొనకపోవడం వల్ల అక్కడి ప్రజలు పనులు లేక, ఉపాదిలేక విలవిలలాడుతున్నారని అంటారు. ఇదా రాజకీయం. ఇదేనా దేశాన్ని ఆర్దికంగా గాడిలో పెట్టడం. ఏది మేకిన్‌ ఇండియా? పతంగుల దారం నుంచి మొదలు, మనదేశ జాతీయ జెండాలు కూడా చైనా నుంచే దిగుమతి చేసుకుంటున్నాం. ఇంక్కెక్కడి మేకిన్‌ ఇండియా? పన్నుల వాయింపుల తప్పడం లేదు. విదేశీ వస్తువులు కొనుగోలు ఆగడం లేదు. మనదేశంలో పారిశ్రామిక ప్రగతి కనిపించింది లేదు. పెద్ద నోట్లు పోయి చిన్న నోట్లు వస్తే జేబులు నిండినట్లు కనిపించొచ్చేమో గాని, వాటి విలువ పెరగదన్నది తెలిస్తే పాలకులు పదే పదే ఇలాంటి ప్రయోగాలు చేయరు. లెస్‌ లగేజ్‌ మోర్‌ కంఫర్టు అని పెద్దలన్నారు. గాని మోర్‌ లగేజ్‌ మోర్‌ కంపర్టు అని అనలేదు. ఈ లాజిక్‌ పాలకులు ఎప్పుడో మిస్‌ అయ్యారు. మిస్‌ ఫైర్‌ అయిన లెక్కలతోటి పన్నులు వాయిస్తున్నారు. నోట్ల ఉపసంహరణ సర్వరోగ నివారిణి అనుకుంటున్నారు. మొదటికే మోసం వస్తున్నా అదే పని కరక్టు అనుకుంటున్నారు. మన ప్రజాస్వామ్యంలో యధా ప్రజా ..తదారాజ అన్నది కనిపించాలి. కాని యధా రాజా..తధా ప్రజా రాజ్యమేలుతోంది. సామ్యవాదం మరుగునపడిపోయింది. మళ్లీ ప్యూడల్‌ వ్యవస్ధ ముసుగులో పెట్టుబడి దారి వ్యవస్ధ కాటేస్తోంది. జనాన్ని పీల్చుకుతింటోంది. ఒక రకంగా చెప్పాలంటే కాల్చుకుతింటోంది.

ఎమ్మెల్యే నివాళి…!

రోడ్డు ప్రమాదంలో మరణించిన యువకులకు.. ఎమ్మెల్యే నివాళి

దేవరకద్ర/ నేటి ధాత్రి.

దేవరకద్ర నియోజకవర్గం కొత్తకోట మున్సిపాలిటీ కేంద్రానికి చెందిన యువకులు చరణ్ రెడ్డి, అనిల్ సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన విషయం తెలిసిందే. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో మంగళవారం చరణ్ రెడ్డి, అనిల్ భౌతిక దేహాలకు ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందడం బాధాకరం అన్నారు. నివాళులర్పించిన వారిలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు.

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ను పకడ్బందీగా నిర్వహించాలి..

ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ను పకడ్బందీగా నిర్వహించాలి
– రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ

– ప్రతి ఓటర్ కు ఓటర్ స్లిప్ లను పంపిణీ చేయాలి

– ఫిబ్రవరి 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహణ

– ప్రతి 2 గంటలకు పోలింగ్ రిపోర్టు వివరాలను పంపాలి

– పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్

సిరిసిల్ల(నేటి ధాత్రి):

శాసనమండలి ఎన్నికల పోలింగ్ మన పెద్దపల్లి జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ అన్నారు.మంగళవారం జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ
చందుర్తి, కోనరావు పేట మండల కేంద్రాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో, వేములవాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను ఆర్డీఓ రాజేశ్వర్ తో కలిసి క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝ మాట్లాడుతూ, పోలింగ్ సజావుగా జరిపేందుకు వీలుగా పోలింగ్ కేంద్రాలలో అవసరమైన అన్ని సౌకర్యాలు ఉండాలని, సీసీ కెమెరాలు లేదా వెబ్ కాస్టింగ్ తప్పనిసరిగా ఉండాలని కలెక్టర్ అధికారులకు సూచించారు.
జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలకు ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరికి ఓటర్ స్లిప్ పంపిణీ చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద
ఫిబ్రవరి 27న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు శాసనమండలి ఎన్నికల పోలింగ్ జరుగుతుందని అన్నారు.
పోలింగ్ కేంద్రం పరిసరాలను చెక్ చేసుకోవాలని ,100 మీటర్ల రేడియస్ లో ఎన్నికలను ప్రభావితం చేసేలా ఎటువంటి ప్రచారం జరగడానికి వీలు లేదని అన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద డమ్మీ బ్యాలెట్ అతికించాలని అన్నారు.
పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు లైన్లో వచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని, దివ్యాంగులు వృద్ధులు గర్భిణీ స్త్రీలు ప్రాధాన్యతతో ఓట్లు వేసే విధంగా చూడాలని, 100 మీటర్ల పరిధిలో ఓటర్ సహాయ కేంద్రానికి హెల్ప్ డెస్క్ లు ఏర్పాటు చేయాలని అన్నారు.
పోలింగ్ లో ఓటు హక్కు వినియోగించుకునేందుకు పాస్పోర్ట్ డ్రైవింగ్ లైసెన్స్ పాస్ బుక్ , పాన్ కార్డు ఆధార్ కార్డు, పెన్షన్ డాక్యుమెంట్, జాతీయ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డ్, యూడి ఐడి, హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డు గుర్తింపు కోసం ఓటర్లు తమ వెంట తీసుకుని రావాల్సి ఉంటుందని అన్నారు.
పోలింగ్ నాడు ఉదయం ఖాళీగా ఉన్న బ్యాలెట్ బాక్స్ ను ఏజెంట్లకు చూపించాలని, గ్రీన్ పేపర్ లో ఏజెంట్ల సంతకాలు తీసుకుని సీజ్ చేయాలని, బ్యాలెట్ బాక్స్ పై పోలింగ్ కేంద్రం వివరాలు ఉండే విధంగా పేపర్ అతికించాలని, ఓటర్ సీక్రసి కాపాడేందుకు వీలుగా ఓటింగ్ కంపార్ట్మెంట్లను ఏర్పాటు చేయాలని అన్నారు.
పోలింగ్ నాడు ప్రతి రెండు గంటలకు ఒకసారి అంటే 10 గంటలకు, 12 గంటలకు, 2 గంటలకు, పోలింగ్ ముగిసిన తరువాత 4 గంటలకు పోలింగ్ వివరాలను ప్రకటించాలని అన్నారు. సాయంత్రం నాలుగు గంటల వరకు ఓటర్ స్లిప్పులు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఓటు వేసే అవకాశం కల్పించాలని, అన్నారు.
చివరి ఓటర్ ఓటు వినియోగించుకున్న తర్వాత నిబంధనలు ప్రకారం బ్యాలెట్ బాక్సులను మూసివేసి సీల్ చేయాలని, ప్రతి ఒక్క సిబ్బంది తన మాన్యువల్ ను ఒకటికి రెండు సార్లు పరిశీలించు కోవాలని , విధులను పక్కగా నిర్వహిస్తూ ప్రశాంతంగా ఓటింగ్ జరిగేలా చూడాలని అన్నారు.
అనంతరం కోనరావుపేట మండలం వెంకట్రావు పేట గ్రామంలోని ఇసుక రీచ్ ను పరిశీలించారు.
ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట వేములవాడ ఆర్డిఓ రాజేశ్వర్ తహసిల్దార్లు విజయ్ ప్రకాష్ రావు , మహేష్, సుజాత, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

ఏనుగులు బీభత్సం.. ఐదుగురు మృతి..

ఏనుగులు బీభత్సం.. ఐదుగురు మృతి..

అన్నమయ్య జిల్లా..
ఓబుల వారి పల్లి(నేటి ధాత్రి)

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శివరాత్ర వేళ తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లె మండల పరిధిలోని గుండాలకోనలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి.
శివరాత్రి సందర్భంగా ఆలయానికి వెళ్తున్న భక్తులపై ఏనుగులు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డాయి.ఈ ఘటనలో వై.కోటకు చెందిన ఐదుగురు భక్తులు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు ఘటనా స్థలికి చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కాగా అటవీ ప్రాంతంలో ఆహారం దొరకపోవడంతో గత కొంత కాలంగా అడవి జంతువులు తరచూ జనావాసాల్లోకి ప్రవేశించి ప్రజలపై దాడికి పాల్పడుతున్నాయి. చిరుత, ఏనుగుల దాడులలో పదుల సంఖ్యలో జనాలు ప్రాణాలు కోల్పోయారు.ఎంతో మంది గాయాలపాలయ్యారు. అటవీ జంతువులు కనిపిస్తే వాటి ముందుకు వెళ్లకూడదని వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచిస్తున్నారు.

కొత్త తిమ్మాపూర్ వద్ద డివైడర్ పనులు ఆపాలంటూ నిరసన.

కొత్త తిమ్మాపూర్ వద్ద డివైడర్ పనులు ఆపాలంటూ నిరసన..

రామకృష్ణాపూర్, నేటిధాత్రి:

 

.క్యాతనపల్లి మున్సిపాలిటీ పరిధిలోని కుర్మపల్లి స్టేజ్ నుండి శ్రీనివాస గార్డెన్ వరకు నిర్మిస్తున్న 100 ఫీట్ల రహదారి నిర్మాణం జరుగుతున్న నేపథ్యంలో డివైడర్లు ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగానే రామకృష్ణాపూర్ ఎక్స్ రోడ్ నుండి అమ్మ గార్డెన్ వరకు డివైడర్ నిర్మించడం వల్ల కొత్త తిమ్మాపూర్ గ్రామానికి వెళ్లే ప్రజలకు దూర భారం ఏర్పడుతున్న నేపథ్యంలో మంగళవారం డివైడర్ పనులు ఆపాలని స్థానిక ప్రజలు నిరసన చేపట్టారు.డివైడర్ పనులు అడ్డుకున్నారు. ప్రజల సౌకర్యార్థం రహదారి పై అవసరమైన చోట యుటర్న్ లు కల్పించాలని స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి దృష్టికి తీసుకెళ్లినా సరే నిర్మాణాలు యధావిధిగానే జరుగుతున్నాయని, అవసరమైన చోట యూటర్న్ నిర్మించడం లేదని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా స్థానిక ఎమ్మెల్యే చొరవ తీసుకొని కొత్త తిమ్మాపూర్ వెళ్లే రహదారి దగ్గర యూటర్న్ ఏర్పాటు చేసేలా చొరవ తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. లేనిపక్షంలో రహదారిపై బైఠాయించి నిరసన కార్యక్రమాలు చేపడతామని అంటున్నారు.

ఉద్యోగంలో లీలలు…ఉద్యోగులతో రాసలీలలు!

`మంత్రికి తెలియకుండానే నియామకాల?

`అక్రమార్కుడికే అందలమా.

 

`మంచి ఆటగాడు ఆ ‘‘అంజయ్య’’?

`నకిలీ పత్రాలతో ప్రమోషన్లు!

`రిటైర్‌ అయినా కొత్త కొలువులు!

`’’అంజయ్య’’ మళ్లా కొలువెక్కిండు!

`పులిహోర కలపడంలో మేటి…కొలువులు తెచ్చుకోవడంలో ఘనాపాటి

`’’అంజయ్య’’… మళ్లా కొలువెట్లొచ్చిందయ్యా?

`’’అంజయ్య’’కు మరో రెండేళ్లు ఉద్యోగం!
`ఔట్‌ సోర్సింగ్‌ వెసులుబాటు సద్యోగం!

`’’ఏడుపాయల’’ దేవాలయంలో పెద్ద నౌకరే!

`నకిలీ సర్టిఫికేట్‌ తో అప్పట్లో ప్రమోషన్‌.

`క్రిమినల్‌ కేసు నమోదుతో బైట పడ్డ భాగోతం.

`తన కింద పని చేసే మహిళలతో ‘‘కేళీ కలాపం’’!

`అప్పట్లో దేవాదాయ శాఖలో సంచలనం.

`వసతీ గృహం నిర్మాణంలో చేతి వాటం.

`లక్షల రూపాయలు తిన్నట్లు తేలిన పర్వం.

`అధికారులు ‘‘అంజయ్య’’ గుప్పిట్లో!

`రిటైర్‌ అయినా మరో రెండేళ్లు కుర్చీలో!!

`’’అంజయ్య’’ మీద కనికరం… రెండేళ్లకు కొలువు వరం!

`అన్నిట్లో ఆరితేరినోడు ‘‘అంజయ్య’’!

`’’అంజయ్య’’ మీద అంత ప్రేమెందుకయ్యా ‘‘రామకృష్ణయ్య’’!

`అమ్మ వారి గుడిలో అపవిత్రుడికి కొలువేందయ్య!

`రసరాజు ‘‘అంజయ్య’’కు రెండేళ్లు ఔట్‌ సోర్సింగ్‌ ఎందుకయ్యా!

`గుడి ఎనక నా సామి గుడిసేటి ఏశాలు తెలిసినా ఇదేం పనయ్యా?

`’’అంజయ్య’’ మీద పిర్యాదు చేసిన ‘‘రామకృష్ణ’’ కొలువిచ్చిండు.
`అవినీతి అధికారికి మరో అవకాశం కల్పించిండు.

పైదరాబాద్‌,నేటిధాత్రి:
అష్ట దరిద్రుడికి నిత్య కళ్యాణమట.. ఇది చదివితే నిజమేనేమో అనిపిస్తుంది. ఒక వ్యక్తి అత్యంత వివాదాస్పదుడు అని తెలిసిన తర్వాత అతన్ని అందలం ఎక్కించడం దుర్మార్గం. వ్యవస్దకు పట్టన గ్రహణం. అంజయ్య అనే దేవాదాయశాఖలో పనిచేసిన ఉద్యోగి చేసిన అక్రమాలు, అవినీతి అంతా ఇంతా కాదు. ఇక దుర్మార్గాల గురించి ఒక్క ముక్కలో చెబితే సరిపోతయేంత చిన్నది కాదు. అన్ని లీలలు తెలిసిన ఉద్యోగి. రాసలీలల్లో ఆరితేరిన వ్యక్తి. ఇంత గొప్ప నీచ చరిత్ర వున్న అంజయ్య ఇటీవలే ఉద్యోగం నుంచి రిటైర్‌ అయ్యారు. అలా అయ్యారో లేదో ఇలా మళ్లీ కొలువు తెచ్చుకున్నాడు. ఈ ఏడాది జనవరిలో అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ అదికారిగా విధులు నిర్వహించిన అంజయ్య రిటైర్‌ అయ్యారు. ఏవో కొ ంపలు మునిగిపోయినట్లుగా, దేవాదాయ శాఖలో మరెరూ లేనట్లుగా రెండేళ్లపాటు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం కల్పిస్తూ పిబ్రవరి 19న దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. విచిత్రమేమిటంటే గతంలో అంజయ్య పెద్ద అవినీతి పరుడు. దేవాదాయ సొమ్మును కాజేస్తున్నాడు. దర్శశాల నిర్మాణం కోసం దాతలు ఇచ్చిన సొమ్మును అంజయ్య మింగేశాడు. అని రిపోర్టు ఇచ్చిన ఉన్నతాదికారి రామకృష్ణ ఇప్పుడు అదే అంజయ్యకు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రెండేళ్లపాటు ఏడుపాయల వన దుర్గాభవాని ఆలయంలో అడ్మినిస్ట్రేటివ్‌ అధికారిగా కొలువును ప్రసాదం పంచినట్లు ఇచ్చేశారు. దీన్నే దొంగలు దొంగలు ఊళ్లు పంచుకున్నారని చెప్పుకుంటారు. గతంలోనే నకికీ సిర్టిఫికెట్‌ ఆరోపణలు అంజయ్య మీద వున్నాయి. ఆలయం నిధులను మింగినట్లు విమర్శలున్నాయి. విజిలెన్స్‌ అదికారులు కూడా లెక్కలుతేల్చి, రిపోర్టు కూడా ఇచ్చారు. వాటిని ఎప్పుడో పక్కన పెట్టారు. ప్రమోషన్ల మీద ప్రమోషన్లు ఇచ్చారు. రిటైర్‌ అయినా సరే మళ్లీ అంజయ్యను తెచ్చి సీట్లో కూర్చొబెడుతున్నారు. ఎన్నికల కోడ్‌ అమలులోవుందన్న సోయి కూడా ఉన్నతాధికాలకు లేకుండాపోయింది. ఎవరు పట్టించుకుంటారు లే అనుకున్నారో లేక, మాకు ఎదురేముందిలే అని అనుకున్నారో గాని పోస్టింగ్‌ ఆర్టర్‌ ఇచ్చేశారు. సహజంగా ప్రభుత్వ ఉద్యోగులంటే ఎంతో ఆదర్శంగా వుండాలి. వారి జీవితం ప్రజలకు మేలు చేసేలా వుండాలి. ఎల్లప్పుడూ సేవచేసేలా వుండాలి. ప్రజలకు అందుబాటులో వుండాలి. సేవ చేయడంలో అందరికన్నా ముందుండాలి. అదే ప్రభుత్వ శాఖలో మరింత గొప్పగా జీవితాలను గడపాల్సిన వారు దేవాదాయశాఖలో వుండాలి. ఆ శాఖలో పనిచేసే వారికి సమర్ధత ఒక్కటే కొలమానం కాదు. వారి వ్యవహారశైలి కూడా ఎంతో కీలకం. వారి ఆలోచన దగ్గర నుంచి వారు నడుచుకునే విధానం కూడా సరిగ్గా వుండదకూడదు. కలలో కూడా తప్పటడుగు వేయకుండా వుండాలి. ప్రజా దనం దుర్వినియోగం చేయకుండా వుండాలి. ముఖ్యంగా హిందువులు ఎంతో పవిత్రంగా కొలిచే స్థలాలైన గుళ్లలో పనిచేసే అధికారులు ఎంతో పవిత్రంగా వుండాలి. వారి మనసు అంతకన్నా పవిత్రంగా వుండాలి. ఏ చిన్న పొరపాటు చేయడానికి కూడా భయపడాలి. దేవుడంటే హిందువులకు ఎంతో నమ్మకం. దేవుడంటే ప్రతి వారికి భక్తి వుంటుంది. తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడనే భయం వుంటుంది. కాని కోట్లాది మంది ఎంతో భయభక్తులతో దేవుళ్లను సందర్శించి వారి తప్పులను మన్నించమని వేడుకుంటారు. అలాంటి ఎంతో పవిత్రమైన స్ధలాలలో ఉద్యోగాలు చేసే ఉద్యోగులు ఎలావుండాలి. ఎంతో ఆదర్శవంతమైన జీవితం గడపడమే కాకుండా, ఆ దేవునిపై అచెంచలమైన భక్తిభావం వుండాలి. అంతకన్నా కొన్ని వందల రెట్ల భయం వుండాలి. కాని గుళ్లలో పనిచేసే కొంత మంది ఉద్యోగుల జీవితాలు ఎంత నీచంగా వుంటాయంటే చెప్పడానికి కూడా అలవి కాకుండా వుంటాయి. అంత దుర్మార్గంగా వుంటాయి. మరికి వారికి దేవుడంటే భయం లేకుండా, నిర్భీతిగా, నిర్లజ్జగా, నిర్లక్ష్యంగా అవినీతి కార్యకలాపాలకు పాల్పడుతుంటారు. ఇంకాకొంత మంది ఓ అడుగు ముందుకేసి చేయకూడని పనులు చేస్తుంటారు. అలా పవిత్రమైన స్ధలాలో కొలువు చేస్తూ నీచమైన పనులు చేస్తూ తనకుతానుగా దొరికిపోయిన ఉద్యోగి అంజయ్య. కొమురవెళ్లి దేవస్దానంలో చిన్న ఉద్యోగిగా కొలువులో చేరిన అంజయ్య కష్టపడి అంచెలంచెలుగా ఎదగలేదు. భక్తులకు సేవ చేసి పేరు పొందలేదు. ఉత్తమ ఉద్యోగిగా ఎక్కడా పేరు లేదు. ఎవరు అంజయ్య గురించి చెప్పినా నీచం,నికృష్టం అనే చెబుతుంటారు. మరి అలాంటి వ్యక్తికి ఉన్నతాధికారులు ఎందుకు సహకరించారన్నది అంతుచిక్కని ప్రశ్న. అంటే కింది స్దాయి నుంచి పై స్ధాయిదాకా ఎంతో పవిత్రమైన దేవాదాయశాఖలో కీచకులు, కామకులు, లంచావతారులు తిష్టవేశారని చెప్పడంలో సందేహం లేదు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అంటే ఇదే మరి. ఒక ఉద్యోగి ఆలయ నిధులు దుర్వినియోగం చేస్తున్నాడని తెలిసినా పై అధికారులు ఎందుకు ఉపేక్షిస్తూ పోయారన్నది కూడా తేలాల్సివుంది. తాను చేరుకోవాల్సిన రైలు జీవిత కాలం లేటు అంటూ గతంలో చెప్పుకునేవారు. దేవాదాయ శాఖలో చూస్తే జీవితం అయిపోయినా కూడా గమ్యం చేరని ప్రయాణంలా సాగుతుంటాయి. అందుకే అవినీతికి పాల్పడిన, అనేక అక్రమాలు చేసిన అధికారులు కూడా తప్పించుకుంటున్నారు. ఏకంగా రిటైర్‌ అయిపోతున్నారు. కాని కేసులు అలాగే పెండిరగ్‌లో వుంటున్నాయి. అసలు విషయానికి వస్తే కొమురవెళ్లిలో జూనియర్‌ అసిస్టెంటుగా మొదలైంది అంజయ్య జీవితం. నికిలీ సర్టిఫికెట్‌తో ప్రమోషన్‌ పొందాడన్నది రుజువైంది. క్రిమినల్‌ కేసు కూడా నమోదైంది. అన్నీ తెలిసినా అంజయ్యకు ప్రమోషన్‌ ఇచ్చారు. క్రిమినల్‌ కేసు నమోదైన తర్వాత కూడా ఆయనను ఉద్యోగంలో నుంచి తొలగించలేదు. చిన్న ట్రాన్ఫ్‌ఫర్‌తో సరిపెట్టారు. అదే శిక్ష అని దేవాదాయశాఖ అదికారులు చేతులు దులుపుకున్నారు. ఇలా పై అదికారులు ఆశీస్సులు వున్న అంజయ్య లాంటి వారి వ్యవహార శైలి విచ్చలవిడి తనాన్ని మరింత పెంచుకుంటుంది. అందుకే అంజయ్యకు భుక్తులంటే చులకన. దేవుడంటే భయం వుండదు. భక్తి వుండదు. పవిత్రమైనస్ధలంలో కొలువు చేస్తున్నామన్న సోయి కూడా వుండదు. ఇక కొమురవెళ్లి దేవస్దానంలో పనిచేసే మహిళా ఉద్యోగుల పట్ల ఆయన చేష్టలు మరీ దుర్మార్గంగా వుండేవి. మహిళా ఉద్యోగులు తనకు లొంగిత ఒక లెక్క..లొంగకపోతే మరో లెక్క. అంతే కాదు తనుకు లొంగిన మహిళలతో పోటోలు దిగి, వారిని బ్లాక్‌ మెయిల్‌ చేయడం కూడా అలవాటు చేసుకున్నాడు. ఆ ఫోటోలు కూడా గతంలో బైట పడ్డాయి. ఇలా పవిత్రమైన స్ధలంలో మహిళలను వేదింపులకు గురిచేయడమే కాదు, వారి లొంగదీసుకొని కేళీ కలాపాలు నిర్వహించాడు. అయినా అదికారులు పట్టించుకోలేదు. అంజయ్యపై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అంటే దేవాదాయ శాఖ ఎంత భ్రష్టుపట్టిపోయిందో అర్దం చేసుకోవచ్చు. తన కింద పనిచేయాలంటే మహిళా ఉద్యోగులు గజగజ ఒనికిపోయేవారు అని చెబుతుంటారు. ఇక ఆలయం శుభ్రం చేసే స్వీపర్లను బానిసలకన్నా హీనంగా చూసేవాడు అనే ఆరోపణలు అనేకం వున్నాయి. వారు అంజయ్య చెప్పినట్లు చేయాలి. లేకుంటే ఉద్యోగాలు పోతాయని భయపెట్టేవాడు. వారు సర్వస్వం అర్పించుకునేలా చేసేవాడని అప్పట్లో అనేక విమర్శలు వచ్చాయి. అందుకు సాక్ష్యంగా కూడా అనేక ఫోటోలు కూడా బైటకు వచ్చాయి. కాని దేవాదాయాశాఖ పై స్ధాయి అదికారులు అంజయ్య మీద చర్యలు తీసుకోలేదు. ఎందుకంటే గుడి సొమ్మును అప్పనంగా మింగుతూ పై స్ధాయి అదికారులకు వాటాలు పంపుతుండేవారని సాటి ఉద్యోగులే చెబుతుంటారు. అంతే కాదు పై అదికారులు ఆశలు ఎలాంటివైనా తీర్చేవాడని అందుకే అంజయ్యపై ఎలాంటి చర్యలు తీసుకోకపోయేవారని చెబుతుంటారు. ఇంత కాలం తప్పుడు పనులు చేసిన అంజయ్యకే ఉన్నతాదికారులు అండదండలు అందించారు. రిపోర్టులను బుట్టదాఖలు చేశారు. నిధులు మింగినా చర్యలు తీసుకోలేదు. పైగా ప్రమోషన్లు ఇచ్చి ప్రోత్సహించారు. అంటే అంజయ్య చేసిన తప్పులలో ఉన్నతాధికారులకు వాటాలున్నట్లు వాళ్లే అంగీకరించనట్లు కాదా? తమకేం తెలియదన్నట్లు ప్రకటనలు చేస్తారా చూడాలి.
మంత్రిగారు…ఈ దుర్మార్గం చూడండి.
ప్రభుత్వానికి తెలియకుండా చీమ చిటుక్కుమనకూడదు. దేవాదాయా శాఖ కొండా సురేఖకుతెలియకుండా ఒక్క ఫైలు కూడా కదలకూడదు. కాని ఉద్యోగాల నియామకాలు మంత్రికి తెలియకుండానే జరిగిపోతున్నాయా? సాక్ష్యానికి అంజయ్య నియామకం ఒక్కటి చాలు. ఉద్యోగాల కోసం ఎంతో మంది ఎదరుచూస్తున్నారు. వాళ్లందరినీ కాదని ఉన్నతాదికారులు అంజయ్యకే ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగం ఎందుకిచ్చినట్లు? ఇక పోతే సంబంధిత మంత్రికి తెలియాల్సిన అవసరం లేదా? ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగాల నియామకం మొత్తం అదికారుల చేతుల్లోనే వుందా? అలా అని ప్రభుత్వం వారికి స్వేచ్ఛనిచ్చిందా? అదే నిజమైతే కొత్తగా అర్హులైన నిరుద్యోగిని ఎంపిక చేయొచ్చు. లేకుంటే రిటైర్‌ అయిన నిజాయితీ పరుడైన ఉద్యోగికి ఇవ్వొచ్చు. పవిత్రమైన గుడిలో కొలువు చేస్తూ అపవిత్రమైన పనులు చేసే అంజయ్య లాంటి ఉద్యోగికి మళ్లీ ఔట్‌ సోర్సింగ్‌ కొలువంటే అపచారం కాదా? తెలంగాణలో ఏడుపాయల జాతర అంటే ఎంతో గుర్తింపు వుంది. వనదుర్గాభవాని అంటే మూడు నాలుగు రాష్ట్రాల నుంచి కొన్ని లక్షల మంది భక్తులు దర్శనం కోసం ఏటా వస్తుంటారు. కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువుగా, భక్తులకు కొంగు బంగారమైన ఎంతో శక్తి వంతమైన మహిమాన్విత క్షేత్రంలో అంజయ్య లాంటి లోలుడికి ఉద్యోగం ఇవ్వడాన్ని భక్తులంతా తప్పు పడుతున్నారు. ఇలాంటి వ్యక్తి నియామకం వల్ల ప్రభుత్వం అబాసుపాలయ్యే అవకాశం వుంది. మంత్రికొండా సురేఖ తక్షణం స్పందించి, అంజయ్య మీద వున్న ఆరోపణలపై విచారణ జరిపించాలని కోరుతున్నారు. రిటైర్‌ అయినంత మాత్రాన ఆయన చేసి అవినీతి మాసిపోదంటున్నారు. పైగా మళ్లీ అంజయ్య అంత సుద్దపూస లేడన్నట్లు ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగం ఇచ్చిన అదికారులపై కూడా దృష్టిపెట్టాలని భక్తులు కోరుతున్నారు. అంజయ్య అవినీతిలో ఉన్నతాదికారుల వాటా కూడా తేల్చాలంటున్నారు. లేకుంటే దేవాదాయశాఖలో ఇలాంటి ప్రబుద్దలు మరింత పెరిగిపోయే అవకాశాలున్నాయి. భక్తుల మనోభావాలు దెబ్బతినే ప్రమాదముంది. అందువల్ల మంత్రి కొండా సురేఖ ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

కోచింగ్‌.. చీటింగ్‌!

 

`కోచింగ్‌ సెంటర్ల చీకటి సంపాదన.

`గోల్‌ మాల్‌ గోవిందం!

 

`‘‘వేలకోట్ల’’ రాబడికి లెక్కుండదు!

`అకాడమీ లకు హద్దుండదు.

 

సెంటర్లలో వెంచర్లకు మించి ఆదాయం.

`పైకి మాత్రం కి విద్యా వికాసం.

`జరిగేదంతా ‘‘వేల కోట్లలో’’ వ్యాపారం.

`లక్షల మందికి కోచింగులు.

`వేలాది రూపాయల ఫీజులు.

`చెతికందేవి ఎన్ని కొలువులు?

`అమాయకుల జీవితాలకు కల్పించే ఆశలు.

`విద్యార్థుల బలహీనతలే పెట్టుబడి.

`పదే పదే చెల్లించే ఫీజులు లెక్కకు మించిన రాబడి.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

తెలంగాణలో గ్రూప్‌ 2,3 పరీక్షలు వాయిదా పడ్డాయి. నిజానికి ఆగష్టు నెలలో జరగాల్సిన పరీక్షలు. కాని జరగడం లేదు. కారణం అభ్యర్ధుల నుంచి వచ్చిన ఒత్తిడి అన్నది అందరూ చెప్పుకునే మాట. కాని దాని వెనుక కోచింగ్‌ సెంటర్ల మాయా జాలం వుందన్నది అందరూ అంగీకరించాల్సిన అంశం. ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా కోచింగ్‌ సెంటర్ల మాఫియా మూలంగానే జరిగిందనేది అందరికీ తెలుసు. కాకపోతే ప్రభుత్వాన్ని బద్‌నాం చేయడానికి ఇంత కాలం వాయిదా కోసం ఉద్యమాలు చేయించారు. దాని వెనుక కూడా కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకల ప్రోద్భలం వుందన్న ఆరోపణలు అనేకం వున్నాయి. ఈ పరీక్షల వాయిదా వల్ల కోచింగ్‌ సెంటర్లకు మళ్లీ కల వచ్చిందనే చెప్పాలి. కనీసం ఆరు నెలల పాటు ఇక కోచింగ్‌ సెంటర్లు రాత్రి పగలు అనే తేడా లేకుండా బ్యాచ్‌లు నిర్వహిస్తారు. కోట్ల రూపాయలు సంపాదిస్తారు. కోచింగ్‌ సెంటర్లు క్లాసులు చెప్పే సమయంలో వీడియోలు తీసి, వాటిని ఆన్‌లైన్‌ కోచింగ్‌ల పేరుతో ప్యాకేజీలు కూడా అమ్ముకుంటున్నారు. దాంతో అటు యూ ట్యూబ్‌ నుంచి ఆదాయం. దానికి తోడు ఉచిత ప్రచారం. ఆన్‌లైన్‌ ప్యాకేజీ కింద ఒక్కొ అభ్యర్ధి నుంచి వేలాది రూపాయలు వసూలు చేస్తాయి. సెంటర్ల నిర్వహణతో వచ్చే ఆదాయం అదనం. అదే అసలైన సంపాదనకు మార్గం. ఇక చిన్నా, పెద్ద అనే తేడా లేకుండా తెలంగాణ వ్యాప్తంగా మూతబడిన కోచింగ్‌ సెంటర్లు కూడా తెరుచుకుంటాయి. ప్రభుత్వం కూడా జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటిస్తామని చెప్పడంతో ఇక ఐదేళ్లపాటు విరామం లేకుండా సెంటర్లు నిర్వహిస్తుంటారు. ఏటా కొన్ని లక్షల మంది పట్టభద్రులు తమ చదువు పూర్తి చేసుకొని వస్తుంటారు. వారికి రకరకాల విద్యా కోర్సుల కోసం, ఉద్యోగాల కోసం కోచింగ్‌లు ఇస్తుంటారు. గ్రూప్‌ పరీక్షల వాయిదా వల్ల కనీసం వెయ్యి కోట్ల రూపాయల వ్యాపారం జరగొచ్చన్నది ఒక అంచానా. డిఎస్సీ వాయిదా వేస్తే ఇంకా ఎక్కువ ఆదాయం సమకూరేది. గ్రూప్‌ పరీక్షలు ఎన్ని లక్షల మంది రాసినా, కోచింగ్‌ చాలా తక్కువ మంది తీసుకుంటారు. కారణం ఉద్యోగాలు తక్కువగా వుంటాయి. డిఎస్సీ పదకొండు వేల ఉద్యోగాలున్నాయి. దాంతో నిరుద్యోగుల్లో ఆశలు వుంటాయి. కోచింగ్‌ సెంటర్లలో కొంత తర్ఫీదు తీసుకుంటే పరీక్ష సులువౌతుందన్న భావన వారిలో కలుగుతుంది. అందుకే కొందరు కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకులు కృత్రిమ ఉద్యమం లేపారు. పరీక్షల నిర్వహణతో అంతా చల్లబడిరది. గ్రూప్‌ పరీక్షలు వాయిదా పడడంతో ఆగిపోయింది.
ట్యుటోరియల్స్‌, కోచింగ్‌ సెంటర్ల మూలంగా లక్షల్లో వుండే పై చదువులకు అవసరమైన కోర్సుల్లో సీట్లు సాధించేందుకు కొంత వరకు ఉపకరిస్తాయేమో కాని, వందల్లో, కొన్ని సార్లు వేలల్లో వుండే ఉద్యోగాలు మాత్రం ఖచ్చితంగా వస్తాయనుకోవడం మాత్రం పూర్తిగా భ్రమే. సహజంగా ఏ రాష్ట్రాలలో అయినా గ్రూప్‌ పరీక్షల నిర్వహణతో ప్రభుత్వాలు ఎంపిక చేసే ఉద్యోగాలు కేవలం వందల్లోనే వుంటాయి. ఒక్క డిఎస్సీ లాంటి పరీక్షలే కొన్ని సార్లు వేలల్లో వుంటాయి. అంతే కాని వందల్లో వుండే గ్రూప్‌1, గ్రూప్‌2 పరీక్షలు కేవలం కోచింగ్‌ సెంటర్లలలో చదువుకున్నవారికే ఉద్యోగాలు వస్తాయన్నది ముమ్మటికీ అబద్దం. ఏ కోచింగ్‌ సెంటరైనా సరే పరీక్షల్లో మెలుకవలు నేర్పుతారు. పరీక్షల్లో సమయం ఎలా సద్వినియోగం చేసుకోవాలన్నదానిపైనే ఎక్కువ దృష్టిపెడతారు. కాకపోతే పరీక్షల విధానంలో తర్పీదు ఇవ్వడంలో కోచింగ్‌ సెంటర్ల పాత్ర కొంత వరకు ఉపయోగకరమే తప్ప, పూర్తిగా దోహరపడతాయని చెప్పడం మాత్రం శుద్ద అబద్దం. ఒక తెలివైన అభ్యర్ధి కోచింగ్‌ వెళ్తే ఉద్యోగం సంపాదించుకునే అవకాశం మెరుగౌతుంది. అంతే తప్ప ఆ తెలివైన అభ్యర్ధి కేవలం కోచింగ్‌కు వెళ్లడం వల్లనే ఉద్యోగం సంపాదించాడని చెప్పలేం. కారణం ఎంతో మంది కోచింగ్‌కు వెళ్లే స్తోమత లేని వాళ్లు కూడా ఉద్యోగ నిర్వహణ పరీక్షల్లో కూడా ఫస్టు ర్యాంకు సాధించిన వారున్నారు. కోచింగ్‌ సెంటర్లలో చదువుకున్న వాళ్లందరూ మొదటి ర్యాంకులుసాధించినట్లు పెద్దగా చరిత్రలుకూడా లేవు. అంతే కాదు గ్రూప్‌1 లో ప్రభుత్వాలు ప్రకటించే కొలువులు ఎన్ని వుంటాయో, తెలంగాణ మొత్తం మీద అన్ని కోచింగ్‌ సెంటర్లు వున్నాయంటే ఆశ్చర్యపోవనవసరం లేదు.
ఇటీవల కోచింగ్‌ సెంటర్లలో చదువుకుంటే తప్ప కొలువులు రావన్న భ్రమలు యువతలో బాగా కల్పించారు. ఎందుకంటే ఉద్యోగాల పరంపర అలా కొనసాగడం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఉద్యోగాలు పొందిన వారిలో చాల మంది అప్పటి అధికారుల కనుసన్నల్లో నడిచిన కోచింగ్‌ సెంటర్లలో చదువుకున్న వారికి ఉద్యోగాలు వచ్చినట్లు పెద్దఎత్తున ప్రచారం వుండేది. అందులో కొంత వాస్తవం కూడా వుంది. అందుకే ఉద్యోగార్ధులు కోచింగ్‌ సెంటర్లకు పరుగులు పెట్టడం అలవాటు చేసుకున్నారు. వాళ్లు తయారు చేసిన మెటీరియల్‌ నుంచే ప్రశ్నలు వస్తాయన్న భ్రమలు కల్పించారు. అదే నిజమైతే ఉద్యోగాలు వచ్చిన వాళ్లంతా కోచింగ్‌ సెంటర్లలో చదువుకున్న వాళ్లే అయి వుండాలి. కాని అది ఎప్పుడూ సాధ్యం కాలేదు. కాని అందమైన బ్రోచర్లు తయారు చేయడం, ఉద్యోగాలు పొందిన వారితో ఇంటర్వూలు చేయించడం మొదలు పెట్టారు. ఇంటి దగ్గరే పూర్తి సమయం చదువుకున్న అభ్యర్ధులకు డబ్బులిచ్చి కూడా తమ కోచింగ్‌ సెంటర్లలో చదువుకున్నట్లు కూడా ప్రచారం చేయించుకుంటూ వస్తున్నారు. దాంతో యువత ఆకర్షితులౌతున్నారు. ఇక సోషల్‌ మీడియా వచ్చిన తర్వాత ఆ ప్రచారం మరీ విపరీతమైంది. దాంతో గ్రామీణ యువత కోచింగ్‌ సెంటర్లవైపు చూడడం అలవాటు చేసుకున్నారు. నిత్యం కోచింగ్‌తోపాటు, పరీక్ష నిర్వహణ వంటివి చేస్తుంటారు. అయినా ఉద్యోగాలు పొందని వారే ఎక్కువగా వుంటారు. తెలంగాణలో కొన్ని వందల కోచింగ్‌ సెంటర్లు వున్నాయి. అన్నింటి నుంచి ఉద్యోగాలు పొందుతున్న వారు ఎంత మంది? కోచింగ్‌లు తీసుకున్నవారు ఎంత మంది? అన్నది లెక్కేస్తే అసలు బండారం బైటపడుతుంది. ఎలాంటి కోచింగ్‌ తీసుకోకుండా ఇంటి వద్ద చదువుకున్నవారు కూడా రెండు మూడు ఉద్యోగాలు సంపాదించిన వారు కూడా చాల మంది వున్నారు.
కోచింగ్‌ సెంటర్ల వ్యాపారం గురించి తెలిస్తే విస్తుపోవాల్సిందే. ఎందుకంటే కోచింగ్‌ సెంటర్లు విద్యా వ్యవస్దలకు అనుసంధానమై వుండవు. ఎందుకంటే అవి ట్యూషన్‌ సెంటర్లుగానే పరిగణిస్తారు. కాని కోచింగ్‌ సెంటర్ల వ్యాపారం వేల కోట్లలో వుంటుంది. ఒక కోచింగ్‌ సెంటరు ఏర్పాటుకు ఎలాంటి అనుమతి అవసరం లేదు. ఎవరి నుంచి పర్మిషన్లు పొందాల్సిన అవసరం లేదు. ఎలాంటి నిబంధనలు లేవు. ఆంక్షలు అసలే లేవు. ఎందుకంటే అది విద్యా సంస్ధలు కాదు. ఒక స్కూల్‌ ఏర్పాటు చేయాలంటే సవాలక్ష నిబంధనలుంటాయి. ఒక కాలేజ్‌ ఏర్పాటుకు కూడా అనేక రకాల అనుమతులు పొందాల్సివుంటుంది. కోచింగ్‌ సెంటర్లు కూడా స్కూళ్ల మాదిరిగానే పనిచేస్తాయి. పైగా స్కూళ్లు, కాలేజీలు వేసవి కాలంలో మూసేస్తారు. కాని కోచింగ్‌ సెంటర్లు అప్పుడే ఎక్కువ నిర్వహిస్తారు. స్కూళ్లలో ఫీజుల నియంత్రణ, నిబంధనలుంటాయి. ఏ క్లాసుకు ఎంత చార్జి వసూలు చేయాలన్నదానిపై స్పష్టమైన గైడ్‌ లైన్స్‌ వుంటాయి. కాని కోచింగ్‌ సెంటర్లకు ఎలాంటి లెక్క లేదు. ఉద్యోగార్ధులు కోచింగ్‌ కోసం వెళ్లడానికి ఆ సెంటర్ల నిర్వాహకులు నిర్ణయించిన దానికి కట్టుబడే చేరుతుంటారు. కారణం భవిష్యత్తు. ఉద్యోగం వస్తుందన్న నమ్మకం. కొందరు ఒక్కసారి కాకుండా ఉద్యోగం వచ్చే వరకు కోచింగ్‌ తీసుకుంటూనే వుంటారు. అలా ఏళ్ల తరబడి తీసుకునేవారు కూడా వున్నారు. పలు కోచింగ్‌ సెంటర్లు మారుతుంటారు. అన్ని కోచింగ్‌ సెంటర్లకు ఫీజులు వదిలించుకుంటుంటారు. అయినా ఉద్యోగాలు రాని వాళ్లు చాలా మంది వున్నారు. అలాంటప్పుడు కోచింగ్‌ సెంటర్ల గొప్పదనం ఏమీ లేదు. కాని వాళ్ల వ్యాపారానికి ఢోకా వుండదు. కోచింగ్‌ సెంటర్లు సంపాదనకు ఎలాంటి ఐటి కూడా అవసరంలేదు. కాని వచ్చే ఆదాయాన్ని ఎవరూ చూపించరు. అందుకు అవసరమైన బిల్లు బుక్కులు కూడా సరిగ్గా వుండవు.

అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి

ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్సీ అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి….

తంగళ్ళపల్లి నేటి ధాత్రి…

తంగళ్ళపల్లి మండలం టెక్స్టైల్ పార్క్ఇందిరమ్మ కాలనీలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా అభ్యర్థి ఉట్కూరి నరేందర్ రెడ్డికిమొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వ వీప్ జిల్లా అధ్యక్షులు వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీనియోజకవర్గ ఇన్చార్జి కేకే మహేందర్ రెడ్డితంగళ్ళపల్లి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రవీణ్ ఆదేశానుసారం టెక్స్టైల్ పార్క్ ఇందిరమ్మ కాలనీలో మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఇందిరమ్మ కాలనీ గ్రామంలో ఉన్నటువంటి పట్టు బద్రులను కలిసి మొదటి ప్రాధాన్యత ఓటువేసి గెలిపించాలని ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కి ఓటు వేసి అత్యధిక మెజార్టీతోగెలిపించాలని ఈ సందర్భంగా తెలియజేశారు పట్టుభద్రులకిఏ సమస్య వచ్చిన ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి వారి గురించి వారి సమస్యలకు పరిష్కారమయ్యే దిశగా పాటు పడదామని ఈ సందర్భంగా తెలియజేశారు ఇట్టి కార్యక్రమంలో సోషల్ మీడియా జిల్లా కోఆర్డినేటర్ గడ్డం మధుకర్ గ్రామ శాఖ అధ్యక్షులు శ్రీరామ్ నరేష్ కొంపెల్లి శ్యామ్ మాజీ వార్డు సభ్యులు దూస మహేందర్ గోరెంట్ల రాజమల్లు బల్ల లక్ష్మీపతి అంబటి ఆంజనేయులు మాటీటీ రాజు ముసం విలాస్ కొండి నరేష్ తదితరులు పాల్గొన్నారు

పట్టభద్రుల ప్రసన్నం కష్టమే!


-హరికృష్ణ ప్రభావం అంతంత మాత్రమే!

-తను ఊహించుకున్న ఆర్భాటం అంతా ఉత్తదే!

mlc candidate vanga

-సాగుతున్న ప్రచారం కూడా పరిమితంగానే.!

-ఎంత ప్రయాసపడినా గెలుపు తీరం కష్టమే

-ఎంత సాగిల పడినా గెలుపు భారమే

-నిరుద్యోగుల సమస్యల మీద గళం విప్పింది లేదు

-తెలంగాణ ఉద్యమ సమయంలో జై తెలంగాణ అన్నది లేదు

-ఉద్యమానికి సమయం కేటాయించింది లేదు

-ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత ఉద్యమాలు చేసింది లేదు

-నిరుద్యోగుల పక్షాన పోరాటం చేసింది లేదు

-ఇంత కాలం తన రాజకీయ ప్రచారం మాత్రమే సాగించారు

-ముందు కాంగ్రెస్‌ టికెట్‌ కోసం ప్రయత్నం చేశాడు

-ఆ తర్వాత బిజేపి అగ్రనాయకులను కలిశాడు

-ఏ పార్టీ టికెట్‌ దక్కకపోవడంతో ఇండిపెండెంట్‌ అన్నాడు

-బిసి ఐక్యత ముసుగేసుకొని కొంత కాలం కథ నడిపించాడు

-ఆఖరుకు బిసి కండువా పక్కన పడేసి బిఎస్పీ అంటున్నాడు

-ఎన్నికలకు ముందే ఇన్ని జెండాలు మార్చిన హరికృష్ణ

-ప్రసన్న ఎజెండా ఎలాంటిదో చెప్పకనే చెప్పాడు

-కోచింగ్‌ సెంటర్ల కోసం తపన పడ్డాడు

-కాలేజీ వదిలేసి కోచింగ్‌ సెంటర్లకు పుస్తకాలు రాయడం మొదలు పెట్టాడు

-కోచింగ్‌ సెంటర్ల ముసుగులో కోట్లు సంపాదించుకున్నాడు?

-ఎన్నికలలో గెలిచి ఎమ్మెల్సీ కావాలనుకున్నాడు

-అసలు రంగు బైటపడడంతో ఉక్కిరి బిక్కిరౌతున్నాడు

                                    హైదరాబాద్‌,నేటిధాత్రి: 

కరీంనగర్‌, ఆదిలాబాద్‌, మెదక్‌, నిజామాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న బిఎస్పీ అభ్యర్ధి ప్రసన్న హరికృష్ణ మీద బిసి. సంఘాలు మండిపడుతున్నాయి. తన స్వార్ధపూరిత రాజకీయాల కోసం బిసిలను ముందు ఎగదోసి, తర్వాత పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. అయినా ఆయనపై పట్టభద్రులలో పెద్దగా స్పందన కనిపించడం లేదు. ప్రసన్న హరికృష్ణ ఒక అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ప్రభుత్వ ఉద్యోగం సాగిస్తూ, తన విద్యార్దుల కోసం చేసిందేమీ లేదు. ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో పనిచేస్తూ ఆయన తన విద్యార్దులను ఉన్నత లక్ష్యాలతో తీర్చిదిద్దాల్సిన సమయంలో ప్రైవేటు కోచింగ్‌ సెంటర్ల మేలు కోసమే పని చేశారన్న ఆరోపణలున్నాయి. ఓ వైపు ప్రభుత్వ ఉద్యోగం చేసుకుంటూ, కోచింగ్‌ సెంటర్ల మేలు కోసం పనిచేశారు. తన విద్యార్ధులకు ఆ మెటీరియల్‌ అందించలేదు. కేవలం వ్యాపార లాభాపేక్షతోనే తన పుస్తక రచనను కొనసాగించారు. వాటిని కోచింగ్‌ సెంటర్లకు అమ్ముకోవడం కోసమే ప్రయత్నం చేశాడు. అలా కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు. విద్యార్దులకు తీరని అన్యాయంచేశారు. తన వల్ల కోచింగ్‌ సెంటర్ల ద్వారా వేల మంది నిరుద్యోగులకు ఉపయోగపడ్డానని చెబుతున్నారే, గాని జీతం తీసుకుంటూ తన కాలేజీ విద్యార్దుల భవిష్యత్తు తీర్చిదిద్దానని చెప్పుకునే పరిస్ధితి లేదు. నిజంగా ఆయన సమాజం కోసం, నిరుద్యోగుల భవిష్యత్తు కోసం ఆలోచిస్తే తాను పనిచేసే కాలేజీ విద్యార్దులే కొన్ని వేల మంది వుంటారు. వారిని తీర్చిదిద్దితే ఎంతోమంది జీవితాలు బాగుపడేవి. కాని అలా చేయలేదు. కేవలం పుస్తకాలు రాసి, ప్రైవేటు కోచింగ్‌ సెంటర్లకు అందజేయడం వల్ల వ్యక్తిగతంగా ఆయన లాభపడ్డాడు. ఆ మెటీరియల్‌తో కోచింగ్‌ సెంటర్లు బాగుపడ్డాయి. అందుకే పట్టభద్రులు ఇప్పుడు ఆయన వ్యవహారశైలిపై గళమెత్తుతున్నారు. హరికృష్ణ విద్యార్ధుల జీవితాలను గాలికి వదిలేసి, కోచింగ్‌ సెంటర్లకు అమ్ముడుపోయిన వ్యక్తి అంటున్నారు. అసలు కాలేజీకి హజరు కాకుండా, విద్యార్దులకు పాఠాలు చెప్పకుండా జీతాలు తీసుకొని ప్రభుత్వాన్ని మోసం చేశారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. కాలేజీకి ఎగనామం పెట్టి, యూనివర్సీటీ పెద్దలను ప్రసన్నం చేసుకొని, కోచింగ్‌ సెంటర్లకు మెటీరియ్‌ అందించి, తన కాలేజీ విద్యార్దులకు తీరని అన్యాయం చేశాడంటున్నారు. పైగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తూ బిసిల మధ్య చీలికకు ప్రయత్నం చేస్తున్నాడన్న బిసి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎమ్మెల్సీ కావాలన్న ఆశలతో ముందు ఆయన కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ కోసం విశ్వ ప్రయత్నాలు చేశారు. హరికృష్ణ అసలు స్వరూపం తెలిసిన తర్వాత ఆయనకు టికెట్‌ ఇచ్చేందుకు కాంగ్రెస్‌ నిరాకరించింది. దాంతో బిజేపి టికెట్‌ కోసం ప్రయత్నాలు చేశారు. బిజేపి పెద్దలను కలిసి వేడుకున్నాడు. కాని అక్కడా అవకాశం దొరకలేదు. తర్వాత బిఆర్‌ఎస్‌ పెద్దలను కలిశారు. అయితే హరికృష్ణ తన జీవితంలో ఏనాడు తెలంగాణ కోసం పనిచేసిన వ్యక్తికాదని తెలిసింది. ఓ వైపు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున సాగుతున్న సమయంలో ఆయన కోచింగ్‌ సెంటర్లకు మెటీరియల్‌ తయారు చేస్తూన సంపాదనలో మునిగితేలారంటున్నారు. ఏనాడు ఆయన తెలంగాణ ఉద్యమంలో పాలు పంచుకున్నది లేదు. తెలంగాణకు జైకొట్టింది లేదని బిసి సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఒక బిసిగా అంతటి స్ధాయికి ఎదిగినా ఏనాడు ఏ బిసి విద్యార్ధికి ఆయన సాయం చేసింది లేదు. కాని తనకు పదవి కావాల్సి రాగానే మాత్రం బిసిల జపం చేస్తున్నాడని అంటున్నారు. బిఆర్‌ఎస్‌ కూడా టికెట్‌ ఇవ్వమని తేల్చి చెప్పడంతో ఇక గత్యంతరం లేక , ఇండిపెండెంటుగా పోటీకి నిలబడ్డాడు. అక్కడ కూడా ఆయనకు సరైన ఆదరణ లభించలేదు. బిసి సంఘాలు ఆయనకు మద్దతు పలకలేదు. దాంతో ఏదొ ఒక పార్టీ గుర్తు మీద పోటీ చేస్తే తప్ప లాభం లేదనుకున్నాడు. బిఎస్పీ పెద్దలను ప్రసన్నం చేసుకొని బిఫామ్‌ తెచ్చుకున్నాడు. అప్పుడు కూడా అటు బిఎస్పీని, ఇటు బిసిలను మభ్యపెడుతూనే వున్నాడు. ప్రచారంలో మోసంచేస్తూనే వున్నాడు. బిసి నాయకులను కలిసే సమయంలో బిసి కండువా కప్పుకుంటున్నాడు. బిఎస్పీ నేతలను కలిసే సమయంలో ఆ పార్టీ కండువా కప్పుకొని ప్రచారం చేయడాన్ని అందరూ గమనిస్తూనే వున్నారు. ప్రసన్న హరికృష్ణకు పట్టభద్రుల్లో పెద్దగా ఆదరణ కనిపించడం లేదు. ఆయనకు సహకరిస్తామని ఎవరూ చెప్పడం లేదు. ఆయన ప్రచారం అంతంత మాత్రంగానే సాగుతోంది. పట్టుమని ఆయన వెంట పది మంది తిరిగే పరిస్ధితి కనిపించడం లేదు. తనకు తానుగా గొప్పగా ఊహించుకొని హరికృష్ణ రంగంలోకి దిగారు. అయితే ఆయన వెనక కోచింగ్‌ సెంటర్లు వున్నాయంటున్నారు. హరికృష్ణకు ఎన్నికల పెట్టుబడి వాళ్లే ఏర్పాటు చేస్తున్నారంటున్నారు. ఎందుకంటే గత ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు రావడం, కోచింగ్‌ సెంటర్లు ఆ నిరుద్యోగుల చేత వాయిదాలు కోరడం, ప్రభుత్వ ం వినకపోతే వారి చేత కోర్టులను ఆశ్రయించడం వంటివి చేస్తుంటారు. అలా ఏళ్ల తరబడి పరీక్షలను వాయిదా వేయిస్తూపోవడం వల్ల నిరుద్యోగులు కోచింగ్‌ సెంటర్లను వదిలివెళ్లిపోరు. కొత్త కొత్త బ్యాచులు ఏర్పాటు చేసుకునేందుకు వీలౌతుంది. అలా కోచింగ్‌ సెంటర్ల వ్యాపారం మూడు పరీక్షలు, ఆరు వాయిదాలుగా నడిచేది. ఆయితే కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చిన తర్వాత కోచింగ్‌ సెంటర్లు చేసే ఈ జిమ్మిక్కులు సాగడం లేదు. కోచింగ్‌ సెంటర్లు కొంత మంది విద్యార్దులను రెచ్చగొట్టి అశోక్‌నగర్‌లో, దిల్‌సుఖ్‌ నగర్‌లో పెద్దఎత్తున ఉద్యమాలు చేసేందుకు కుట్రులు పన్నారు. అయినా ప్రభుత్వం చెప్పిన సమయానికి పరీక్షలు నిర్వహిస్తూ, ఉద్యోగాలు భర్తీ చేస్తోంది. ఇలా జరిగితే కోచింగ్‌ సెంటర్ల అవసరం ఎవరికీ రాదు. దాంతో కోచింగ్‌ సెంటర్లు దివాళా తీసే పరిస్ధితి వస్తుంది. ఇప్పటికే కోచింగ్‌ సెంటర్లు ఊగలుతోలుకునే పరిస్ధితి వచ్చింది. ఈ పరిస్ధితి మారాలంటే మళ్లీ కోచింగ్‌ సెంటర్లు కళకళలాడాలంటే తమకు అనుకూలమైన వ్యక్తిని ఎమ్మెల్సీ చేయాలని పెద్దఎత్తున ఖర్చుపెడుతున్నారు. ప్రసన్న హరికృష్ణనుముందు పెట్టి ఎమ్మెల్సీ ఎన్నికలను ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ప్రసన్న హరికృష్ణ కోచింగ్‌ సెంటర్ల మూలంగానే కోట్లు సంపాదిస్తున్నారు. వారికి మేలు చేయడానికి తప్ప రాష్ట్రంలోని పట్టభద్రులకు న్యాయం చేసేందుకు కాదని హరికృష్ణ వ్యవహారం తేలిపోయింది. అందుకే ఆయన వెంట పట్టభద్రులు ఎవరూ కనిపించడం లేదు. కేవలం కోచింగ్‌ సెంటర్లకు చెందిన వ్యక్తులు మాత్రమే ప్రచారంలో పాలు పంచుకుంటున్నారు. అది కూడా అంతంత మాత్రంగానే సాగుతోంది. ప్రసన్న హరికృష్ణఎంత సాగిలపడినా వృధానే అనే టాక్‌ వినిపిస్తోంది. ఎంత సాగిలపడినా గెలుపు దారిలో ముందుకొచ్చే పరిస్ధితి కనిపించడం లేదు. ఎందుకంటే ఆయన నిరుద్యోగుల విషయంలో గళం విప్పిందిలేదు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణకు చెందిన యువతకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించలేదు. కనీసం ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత ఉద్యోగాల కోసం ఉద్యమాలు చేసింది లేదు. నిరుద్యోగులను రెచ్చగొట్టి పరీక్ష వాయిదా కోసం ప్రయత్నం చేశాడే తప్ప, ఉద్యోగాలు నోటిఫికేషన్‌ కోసం ఏనాడు కృషి చేయలేదు. నిరుద్యోగుల పక్షాన పోరాటంచేసింది లేదు. ఎన్నికలకు ముందే ఇన్ని జెండాలుమార్చిన హరికృష్ణ నిరుద్యోగుల పక్షాన నిలుస్తారని అనుకోవడం అత్యాశే అవుతుంది. ఎన్నికల ముందు అన్ని రాజకీయ పార్టీలను కలిసి టికెట్‌ కోసం ప్రయత్నం చేసిన హరికృష్ణ ఒక వేళ గెలిచినా, తనవ్యక్తిగత రాజకీయ ప్రతిష్ట కోసం పాకులాడుతాడే తప్ప నిరుద్యోగుల గళంకాలేడని అంటున్నారు. ఇంత కాలం కోచింగ్‌ సెంటర్లకోసం తపన పడ్డాడు. కోచింగ్‌ సెంటర్ల యజమానుల డబ్బులతో ఎన్నికల్లో నిలబడ్డాడు. కోచింగ్‌ సెంటర్లలో జరుగుతున్న ఫీజుల దోపిడీని అరికడతాడా? నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకుంటాడు. ప్రభుత్వం నోటిఫికేషన్లు వేసిన ప్రతి సందర్భంలోనూ వాటి వాయిదాల కోసమే హరికృష్ణ ప్రయత్నం చేస్తారు. నిరుద్యోగుల నుంచి కోచింగ్‌ సెంటర్లు సొమ్ముచేసుకునేందుకే ఉపయోగపడతాడు. అని సాక్ష్యాత్తు బిసి సంఘాలు, పట్టభద్రులే అంటున్నారు. ఇంత మంది చెబుతున్న మాటలు వింటున్న జనం హరికృష్ణను ఆదరిస్తారని మాత్రం ఎవరూ అనుకోరు.

’’వంగ’’కు ఎదురుతిరుగుతున్న టీచర్లు?

`బెడిసికొడుతున్న ‘‘వంగ’’ ప్రచారం.

`టీచర్ల ప్రశ్నలకు కంగు తింటున్న ‘‘వంగ’’.

`’’వంగ మహేందర్‌ రెడ్డి’’ మాటలు నమ్మమని వ్యాఖ్యలు.

`’’వంగ’’ ఇన్నేళ్లు చేసిందేమీ లేదు!

`టీచర్ల సమస్యలపై ‘‘వంగ’’ పోరాటం చేయలేదు.

`గత ప్రభుత్వాన్ని ‘‘వంగ’’ నిలదీసింది లేదు.

`సమస్యల సాధనకు ‘‘వంగ’’ కొట్లాడిరది లేదు.

`’’వంగ’’ లీడర్‌ గా ఒరగబెట్టిందేమీ లేదు!

`’’వంగ’’ ఎమ్మెల్సీ అయితే రాజకీయాలు తప్ప మరేమీ చెయ్యలేడు!!

`’’వంగ మహేందర్‌ రెడ్డి’’ పై యూనియన్‌ సభ్యుల గుసగుసలు.

`వ్యక్తిగత ప్రతిష్ఠ కోసం రాజకీయాలు.

`పరపతి పెంపుకోసమే పాకులాటలు.

`317 జీవోను అడ్డుకున్నది లేదు.

`టీచర్లు చెట్టుకొకరు పుట్టకొకరైతే కాపాడిరది లేదు.

`ఆ జీవో రద్దు చేయించలేదు.

`ఆ సమయంలో కేంద్ర మంత్రి ‘‘బండి సంజయ్‌’’ పోరాటం చేశారు.

`కనీసం ‘‘బండి సంజయ్‌’’ కి ఆయనకు మద్దతు పలికింది లేదు.

`టీచర్ల కోసం ‘‘బండి సంజయ్‌’’ దీక్ష చేశారు.

 `యూనియన్‌ తరుపున ‘‘వంగ’’ చేసిన ఉద్యమాలేమీ లేవు.

`టీచర్లకు అండగా నిలిచింది లేదు!

`ట్రాన్స్‌ఫర్ల మీద నోరు విప్పింది లేదు.

`తెలంగాణ కోసం కొట్లాడిన టీచర్లను అడుక్కునే స్థితికి ఎవరు తెచ్చారు?

`జీతాలు నెలనెల రాకున్నా నోరు మూసుకున్నదెవరు?

`టీచర్లకు రావాల్సిన ‘‘జీపిఎఫ్‌’’ నిధులు ఆగిపోతే యూనియన్‌ ఏం చేసింది?

`’’పిఆర్‌సీ’’ సమస్యలు ఎందుకు పరిష్కారం కాలేదు?

`’’రిటైర్డ్‌ టీచర్ల బెన్‌ఫిట్స్‌’’ ఆగిపోతే యూనియన్‌ చేసిందేముంది.

`నోరు మూసుకొని కూర్చున్న యూనియన్‌ లీడర్‌ ‘‘వంగ’’ గెలిస్తే ప్రశ్నిస్తాడా?

`ఏ రకంగా చూసినా ‘‘వంగ’’ సాధించేదేమి వుండదు.

`సంపాదనకు అప్పుడు అడ్డూ అదుపు వుండదు.

`ఇది ‘‘టీచర్ల’’ మనోగతం.

హైదరాబాద్‌,నేటిధాత్రి:

రిత్రలో మొదటి సారి యూనియన్‌ లీడర్‌కు టీచర్లు ఎదురు తిరుగుతున్నారు. ప్రతిసారి యూనియన్‌ పేరు చెప్పుకోవడం ఎమ్మెల్సీలుగా గెలవడం, రాజకీయ పార్టీల కండువాలు కప్పుకోవడం అలవాటైందని నిలదీస్తున్నారు. యూనియన్‌ లీడర్‌ ముదిరి రాజకీయ నాయకుడౌతాడంటే ఇదే నిదర్శనమంటున్నారు. దేశంలో ఏ ఉద్యోగులకు, ఏ యూనియన్లకు లేని అవకాశం ఒక్క టీచర్లకే రాజ్యాంగం ఈ అవకాశం కల్పించింది. దానిని ఉపాద్యాయుల హక్కులు, విద్యా వ్యవస్ధలో నూతన ఆవిష్కరణలకు ఉపయోగపడాల్సిన ఎమ్మెల్సీలు రాజకీయాలను ఎంచుకుంటున్నారు. ఉపాద్యాయుల సమస్యలు గాలికి వదిలేస్తున్నారు. అందుకే ఈసారి యూనియన్‌ పేరు చెప్పుకొని పబ్బం గడుపుకోవాలనుకుంటున్నవారికి ఎన్నుకోమని టీచర్లు ముక్తకంఠంతో చెబుతున్నారు. ముఖ్యంగా కరీంనగర్‌, ఆదిలాబాద్‌, మెదక్‌, నిజామాబాద్‌ ఉపాద్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేస్తున్న యూనియన్‌ లీడర్‌ వంగ మహేందర్‌ రెడ్డికి చుక్కలు చూపిస్తున్నారు. నిన్నటి వరకు మహేందర్‌ రెడ్డికి ఎదురు చెప్పడానికి కూడా ఆలోచించే ఎంతో మంది టీచర్లు ముఖం మీదే టీచర్ల కోసం ఏం చేశావని ప్రశ్నిస్తున్నారు. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. మొదటిసారి టీచర్లు తమ గొంతువిప్పడం వారిలో వచ్చిన చైతన్యానికి నిదర్శనం. ఏకంగా సోషల్‌ మీడియా వేదికగా వంగా మహేందర్‌రెడ్డికి ఎందుకు ఓటేయ్యాలని అంటున్నారు. యూనియన్‌ పేరు చెప్పుకొని వారు బాగు పడడం తప్ప టీచర్లకు జరిగిన న్యాయం ఏదీ లేదంటున్నారు. అనాదిగా ఏం జరుగుతుందో మహేందర్‌రెడ్డిని ఎన్నుకుంటే అదే జరుగుతుందని కూడా తేల్చి చెబుతున్నారు. ఇప్పుడు అలాంటి ఆనవాయితీని కొనసాగించమంటున్నారు. సమాజానికి చైతన్యం నింపే ఉపాద్యాయులే ప్రశ్నించకపోతే, సమాజ చైతన్యం ఎలా వెల్లివిరుస్తుందంటున్నారు. యూనియన్‌ ముసుగేసుకొని రాజకీయాలు చేయాలనుకుంటున్నవారికి ఈ ఎన్నికలు ఒక చెంప పెట్టు కావాలని కోరుకుంటున్నట్లు కూడా టీచర్లు చెబుతున్నారు. ఏ సోషల్‌ మీడియా చూసినా ఇవే వార్తలు వుంటున్నాయి. ఎక్కడికక్కడ టీచర్లు తమ గొంతు సవరించుకుంటున్నారు. యూనియన్‌ అనేది సమస్యల పరిష్కారం కోసం, ఉపాద్యాయుల మద్దత కోసం, వారి ప్రయోజనాల కోసం…కాని యూనియన్ల వల్ల ఒరిగిందేమీ లేదంటున్నారు. ముఖ్యంగా వంగా మహేందర్‌ మూలంగా ఇప్పటి వరకు జరిగిన మేలు కూడా ఏదీ లేదంటున్నారు. ఇలా ఒక్కసారిగా టీచర్లు ఎదురు తిరుగుతారని కూడా మహేందర్‌ రెడ్డి ఊహించలేదు. గత రెండేళ్లుగా ఉద్యోగాన్ని వదులకొని ఊరూరు తిరుగుతూ ప్రచారం సాగిస్తున్నారు. కాని ఆఖరుకు ఈ పరిస్టితి వస్తుందని అనుకోలేదు. ఆయన ఉద్యోగం పూర్తిగా మానేయలేదు. కేవలం వాలెంటరీ రిటైర్‌ మెంటు తీసుకున్నారు. అంతే…ఈ ఎన్నికల్లో గెలిస్తే ఎమ్మెల్సీ అవుతాడు. లేకుంటే మళ్లీ తన ఉద్యోగాన్ని ఎలాగో తెచ్చుకొని కొలువు చేసుకుంటాడు. మళ్లీ యూనియన్‌ లీడర్‌గా తన పెత్తనం ఎలాగూ సాగిస్తాడు. అలాంటప్పుడు ఆయన వల్ల ఒనగూరేదేమీ వుండడు. ఈ మధ్య మహేందర్‌ రెడ్డి ఎక్కడికెళ్లినా ఇలాంటి ప్రశ్నలు ముఖం మీదే అడుగుతున్నారట. దాంతో ఆయన ఖంగు తింటున్నారు. ప్రచారానికి వెళ్లాలంటే కూడా భయపడుతున్నాడట. టీచర్లను ఒక చోటకు పిలవాలంటే కూడా ముందు వెనుక ఆలోచిస్తున్నాడట. టీచర్లు ఒక్కసారిగా ఇలాఎందుకు ఎదురు తిరిగే పరిస్టితి వచ్చిందని ఆలోచించుకుంటూ తల పట్టుకుంటున్నాట. మహేందర్‌ రెడ్డి నీ మాటలు మేం నమ్మం అంటూ ముఖం మీదే చెబుతుంటే సమాదానం చెప్పలేక దండం పెడుతూ వెనుతిరుగుతున్నారట. ఒక్కసారిగా టీచర్లలో ఇలాంటి చైతన్యం చూసి ఆయన విస్తుపోతున్నాడు. ఎమ్మెల్సీ పదవి దేవుడెరుగు ఎన్నికలు అయిపోయిన తర్వాత కనీసం తనను యూనియన్‌ లీడర్‌గానైనా అంగీకరిస్తారా? లేదా? అన్న డైలమాలో పడుతున్నారట. ఎందుకంటే ఎప్పుడో రెండేళ్ల క్రితమే రాజీనామా చేసిన ఉపాద్యాయుడు యూనియన్‌లో సభ్యుడుగా వుండడమే సరైంది కాదు. అలాంటిది యూనియన్‌ లీడర్‌గా ఎలా చెలామణి అవుతాడంటూ కూడా నిలదీస్తున్నారట. అయినా మహేందర్‌ రెడ్డి టీచర్ల సమస్యల కోసం పోరాటం సాగించి, ఉద్యోగానికి రాజీనామా చేయలేదు. టీచర్ల సమస్యలు పరిష్కరింకపోవడంతో నిరసనగా మహేందర్‌ రెడ్డి రాజీనామా చేసి పోరాటం చేయడంలేదు. టీచర్ల హక్కుల పోరాటం కోసం ఆయన రాజీనామా చేసి ఎన్నికల్లోకి వెళ్లడం లేదంటూ టీచర్లు సెటైర్లు వేస్తున్నారు. కేవలం తన వ్యక్తిగత ప్రయోజనం తప్ప ఇందులో టీచర్ల కోసం ఏముందంటూ చెబుతున్నారు. తమ అభిప్రాయం ఏమిటో కూడా తెలుసుకోకుండా ఏక పక్షంగా వారికి వారే నిర్ణయాలు తీసుకుంటే యూనియన్‌లో ప్రజాస్వామ్యమెక్కడుంది. మా మాటలకు విలువేముందని టీచర్లు ప్రశ్నిస్తున్నారు. హక్కుల గురించి రేపటి తరానికి పాఠాలు చెప్పే టీచర్ల అభిప్రాయానికే విలువలేకుండా చేస్తున్న యూనియన్ల మూలంగా మా గొంతులు నొక్కబడుతున్నాయంటున్నారు. గత ప్రభుత్వం కొత్త జిల్లాలను తెచ్చి, టీచర్ల జీవితాలు ఆగం చేసింది. జీవో.నెం.317 తెచ్చి టీచర్లను చెట్టుకొకరు, పుట్టకొకరును చేసింది. అప్పుడు యూనియన్‌ ఏం చేసింది? ఎందుకు ప్రభుత్వాన్ని నిలదీయలేదు. జీవో తప్పని ఎందుకు నినదించలేదు. తూతూ మంత్రంగా చెప్పడం కాదు..గతంలో టీచర్ల మాటంటే ప్రభుత్వాలు గౌరవించేవి. టీచర్లు ఉద్యమ బాట పడుతున్నారంటే భయపడేవి. కాని యూనియన్లు ప్రభుత్వాలకు తొత్తులుగా మారిపోయిన తర్వాత అసలు ప్రశ్నించడమే మర్చిపోయారు. హక్కుల సాధనకు కొట్లాటే మానుకున్నారు. అందుకే 317 జీవో అమలైంది. ఆ సమయంలో యూనియన్‌ నిక్కచ్చిగా వ్యతిరేకిస్తే అమలుజరిగేదా? అంటూ టీచర్లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు కూడా ఆ జీవోపై ప్రభుత్వం నోరు మెదపడం లేదు. ఎన్నికల ముందు జీవోను సవరిస్తామని చెప్పి,దానిపై ప్రభుత్వం స్పందించడం లేదు. అయినా యూనియన్‌ ఏం చేస్తోంది? నిజం చెప్పాలంటే 317 జీవో రద్దు కోసం రాజకీయ పార్టీలు ప్రయత్నం చేశాయి. ముఖ్యంగా బిజేపి అధ్యక్షుడుగా ఆ సమయంలో వున్న కేంద్ర మంత్రి బండి సంజయ్‌ పోరాటం చేశారు. ఈ జీవో విషయంలో అరెస్టుయ్యారు. కాని యూనియన్‌ మాత్రం నోరు మెదపలేదంటూ టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ కోసం అటు విధులు నిర్వర్తిస్తూనే ఉద్యమాలు చేసిన చరిత్ర టీచర్లది. విద్యార్థుల జీవితాలు ఆగం కాకుండా వారికి పాఠాలు బోదిస్తూనే, మరో వైపు ఉద్యమానికి ఊపిరి పోసిన వారిలో టీచర్లున్నారు. అలాంటి టీచర్లు జీతమెప్పుడు వస్తుందా? అని ఎదురు చూసే రోజులు వస్తే కూడా యూనియన్‌ ప్రశ్నించింది లేదు. టీచర్లు అడుక్కుతినే పరిస్ధితి వస్తుంటే గుడ్లప్పగించి చూసిన యూనియన్‌ వల్ల ఒరిగిందేమీ లేదంటున్నారు. జీతాలు సకాలంలో రాకున్నా నోరు మూసుకున్నారు. టీచర్లకు రావాల్సిన జిపిఎఫ్‌ నిధుల ఆగిపోయినా, అడిగే నాధుడు లేదు. అయినా ఒకటీచర్‌దాచుకున్న సొమ్ముకూడా తీసుకోలేని స్దితిలో వున్నారంటే పరిస్దితి ఎలా వుందో అర్దం చేసుకోవచ్చు. పిఆర్‌సీ సమస్యలు ఎందుకు పరిష్కారం కావడం లేదంటూ టీచర్లు వంగాన నిలదీస్తున్నారు. కొన్ని వేల మంది రిటైర్డ్‌ టీచర్స్‌ బెన్‌ఫిట్స్‌ అగిపోతే యూనియన్‌ ఎందుకు స్పందించడం లేదంటూ ప్రశ్నిస్తున్నారు. ఇలా రకరకాల ప్రశ్నలతో మహేందర్‌రెడ్డిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు. నాలుగు డిఏలు పెండిరగ్‌లో వున్నా ఇప్పటి వరకు యూనియన్‌ నోరు మెదపడం లేదంటున్నారు. యూనియన్‌ లీడర్‌గా వున్నప్పుడే నోరు మెదపని మహేందర్‌ రెడ్డి రేపు ఎమ్మెల్సీ అయిన తర్వాత సమస్యలపై మాట్లాడతాడంటే నమ్మలేమని తేల్చి చెబుతున్నారు. ఇంత కాలం గొప్పగా నాయకుడిని అని చెప్పుకుంటున్న మహేందర్‌రెడ్డి చేసిన ఉద్యమాలు ఏమీ లేవంటున్నారు. పెద్దగా పోరాటాలు చేసి సాదించిన హక్కులేమీ లేదు. గుంపులో గోవిందయ్యే తప్ప ఉపాద్యాయ సమస్యల మీద సదస్సులు పెట్టిన నాయకుడు కాదు. టీచర్ల సమస్యలను ప్రభుత్వం దృష్టికి వెళ్లి కొట్లాడిన సందార్భాలేమీ లేవు. అందుకే ఈ ఎన్నికల్లో ఈసారి యూనియన్‌ నాయకులకు కాకుండా ప్రశ్నించే గొంతులు ఎవరుంటే వారిని ఎంచుకుంటామంటున్నారు.

తిరుపతిలో ముగిసిన అంతర్జాతీయ దేవాలయాల సదస్సు

ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, గోవా ముఖ్యమంత్రులు హాజరు

ఆకట్టుకున్న తమిళనాడు బీజేపీ అధ్యక్షులు అన్నామలై ప్రసంగం

ప్రపంచ వ్యాప్తంగా హిందూ, బౌద్ధ, సిక్కు, జైన ప్రార్థనా స్థలాల అనుసంధానతే లక్ష్యం

ప్రపచంలో దేవాలయాల ఆర్థిక వ్యవస్థ విలువ రూ.6లక్షల కోట్లు

భారత్‌లో పెరుగుతున్న దేవాలయ పర్యాటకం

కోవిడ్‌ తర్వాత పెరుగుతున్న తీర్థయాత్రికులు

ఈ నేపథ్యంలోనే హిందూ దేవాలయాల అనుసంధానతకు ప్రాధాన్యం

దేవాలయాలకు గుదిబండగా మారిన ప్రభుత్వ నియంత్రణ

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ప్రపంచ వ్యాప్తంగా దేవాలయాల మధ్య అనుసంధానతను మరింత బలోపేతం చేసే ఉద్దేశంతో ‘ఇంటర్నేషనల్‌ టెంపుల్స్‌ కన్వెన్షన్‌ Ê ఎక్స్‌పో`2025’ను (ఐ.టి.సి.ఎక్స్‌`2025) ఫిబ్రవరి 17 నుంచి 19వ తేదీవరకు ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన తిరుపతిలోని ఆశా కన్వెన్షన్‌లో జరిగింది. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్‌, గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌, తమిళనాడు బీజేపీ అధ్యక్షులు అన్నామలై, గోవా మంత్రులు, పార్లమెంట్‌ సభ్యుల వంటి ప్రముఖులు హజరై ప్రసంగించడం విశేషం. 2023లో తొలి సదస్సు వారణాసిలో జరగ్గా రెండవ సదస్సును తిరుపతిలో నిర్వహించారు. ఇందులో 17 దేశాలకు చెందిన 1581 దేవాలయాల ప్రతినిధులు, మరో 58 దేశాలనుంచి 685దేవాలయాల ప్రతినిధులు ఈ సదస్సుకు హాజరయ్యారు. ఈ మూడు రోజుల కార్యక్రమంలో 111మంది వక్తలు తమ విలువైన సందేశాలనివ్వగా, 15 వర్క్‌షాప్‌లు, 60కంటే ఎ క్కువ ప్రదర్శన శాలలను నిర్వహించారు. దేవాలయాల వారసత్వాన్ని పరిరక్షించడం, వాటి పరి పాలన, ఆలయాల నిర్వహణలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగం వంటి అంశాలు ఈ సందర్భంగా చర్చకు వచ్చాయి. ఈ ఎక్స్‌పోను ‘టెంపుల్‌ కనెక్ట్‌’, అంత్యోదయ ప్రతిష్టాన్‌ సహకారంతో నిర్వహించారు. హిందూ, బౌద్ధ, జైన, సిక్కు ప్రార్థనా స్థలాలను ఒకేతాటి కిందికి తీసుకొనిరావడం దీని ప్రధాన లక్ష్యం. 

ఆలయాల సమాచారం డిజిటలీకరణ

 ‘టెంపుల్స్‌ కనెక్ట్‌’ వ్యవస్థాపకులు గిరీష్‌ కులకర్ణి మరియు ఇంటర్నేషనల్‌ టెంపుల్‌ కన్వెన్షన్‌ అండ్‌ ఎక్స్‌పో ఛైర్మన్‌, మహారాష్ట్ర శాసన మండలి ఛీఫ్‌ విప్‌ ప్రసాద్‌ లాడ్‌లు ‘మహాకుంభ్‌ ఆఫ్‌ టెంపుల్స్‌’గా వ్యవహరించే ఐ.టి.సి.ఎక్స్‌ను ఏర్పాటు చేశారు. భారతీయ మూలాలున్న దేవాలయాలకు సంబంధించిన పూర్తి సమాచారాన్ని సేకరించి డిజిటల్‌ రూపంలో భద్రపరచడం ప్రధాన ల క్ష్యంగా టెంపుల్‌ కనెక్ట్‌ సంస్థ పనిచేస్తుంది. దేవాలయాల ఆర్థిక వ్యవస్థను మరింత విస్తరించడం కూడా ఐ.టి.సి.ఎక్స్‌. ప్రధాన ఉద్దేశం. దేవాలయ పర్యాటకాన్ని, నిర్వహణను ప్రోత్సహించడానికి కూడా ఇది కృషిచేస్తుంది. 

మతపరమైన లేదా ధార్మిక అవస్థల పరిధికి ఆవల దేవాలయాల నిర్వహణలో మరింత పురోగతి సాధించేందుకు విధానకర్తలు, దేవాలయాల నాయకులు, పారిశ్రామిక నిపుణుల సమన్వయం కోసం ఐ.టి.సి.ఎక్స్‌`2025 ప్రధానంగా కృషిచేసింది. నిధుల నిర్వహణ, రద్దీ నియంత్రణ, భద్రత వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై కూడా ఈ ఎక్స్‌పో దృష్టి కేంద్రీకరించింది. కేంద్ర పర్యాటకమంత్రిత్వశాఖ ఐ.టి.సి.ఎక్స్‌`2025 ఎక్స్‌పోకు మద్దతునిచ్చింది. మహారాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ కూడా దీనికి సహాయ సహకారాలను అందజేసింది. అంతేకాదు భారత పురావస్తు పరిశో ధనా సంస్థ, ఆంధ్రప్రదేశ్‌, కేరళ, కర్ణాటకకు చెందిన టూరిజం అండ్‌ ఎండోమెంట్స్‌ బోర్డులు కూడా ఈ సదస్సుకు సంపూర్ణ మద్దతును అందజేశాయి. కానీ టెంపుల్‌ స్టేట్‌గా పేరుపొందిన తమిళనాడునుంచి సహకారం అందలేదు. కాగా ఈ సదస్సు సందర్భంగా ‘స్మార్ట్‌ టెంపుల్స్‌ మిషన్‌’ను ప్రారంభించడమే కాకుండా, ‘స్మార్ట్‌ టెంపుల్స్‌ అవార్డు’లను కూడా ప్రదానం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేక లక్షణాలతో అలరారుతున్న 12 దేవాలయాలకు ఈ అవా ర్డులను ప్రదానం చేశారు.

యు.కె.లోని జైన ధర్మశాలలు, ప్రముఖ డివోషనల్‌ చారిటీస్‌, హిందూ దేవాలయాల సంఘాల ప్రతినిధులు, అన్నక్షేత్ర మేనేజ్‌మెంట్లు, వివిధ పుణ్యక్షేత్రాలకు చెందిన పురోహిత్‌ మహాసంఘా లు, తీర్థయాత్రలను ప్రోత్సహించే బోర్డులకు చెందిన సభ్యులు కూడా ఈ సదస్సుల్లో పాల్గన్నారు. ఇస్కాన్‌, శ్రీమందిర్‌, దుర్లభ్‌ దర్శన్‌, సరస్వత్‌ ఛాంబర్‌, క్రిస్టల్‌ ఇంటిగ్రేటెడ్‌ సర్వీసెస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌, ఒ.ఎన్‌.డి.సి, హల్దీరామ్‌ వంటి సంస్థలు ఐ.టి.సి.ఎక్స్‌`2025కు స్పాన్సరర్లుగా వ్యవహ రించాయి. 

ప్రపంచ వ్యాప్తంగా 32 లక్షల దేవాలయాలు

ప్రపంచ వ్యాప్తంగా 32లక్షల దేవాలయాలు, ప్రధానంగా భారత్‌కు చెందిన ఆలయాలను ఒకే వేదిక కిందికి తీసుకొని రావడం ఐ.టి.సి.ఎక్స్‌`2025 ప్రధాన లక్ష్యం. ఈ దేవాలయాల మొత్తం ఆర్థిక వ్యవస్థ రూ.6లక్షల కోట్లు! ఇప్పుడు వీటన్నింటినీ ఒకే నెట్‌వర్క్‌ కిందికి తెచ్చే యత్నాలు జరుగుతున్నాయి. ఆవిధంగా వీటన్నింటినీ ప్రజలకు పారదర్శకమైన రీతిలో అందుబాటులోకి తేవడం కూడా దీని ప్రధాన ఉద్దేశం. ఐ.టి.సి.ఎక్స్‌ ఇప్పటికే ప్రపంచంలోని 12వేల దేవాలయాలతో అనుసంధానత ఏర్పరచుకోగలిగింది. కోవిడ్‌ మహమ్మారి తర్వాత దేవాలయాల సందర్భన బా గా పెరిగింది. ఉదాహరణకు కోవిడ్‌కు ముందు వైష్ణోదేవి ఆలయానికి రోజుకు 10 నుంచి 15వే లమంది భక్తులు సందర్శించేవారు. కానీ కోవిడ్‌ తర్వాత వీరి సంఖ్య 32వేలు`40వేల మధ్య వుంటోంది. పంజాబ్‌లోని స్వర్ణ దేవాలయాన్ని ఇప్పుడు రోజుకు లక్షమంది సందర్శిస్తున్నారు. ఇది కూడా కోవిడ్‌కు పూర్వం కంటే చాలా ఎక్కువ. కేరళలో ప్రఖ్యాత గురువాయూర్‌ దేవాలయన్ని కోవిడ్‌కు ముందు రోజుకు 4వేలమంది దర్శిస్తే ఇప్పుడు వారి సంఖ్య 6 నుంచి 7వేలకు పెరి గింది. ప్రస్తుతం భారత్‌లో పర్యాటక పరిశ్రమ ద్వారా 80 మిలియన్ల మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. ఎందుకంటే ఏటా పర్యాటకుల సంఖ్య 19శాతం చొప్పున పెరుగుతోంది. అదేవిధంగా ప్రపంచ వ్యాప్తంగా మతపరమైన పర్యాటక మార్కెట్‌ 2032 నాటికి ఏకంగా 2.22బిలియన్‌ యు.ఎస్‌. డాలర్లకు చేరుతుందని కేపీఎంజీ సంస్థ అంచనా వేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ పర్యాటకం ఏటా సగటున 6.25% వృద్ధిని నమోదు చేస్తోంది. 

చంద్రబాబు ప్రసంగం

ఈ ఎక్స్‌పోలో పాల్గన్న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృత్రిమ మేధ, బ్లాక్‌ ఛైన్‌, సుస్థిర ఇంధన పరిష్కారాల ద్వారా దేవాలయాల నిర్వహణను మరింత ఆధునీకరించాల్సిన అవసరం వుందన్నారు. ఆధ్యాత్మిక, ఆర్థిక కేంద్రాలుగా వున్న దేవాలయాలను సృజనాత్మక రీతి లో నిర్వహించాలన్నారు. ఫలితంగా వీటి సాంస్కృతిక ప్రభావశీలత బలీయంగా వుండగలదన్నా రు. ఇదే సమయంలో తిరుపతి ఆధ్యాత్మిక వారసత్వ ప్రాశస్త్యాన్ని అనుభవంలోకి తెచ్చుకోవాలని ప్రపంచ ప్రతినిధులను కోరారు. 

హెచ్‌ఆర్‌ Ê సి.ఇ. చట్టం వల్ల అనర్థాలు

రెండో రోజు ఐ.టి.సి.ఎక్స్‌ా2025లో తమిళనాడు బీజేపీ అధ్యక్షులు అన్నామలై ప్రసంగిస్తూ త మిళనాడులో ప్రస్తుతం అమల్లో వున్న ‘హిందూ రిలిజియస్‌ అండ్‌ ఛారిటబుల్‌ ఎండోమెంట్‌ యాక్ట్‌ (హెచ్‌ఆర్‌Ê సి.ఇ.)’ వల్ల కలుగుతున్న అనర్థాలను ఆకట్టుకునే రీతిలో వివరించారు. ఈ చట్టాన్ని ఎత్తేయాలని, హిందూ దేవాలయాలపై ప్రభుత్వాల నియంత్రణ వుండకూడదని కోరారు. తిరుమల తిరుపతి దేవస్థానం మార్కెట్‌ విలువ రూ.2.5లక్షలకోట్లని పేర్కొంటూ, ప్రపంచంలోని చాలా ప్రముఖ సంస్థలకంటే ఇదెంతో విలువైందన్న సంగతిని గుర్తుచేశారు. తమిళనాడులో అమల్లో ఉన్న హెచ్‌ఆర్‌Ê సి.ఇ. చట్టం హిందూ దేవాలయాల ఆర్థిక పురోభివృద్ధికి గుదిబండలా మారిందని పేర్కొన్నారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఈ చట్టాన్ని ఎత్తేస్తామని స్పష్టం చేశారు. వెంకటేశ్వరస్వామి దయవల్ల తాము తమిళనాడు పగ్గాలు చేపడితే రాష్ట్రంలోని 44121 దేవాల యాలకు స్వేచ్ఛను ప్రసాదిస్తామన్నారు. దేవాలయాల ఆర్థిక వ్యవస్థ, తమ చుట్టుపక్కల ప్రదేశా ల్లోని స్కూళ్ల నిర్వహణ, పౌర మౌలిక సదుపాయాల కల్పన, సెంటర్స్‌ ఫర్‌ ఎక్స్‌లెన్స్‌ ఫర్‌ సైన్స్‌ వంటి కేంద్రాల నిర్వహణలో ఎంతో ఉపయోగపడుతున్న సంగతిని గుర్తుచేశారు. తమిళనాడులో ఆలయాల ఆర్థిక వ్యవస్థ నిర్వహణను ప్రభుత్వాలు దుర్వినియోగం చేస్తున్నా ఇంతటి సామాజిక సేవను చేస్తున్న దేవాలయ వ్యవస్థను మరింత పటిష్టం చేయాల్సిన అవసరం వుందన్నారు. చోళ రాజులు ఎంత చక్కగా దేవాలయాలను నిర్వహించిందీ ఆయన వివరించారు. ఈ దేవాలయాలు కేవలం ధార్మిక కేంద్రాలు మాత్రమే కాదు, ధనిక, పేద వర్గాలను ఒక్కచోటుకు చేర్చే ప్రదేశాల న్న సంగతిని ఆయన గుర్తుచేశారు. భారత్‌ను ఒకే తాటిపై నిలుపుతున్నది దేవాలయాలు మాత్ర మే. ఈ నేపథ్యంలో ఆధ్యాత్మిక సుగంధాన్ని పునరుద్ధరించడం సనాతనధర్మంలో భాగమేనన్నారు.తొలి సదస్సు వారణాసిలో

 ఇంటర్నేషనల్‌ టెంపుల్‌ కన్వెన్షన్‌ అండ్‌ ఎక్స్‌పో (ఐ.టి.సి.ఎక్స్‌ా2023) 2023 జులై 22 నుంచి 24వ తేదీ వరకు వారణాసిలో జరిగింది. ఆర్‌.ఎస్‌.ఎస్‌. సర్‌సంఫ్‌ుచాలక్‌ మోహన్‌ భాగవత్‌ దీన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అప్పటి టీటీడీ ఇ.ఒ. ధర్మారెడ్డి కూడా పాల్గన్నారు. మొత్తం 25 దేశాలనుంచి 450కి పైగా దేవాలయాలకు చెందిన ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గన్నారు. వీరిలో హిందూ, బౌద్ధ, జైన, సిక్కు ప్రార్థనా స్థలాకు చెందిన వారుండటం విశేషం. వారణాసిలోని రుద్రాక్ష కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా ప్రార్థనా స్థలాల్లో ఉత్తమ ప్రార్థనా రీతులను ప్రవేశపెట్టడం ప్రధానలక్ష్యమని టెంపుల్‌ కనెక్ట్‌ వ్యవస్థాపకులు గిరీష్‌ కుల కర్ణి, ఐటీసీఎక్స్‌ ఛైర్మన్‌ ప్రసాద్‌ లాడ్‌లు ఈ సదస్సులో స్పష్టం చేశారు. టెంపుల్‌ కనెక్ట్‌ను గిరీష్‌ కులకర్ణి 2016లో స్థాపించారు.

ఆపరేషన్‌ బెంగాల్‌ మొదలు?

ఢల్లీి, హర్యానా, మహారాష్ట్ర ఎన్నికల విజయంతో బీజేపీలో జోష్‌

రంగంలోకి దిగిన ఆర్‌ఎస్‌ఎస్‌

ఎన్నికలకు ఏడాదిముందే వ్యూహాత్మక అడుగులు

తృణమూల్‌ సాంస్కృతిక మూలాలపై విమర్శలు

హిందువులను ఏకీకృతం చేసేందుకు యత్నాలు

తృణమూల్‌ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత

ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచిన ఆర్జీకర్‌ ఆసుపత్రి సంఘటన 

హిందువులపై వివక్షను హైలైట్‌ చేస్తున్న బీజేపీ

శాఖలు పెంచుకోవడం ద్వారా క్షేత్రస్థాయిలో విస్తరణకు ఆర్‌ఎస్‌ఎస్‌ యత్నాలు

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

ఢల్లీి అసెంబ్లీ ఎన్నికలు, ఛత్తీస్‌గఢ్‌, గుజరాత్‌ల్లో జరిగిన స్థానిక ఎన్నికల్లో సాధించిన విజయాల తో కమలనాథుల్లో సమరోత్సాహం పెల్లుబుకుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు ‘ఆపరేషన్‌ బెంగాల్‌’ను బీజేపీ మొదలుపెట్టిందా అన్న అనుమానాలను లేవనెత్తుతున్నాయి. ముఖ్యంగా కొరకరాని కొయ్యగా ఉన్న పశ్చిమ బెంగాల్‌లో పాగా వేయాలన్నది వారి ప్రస్తుత లక్ష్యం. 2019 లోక్‌సభ ఎన్నికల్లో భాజపా, పశ్చిమ బెంగాల్‌లో 18 లోక్‌సభ స్థానాల్లో విజయం సాధించగా, ఆ ఉత్సాహంతో పార్టీ కార్యకర్తలు చేసిన విస్తృత ఫలితాలనిచ్చి 2021 అ సెంబ్లీ ఎన్నికల్లో 77 సీట్లలో గెలుపు సాధించడానికి దోహదం చేసింది. ఒకప్పుడు మమతా బెనర్జీకు కుడిభుజంగా వ్యవహరించిన సుబేందు అధికారి, నందిగ్రామ్‌లో మమతా బెనర్జీని ఓడిరచి ఈ ప్రాంతంలో తన బలమేంటో నిరూపించారు. ప్రస్తుతం భాజపా పశ్చిమ బెంగాల్‌లో గెలుపు సాధనకోసం ఇప్పటినుంచే ప్రయత్నాలు ప్రారంభించింది. ముఖ్యంగా కాంగ్రెస్‌, కమ్యూనిస్టులు ఇప్పుడు పూర్తిగా ఉనికిని కోల్పోయిన నేపథ్యంలో, మమత ప్రభుత్వంలో నెలకొన్న అవినీతి, అరాచక పాలనను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలన్న యోచనలో వ్యూహాత్మకంగా ముందుకు సాగు తోంది. గత ఎన్నికల్లో వివిధ రాష్ట్రాల్లో బీజేపీ విజయానికి క్షేత్రస్థాయిలో ఆర్‌ఎస్‌ఎస్‌ గణనీయంగా కృషిచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్‌ఎస్‌ఎస్‌ ఇప్పుడు తన శాఖలను మరింత విస్తరించుకొని, బీజేపీ బలహీనంగా వున్న ప్రాంతాల్లో పార్టీకి గట్టి ఓటు బ్యాంకు ఏర్పాటుచేసేందుకు తనవంతు కృషిని మొదలుపెట్టింది.

ఢల్లీి ఎన్నికల్లో విజయం సాధించడంతో, పశ్చిమబెంగాల్‌ బీజేపీ శాఖలో జోష్‌ కనిపిస్తోంది. అవినీతి, ఆశ్రిత పక్షపాతం వంటి కారణాలవల్ల ఆప్‌ అధికారాన్ని కోల్పోయిందని బీజేపీ రాష్ట్ర నేతలుఒకపక్క విమర్శిస్తుంటే, ఆప్‌కు మద్దతిచ్చిన తృణమూల్‌ కాంగ్రెస్‌ మౌనంగా వుండటం గమనా ర్హం. ఢల్లీి ఎన్నికలు పశ్చిమ బెంగాల్‌లో తమ పార్టీ గెలుపునకు ఉత్తేజాన్నిస్తాయని బీజేపీ నాయకులు విశ్వసిస్తున్నారు. అయితే 2021 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 294 స్థానాల్లో 213 సీట్లను కైవసం చేసుకొని తృణమూల్‌ కాంగ్రెస్‌ తన కోట ఎంత పటిష్టంగా వున్నదీ తెలియజెప్పింది. ఇక కుంభమేళాను ‘మృత్యు కుంభ్‌’ అంటూ మమతా బెనర్జీ చేసిన తాజా వ్యాఖ్యలతో రాష్ట్ర బీజేపీ నేతలు ఒక్కసారి భగ్గుమన్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన మమతా బెనర్జీపై కఠిన చర్యలు తీసుకోవాలని, బీజేపీ నాయకులు సుబేందు అధికారి నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు గవర్నర్‌ను కలిసి ఒక వినతిపత్రాన్ని సమర్పించడం తాజా పరిణామం. ఇదిలావుండగా పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర అసెంబ్లీలో బడ్జెట్‌ సమావేశం సందర్భంగా జరిగిన గందరగోళంలో బీజేపీ నాయకు డు, విపక్షనేత సుబేందు అధికారితో సహా నలుగురు బీజేపీ ఎమ్మెల్యేలను 30రోజుల పాటు స్పీ కర్‌ సస్పెండ్‌ చేశారు. వరుస పరిణామాలను పరిశీలిస్తే బీజేపీ నాయకులు తృణమూల్‌ కాంగ్రెస్‌ పై తమ దాడులను క్రమంగా తీవ్రం చేస్తున్నారన్న అంశం స్పష్టమవుతోంది. తృణమూల్‌ సాం స్కృతిక, మతపరమైన మూలాల నేపథ్యంలో భాజపా నాయకులు హిందువుల హక్కులను పరిర క్షించేది తమ పార్టీమాత్రమేనన్న అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. ముఖ్యంగా వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో, రాష్ట్ర బీజేపీ నాయకత్వం మరింత చురుగ్గా తృణమూల్‌పై విమర్శల దాడులను ముమ్మరం చేస్తారని తాజా పరిణామాలు స్ప ష్టం చేస్తున్నాయి.  

ఇటీవల హిందువులు నిర్వహించే సరస్వతీ పూజపై తృణమూల్‌ ప్రభుత్వం ఆంక్షలు విధించడం తో, హిందువులపట్ల ప్రభుత్వం వివక్షాపూరితంగా వ్యవహరిస్తోందంటూ బీజేపీ నేతలు విపరీతం గా ప్రచారం చేశారు. హిందువులపై జరుగుతున్న దాడులు, వీరికి వ్యతిరేకంగా నెరపే రాజకీ యాలను ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేస్తూ ఏడాది కాలంలో తృణమూల్‌ను బలమైన ఓటు బ్యాంకును దెబ్బతీయాలన్న లక్ష్యంతో రాష్ట్ర నాయకత్వం ముందుకెళుతోంది. తృణమూల్‌ కాంగ్రెస్‌ కూడా బీజేపీ రాజకీయాలను ఎదుర్కొనేందుకు తమది ‘సెక్యులర్‌’ ప్రభుత్వమని ప్రచారం చే స్తోంది. శాంతిభద్రతల విషయంలో మతం పేరుతో చూసీ చూడనట్టు వుండలేమని స్పష్టం చే స్తోంది.

రంగంలోకి ఆర్‌ఎస్‌ఎస్‌

మహారాష్ట్ర, హర్యానా, ఢల్లీి ఎన్నికల్లో భాజపా విజయం సాధించడంలో కీలకపాత్ర పోషించిన రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఫ్‌ు ఇప్పుడు పశ్చిమ బెంగాల్‌పై తన దృష్టిని కేంద్రీకరించిందన్నది స్పష్టమవుతోంది. ముఖ్యంగా సంస్థ అధినేత మోహన్‌ భాగవత్‌ ఫిబ్రవరి 15వ తేదీన పశ్చిమ బెంగాల్‌లోని బర్ధమాన్‌ పట్టణంలోని తాలిత్‌ రాయ్‌ కాంప్లెక్స్‌లో జరిగిన సంస్థ కార్యకర్తల సమావేశంలో ప్రసంగిస్తూ, ఆర్‌ఎస్‌ ఎస్‌లో సభ్యులుగా చేరాలంటూ కొత్తవారికి పిలుపునివ్వడం రాష్ట్రంలో సంస్థను మరింత విస్తరించడం ద్వారా హిందువులను మరింత సుసంఘటితం చేయాలన్న ఉద్దే శం స్పష్టమవుతోంది. ‘బయట వుండి మమ్మల్ని పరిశీలిస్తే మీలో తప్పుడు అభిప్రాయం ఏర్పడవచ్చు. అందువల్ల సంస్థలో చేరండి. ఫీజు చెల్లించాల్సిన పనిలేదు. ఇక్కడి కార్యకలాపాలను పరిశీలించి నచ్చితే కొనసాగండి లేకపోతే వెళ్లిపోవచ్చు’ అంటూ ఆయన పిలుపునిచ్చారు. ఆర్‌ఎస్‌ఎస్‌ను అర్థం చేసుకోవాలంటే కొంత సమయం పడుతుంది. హిందూ సమాజంలో ఆత్మీయతను పెంపొందించడం, వారిని ఏకతాలిపై నడపడమే ఆర్‌.ఎస్‌.ఎస్‌. ప్రధాన లక్ష్యమని ఆయన అ న్నారు. బయటనుంచి అభిప్రాయాలు ఏర్పరచుకునేదానికంటే సంస్థతో సాన్నిహిత్యాన్ని పెంచు కోండి. అప్పుడు మీకు సంస్థ అంటే ఏంటో అర్థమవుతుందన్నారు. ఇప్పటికే పశ్చిమ బెంగాల్‌లో 70వేల ఆర్‌ఎస్‌ఎస్‌ శాఖలు పనిచేస్తున్నాయి. ముఖ్యంగా సంస్థ బలహీనంగా వున్న ప్రాంతాల్లో శాఖలను నెలకొల్పడం ద్వారా ప్రజల్లోకి మరింతంగా విస్తరించాలన్న అభిప్రాయం ఆయన మాటల్లో వ్యక్తమైంది. అంతేకాదు ఈసారి ఆయన పది రోజుల పర్యటన వ్యూహాత్మకంగా సాగింద నుకోవాలి. ఎందుకంటే 2026లో పశ్చిమ బెంగాల్‌ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. మహారాష్ట్ర, హర్యానా, ఢల్లీి ఎన్నికల్లో భాజపా విజయం వెనుక క్షేత్రస్థాయిలో చాలా ముందునుంచే ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తల అకుంఠిత కృషి దాగివున్నదన్న ది నిష్టుర సత్యం. ఈ నేపథ్యంలో ఏడాది ముందునుంచే బెంగాల్‌లో తన వ్యూహాలను అమలు చేయాలన్న ఉద్దేశంతో ఆర్‌ఎస్‌ఎస్‌ అడుగులు ముందుకేస్తున్నట్టు అవగతమవుతోంది. ముఖ్యంగా దక్షిణ పశ్చిమబెంగాల్‌ ప్రాంతంలో బలంగా వున్న తృణమూల్‌ కాంగ్రెస్‌ మూలాలను దెబ్బకొట్ట గలిగితే బీజేపీ అవలీలగా అధికారంలోకి రాగలుగుతుంది. ప్రస్తుతం ఆర్‌ఎస్‌ఎస్‌ ఈ ప్రాంతంపై నే దృష్టికేంద్రీకరించి, తన శాఖలను మరింత విస్తరించి ఇప్పటినుంచే క్షేత్ర స్థాయి వ్యూహాలను అమలు పరచాలని చూస్తోంది. 

ఆర్‌ఎస్‌ఎస్‌ సభను అడ్డుకోవడానికి విఫలయత్నం

ఆర్‌ఎఎస్‌ఎస్‌ వ్యూహాలను ముందుగానే పసిగట్టిన మమతా బెనర్జీ ప్రభుత్వం బర్థమాన్‌లో మోహన్‌ భాగవత్‌ నిర్వహించాల్సిన సమావేశానికి అనుమతినివ్వలేదు. ప్రస్తుతం పదోతరగతి పరీక్షలు జరుగతున్నందున, మైకులు, లౌడ్‌స్పీకర్ల వల్ల విద్యార్థులకు అసౌకర్యం ఏర్పడుతుందన్న నెపంతో జిల్లా యంత్రాంగం ఈ ర్యాలీ, బహిరంగ సభకు అనుమతి నిరాకరించింది. దీనిపై ఆర్‌ఎస్‌ఎస్‌ హైకోర్టును ఆశ్రయించడంతో, ‘ఆదివారం కావడంవల్ల పిల్లలకు ఏవిధమైన ఇబ్బంది ఏర్పడదని’ పేర్కొంటూ షరతులతో కూడిన అనుమతిని మంజూరుచేసింది. హైకోర్టు అనుమతివ్వడం తృణ మూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి దెబ్బగానే పరిగణించాలి. ఇదిలావుండగా ఆర్‌ఎస్‌ఎస్‌ కార్యకర్తలు భాగవత్‌ పర్యటన కేవలం రొటీన్‌గా జరిగేదే అని చెబుతున్నప్పటికీ, పొరుగున్న వున్న బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న హింసాకాండ, బాంగ్లా సరిహద్దుల వద్ద కొనసాగుతున్న ఉద్రిక్త తల నేపథ్యంలో రాష్ట్రంలో ఆర్‌ఎస్‌ఎస్‌ తన ఉనికిని మరింత విస్తరించాలన్న ఉద్దేశంతో ఉన్నది. ఇందుకోసం గ్రామపంచాయతీల స్థాయిలో తమ కార్యకలాపాలను కొనసాగించడం ద్వారా మరింత బలోపేతం కావాలని సంఫ్‌ు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. 

పొరుగున బంగ్లాదేశ్‌లో షేక్‌ హసీనా ప్రభుత్వాన్ని పడగొట్టడం, ఇస్కాన్‌కు చెందిన స్వామీజీ అరెస్ట్‌, హిందువులపై, వారి ప్రార్థనా మందిరాలపై దాడులు పెరగడంతో పశ్చిమ బెంగాల్‌లో ఆర్‌ఎ స్‌ఎస్‌ నేతృత్వంలో పలు నిరసన ర్యాలీలు గతంలో జరిగాయి. ఫిబ్రవరి 8వ తేదీన మోహన్‌ భాగవత్‌ ఆర్జీకర్‌ ఆసుపత్రిలో అత్యాచారం, హత్యకు గురైన జూనియర్‌ డాక్టర్‌ తల్లిదండ్రులను కలిసి పరామర్శించడం గమనార్హం. గత అక్టోబర్‌ నెలలో ఆర్జీకర్‌ ఆసుపత్రి సంఘటనపై స్పందిస్తూ, తృణమూల్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం నేరస్థులను కాపాడటానికి యత్నిస్తున్నదంటూ విమర్శించారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన రాష్ట్రంలోని ఉత్తర, దక్షిణ, మధ్య ప్రాంతాలకు చెందిన కార్యకర్తలతో ఆయన సమాలోచనలు జరిపారు. అంతేకాదు బెంగాల్‌, బిహార్‌, సిక్కిం, అండమాన్‌ అండ్‌ నికోబార్‌ దీవులకు చెందిన సంఘ సీనియర్‌ కార్యకర్తలతో కూడా ఆయన చర్చలు జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది. బర్ధమాన్‌ పట్టణంలోని ఉల్లాష్‌లో ఫిబ్రవరి 14న మధ్యప్రాంత ఆర్‌ఎస్‌ఎస్‌ కా ర్యాలయాన్ని ప్రారంభించారు. ఇదే జిల్లాలోని పుర్బాలోని శాఖను ఆయన సంద ర్శించారు.

మోహన్‌ భాగవత్‌ పర్యటన బెంగాల్‌లో ఆర్‌ఎస్‌ఎస్‌ను మరింత విస్తరించేందుకు దోహదం చే స్తుందనడంలో ఎంతమాత్రం సందేహంలేదు. బంగ్లా సరిహద్దు రాష్ట్రమైన పశ్చిమ బెంగాల్‌లో హింసా రాజకీయాలు సర్వసాధారణంగా మారాయి. ఈ నేపథ్యంలో బెంగాల్‌ పీఠం లక్ష్యంగా ఆర్‌ఎస్‌ఎస్‌ ఏవిధంగా పావులు నడుపుతుందో వేచి చూడాలి. గతంలో ఎన్నికలు జరిగిన రాష్ట్రాల్లో ఆర్‌ఎస్‌ఎస్‌ వ్యూహాలు ఫలించి బీజేపీ అధికారంలోకి రావడానికి దోహదం చేశాయన్న సంగతి మరువకూడదు! అందుకనే మోహన్‌ భాగవత్‌ బెంగాల్‌ పర్యటనకు అంతటి ప్రాధాన్యత!

వాటీస్‌ దిస్‌ నాన్సెన్స్‌ నరేష్‌! 

`పాలక మండలి పరువు తీసిన నరేష్‌ ను సాగనంపండి.

`బోర్డు సభ్యుడి బలుపు మాటలు!

`బోర్డు సభ్యుడు ఆధిపత్యం కోసమా!

`బోర్డు సభ్యులు భక్తులకు సేవకులు!

`భక్తులకు సేవ చేయడం కోసమా!

`రెండేళ్ల పదవికే అంత అహంకారమా!

`దేవదేవుని ముందు అందరూ సమానమే!

`తక్షణమే నరేష్‌ కుమార్‌ ను తప్పించాలని భక్తుల డిమాండ్‌.

`టిటిడి ఉద్యోగిపై సభ్యుడి పెత్తనమేమిటి?

`విజిలెన్స్‌ డిపార్ట్‌మెంట్‌ అలసత్వమేమిటి!

`తన కర్తవ్యం నిర్వహిస్తున్న ఉద్యోగికి ఆ అవమానమేమిటి?

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

వాటీస్‌ దిస్‌ నరేష్‌ నాన్సెన్స్‌.. తిరుమల తిరుపతి దేవస్ధానం పాలక మండలి సభ్యుడై వుండి ఉద్యోగి బాలాజీపై నోరు పారేసుకోవడం ఎంత వరకు సమంజసం. ఒక ఉద్యోగి విధి నిర్వహణను అభినందించాల్సిన సమయంలో ధర్డ్‌ క్లాస్‌ నా కొడకా..అని బూతులు తిట్టే అదికారం ఎవరిచ్చారు. అసలు పాలక మండలి సభ్యుడంటే భక్తులకు సేవ చేసే సేవకుడు మాత్రమే. పెత్తనం చేసే పెత్తందారు కాదు. భక్తులకు సౌకర్యాల కల్పనలో, దేవదేవుని సేవలో తరించాల్సిన పాలక మండలి సభ్యుడు నరేష్‌ కుమార్‌ ఉద్యోగిపై నోరు పారేసుకోవడాన్ని భక్తులు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. తన కర్తవ్యాన్ని నిబద్దతతో నిర్వహిస్తున్న ఉద్యోగిని అభినందించాల్సిందిపోయి, నోటికొచ్చినట్లు ఇష్టాను సారం మాట్లాడడాన్ని ఎవరూ స్వాగతించరు. వెంటనే నరేష్‌ ఆ ఉద్యోగికి క్షమాపణ చెప్పాలి. టిటిడి ఉద్యోగులు నరేష్‌ కుమార్‌ మీద పోలీసు కేసు నమోదు చేయాలి. పొరుగు రాష్ట్రానికి చెందిన వ్యక్తిని పాలకమండిలోకి తీసుకునేపప్పుడు ఇకపై వారి వ్యక్తిత్వాలేమిటి? వారి వ్యవహార శైలి ఎలాంటిది అని కూడా ఇకపై పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం వుంది. టిటిడి బోర్డు సభ్యుడి పదవీ కాలం కేవలం రెండేళ్లు మాత్రమే. నరేశ్‌కుమార్‌ పాలకమండలికి శాశ్వతసభ్యుడు కాదు. ఆయనకు ప్రత్యేకమైన అధికారాలు ఏమీ లేవు. అయినా పాలక మండలి నిర్ణయాలను నరేశ్‌ ఉల్లంఘించడమే తప్పు. అందరికీ ఆదర్శంగా వుండాల్సిన సభ్యుడు తనకు ఉద్యోగి సూచనలు కూడా అవమానంగా భావించడం అతని అహంకారానికి నిదర్శనం. ఎప్పుడో నెలకోసారో..వచ్చి చుట్టపు చూపుగా వచ్చినట్టు, తనకు ఎనలేని అధికారాలు టిటిడి కట్టబెట్టినట్లు ప్రవర్తించడం సరైంది కాదు. ముందుగా ఎట్టిపరిస్దితిల్లోనూ నరేశ్‌ ఉద్యోగి బాలాజీకి క్షమాపణ చెప్పాలి. లేకుంటే పాలకమండలి తీర్మాణం చేసి సభ్యత్వం రద్దు చేయాలి. ఈ విషయంలో మరో ఆలోచనకు ప్రభుత్వం తావివ్వకూడదు. నిత్యం వేలాది మంది భక్తులు వచ్చే తిరుమలతో విధి నిర్వహణ అంటే ఎంతో కష్టతరమైన పని. వాళ్లు పడే శ్రమ అంతా ఇంతా కాదు. వేలాది మంది భక్తులకు సేవ చేసి ఆ ఉద్యోగులు తరిస్తుంటారు. అలాంటి ఉద్యోగిపై చేయి చేసుకోవడమే కాకుండా, ఇష్టాను సారం బూతులు తిట్టడం అంటే బోర్డు సభ్యుడిగా నరేష్‌ ఎంత మాత్రం అర్హడు కాదు. ప్రతి క్షణం గోవింద నామ్మస్మరణతో అలరాలే పవిత్రమైన స్ధలంలో బోర్డు సభ్యుడు ఉద్యోగిపై చిందులు తొక్కడం. నోటికొచ్చిన పదజాలం వాడడాన్ని భక్తులు సహించలేకపోతున్నారు. నిజానికి అక్కడ వున్న భక్తులు ఎవరో వీడియో తీయడం వల్ల ఇదంతా బైట పడిరది లేకుంటే, ఆ ఉద్యోగికి నరకం చూపించేవారు. ఆ ఉద్యోగిని ఇప్పటికే సస్పెండ్‌ చేసేవారు. ఆయనపై కేసు కూడా నమోదు చేసి ఆ ఉద్యోగికి నకం చూపించేవారు. అంతటి ఘనులే కొంత మంది పాలక మండలి సభ్యులు. సభ్యులకు తోడు విజిలెన్స్‌ అధికారులు కూడా వీవీఐపిల సేవల్లో తరించి పోతుంటారు. తిరుమలలో విజిలెన్స్‌ అదికారుల సేవలు కూడా కేవలం రెండు సంవత్సరాలు మాత్రమే. అందుకే వాళ్లు కూడా పెద్ద వాళ్ల సేవల్లో మునిగితేలుతుంటారు. వారికి సేవలు చేసి, లాభం పొందుతుంటారు. అసలు తప్పు చేసిన నరేష్‌కు నచ్చజెప్పాల్సిన విజిలెన్స్‌ అధికారులు ఉద్యోగి బాలాజీని పక్కకు నెట్టేశారు. ఆయనను దూరంగా తీసుకెళ్లారు. తన కర్తవ్య నిర్వహణలో నిజాయితీ చూపించిన బాలాజీ అక్కడినుంచి తలవంచుకుని పోయేలా చేశారు. ఇదేనా పాలక మండిలిలో చేసిన తీర్మాణం.. అంత మంది భక్తుల మందుకు ఆ ఉద్యోగిని పంపించేయండి? అంటూ విజిలెన్స్‌ అదికారులను ఆదేశించడం ఏమిటి? ఉద్యోగిని విజిలెన్స్‌ అధికారులు పక్కకు తీసుకెళ్లడమేమిటి? అసలు ఆ ఉద్యోగి బాలాజీ చేసిన నేరమేమిటి? వెంకన్న సన్నిదిలో అందరూ ఒక్కటే. తిరుమల కొండకు చేరుకున్న తర్వాత పేద, పెద్ద అన్న తేడా వుండకూడదు. వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అందరూ సమానమే. ఆ విషయం కూడా తెలియని వ్యక్తికి బోర్డు సభ్యత్వం కల్పించడమే తప్పు. దర్శనం పూర్తయిన తర్వాత ఎవరైనా సరే మహాద్వారం నుంచి వెళ్లకూడదని పాలకమండలే తీర్మాణం చేసింది. అందుకు నరేశ్‌ కూడా అంగీకరించే మినిట్స్‌లో సంతకం చేశారు. అలాంటి వ్యక్తి నిబంధనలు ఎలా ఉల్లంఘిస్తాడు. అలాంటి వ్యక్తి బోర్డు సభ్యుడిగా వుండడానికి అర్హుడే కాదు. అయినా బయోమెట్రిక్‌ దారిని కేటాయించిన సంగతి సదరు సభ్యుడికి తెలియందా? అంటే అందరూ వేరు…నేను వేరు అనుకున్నాడా? అలాంటి వారికి తిరుమలలో వుండే అర్హతలేదు. అక్కడ పెత్తనానికి అవకాశమే లేదు. నరేష్‌ చేసిన పని పాలక మండలి పరువు కూడా తీసినట్లైంది. గతంలో ఎప్పుడూ ఇలాంటి వివాదం ఎదురుకాలేదు. కారణం సభ్యులకు కూడా పాలకమండలి ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేయలేదా? వారు అనుసరించాల్సిన, ఆచరించాల్సిన విధి విధానాలు చెప్పలేదా? పాలక మండలి సభ్యుడిగా వుండి నిత్యం టిక్కెట్లు అమ్ముకుంటున్నాడన్న అపవాదును ఇప్పటికే నరేష్‌ ఎదుర్కొంటున్నట్లు కూడా ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సంఘటన జరిగిన రోజు ఆయనతోపాటు కొంత మందిని దర్శనానికి తీసుకెళ్లిన నరేష్‌ వారి ముందు ఆధిపత్యం చెలాయించాలని చూశాడు. కాని బాలాజీ అడ్డుకున్నాడు. అయినా కొత్తగా ఏర్పాటైన బోర్డు సభ్యులందరూ బాలాజీ లాంటి సామాన్యమైన ఉద్యోగికి తెలియాలనేమీ లేదు. నరేశ్‌ లాంటి సభ్యులు రెండెళ్లకోసారి ఎంతో మంది మారుతుంటారు. ఎంత మంది బోర్డు సభ్యులను సాదారణ ఉద్యోగులు గుర్తుంచుకుంటారు. చూస్తుండగానే రెండేళ్ల పుణ్యకాలం ముగిసిపోతుంది. అంత దానికి నరేష్‌కు అంతటి మడిసిపాటు ఎందుకు? నరేష్‌ తెలుగు రాష్ట్రాలకు చెందిన వ్యక్తి కాదు. పొరుగున వున్న కర్నాటకకు చెందిన బిజేపి నాయకుడు. సహజంగా బిజేపి నాయకులు సనాతన దర్మం. దేశం కోసం , ధర్మం కోసం అంటూ ముచ్చట్లు చెబుతుంటారు. హిందూమతోద్దరణ మాకు మాత్రమే సొంతమని చెప్పుకుంటారు. అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడు కొలువై వున్న సప్తగిరుల మీదనే సాటి హిందువును దూషించడం నరేష్‌ తప్పు కాదా? ఒక ఉద్యోగిపై చేయి చేసుకోవడం నేరం కాదా? ఈ విషయంపై ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా స్పందిచాల్సిన అవసరం వుంది. ఇలాంటి సభ్యుడి వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. అలాంటి సభ్యుడికి కొనసాగిస్తే, ఉద్యోగుల్లో కూడా అసహనం పెరిగిపోతుంది. రేపటి రోజు ప్రభుత్వంపై ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతుంది. అయినా పాలక మండలి సభ్యుడికి ప్రత్యేక గౌరవాలు ఏమిటి? ఆయన ఒక సేవకుడు మాత్రమే. తిరుమలలో భక్తులకు సేవ చేసి జన్మ ధన్యం చేసుకోవాల్సిందిపోయి, దేవుడి దగ్గరే నేనుగొప్ప అనుకునేవారిని వెంకటేశ్వర స్వామి క్షమించడు. పాపం పండితేనే ఇలాంటి మాటలు ఎవరైనా మాట్లాడుతారు. ఈ విషయంలో టిటిడి చైర్మన్‌ స్పందించకపోవడంపై భక్తులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆ మధ్య జరిగిన తొక్కిసలాట సమయంలో అంత మంది భక్తులు చనిపోయిన సమయంలో భక్తుల యోగక్షేమాలు చూసుకోలేని నరేష్‌ ఎక్కడున్నారు. ఆ సమయంలో భక్తులకు ఎందుకు సేవ చేయలేదు. ఆయన భక్తులకు సేలందిస్తున్నట్లు ఎక్కడా వార్తలు వినిపించలేదు. అసలు ఆయన ఒక సభ్యుడన్న సంగతి చాలా మందికి తెలియదు. మరి అలాంటి వ్యక్తి పాలకమండలిలో చేరి నిత్యం ఎంతో మందిని దర్శనానికి పంపిస్తునట్లు కూడా వార్తలు వస్తున్నాయి. అలా టిక్కెట్లు అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నట్లు చెప్పుకుంటున్నారు. ముప్పై సంవత్సరాల పాటు తన ఉద్యోగ నిర్వహణలో భక్తులకు సేవలు చేసే ఉద్యోగి నిజంగా తప్పు చేస్తే శిక్షించాల్సిందే. కాని పాలక మండలి సభ్యులకు ఉద్యోగులు కట్టు బానిసలు కాదు. వారికి ఆత్మగౌరవం వుంటుంది. వారిని చులకన చేసి మాట్లాడడం ఎవరికీ మంచిది కాదు. ముఖ్యంగా పవిత్రమైన తిరుమలలో వెంకన్నసన్నిధిలో కోపానికి తావు లేదు. అహానికి అసలే తావు లేదు. ధిక్కార స్వరాలు వినిపించకూడదు. ముల్లోకాలను ఏలే స్వామి ముందుకు నేను గొప్ప అనుకునే వారికి చోటు వుండకూడదు. ముఖ్యంగా మర్యాద లేని వ్యక్తులకు పాలకమండిలో చోటే వుండకూడదు.

‘నీతి’ కోసం పోరులో ‘అవినీతి’లో మునిగిన ఆప్‌

తాను తప్పు పట్టిన పార్టీలతోనే జట్టుకట్టిన వైనం

14 కాగ్‌ నివేదికలను తొక్కిపట్టిన కేజ్రీవాల్‌ ప్రభుత్వం

ఈశాన్య ఢల్లీి స్కూళ్ల మౌలిక సదుపాయాలపై ఢల్లీి హైకోర్టు చీవాట్లు

‘స్వచ్ఛ’ యమున హామీ నెరవేర్చలేదు

కాలుష్య నియంత్రణలో వైఫల్యం

అధికారంకోసం అడ్డదారులు

అమలు చేయలేని అలవికాని హామీలు

అవినీతి ఆరోపణలతో ముఖ్యమంత్రిగా జైలుకెళ్లిన రికార్డు

ఎన్నికల్లో ‘ఊడ్చేసిన’ ఢల్లీి ఓటర్లు!

హైదరాబాద్‌,నేటిధాత్రి:
ఢల్లీి పీఠాన్ని 2/3వవంతు మెజారిటీతో కైవసం చేసుకోవడంతో గత 27 ఏళ్లుగా నిరంతరాయంగా చేస్తున్న పోరాటం ఇప్పటికి ఫలించిందన్న ఆనందం భారతీయ జనతాపార్టీని ముంచెత్తడం సహజం. అయితే ఇక్కడ గమనించాల్సిన ప్రధాన అంశమేంటంటే ఓట్లశాతాన్ని పరిశీలించినప్పుడు ఆమ్‌ఆద్మీ పార్టీ కంటే బీజేపీకి వచ్చిన ఓట్లు కేవలం రెండుశాతం మాత్రమే అధికం. కొన్ని సందర్భాల్లో ఒక్కశాతం ఓట్లు కూడా పార్టీల అదృష్టాలను తల్లక్రిందులు చేయడం చూస్తూనే వున్నాం. ప్రస్తుతం ఢల్లీి అసెంబ్లీలో మొత్తం 70 స్థానాలుండగా వీటిల్లో 48 భాజపాకు, 22 ఆమ్‌ ఆద్మీ పార్టీ (ఆప్‌)కు లభించాయి. ఈ సారి ఎన్నికల్లో భాజపాకు 45.8%, ఆప్‌కు 43.8%, కాంగ్రెస్‌ కు 6.4% ఓట్లు వచ్చాయి.అదే 2020 ఎన్నికల్లో భాజపాకు 38.5%, ఆప్‌కు 53.6%, కాంగ్రెస్‌కు 4.3% ఓట్ల షేర్‌ నమోదైంది. కాంగ్రెస్‌పార్టీ ఏఏపీతో జట్టుకట్టకపోవడం వల్లనే ఓట్లు చీలి భాజపాకు అనుకూలంగా ఫలితాలు వచ్చాయన్న వాదన ఆమోదయోగ్యంగా కనిపిస్తున్నప్పటికీ, ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ఈ టర్మ్‌ పాలనలో ఆప్‌పై గతంలో ఎన్నడూ లేని రీతిలో అవినీతి ఆరోపణలు వచ్చాయి. శీష్‌మహల్‌, లిక్కర్‌కుంభకోణం వంటివి పార్టీ ఇమేజ్‌ను చాలా దెబ్బతీశాయి. ఈ నేపథ్యంలో ఒకవేళ కాంగ్రెస్‌ జట్టు కట్టినా ఆ పార్టీ ఓట్లు ఆప్‌ ఖాతాలో పడతాయని చెప్పడం కష్టం. అదీకాకుండా కేవలం భాజపాతో పోలిస్తే కేవలం రెండుశాతం ఓట్ల తేడానే కదా అని వాదించేవారు కొన్ని నియోజకవర్గాల్లో ఆప్‌కు భారీ మెజారిటీ రావడం ఈ ఓట్లశాతం అధికంగా కనిపించడానికి ప్రధానకారణమన్న సంగతిని గుర్తించాలి. అంటే కొన్ని ప్రాంతాల్లో మాత్ర మే అదికూడా ముస్లింలు అధికంగా వున్న నియోజకవర్గాల్లో మాత్రమే ఆప్‌ థంపింగ్‌ మెజారిటీని సాధించింది. ఇది ఆపార్టీ ఓట్లశాతం దాదాపు చెక్కుచెదరలేదన్న భావనకు కారణమవుతోంది. నిజం చెప్పాలంటే 2020లో ఆప్‌ సాధించిన ఓట్లతో పోలిస్తే 2025 ఎన్నికల్లో 9.8% ఓట్ల షేర్‌ను కోల్పోయింది. ఈ విధంగా కోల్పోయిన ఓట్లు భాజపా ఖాతాలో 7.8%, కాంగ్రెస్‌ ఖాతాలో 2.1% చొప్పున జమ అయ్యాయి. ఫలితంగా గత ఎన్నికలతో పోలిస్తే ఆ రెండు పార్టీలకు ఆ మేరకు అధికశాతం ఓట్లు నమోదుకావడం సహజమే. గుర్తించాల్సిన మరో ప్రధానాంశ మేమంటే 2015`2020 వరకు ఆప్‌ ఓట్లశాతం 54.3%, 53.6% నమోదు కావడం, ఆ పార్టీ ఓటు బ్యాంకు పటిష్టంగా ఉన్నదన్న సంగతిని స్పష్టం చేస్తున్నాయి. ఈ కారణంగానే 2015లో 67 సీట్లు, 2020లో 62 సీట్లలో విజయం సాధించగలిగింది. నిజానికి ఈ రెండు ఎన్నికల్లో ఒకటికంటే తక్కువ ఓట్ల శాతం తగ్గిన ఫలితంగా ఐదుసీట్లు తగ్గిపోయాయి. ఇది 2025 ఎన్నికల కు ప్రమాద ఘంటికలుగా అరవింద్‌ కేజ్రీవాల్‌ పరిగణించకపోవడం ఇప్పుడు పార్టీ ఓటమికి కారణ మైంది.
ఇక కాంగ్రెస్‌ పార్టీ విషయానికి వస్తే 1993లో ఢల్లీి ఎన్నికల్లో 34.5% ఓట్లు సాధించగా, 42.8% ఓట్లతో భాజపా అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత 2025లో మాత్రమే పార్టీ మళ్లీ అధికా రంలోకి రాగలిగింది. 1998, 2003 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పుంజుకొని వరుసగా 47.8%, 48.1% ఓట్లతో అధికారాన్ని హస్తగతం చేసుకుంది. ఇక అక్కడినుంచి కాంగ్రెస్‌ పతనపథం అప్రతిహ తంగా కొనసాగుతూ వచ్చి 2015, 2020, 2025 సంవత్సరాల్లో వరుసగా 9.7%, 4.4%, 6.4% ఓట్లషేరు సంపాదించింది. 2020తో పోలిస్తే ఈసారి రెండుశాతం ఓట్లు ఎక్కువ రావ డానికి ప్రధాన కారణం, ఆప్‌ కోల్పోయిన ఓట్లు తన ఖాతాలో పడటమే!
ఆప్‌ పతనానికి కారణాలేంటి?
కాంగ్రెస్‌ నాయకురాలు శీలాదీక్షిత్‌ ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాల పాటు ఢల్లీిని పాలించిన కాలంలో అవినీతి ఆరోపణలు పరాకాష్టకు చేరాయి. ఈ నేపథ్యంలో చైతన్యశీలురైన ఢల్లీి ప్రజలు 2011లో ఒక మార్పు అవసరమన్న నిర్ణయానికి వచ్చారు. సరిగ్గా ఇదే సమయంలో అవినీతిని నిర్మూలిస్తామంటూ 2012 అక్టోబర్‌ 2న ‘ఆమ్‌ ఆద్మీ’ పార్టీని స్థాపించి కెజ్రీవాల్‌ ప్రజల్లోకి రావ డంతో ఈయన చక్కటి ప్రత్యామ్నాయంగా భావించిన 2013 ఎన్నికల్లో ప్రజలు పట్టంకట్టారు. తర్వాతి కాలంలో అవినీతికి ఆలవాలమైన కాంగ్రెస్‌ పార్టీలో జట్టు కట్టే ప్రసక్తే లేదని కేజ్రీవాల్‌ శపథం చేశారు కూడా! డిల్లీని కాలుష్య రహితం చేస్తామని, 24I7 స్వచ్ఛమైన నీటిని అందిస్తామని,యమునానదిని ప్రక్షాళన చేస్తామని, ఢల్లీి రోడ్లను లండన్‌ రోడ్లతో పోటీపడేలా అందంగా తీర్చిదిద్దుతామంటూ హామీలు గుప్పించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన తన భీషణ ‘ప్రతిజ్ఞ’ను తుంగలో తొక్కి అధికారం కోసం కాంగ్రెస్‌తో జట్టు కట్టారు. తర్వాతి కాలంలో ఆయన దృష్టి ఢల్లీికి పరిమితం కాలేదు క్రమంగా ప్రధాని నరేంద్రమోదీని ఢీకొట్టేందుకు ప్రయత్నించారు. ఇందుకోసం తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అఖిలేష్‌ యాదవ్‌, లల్లూప్రసాద్‌ యాదవ్‌లతో చేతులు కలిపారు. ఈ విధంగా ఏ అవినీతికి వ్యతిరేకంగా ‘ఆప్‌’ స్థాపితమైందో, తాను ఏ పార్టీలపై అవినీతి ఆరోపణలు చేసారో, వాటితోనే అరవింద్‌ కేజ్రీవాల్‌ కలవడం, ప్రజల్లో ఆయనపట్ల అనుమానాలు పెంచేలా చేసింది. తర్వాతికాలంలో ఇతర పార్టీల అవినీతి మాట అట్లావుంచితానే పూర్తి అవినీతిలో కూరుకుపోయింది. పార్టీ ముఖ్యనేతలైన మనీష్‌ సిసోదియా, సంజయ్‌ సింగ్‌, సత్యేంద్రసింగ్‌ జైన్‌ చివరకు కేజ్రీవాల్‌ అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయారు. చివరకు ఆర్థిక అవకతవకల నేపథ్యంలో జైలుపాలవక తప్పలేదు.
ఢల్లీి విద్యావ్యస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తామని కేజ్రీవాల్‌ హామీ ఇచ్చారు. కానీ ఈశాన్యఢల్లీిలోని స్కూళ్లలో కనీస మౌలిక సదుపాయాలు లేకపోవడంపై గత ఏప్రిల్‌లో ఢల్లీి హైకోర్టు ప్రభుత్వాన్ని చీవాట్లు పెట్టింది. పేదలకు వైద్యాన్ని అందుబాటులోకి తేవడం, ఈ రంగంలో అవినీతిని అరికట్టే ఉద్దేశంతో ‘మొహల్లా క్లినిక్‌’లు ఏర్పాటు చేశారు. కానీ ఈ క్లినిక్‌ల్లో కేవలం 11నెల ల్లో 65వేల మంది రోగులకు చికిత్స చేసినట్టు తప్పుడు లెక్కలను రికార్డుల్లో నమోదు చేసినట్టు ఏసీబీ విచారణలో తేలింది. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని ఢల్లీిలో అమలు చేయడానికి కేజ్రీవాల్‌ ప్రభుత్వం అనుమతించకపోవడాన్ని కూడా న్యాయవ్యవస్థ తప్పుపట్టింది.
కోవిడ్‌ మహమ్మారి తీవ్రస్థాయిలో వున్న సమయంలో తన అధికార నివాసం శీష్‌మహల్‌కు మరమ్మతుల పేరుతో కోట్లాది రూపాయల వ్యయంతో విలాసవంతమైన సౌకర్యాలు కల్పించుకోవడంతీవ్ర విమర్శలకు దారితీసింది. ఇదే సమయంలో నీళ్ల ట్యాంకర్ల మాఫియా, రోడ్లు అధ్వాన్నంగాతయారవడం వంటి సమస్యలను పట్టించుకోలేదు. వీటిపై కూడా ఢల్లీి హైకోర్టు ప్రభుత్వాన్ని తప్పు పట్టింది. అన్నింటికంటే ముఖ్యంగా ఆప్‌ పాలనలో గత 31 సంవత్సరాల్లో ఎన్నడూ లేనిది, ప్రభుత్వం నిధుల లోటును ఎదుర్కొంది. ఫలితంగా నేషనల్‌ స్మాల్‌ సేవింగ్స్‌ ఫండ్‌ నుంచి రూ.10వేల కోట్లు అప్పు తీసుకోవడంతో ప్రభుత్వ పనితీరు ఎంత అధ్వాన్నంగా పనిచేస్తున్నదీ ప్రజలకు తెలిసొచ్చింది. కాంగ్రెస్‌ పాలనలో అంతటి స్థాయిలో అవినీతి జరిగిందన్న ఆరోపణలు వచ్చినా ఎప్పుడూ ప్రభుత్వం అప్పు తీసుకోవాల్సిన దుస్థితి రాలేదు!
ఇక యమునా నది నీటిని శుభ్రం చేస్తానన్న హామీని కూడా కేజ్రీవాల్‌ అమలుపరచలేకపోయారు. ముఖ్యంగా ఛాట్‌పూజ సందర్భంగా మహిళలు కాలుష్యమయంగా వున్న యమునానదిలోకి దిగి ‘అర్ఘ్యం’ వదిలిన చిత్రాలు సోషల్‌ మీడియాలో హల్‌చెల్‌ చేశాయి. ఇక కేజ్రీవాల్‌ లిక్కర్‌ పాలసీ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన లిక్కర్‌ పాలసీ పుణ్యమాని వీధివీధికీ లిక్కర్‌షాపులు పుట్టుకొచ్చాయి. చివరకు ఈ స్కామ్‌లోనే ఆయన జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. 11 నెలలుగా అంగన్‌వాడీ కార్యకర్తలకు చెల్లింపులు జరపకపోవడంతో కేజ్రీవాల్‌ ఇచ్చిన మహిళా సంక్షేమంపై హామీ కూడా ప్రశ్నార్థకంగా మారింది. మహిళలకు నెలకు రూ.1000 చెల్లిస్తామన్న హామీని కూడా కేజ్రీవాల్‌ అమలుచేయలేదు.
అవకాశవాద రాజకీయాలు
కేజ్రీవాల్‌ రాజకీయాలు అవకాశాన్ని బట్టి మారుతూ వచ్చాయి. ముస్లింలను బుజ్జగించే చర్యల్లో భాగంగా మౌల్వీలకు నెలవారీ జీతాలు చెల్లించిన కేజ్రీవాల్‌ ప్రభుత్వం హిందూ, సిక్కు పూజారు లను పూర్తిగా విస్మరించింది. ఈ రెండు వర్గాల పూజార్లు కేవలం ఎన్నికల సమయంలో మాత్ర మే గుర్తుకురావడం కేజ్రీవాల్‌ మార్క్‌ రాజకీయానికి చిహ్నం! అయోధ్య రామమందిరానికి, హిందువులు పవిత్రంగా భావించే స్వస్తిక్‌ చిహ్నానికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం కేవలం మైనారిటీలను బుజ్జగించడానికే! మిగతా హామీలు ఎట్లావున్నా, తమ భావోద్వేగాలపై కేజ్రీవాల్‌ చేస్తున్న దాడిని ఢల్లీిలోని హిందూ, సిక్కు ఓటర్లు మరచిపోలేదు. మరి పారదర్శకతకో గొంతు చించుకు న్న కేజ్రీవాల్‌ ప్రభుత్వం కంట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) రూపొందించిన 14 నివేదికలను తొక్కిపట్టి, అసెంబ్లీలో ప్రవేశపెట్టలేదు. ఇవన్నీ కేజ్రీవాల్‌ రాజకీయ, పాలనాపరమైన వైఫల్యాలుగా చెప్పుకోవాలి.
ఆమ్‌ ఆద్మీ పార్టీని మిగిలిన పార్టీకంటే భిన్నంగా స్వచ్ఛమైందిగా చెప్పుకున్న కేజ్రీవాల్‌, తర్వాతి కాలంలో అధికారంకోసం అడ్డదారులు తొక్కడం మొదలుపెట్టారు. అలవికాని హామీలు గుప్పిం చడం ఇందులో భాగమే. దీర్ఘకాల అభివృద్ధి పనులను పట్టించుకోకుండా, తాత్కాలిక ప్రయోజనా ల కల్పనతో అధికారంలోకి రావాలనుకోవడం ఆయన చేసిన పెద్ద తప్పిదం. దేశంలోని మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే ఢల్లీి పూర్తి భిన్నం. ఇక్కడ మధ్యతరగతి, విద్యావంతులు అధికం. ప్రతి విషయాన్ని వారు జాగ్రత్తగా పరిశీలించడమే కాదు, ఎప్పటికప్పుడ చైతన్యశీలంగా వుంటారు. వీరిని తక్కువ అంచనా వేయడం కేజ్రీవాల్‌ ఘోర తప్పిదం! ఇన్ని కారణాలతో ఆప్‌ ప్రస్తుతం ఓటమిపాలై, అలవికాని హామీలు గుప్పించే ఇతర పార్టీలకు ఒక గుణపాఠంగా మారింది.

ఉద్యోగానికి రాజీనామా ఒక డ్రామా!

-హరికృష్ణ త్యాగం ఒక మిధ్య!!

-రాజీనామా చేసినా ఉద్యోగం మళ్ళీ వస్తుంది?

-అలా ఉద్యోగాలు పొందిన వాళ్లు కోకొల్లలు!

mlc candidate harikrishna

-ప్రజలను మభ్యపెట్టి సానుభూతి కోసం ఆరాటం

-ఎన్నికలలో గెలవాలన్న ఆలోచనతో ప్రచారం

-కోచింగ్‌ సెంటర్ల మేలు కోసం సరికొత్త నాటకం

-కోచింగ్‌ సెంటర్ల నిర్వాహకులంతా ఏకమై సాగిస్తున్న రాజకీయం

-ఎమ్మెల్సీ ఎన్నికలు ఖర్చుతో కూడుకున్నవి

-ఒక సామాన్యమైన ఉద్యోగికి అంత సొమ్మెక్కడిది!

-జీతంలో ముప్పై శాతం సామాజిక కార్యక్రమాలు గొప్పల కోసమే

-ప్రభుత్వాల మీద కోచింగ్‌ సెంటర్ల ఆధిపత్యం కోసం కొత్త ఎత్తుగడ

-విద్యార్థుల జీవితాలు ఫణంగా పెట్టి సంపాదనా మార్గాలకు రాచబాట

అబద్దమాడరాదు..సత్యమునే పలుకవలెను..అని చెప్పాల్సిన గురువులు కొందరు పచ్చి అబద్దాలు చెప్పి సమాజాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్‌, మెదక్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాల పట్టభద్రుల ఎన్నికల్లో పోటీ చేస్తున్న బిఎస్పీ అభ్యర్ధి ప్రసన్న హరికృష్ణ గౌడ్‌ మాటలు అలాగే వున్నాయి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచనతో ఆయన కొంత కాలం క్రితం తన ఉద్యోగానికి రాజీనామా చేశారు. అప్పటి నుంచి తాను ప్రజా సేవ కోసం ప్రజల్లోకి వచ్చానని, ప్రజా సేవ కోసం తన ఉద్యోగాన్ని తృణ ప్రాయంగా వదిలేశానని, కొలువుకు రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నానని ప్రచారం మొదలు పెట్టారు. సహజంగా ఇలాంటి మాటలు విన్నవారికి ఎవరికైనా సరే అవునా? చాలా గొప్ప వ్యక్తి అన్న భావనే ఏర్పడుంది. చాలా మందికి అసలు నిజం తెలియదు. అంతలోతుగా కూడా ఎవరూ ఆలోచించరు. ఉద్యోగాల విషయంలో ఎలాంటి వెసులు బాటు వుంటుందో కూడా ఇతరులకు పెద్దగా అవగాహన వుండదు. దాంతో ఉన్నతమైన ఉద్యోగం వదిలి ప్రజలకు సేవ చేయాలనుకుంటున్నాడేమో? అని జనం ఆలోచిస్తుంటారు. కాని అదంతా నిజంకాదు. ఇకపోతే ఎన్నికల్లో పోటీ చేయాలన్న ఆలోచనతోనే గత కొంత కాలంగా చిన్నా చితక సామాజిక కార్యాక్రమాలు చేపడుతూ వస్తున్నానని ఆయనే చెబుతున్నారు. తనకు వచ్చే జీతంలో కొంత శాతం సమాజ సేవ కోసం ఖర్చు చేస్తున్నానంటూ చెబుతుండడం విడ్డూరం. ఆయనకు వచ్చే జీతమెంత? అందులో చేసే ఖర్చెంత? ఎందుకంటే ఆసుపత్రుల్లో పది మంది రోగులకు పండ్లు పంచినా అది సామాజిక సేవే…కాని మన సమాజంలో ఎంతో మంది కొన్ని కోట్ల రూపాయలు సమాజం కోసం ఖర్చు చేస్తూ గుప్త దానాలు చేస్తున్న వారు అనేక మంది వున్నారు. వాళ్లెవరూ ఇలా ప్రచారం చేసుకోరు. అసలు పేదలను ఆదుకునేందుకు విద్యా, వైద్య సహాయ కార్యక్రమాలు చేస్తున్నట్లు కూడా తెలియదు. కాని రాజకీయ భవిష్యత్తుకోసం ఆరాటపడే వాళ్లే ఇలా చిన్నా చితక సాయాలు చేసి పెద్దగా ప్రచారం చేసుకుంటారు. మీడియాలో వార్తలు రాయించుకొని ప్రచారంలో దూసుకుపోతుంటారు. ఉద్యోగానికి రాజీనామా చేసిననాడు కూడా ఇలాగే తన త్యాగం గురించి చెప్పుకొని మీడియా సమావేశం ఏర్పాటు చేసి, గొప్పలు చెప్పుకున్నారు. ఆ మరునాడు వచ్చిన మీడియా కథనాలను బ్రోచర్‌గా మార్చుకొని రాజకీయ పార్టీల వెంట ప్రసన్న హరికృష్ణ తిరిగారు. ముఖ్యంగా అదికార కాంగ్రెస్‌ పార్టీ చుట్టూ ప్రదక్షిణాలు చేశారు. కాని కాంగ్రెస్‌ పార్టీ ప్రసన్న హరికృష్ణను నమ్మలేదు. ఎందుకంటే హరికృష్ణ ఉద్యోగ జీవితమే పట్టుమని పదిహేనేళ్లు లేదు. రిటైర్‌ మెంటుకు దగ్గరకూడా లేరు. కాని ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం అడుగులు వేశారు. అందులోనూ పెద్దల సభను ముందుగా ఎంచుకున్నాడు. ఇక్కడే ఆయనలోని అత్యాశ కనిపించింది. ఒక సాధారణ వ్యక్తి రాజకీయంగా ఎదగాలనుకున్నప్పుడు చిన్న వయసు నుంచే కార్యకర్తగా మొదలై, అంచెలంచెలుగా ఎదుగుతుంటారు. లేకుంటే రిటైర్‌ అయ్యే సమయంలో రాజీనామాలు చేసి రాజకీయాల్లోకి వస్తుంటారు. కాని ఇంకా ఎంతో ఉద్యగ భవిష్యత్తు వున్న వ్యక్తి రాజీనామా చేశానని చెప్పి, ప్రజలను నమ్మించి రాజకీయాల్లో వస్తున్నానంటే ఎవరూ నమ్మరు. కారణం ఆ ఉద్యోగం ఎటూ పోదు. ఇంకా రెండేళ్లకైనా సరే ఆ ఉద్యోగం మళ్లీ వస్తుంది. అవసరమైతే ఆ జీతమంతా కలుపుకొని కొలువొస్తుంది. ఈ జిమ్మిక్కులు సామాన్యులకు తెలియవు. ఏదొ కారణం చెప్పి కోర్టును ఆశ్రయిస్తారు. ఇలా రాజీనామాలు చేసి, ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన తర్వాత మళ్లీ కొలువులు తెచ్చుకున్నవారు అనేక మంది వున్నారు. ఇలా ఉద్యోగానికి రాజీనామా చేసి ఎన్నికల్లో పోటీ చేయడం త్యాగం కాదు. ప్రజలను మోసం చేయడం. అద్యాపక వృత్తిలో వుంటూ నీతి, నిజాయితీని సమాజానికి పంచాల్సిన వ్యక్తి అబద్దాల పునాదుల మీద, అసత్యాలతో రాజకీయాలు చేయాలనుకోవడం తప్పు. కొన్ని రోజుల తర్వాత మళ్లీ తన కొలువు తిరిగి తెచ్చుకోవడం కోసం న్యాయ స్దానాలను కూడా మోసం చేస్తారు. ఇలా కోర్టులను కూడా మోసం చేయగలిగిన వాళ్లు ప్రజలను మోసం చేయకుండా వుండగలరా? నల్లగొండ ఉపాధ్యాయ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధికూడా ఇలాగే తన ఉద్యోగానికి రాజీనామా చేసి పోటీ చేస్తున్నారు. తర్వాత ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకొని, వారు కోరినంత ముట్ట జెప్పి, కోర్టును కూడా ప్రబావితం చేసి ఉద్యోగాలు తెచ్చుకుంటారు. అందువల్ల హరికృష్ణ చెబుతున్నది అబద్దమని, త్యాగం అసలే కాదని ఇక్కడే తేలిపోయింది. ఇంకా ఆయనను ప్రజలు నమ్ముతారని అనుకోవడం విచిత్రం. ఇక కాంగ్రెస్‌ పార్టీ టికెట్‌ ఇవ్వకపోవడంతో ఇండిపెండెంటుగా పోటీకి నామినేషన్‌ వేసిన హరికృష్ణ కొంతకాలంగా తాను బిసినంటూ బిసీ వాదం వినిపిస్తూ వచ్చారు. బిసిలను సంఘటితం చేసి విజయం సాధిస్తాననుకున్నారు. కాని అటు వంటి దారి ఎక్కడా కనిపించలేదు. దాంతో రాత్రికి రాత్రి బిఎస్పీ కండువా కప్పుకున్నారు. బిఎస్పీ కార్యకర్తలైన పట్టుబద్రుల వద్దకు వెళ్లినప్పుడు బిఎస్పీ కండువా కప్పుకుంటున్నారు. ఇతర బిసి పట్టభద్రుల వద్దకు వెళ్లినప్పుడు బిసి కండువాతో ప్రచారం సాగిస్తున్నారు. తాను ఎంత ఊసరవెళ్లి రాజకీయాలను చేయగలనో ఇక్కడే ఆయన చూపించుకుంటున్నారు. ఈ రెండిరటికన్నా మరో భయంకరమైన నిజం హరికృష్ణ రాజకీయంలో దాగి వుంది. గత ప్రభుత్వ సమయంలో తెలంగాణ వ్యాప్తంగా ఉద్యోగాలు లేకున్నా, అప్పటి ప్రభుత్వం చెప్పే మాటలతో కోచింగ్‌ సెంటర్లన్నీ కళకళలాడుతుండేవి. కోచింగ్‌ సెంటర్లు కూడా ఇదిలో ఈ నోటిఫికెషన్‌ వచ్చే, ఆ నోటిఫికేషన్‌ వచ్చే అని ప్రచారం చేసుకోవడానికి వీలుండేది. ప్రభుత్వం నుంచి ఉద్యోగాల కల్పన ప్రకటన వచ్చిన నాటి నుంచి కోచింగ్‌ సెంటర్లప్రచాం మొదలు పెట్టేవి.తెలంగాణ వచ్చిన తర్వాత లక్ష ఉద్యోగాలు ఇస్తామని గత బిఆర్‌ఎస్‌పాలకులు చెప్పడంతో గ్రామీణ ప్రాంతాల పట్టభద్రులు పెద్దఎత్తున నగరాలకు చేరుకుంటూ వుండేవారు. ముఖ్యంగా హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, ఉమ్మడిజిల్లాల కేంద్రాలలో పెద్దఎత్తున వెలసిన కోచింగ్‌ సెంటర్లలో చేరేవారు. దాంతో కోచింగ్‌ సెంటర్లకు కోట్లాది రూపాయల ఆదాయం వచ్చేది. కాని ప్రజా ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటిఫికేషన్లు వేయడం నిర్ణీత గడువు ప్రకటించడం, పరీక్షలు నిర్వహించడం కోచింగ్‌ సెంటర్లబొచ్చేలో రాయి వేసినట్లైంది. కోచింగ్‌ సెంటర్లు వెలవెలబోతున్నాయి. కొన్ని దశాబ్ధాలుగా ఏటా కిటకిటలాడే కోచింగ్‌ సెంటర్లు మూసుకోవాల్సిన పరిస్ధితి విచ్చింది. ఆ మధ్య డిఎస్సీ, గ్రూప్‌ వన్‌ ల మీద పెద్దఎత్తున సొమ్ము చేసుకోవాలని చూసిన కోచింగ్‌ సెంటర్లు, అభ్యర్ధులను రెచ్చగొట్టి రోడ్లమీదకుతెచ్చింది. పరీక్షలు వాయిదా వేయాలని ఉద్యమాలు చేయించింది. అయినా ప్రభుత్వం ఇచ్చిన గడువులోగా ఉద్యోగ పరీక్షలు నిర్వహించింది. దాంతో కోచింగ్‌ సెంటర్ల గొంతులో వెలక్కాయ పడినట్లైంది. ఇకపై ప్రభుత్వం తమ చెఫ్పుచేతుల్లో వుండాలన్న ఆలోచనతో కోచింగ్‌ సెంటర్లన్నీ ఏకమై ఎమ్మెల్సీ ఎన్నికల ఖర్చు భరించేందుకు ముందుకు వచ్చి, హరికృష్ణను రంగంలోకి దింపాయి. గుట్టు చప్పుడు కాకుండా కాంగ్రెస్‌ పార్టీనుంచి టికెట్‌ తెచ్చుకునేలా హరికృష్ణ కూడా వ్యూహం పన్నారు. ఎందుకంటే ఆయన ఓ వైపు కాంపిటీటివ్‌ పరీక్షల కోసం పుస్తకాలు రాస్తూ , అదనపు ఆదాయం సమకూర్చుకుంటుంటారు. కోచింగ్‌ సెంటర్లకు ద్వారా వాటిని అమ్ముకుంటుంటారు. ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి గెలిస్తే ప్రభుత్వం కోచింగ్‌ సెంటర్ల చేతిలోకి వెళ్లిపోతుంది. పట్టభద్రుల నుంచి కోచింగ్‌ల పేరిట కోట్లు సంపాదించుకోవాలని చూశారు. కాని హరికృష్ణ ఆశలు కాంగ్రెస్‌ పార్టీ ద్వారా తీరలేదు. ఆయనకు టికెట్‌ రాలేదు. అయినా సరే కొండంత అండగా కోచింగ్‌ సెంటర్లు వుండడంతో ఆయన ఇండిపెండెంటుగా నామినేషన్‌ వేశారు. బిఎస్పీ కండువా కంప్పుకొని తిరుగుతున్నారు. ఈ విషయాలు పట్టభద్రులు తెలుసుకుంటే ఆయన అసలు నిజస్వరూపం తెలిసిపోతుంది. చైతన్య వంతులైన పట్టభద్రులను మోసం చేయడం ఎవరి వల్ల కాదన్నది ప్రజల అభిప్రాయం. ఎన్నికలంటేనే ఎన్నెన్నో లెక్కలు..విద్యలు..ఎత్తులు..జిత్తులు…కథలు…నటనలు..సానుబూతి పవనాలు. .ఇన్ని దాగి వుంటాయి. కాని కొన్ని ఎన్నికలు అలా వుండకూడదు. ముఖ్యంగా పెద్దల సభకు జరిగే ఎన్నికలైనా నీతిగా, నిజాయితీ వుండాలని రాజ్యాంగ పెద్దలు కొన్ని నియమనిబంధనలు ఏర్పాటు చేశారు. రాజకీయ పార్టీలు వాటిని కూడా తుంగలో తొక్కడం అలవాటు చేసుకున్నారు. ఎన్నికల వ్యవస్దలో వున్న లొసుగులను ఆసరాగా చేసుకుంటున్నారు. ఇక తీర్పునివ్వాల్సింది పట్టభద్రులే…

విపక్షాల వైఖరి మారాలి

బలమైన ప్రతిపక్షానికి సహేతుక సిద్ధాంతం అవసరం

కలగూరగంప రాజకీయాల వల్ల ఒరిగేదేమీ వుండదు

 

ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పును గుర్తించని విపక్షాలు

అధికార దాహం తప్ప బలమైన నాయకుడేడీ?

 

ఉచితాలు మితిమీరి మునుగుతున్న రాష్ట్రాలు

ఒక వర్గం ప్రయోజనం కోసం మరో వర్గం బలి!

 

ఇదీ విపక్షాల ‘సెక్యులర్‌’ సిద్ధాంతం!

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

స్వాతంత్య్రం వచ్చిననాటినుంచి పరిశీలిస్తే మనదేశంలో అధికారంలో ఉన్న పార్టీ ఆధిపత్యమే అ ప్రతిహతంగా కొనసాగింది తప్ప, విపక్షాల వాణి ఎప్పుడూ బలహీనంగానే వుంటూ వచ్చింది. కాంగ్రెస్‌కు సైద్ధాంతికంగా బలమైన ప్రత్యామ్నాయాలుగా వున్న కమ్యూనిస్టు పార్టీలు నేడు పూర్తి శిథిలావస్థకు చేరుకున్నాయి. అవినీతికి వ్యతిరేక పోరాటంలో పుట్టుకొచ్చిన ఆమ్‌ ఆద్మీపార్టీ, తె లంగాణ ఉద్యమ నేపథ్యంలో ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రసమితి (తర్వాత బీఆర్‌ఎస్‌గా మా రింది) ప్రాంతీయ పార్టీలు ఇప్పుడు చతికిలపడటం తాజాపరిణామం. సైద్ధాంతిక దివాలకోరుత నంతో అధికారమే పరమావధిగా రాజకీయాలు నడుపుతున్న కాంగ్రెస్‌ అంపశయ్యవైపు అడుగులేస్తోంది. పశ్చిమ బెంగాల్‌లో తృణమూల్‌ కాంగ్రెస్‌ అధికారంలో కొనసాగుతూ వస్తున్నప్పటికీ హింసారాజకీయమే దానికి ఊతంగా నిలుస్తోంది. మొత్తంమీద చెప్పాలంటే దేశంలో విపక్షాలు యుద్ధంలో అన్ని ఆస్త్రాలను కోల్పోయి నిర్వీర్యమైన దుస్థితికి చేరుకున్నాయనడంలో సందేహం లేదు. ఇందుకు ప్రధాన కారణాన్ని విశ్లేషించాల్సిన ఆవశ్యకత ఏర్పడిరది. ముఖ్యంగా విభిన్న సైద్ధాంతిక నేపథ్యాలు కలిగిన బలమైన ప్రతిపక్షాలు ఎంత బలంగా వుంటే ప్రజాస్వామ్యం అంత పటిష్టంగా మనుగడ సాగిస్తుందనేది ఒక అభిప్రాయం. కానీ స్వాతంత్య్రం వచ్చిననాటినుంచి విప క్షాలు బలంగా ఉన్నది ఎప్పుడూ లేదు! బలంగా ఉన్న కొద్దికాలంలో అవి ప్రభుత్వాలను స్థిరంగా పాలన సాగించనివ్వనూ లేదు! ఈ రెండూ చెప్పడానికి విచిత్రంగా వున్నా, అక్షరసత్యం!

ఛరిష్మా రాజకీయాలు

ఏ రాజకీయ పార్టీ అయినా తాము నమ్మిన కొన్ని సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకెళ్లినప్పుడు వారి ఆమోదం లభిస్తేనే దానికి మనుగడ వుంటుందనేది అందరికీ తెలిసిందే. స్వాతంత్య్రం వచ్చిన కొత్తల్లో కాంగ్రెస్‌పై స్వాతంత్య్రోద్యమ ప్రభావం వుండటంవల్ల అప్రతిహతంగా అధికారంలో కొనసాగగలిగింది. ఈ ఛరిష్మాముందు కమ్యూస్టుల సిద్ధాంతాలు పనిచేయలేదు. ఒకదశలో కాంగ్రెస్‌ను ఢీ అంటే ఢీ అనే స్థితి ఏర్పడినా స్వీయ తప్పిదాలు, అంతర్గత సైద్ధాంతిక విభేదాలు కమ్యూనిస్టుపార్టీని దెబ్బతీసాయి. ఒకరకంగా చెప్పాలంటే కాంగ్రెస్‌ పార్టీకూడా సిద్ధాంత నేపథ్యం కంటే, నె హ్రూ, ఇందిరాగాంధీ ఛరిష్మాపైనే నెట్టుకొచ్చింది. ఇప్పుడు ఆ ఛరిష్మా కలిగిన నాయకులు లేకపోవడంతో పార్టీ కోటలు ఒక్కటక్కటిగా కుప్పకూలిపోవడం మొదలైంది. ఇక కమ్యూనిస్టులో పరిపాలనా పరంగా ‘లిబరల్‌’, ‘నియో`లిబరల్‌’ విధానాల మధ్య ఊగిసలాట వైఖరి కొనసాగింది.

అవినీతిపై పోరాటం, వివిధ రాష్ట్రాల్లో ప్రాంతీయ ప్రాధాన్యతల ఆధారంగా కొనసాగే ఉద్యమ నేపథ్యంలో అధికారంలోకి వచ్చే పార్టీల మనుగడ ఆయా పరిస్థితులు చక్కబడేంతవరకే వుంటుంది. ఆయా సమస్యలు తీరిన తర్వాత ప్రజలు సహజంగానే వాటిని మరచిపోతారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో సాధారణ ప్రజలు తమకు కనీసావసరాలపై దృష్టిపెడతారు తప్ప మిగిలినవి వారికి పట్టవు. ఇవి అన్ని వర్గాలు, కులాలు, మతాలవారికీ ఒక్కటే కనుక ప్రస్తుతం రాజకీయ పార్టీలు ‘సంక్షేమం’ పేరుతో ఉచితాలను ఇవ్వడం మొదలుపెట్టాయి. ఇవి ఒక పరిమితిని దాటిపోవడం తో అమలు చేయలేక అధికార పార్టీలు సతమతమవుతుంటే, మరోవైపు రాష్ట్రాల ఆర్థికవ్యవస్థలు కుప్పకూలడం వర్తమాన చరిత్ర! విపక్షాలు చేస్తున్న మరో తప్పిదమేమంటే ‘సెక్యులరిజం’ పేరు తో మెజారిటీ ప్రజలను నిర్లక్ష్యం చేయడం, మైనారిటీలను విపరీతంగా బుజ్జగించడం! ఇదికూడామెజారిటీ ప్రజల్లో వారిపట్ల వ్యతిరేకత పెరగడానికి ప్రధాన కారణం! అదే ముస్లింలు లేదా క్రైస్తవులు బలీయంగా వుండి, హిందువులు మైనారిటీలుగా ఉన్న రాష్ట్రాలు లేదా ప్రాంతాల్లో ఈ పార్టీల వైఖరి మైనారిటీలకు అనుకూలంగా వుండదు. ఈ రెండు నాల్కల ధోరణిని మెజారిటీ వర్గాలుగుర్తించడమే వాటి పతనానికి ప్రధాన కారణం

జాతీయవాదానికి కారణం

ఒక జాతిప్రజలు తమ సంస్కృతిాసంప్రదాయాలకు భంగం వాటిల్లుతుందని భయపడినప్పుడు, వారిలో జాతీయవాదం క్రమంగా పెరుగుతుందనేది వర్తమాన చరిత్ర చెబుతున్న సత్యం. ముఖ్యంగా ప్రజాస్వామ్య దేశాల్లో సెక్యులర్‌ ప్రభుత్వాల మితిమీరిన మైనారిటీ బుజ్జగింపు రాజకీయాలు, జాతీయవాదం ప్రబలడానికి ప్రధాన కారణమవుతున్నాయి. ఒక జాతి తన మనుగడకు ప్ర మాదం వాటిల్లుతుందని లేదా మరొక సంస్కృతి తన అస్తిత్వానికే భంగకరంగా మారిందని భా వించినప్పుడు ఉద్భవించే జాతీయవాదాలు ప్రజాస్వామ్యంలో కొత్త పోకడలను ఆవిష్కరిస్తాయి. ఐరోపా దేశాలు ప్రస్తుతం ఈ పోకడలకు గొప్ప ఉదాహరణ. మనదేశంలో జమ్ముాకశ్మీర్‌కు చెందిన నాలుగు లక్షలమంది కాశ్మీరీ పండిట్లు ఇప్పుడు స్వదేశంలోనే కాందిశీకులుగా బతుకులీడవా ల్సిన దుస్థితికి ఇస్లామిక్‌ ఉగ్రవాదంతో పాటు, సెక్యులర్‌ పార్టీల పక్షపాత, నిర్లక్ష్య ధోరణి ప్రధాన కారణం. సెక్యులర్‌ ప్రభుత్వాల మితిమీరిన బుజ్జగింపు రాజకీయాలకు విసిగిన ప్రజలు క్రమం గా జాతీయవాద పార్టీ అయిన బీజేపీ వైపు మొగ్గు చూపారు. దాదాపుగా ఇదే పరిస్థితి యూరప్‌ దేశాల్లో ప్రస్తుతం నెలకొంది. ఇస్లామిక్‌ ఉగ్రవాదం కారణంగా తమ అస్తిత్వానికి భంగం వాటిల్లుతున్నదని అక్కడి ప్రజలు భయపడుతుండటంతో క్రమంగా అక్కడ జాతీయవాద పార్టీలు అధికా రంలోకి రావడమో, పెద్ద పార్టీలుగా అవతరించడమో జరుగుతోంది. 2010కి ముందు ఈ దేశాల్లో మొత్తం పోలైన ఓట్లలో జాతీయవాద పార్టీల వాటా 3% కంటే తక్కువ వుండేది. తర్వాతి కా లంలో స్వీడన్‌లో 12%కు, ఫిన్లాండ్‌లో 18%, హంగరీలో 19%కు పెరగడం ఆయా దేశాల సా మాజిక వర్గాల్లో పెరుగుతున్న సాంస్కృతిక అభద్రతాభావానికి చిహ్నం. ఈ పరిణామాలను మన దేశంలో కమ్యూనిస్టులతో సహా సెక్యులర్‌ పార్టీలుగా చెప్పుకునేవారు గుర్తించకపోవడం విచారకరం. 

ప్రాధాన్యత లేని అంశాలపై పోరు

పెట్టుబడిదార్లను, భూస్వాములను వ్యతిరేకిస్తూ ప్రాభవంలోకి వచ్చిన కమ్యూనిస్టు పార్టీలు తమ ప్రాభవం కోల్పోవడానికి ప్రధాన కారణం ఈ రెండు అంశాలకు ఇప్పుడు ప్రాధాన్యత లేకపోవడమే. ఒక పెట్టుబడిదారు సంస్థను స్థాపిస్తే ఎంతోమందికి ఉద్యోగ, ఉపాధి లభిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థల్లో ట్రేడ్‌యూనిన్లు హక్కులకోసం పోరాటం తప్ప, బాధ్యతలపై దృష్టిపెట్టకపోవడంతోఅవి దేశ ఆర్థిక వ్యవస్థకే గుదిబండల్లా మారిపోయి, చివరకు ప్రైవేటీకరణకు గేట్లు తెరవాల్సిన పరిస్థితి ఏర్పడిరది. ఇక భూస్వామ్య వ్యవస్థ విషయానికి వస్తే ఇప్పుడు ప్రతిదీ కార్పొరేటీకరణ జరుగుతున్న కాలం ఇది. జనాభా విపరీతంగా పెరిగి కమతాల విస్తీర్ణం కుంచించుకుపోతున్న నేప థ్యంలో ఎవరికీ కడుపునిండని దుస్థితి! ఈ నేపథ్యంలో ప్రజల ఆలోచనా విధానాల్లో సమూల మార్పులు వచ్చేశాయి. లాభదాయకమైన ఉపాధి అవకాశాలవైపు దృష్టి సారించడం మొదలవడంతో భూస్వామ్య వ్యవస్థపై పోరాటానికి విలువేలేకపోయింది. సాయుధపోరాటం పేరుతో వాపపక్షతీవ్రవాదం ఇప్పుడు శాంతిభద్రతల సమస్యను సృష్టిస్తోంది. దీనికి తోడు ముస్లిం మత ఛాందస వాదం ప్రపంచ దేశాల అస్తిత్వానికే ప్రమాదకరంగా మారింది. అభివృద్ధి నిరోధకంగా, హింసను ప్రజ్వరిల్లజేస్తున్న ఈరెండు రకాల ఉగ్రవాదాలను కఠినంగా అణచివేయాలని ప్రపంచ దేశాలు నిర్ణయించిన నేపథ్యంలో వీటికి ప్రజలనుంచి మద్దతు లభించదు. వామపక్ష ఉగ్రవాద సమర్థకు లు ‘యుద్ధం’, ‘రణరంగం’ వంటి అతిపెద్ద పదాల ప్రయోగం చేస్తుంటారు. బలమైన వ్యవస్థతో సాయుధపోరాటం పనిచేయదన్నది ప్రపంచ వ్యాప్తంగా నిరూపితమైన సత్యం. తమ భావజాలాన్నిమార్చుకొని వర్తమాన పరిస్థితులకు అనుగుణంగా మలచుకుంటే, ప్రజల్లో మద్దతుకోసం ముందుకు సాగవచ్చు. అసలు ప్రపంచ వ్యాప్తంగా యుద్ధ తంత్రమే మారిపోయిన కాలమిది. ఇక ముందు ఆయుధాలు పనిచేయవు! అంతా డిజిటల్‌ పద్ధతిలోనే యుద్ధాలు జరుగుతాయి!

చరిత్ర ఒకప్రవాహం

చరిత్ర అనేది ఒక ప్రవాహం వంటిది. ఒక్కో కాలంలో ఒక్కో వాదం, సిద్ధాంతం బహుళ ప్రాచు ర్యం పొందుతాయి. ఒక కాలంలో ప్రధాన సమస్యగా వున్నది అనంతరకాలంలో కనుమరుగు కావచ్చు. ఎందుకంటే ఆ సమస్యపై ఆ కాలంలో జరిగిన పోరాటం విజయం సాధించడం వల్ల. ఆసమస్యకు పరిష్కారం లభించిన తర్వాత ఇక ఆ వాదంతో పనివుండదు. కానీ అదేవాదాన్ని పట్టుకు వేలాడతానన్న వారికి మనుగడ వుండదు! దళితవాదం, స్త్రీవాదం వంటి అనేక వాదాలు ఒకప్పుడు బహుళ ప్రచారం పొందడానికి ప్రధాన కారణం ఆయా వర్గాలు తీవ్ర అణచివేతను ఎదు ర్కొనడం! ఈ సిద్ధాంతాల నేపథ్యంలో జరిగిన సంఘర్షణ పుణ్యమాని వీరిపై అణచివేత తగ్గుముఖం పట్టడంతో క్రమంగా ఆయావాదాలు కనుమరుగైపోతాయి. ఇప్పుడు క్రమంగా పురుషుల పైవేధింపులు పెరుగుతున్నాయి! మరిప్పుడు ‘పురుషవాదం’ రావాలా? పిల్లల్ని మేమెందుకు కనాలి? అనే ధోరణి క్రమంగా పెరుగుతున్న రోజులివి. ఈ నేపథ్యంలో సాంకేతిక సహాయంతో బిడ్డలను కనేరోజులు మొదలయ్యాయి! ఇంతటి మార్పు వస్తున్న తరుణంలో స్త్రీవాదం పనిచేస్తుందా? సామాజికంగా సమానత్వం పరిఢవిల్లుతున్న నేటి కాలంలో పేదరిక నిర్మూలన, ఉపాధికే ప్రాధా న్యత వుంటుంది తప్ప దళితవాదానికి ప్రాధాన్యత ఎక్కడ? హింసకు లేదా అత్యాచారానికి గురైన వ్యక్తి పేద లేదా మహిళ లేదా మరే ఇతరులైనా చట్టపరమైన న్యాయాన్ని పొందడానికి అర్హులవుతారు. పీడితుడికి కులం, మతం, ప్రాంతం అనేవి వుండవు. ఎవరైనా వేధింపులకు గురైనప్పుడు పోలీసులను ఆశ్రయించి న్యాయం పొందవచ్చు. మహామహులు, తాము గొప్ప నాయకులనుకుంటున్నవారే జైళ్లకు వెళ్లే రోజులివి! 

విపక్షాల మార్కు సెక్యులరిజం

ఇంత విశ్లేషణ తర్వాత మనకు అర్థమయ్యేది ఒక్కటే! మెజారిటీ, మైనారిటీ, ధనిక, పేద అనే తే డా లేకుండా అందరికి సమానత్వం, సమాన న్యాయం జరగడమే సెక్యులరిజం. కానీ విపక్షాలు సెక్యులరిజం పేరుతో తమకు ప్రయోజనం వుంటుందనుకున్న వర్గాన్ని మాత్రమే వెనకేసుకొచ్చి, మరొక వర్గాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాయి. విపరీత స్థాయిలో బుజ్జగింపులకు పాల్పడుతున్నాయి. ఇదే వాటి పతనానికి ప్రధాన కారణం! ఓట్లకోసం సైద్ధాంతిక నిబద్ధతను గాలికొదిలేయడం విపక్షాలు వరుస పరాజయాలు ఎదుర్కొనడానికి మరో కారణం! నిజం చెప్పాలంటే మైనారిటీల పేరు తో ‘మతవాదాన్ని’ సమర్థిస్తున్నవి ఈ పార్టీలే. మెజారిటీ వర్గం మేల్కంటే, దాన్ని ‘మతోన్మాదమంటూ’ గగ్గోలు పెట్టడం వీటికి ఫ్యాషనైపోయింది. ఇప్పటికీ ఇవి తమ లోపాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేయడంలేదంటే, ఈ వాస్తవాన్ని ఇంకా గుర్తించలేదని అర్థం. సైద్ధాంతిక నిబద్ధత కలిగిన కమ్యూనిస్టులు తమ సిద్ధాంతాలను కాలానుగుణంగా, మనదేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మార్పుచేసుకోవడానికి అంగీకరించరు. అధికారం పొందడం మాత్రమే సిద్ధాంతంగా కలిగిన మిగిలిన పార్టీలు తమ విపరీత పోకడలను మార్చుకోరు. మనదేశంలో విపక్షాలు బలోపేతం కాకపోవడానికి ఇది మరో కారణం! లౌకికవాదం ముసుగులో రాజ్యాంగాన్ని హతమార్చి హిం దువులకు వ్యతిరేకంగా వ్యవహరించిన కాంగ్రెస్‌ భయంకరమైన పాపాన్ని మూటకట్టుకుంది. 1975 నుంచి 1977 మధ్య 21నెలల పాటు ఎమర్జెన్సీ కాలంలో అరెస్టయింది, నష్టపోయింది హిందువులే! దేశాన్ని తల్లిగా పేర్కొంటూ, మాతృప్రేమను పెపొందించేది భాజపా, ఆర్‌ఎస్‌ఎస్‌లు మాత్రమే! కులం, ప్రాంతం, భాష అనే కుంపట్ల మధ్య కునారిల్లుతున్న హిందువుల్లో తాము హిందువులమన్న జాగృతిని కలిగించింది కేవలం అయోధ్య రామమందిరం మాత్రమే. విభిన్న త్వం పేరుతో ప్రజలమధ్య విభేదాలు సృష్టిస్తూ ఓట్లను దండుకోవడానికి ప్రయత్నిస్తున్న విపక్షాల కుచ్చిత నీతిని ప్రజలు గుర్తించడంవల్లనే వాటికి ప్రస్తుత దుస్థితి. నేడు ప్రజలు ఒక సత్యాన్ని బాగా గుర్తించారనుకోవాలి. ఏంటంటే సన్యాసులు (కర్మయోగులు) పాలిస్తే కోట్లరూపాయల మిగు లు బడ్జెట్‌ వుంటోంది. అదే సన్నాసులు (స్వార్థపరులు) పాలిస్తే అప్పులే గతి!

సామాజిక న్యాయానికి కేరాఫ్‌ కాంగ్రెస్‌

`అంతర్గత ప్రజాస్వామ్యం.. సామాజిక న్యాయం!

`కాంగ్రెస్‌ కే చెల్లిన ఆదర్శ రాజకీయం

`అన్ని వర్గాలకు సముచిత స్థానం కాంగ్రెస్‌లోనే సాధ్యం

`ఉమ్మడి రాష్ట్రంలోనూ అనుసరించిన విధానం.. సమ ప్రాధాన్యం

`ఇప్పుడూ కాంగ్రెస్‌లో అందరికీ అందుతున్న పదవుల పంపకం

`మహిళా సాధికారతలోనే కాంగ్రెస్‌ పార్టీదే పై చేయి

`మహిళా విభాగానికి సైతం కాంగ్రెస్‌లో అధిక ప్రాధాన్యత

`పిసిసికి సమానంగా విభాగాలున్న ఏకైక పార్టీ కాంగ్రెస్‌

`అత్యధికంగా మహిళా ముఖ్యమంత్రులను చేసిన పార్టీ కాంగ్రెస్‌

`ఉత్తర ప్రదేశ్‌ రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రి సుచేత కృపలాని

`యుపి తొలి గవర్నర్‌ సరోజినీ నాయుడు

`కాంగ్రెస్‌ పార్టీ తొలి జాతీయ అధ్యక్షురాలు కూడా

`ఉప ప్రధానిగా, ముప్పై సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా పనిచేసిన జగ్జీవన్‌ రాం

`అన్ని స్థాయిలలో ఎస్సీ, ఎస్టీలకు రాజకీయ ప్రాధాన్యం కల్పించిందే కాంగ్రెస్‌

`సామాజిక న్యాయంలో కాంగ్రెస్‌ ను మించిన పార్టీ లేదు

`ఇప్పుడు కూడా ఏఐసిసి. అధ్యక్షుడు ఖర్గే వున్నారు

`తెలంగాణలోనూ సమన్యాయ పాలన

`బీసీలకు సముచితమైన అవకాశాల కోసం కులగనణ

`పేద వర్గాల అభ్యున్నతి కాంగ్రెస్‌ తోనే

`అన్ని తరగతుల ప్రజల అభివృద్ధి కాంగ్రెస్‌ లోనే..

`రాజకీయ సమ ప్రాధాన్యత కేవలం కాంగ్రెస్‌ కే సొంతం

హైదరాబాద్‌,నేటిధాత్రి:
వాడుకోవడానికి వర్డ్‌ బాగుంది కదా! అని అందరూ సామాజిక న్యాయం అనే పదం వాడుతుంటారు. కాని అందులో నిజమెంత? దానిని అనుసరించే పార్టీల విజ్ఞతెంత? రాజకీయ పార్టీల నైతికతెంత? వారు అనుసరిస్తున్న విదానమెంత? అని చూసుకుంటే కాంగ్రెస్‌ పార్టీ అన్ని పార్టీ పార్టీలకంటే ఒకింత మేలనే చెప్పాలి. ఆది నుంచి చూసినా, ఇప్పుడు పరిశీలించినా కాంగ్రెస్‌ ఫార్టీ జరిగేంత సామాజిక న్యాయం మరే పార్టీలోనూ జరగదు. కాని తమ పార్టీలలో ఆ సామాజిక న్యాయం అనుసరించని పార్టీలన్నీ కాంగ్రెస్‌ను నిందిస్తుంటాయి. మన తెలుగు ఉమ్మడి రాష్ట్రంలో చూసినా, ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాలలో చూసినా ఆయా పార్టీలలో ఎంత సామాజిక న్యాయం అమలు జరుగుతుందన్నది చూస్తే జల్లడ వేసినా కాంగ్రెస్‌ తప్ప మరో పార్టీ కనిపించదు. తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ వస్తే దళితుడే తొలి ముఖ్యమంత్రి అని కొన్ని వందల వేల సార్లు చెప్పింది కేసిఆర్‌. కొన్నివందల సార్లు తాను కాపాలా కుక్కలా వుంటానే తప్ప తెలంగాణకు ఎట్టిపరిస్ధితుల్లోనూ తొలి ముఖ్యమంత్రి దళితుడే అన్నారు. కాని తీరా బిఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలోకివచ్చిన తర్వాత కేసిఆర్‌ చేసిందేమిటి? కుర్చీలో తాను కూర్చున్నాడు. కీలక పదవులన్నీ రెండు సామాజిక వర్గాల చేతుల్లో పెట్టేశాడు. ప్రాధాన్యత లేని పదవులను కూడా కొన్ని సార్లు బిసిలకు, దళితులకు, గిరిజనులకు ఇచ్చేందుకు చేతులురాలేదు. కాని కాంగ్రెస్‌ పార్టీలో అలా వుండదు. కొంత రెడ్డి సామాజిక వర్గానిది కాంగ్రెస్‌ పార్టీలో పై చేయి వుంటుందన్నది వాస్తవం. కాని పూర్తిగా వారిదే పై చేయి వుంటుందనేది కూడా నిజం కాదు. బిసి నాయకులు ఎంతో మంది కాంగ్రెస్‌లో కీలక భూమికపోషించారు. ఇప్పుడూ క్రియాశీలక పాత్రలో వున్నారు. దేశంలోనే అన్ని వర్గాల ప్రజలకు అన్నింటా న్యాయం చేసిన పార్టీ ఏదైనా వుందంటే అది కాంగ్రెస్‌ పార్టీయే. ఎందుకంటే దేశ స్వాతంత్య్ర ఉద్యమ కాలంలోనే సరోజినీ నాయుడుకు 1927లో జాతీయ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలును చేసింది. అసలు స్వాతంత్య్రోమ కాలంలో మహిళలకు అంత పెద్ద పదవి అందుతుందని ఎవరూ ఊహించలేదు. కాని తాను ఆ పదవి చేపట్టేందుకు సిద్దంగా వున్నానని చెప్పిన సరోజనీ నాయుడును కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షురాలని చేశారు. అంతే కాదు స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఉత్తరప్రదేశ్‌ గవర్నర్‌గా సరోజినీ నాయుడుకు అవకాశంకల్పించారు.1963లో ఉత్తర ప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా సుచేతా కృఫలానీని చేసిన ఘనతకాంగ్రెస్‌దే. అంతే కాకుండా కాంగ్రెస్‌ పార్టీ ఐదుగురు మహిళలను ముఖ్యమంత్రులను చేశారు. ఒడిషాకు చెందిన నందినీ సత్పతి, అస్సాంలో అన్వారా, డిల్లీ షీలా దీక్షిత్‌, పంజాబ్‌ రాజీందర్‌ కౌర్‌లను ముఖ్యమంత్రులను చేసింది కాంగ్రెస్‌ పార్టీ. కాని అది బిజేపిలో సాద్యమా? జన్‌సంఫ్‌ులో సాధ్యమైందా? ఆర్‌ఎస్‌ఎస్‌లో సాధ్యమౌతుందా? దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటి మహిళా ముఖ్యమంత్రిని కూడా కాంగ్రెస్‌ పార్టీయే చేసింది. బిజేపిలో ముఖ్యమంత్రిగా పనిచేసిన ఉమా భారతి పరిస్దితి ఏమిటి? ఆమెను క్రియాశీల రాజకీయాలకు ఎందుకు దూరం చేశారు? ఎవరు దూరం చేశారు? బిజేపిలో జాతీయ అధ్యక్షురాలిగా మహిళను నియమించగలరా? కాని కాంగ్రెస్‌లో మహిళా విభాగం కూడా ప్రత్యేకంగా వుంటుంది. ఆ విభాగం కూడా కీలక భూమిక పోషిస్తుంది. కాని ఇతర పార్టీలలో ఆ విభాగాలు వున్నా, ఉత్సవ విగ్రహాలుగానే వుంటారు. తప్ప ఎక్కడా పార్టీ కమిటీకి సరిసమానమైన ప్రాధాన్యత వుండదు. కాంగ్రెస్‌ పార్టీలో చాల వరకు ఆ మహిళా విభాగానికి ఎంతో ప్రాదాన్యత వుంటుంది. అలా మహిళా అధ్యక్ష పదవులు నిర్వహించిన వాళ్లు మంత్రులయ్యారు. రాష్ట్ర రాజకీయాలను శాసించారు. అందులో గల్లా అరుణకుమారి. గీతారెడ్డి లాంటి వారు అనేక మంది వున్నారు. వాళ్లు ఎమ్మెల్యేలయ్యారు. పురుషాదిక్య సమాజంలో సమాన పాత్రలు పోషించారు. కాని బిజేపిలో ఆ పరిస్ధితి ఎక్కడా కనిపించదు. ఇదే విషయాన్ని పార్లమెంటులో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ దేశమంతా ప్రచారం చేస్తున్నారు. బిజేపిలో వ్యక్తి పూజలు ఎక్కువయ్యాయి. మహిళా ప్రధాన్యత తగ్గిపోయింది. పైగా సామాజిక న్యాయం అడుగంటిపోయింది. కేంద్ర మంత్రి వర్గంలో ఎక్కువ శాతం ఉన్నత కులాలకుచెందిన నాయకులే వున్నారు. కీలకభూమికపోషిస్తున్నారు. ఉన్నత వర్గాలు కీలకంగా లేని రాష్ట్రాలలో మాత్రమే ఇతర వర్గాలకు కొంత గుర్తింపునిస్తున్నారు. తప్ప ఎక్కడా బిజేపి సామాజిక న్యాయాన్ని పాటించడం లేదు. కేవలం ప్రధాని పదవిని చూపించి, బిజేపి రాజకీయం చేస్తోంది. ఆ విషయాన్ని కూడా ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. ప్రదాని మోడీ బిసి కాదని తేల్చేశారు. అది జీర్ణించుకోలేని బిజేపి కుల రాజకీయాలను ముందు పెడుతోంది. కాని దేశంలో కుల గణనను మాత్రం తొక్కి పెట్టేస్తోంది. జనాభా గనణ చేపడితే బిసిల సంఖ్య తేలుతుంది. అన్ని కులాల లెక్కలు తేలుతాయి. దాంతో రాజకీయంగా రిజర్వేషన్ల శాతం పెంచాల్సి వస్తుంది. ఉన్నత వర్గాలకు అన్యాయం జరుగుతుంది. అందుకే బిజేపి జనాభా గణనకు ముందుకు రావడం లేదు. నిజానికి 2021లోనే జనాభా గణన జరగాలి. కాని ఇప్పటి వరకు చేపట్టలేదు. ఆలస్యానికి కారణం చెబుతోందే తప్ప, కుల గణన సంగతి మాట మాత్రమైనా చెప్పడం లేదు. కుల గణన చేపడితే దేశ రాజకీయాల్లో పెనుమార్పులు వస్తాయని బిజేపి భయపడుతోంది. కాని కాంగ్రెస్‌ పార్టీ ఏనాడు అలా వెనుకడుగు వేయలేదు. దేశంలో డెబ్బై ఏళ్ల స్వాతంత్య్ర దేశంలో జనాభా గణన, కుల లెక్కలు తేల్చకుండా వుండలేదు. కాని బిజేపి లెక్కలు అనగానే భయపడుతోంది. ఇటీవల రాహుల్‌ గాందీ చేసిన కొన్ని వ్యాఖ్యలు సంచనాలయ్యాయి. దేశ బడ్జెట్‌ రూపకల్పనలో పాలు పంచుకునేంత శక్తి బిసి, ఎస్సీ, ఎస్టీ అధికారులకు లేదా? వారి ఎంపిక చేయాల్సిన అవసరం లేదా? బడ్జెట్‌ రూపకల్పనలో ఉన్నత కులాల అదికారులకే బాధ్యతలా? ఆఖరుకు హల్వాతినడానికి కూడా ఇతర అధికారులు అర్హులు కారా?అంటూ నిలదీశారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన పాలనా వ్యవహారాలలో కీలక భూమిక పోషించే అదికారులు కూడా ఉన్నత వర్గాలేనా? అంటూ ప్రశ్నించారు. కాని కాంగ్రెస్‌ పార్టీపై అలాంటి ప్రశ్నలు లేవనెత్తేందుకు బిజేపికి ఎక్కడా అవకాశం లేదు. రాజ్యాంగ రచనాసంఘం అధ్యక్షుడు డాక్టర్‌.బిఆర్‌.అంబెద్కర్‌ ప్రత్యక్ష్య ఎన్నికల్లో ఓడిపోతే, ఆయనను రాజ్యసభకు నామినేట్‌ చేసి మంత్రిని చేసింది ప్రదాని నెహ్రూ. కాని బిజేపి పార్టీ చెప్పే మాటల్లో ఎంత మాత్రం నిజం లేదు. కాంగ్రెస్‌ పార్టీలో దళిత నాయకుడైన బాబూ జగ్జీవన్‌రాం ఉప ముఖ్యమంత్రి పదవిని నిర్వహించారు. అంతే కాదు సుమారు 30 సంవత్సరాల పాటు కేంద్ర మంత్రిగా పనిచేసిన ఏకైక నాయకుడు జగ్జీవన్‌ రాం. అంతగా ఆయనకు ప్రాదాన్యత కల్పించిన పార్టీ కాంగ్రెస్‌ పార్టీ. మరి బిజేపిలో ఒక దళిత నాయకుడికి ఇంతటి ప్రాదాన్యత దక్కుతుందా? ఊహించగలమా? ఇప్పుడు కూడా తెలంగాణలో మంత్రి వర్గంలో కూడా చాల వరకు న్యాయం జరిగింది. ఇంకా జరగాల్సి వుంది. కానీ ఎన్నికల ముందు ఇచ్చిన హమీ మేరకు కుల గణన చేశారు. 42శాతం బిసిలకు రిజర్వేషన్‌ కల్పించేందుకు సిద్దంగా వున్నారు. బిఆర్‌ఎస్‌లో దళితులకు , బిసిలకు కాంగ్రెస్‌లో కనిపించేంత సామాజిక న్యాయం ఊహించగలమా? 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కేసిఆర్‌ తన తొలి ఐదేళ్ల పాలనా కాలంలో ఒక్క మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. ఇది పాలనలో మహిళా నాయకులను చిన్న చూపు చూడడం కాదా? డిప్యూటీ స్పీకర్‌ పదవి ఇచ్చినా అది ఉన్నత వర్గానికే కట్టబెట్టారు. కాని కాంగ్రెస్‌ ప్రభుత్వంలో ఇద్దరు మహిళా మంత్రుకు చోటు కల్పించారు. అందులోనూ ఒకరు బిసి, మరొకరు ఎస్టీకి కేటాయించారు. కొండా సురేఖ, ధనసరి అనసూయ( సీతక్క)ను మంత్రులు చేశారు. బిసిలకు కూడా బిఆర్‌ఎస్‌ కన్నా మెరుగైన స్ధానమే కల్పించారు. సామాజిక న్యాయం చేసేందుకు ప్రయత్నం జరిగింది. కాకపోతే పదేళ్ల పాటు పార్టీ కోసం పని చేసిన నాయకుల్లో ఎక్కువగా ఉన్నత వర్గాల నాయకులే వున్నారు. ఇక తెలంగాణ ప్రకటించిన వెంటనే రాష్ట్ర కాంగ్రెస్‌ భాధ్యతలు పొన్నాల లక్ష్మయ్యకు కట్టబెట్టారు. కాని ఆయన తన వల్ల కాదని ఆ పదవిని వద్దనుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువే..సామాజిక న్యాయం ఎక్కువే.. ఆ రెండు లక్షణాలులేని ఇతర రాజకీయ పార్టీలు కాంగ్రెస్‌ నిందిస్తామంటే జనమే మెచ్చరు.

బిహార్‌లో నితిశ్‌ వారసుడిగా నిశాంత్‌?

నితిష్‌ నిష్క్రమణ తర్వాత జేడీయూ విలీనానికి భాజపా ప్రణాళిక

వయసు, ఆరోగ్య సమస్యలతో నితిష్‌

నిశాంత్‌ అరంగేట్రాన్ని స్వాగతిస్తున్న పార్టీలు

నితిష్‌ వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకం

మరో ఇద్దరు సోషలిస్టు నాయకుల తనయులు ఇప్పటికే రాజకీయాల్లో…

పార్టీ మనుగడకోసం నితిష్‌ సర్దుకుపోతారా?

రాష్ట్రంలో తిరుగులేని బలంతో ఎన్డీఏ కూటమి

నేటిధాత్రి డెస్క్‌:

బిహార్‌లో ఈ ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. ఢల్లీి పీఠం కైవసంతో, రాష్ట్రంలోని భాజపా వర్గాల్లో జోష్‌ నెలకొంది. మొత్తం 243 అసెంబ్లీ స్థానాల్లో 225 కైవసం చేసుకోవాలన్నది వీరి లక్ష్యం. అవసరమైతే ఒంటరిపోరుకూ సై అంటున్నప్పటికీ, బిహార్‌లో ఇప్పటికీ అత్యంత చరిష్మా కలిగిన నాయకుడు జెడీయూ అధినేత నితిష్‌కుమార్‌ మాత్రమే! ఈ నేపథ్యంలో పార్టీ కేంద్రనాయకత్వం మాత్రం నితిష్‌ నేతృత్వంలోనే ఈసారి ఎన్నికల్లో పోటీచేయాలన్న స్పష్టమైన ఉద్దేశంతో వుంది. ప్రస్తుతం భాజపా`జేడీయూ`ఎల్‌జేపీలు కాంబినేషన్‌ను ఆర్‌జేడీ`కాంగ్రెస్‌ కూటమి ఎదుర్కొనే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనే ఆర్‌జేడీ నేత తేజస్వినీ యాదవ్‌కు నితిష్‌కుమార్‌పై దింపుడు కళ్లం ఆశలున్నాయి. చివరిదశలోనైనా బీజేపీకి థమ్కా ఇచ్చి తమ కూటమిలో చేరితే తిరుగుండదని భావిస్తున్నా, నితీష్‌ నిలకడలేని వైఖరి, ఆయన ఆరోగ్యం అంతంత మాత్రంగా వుండటం వంటి ప్రతికూలతలు ఇబ్బందిగా మారాయి. అదీకాకుండా ప్రస్తుతానికి ఆయనకు కేంద్రంలోని భాజపాతో ఎటువంటి పొరపొచ్చాలు లేవు. కేంద్ర నాయకత్వం పటిష్టంగా వుండటం తో తోకజాడిరపు రాజకీయాలు ఇప్పుడు పనిచేయవన్న సంగతి ఆయనకు బాగా తెలుసు. దీనికితోడు వయోభారం, అనారోగ్యంతో ఇబ్బందులు ఎలాగో వున్నాయి. ఇదిలావుండగా రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని కేంద్రం ఈసారి బడ్జెట్‌లో బిహార్‌కు ముఖ్యంగా యువత, స్త్రీలు మరియు పేదలను దృష్టిలో వుంచుకొని అనేక రాయితీలు ప్రకటించిన నేపథ్యంలో ఈసారి భాజపాకు తిరుగుండదన్న అభిప్రాయం కూడా రాష్ట్ర నాయకత్వంలో వుంది. రాష్ట్రంలోని మిథిలా ప్రాం తంలో మఖనా పంటను అధికంగా సాగుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్‌లో ఈ మఖ నా బోర్డు ఏర్పాటు చేస్తున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశ పెట్టిన సందర్భంగా ప్రకటించారు. అంతేకాదు పశ్చిమ కోశి కాల్వ ప్రాజెక్టు, నేషనల్‌ ఇన్‌స్టిట్యూ ట్‌ ఆఫ్‌ ఫుడ్‌ టెక్నాలజీ, పాట్నాలోని ఐఐటీ విస్తరణ వంటి వరాలను కూడా ప్రకటించడం గమనార్హం.

ఈనెల 24న ప్రధాని పర్యటన

ఫిబ్రవరి 24న ప్రధాని నరేంద్రమోదీ భాగల్పూర్‌లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా 18వ విడత ‘పి.ఎం. కిసాన్‌ సమ్మాన్‌ నిధి’ని దేశవ్యాప్తంగా రైతులకు వారివారి ఖాతాల్లో జమచేయనున్నారు. బిహార్‌కు చెందిన 83లక్షల మంది రైతులకు ఈ నిధులు అందుతాయి. ప్రధాని నరేంద్రమోదీ ఈ పంపిణీ కార్యక్రమాన్ని బిహార్‌లో చేపట్టడం, రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే నన్న సంగతి స్పష్టమవుతోంది. ఇదే సమయంలో లబ్దిదారులో ప్రధాని వర్చువల్‌గా ముచ్చటిస్తా రు. అంతేకాకుండా రాష్ట్రంలో రూ.15వేల కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు ఆయన శంకు స్థాపన చేయనున్నారు. ప్రస్తుతం నితీష్‌కుమార్‌ నేతృత్వంలోని జేడీయూకు చెందిన 12 మంది ఎంపీలు, కేంద్రంలోని ఎన్‌డీఏ ప్రభుత్వానికి మద్దతునిస్తున్నారు. రాష్ట్ర బీజేపీ వర్గాల్లో ఒంటరిగా పోటీచేయాలన్న ఉద్దేశమున్నప్పటికీ, తిరుగులేని నితిష్‌కుమార్‌ చరిష్మాముందు ఎవరూ నిలబడటం కష్టమన్న సంగతి వారికి బాగా తెలుసు. నితిష్‌ తర్వాత జేడీయూలో ఎవరనేదానికి ప్రస్తు తానికి సమాధానం దొరకడం కష్టం. ప్రస్తుతం ఆయన పేరుమీదనే పార్టీ మనుగడ సాగుతోంది.

పోస్టర్‌ రాజకీయం

ఇదిలావుండగా ఫిబ్రవరి 12న బిహార్‌ రాజధాని పాట్నాలో వెలిసిన ఒక పోస్టర్‌ అందరిని ఒక్క సారి ఆశ్చర్యంలో ముంచెత్తింది. దీన్ని కాంగ్రెస్‌ నాయకుడు రవికుమార్‌ గోల్డెన్‌ ఏర్పాటుచేశారు.నలంద జిల్లాలోని హర్నౌట్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి తాను పోటీ చేస్తున్నట్టు ఆయన ఈ పోస్టర్‌లో పేర్కొనడమే అందరినీ ఆకర్షించడానికి ప్రధాన కారణం. నిజానికి ఈ స్థానం గత 20ఏళ్ళుగా జె.డి(యు)కు కంచుకోటగా కొనసాగుతోంది. జె.డి(యు) అధినేత, ముఖ్యమంత్రి నితిష్‌కుమార్‌ ఈ స్థానంనుంచే గెలుపొందారు. 2005కు ముందు ఈ స్థానంలో సమతాపార్టీ బలంగా వుండేది. ఈ పార్టీని నెలకొల్పింది ఎవరో కాదు. నితిష్‌కుమార్‌, మాజీ రక్షణశాఖ మంత్రి జార్జ్‌ ఫెర్నాండెజ్‌తో కలిసి ఈ పార్టీని ఏర్పాటు చేశారు. ఇదిలావుండగా రవికుమార్‌ గోల్డెన్‌ స్వగ్రా మం కూడా ఇదే నియోజకవర్గంలో వుంది. ఈ గ్రామం పేరు కళ్యాణ్‌ బిఘా. హరినారాయణ్‌ సింగ్‌ అనే సీనియర్‌ జేడీ(యూ) నాయకుడు 2010 నుంచి ఈ స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.2020లో హర్నౌట్‌ స్థానంనుంచి కాంగ్రెస్‌ తరపున టిక్కెట్‌ కోసం యత్నించిన రవికుమార్‌ గోల్డె న్‌ సక్సెస్‌ కాలేదు. ఈసారి తనకు పార్టీ టిక్కెట్‌ లభిస్తుందన్న ఆశ వున్నా, ఈ స్థానం లో నితిష్‌ కుమార్‌ తన కుమారుడు నిశాంత్‌కుమార్‌ను నిలబెడితే తన గెలుపు కష్టమన్న భయం కూడా ఆయన్ను వెన్నాడుతోంది. కాగా ఇదంతా టిక్కెట్‌ కోసం పోస్టర్‌ స్టంట్‌ అని భాజపా, జెడీ (యు)లు కొట్టిపారేస్తుండగా, కాంగ్రెస్‌ దీనిపై ఇప్పటివరకు ఏవిధమైన కామెంట్‌ చేయలేదు.

రాజకీయాలకు దూరంగా నిశాంత్‌

నిశాంత్‌ కుమార్‌ బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌ పూర్తిచేసారు. ఆయన రాజకీయాల్లోకి రావడానికి ఇంతవరకు ఉత్సాహం చూపడంలేదు. పుస్తకపఠం, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, భజనలు…ఇవీ ఆయన వ్యాపకం. నితిష్‌కుమార్‌కు నిబద్ధ రాజకీయవేత్తగా రాష్ట్రంలో పేరుంది. తన వారసులను తీసుకొచ్చేందుకే రాజకీయాలు నడపరన్న మంచిపేరును తెచ్చుకున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే, ఇప్పటివరకు రాజకీయాలకు దూరంగా ఆధ్యాత్మిక జీవనానికి ప్రాధాన్యమిస్తున్న నిశాంత్‌ ఇక రాజకీయాల్లోకి అడుగుపెడతారన్న వార్తలు రాష్ట్రంలో జోరుగా సాగుతున్నాయి. ఇందుకూ కారణం లేకపోలేదు. 2015లో ఆర్‌జేడీ`జేడీయూ అలయన్స్‌ ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పుడు నితిష్‌కుమార్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకార కార్యక్రమానికి నిశాంత్‌ హాజరయ్యాడు. ఇదే ఎన్నికల్లో ఆర్‌జేడీ అధినేత లల్లూ ప్రసాద్‌ యాదవ్‌ తనయుడు తేజస్వీ యాదవ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి రాజకీయ అరంగేట్రంచేశారు. సరిగ్గా ఏడాది తర్వాత రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ తనయుడు చిరాగ్‌ పాశ్వాన్‌ జాముయ్‌ లోక్‌సభ స్థానంనుంచి గెలుపొంది పార్ల మెంట్‌లోకి అడుగుపెట్టారు. ఈవిధంగా బిహార్‌లో ముగ్గురు సోషలిస్ట్‌ నాయకులు (నితిష్‌కుమార్‌, లాలూప్రసాద్‌ యాదవ్‌, రాంవిలాస్‌ పాశ్వాన్‌) తమ కింది తరాలకు అధికారాన్ని బదలీ చేస్తా రన్నది స్పష్టమైంది. ముఖ్యంగా ప్రస్తుతం రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, అసెంబ్లీ వ్యవహారాల మంత్రి శ్రావణ్‌కుమార్‌ (ఈయన నితిష్‌కు సన్నిహితులు) ఇటీవల మాట్లాడుతూ నిశాంత్‌ త్వరలోనే రాజకీయ రంగ ప్రవేశం చేస్తారని వెల్లడిరచడం ఈ వాదనకు బలం చేకూరుస్తున్నది.

రెండోతరం నాయకుల కొరత

నితిష్‌కుమార్‌ నడిపిన అస్థిర రాజకీయాల నేపథ్యంలో అప్పటివరకు ‘సుశాసన్‌ బాబు’గా ప్రసిద్ధు డైన ఆయన్ను ‘‘పల్టు చాచా’’ బీహార్‌ ప్రజలు పిలవడం మొదలుపెట్టారు. ఈ పరిస్థితుల్లో నితిష్‌కుమార్‌ తన తర్వాత అధికారాన్ని అప్పగించడానికి రెండోతరం నాయకులను తయారు చేయలేదు. మరి ఇదే సమయంలో రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ కేంద్రంలో, లలూప్రసాద్‌ యాదవ్‌ రాష్ట్రంలో సుస్థిరమైన రీతిలో రెండోతరానికి అధికారాన్ని అప్పగించగలిగారు. ఇదిలావుండగా 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు, నితిష్‌కుమార్‌ అప్పటిరకు కొనసాగాని ఇండీ కూటమి కాడి కిందపడేసి, ఎన్డీఏ కూటమిలో చేరిపోయారు. ఈ ఎన్నికలను 2025 అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్స్‌గా పరిగణించారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లోనే నితిష్‌కు తొలిసారి రెండోతరం నాయకులు లేని లోటుఅర్థమైంది. ముఖ్యంగా ఆయన స్టార్‌ కాంపెయినర్లుగా అశోక్‌ చౌదరి, విజయ్‌ చౌదరి, రాజీవ్‌ రంజన్‌సింగ్‌, సంజయ్‌ రaాలపై ఆధారపడ్డారు. వీరు ప్రచారంలో పాల్గనడమే కాదు, జెడీ (యు)లో నిర్ణయాలు తీసుకోవడంలో కీలకపాత్ర పోషించారు. అంతకుముందు నితిష్‌ వారసుడి గా మనీష్‌వర్మ పేరు బాగా వినబడిరది. ఈయన నితిష్‌కు అత్యంత సన్నిహితుడిగా వ్యవహరిం చాడు. కానీ క్రమంగా ఈయన తెరమరుగు కావడంతో, మరి నితిష్‌ స్థానాన్ని భర్తీ చేసేదెవరన్న దనేది ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇటువంటి పరిస్థితిలో పైన పేర్కొన్న నలుగురు నాయకులే ఇకముందు పార్టీ వ్యూహాలను రచించడంతోపాటు, భాజపాతో సీట్ల ఒప్పందాలను చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీ కూడా చాలా ఓపిగ్గా జేడీయూ పరిణామాలను పరిశీలిస్తోంది. నితిష్‌ రాజకీయాలనుంచి తప్పుకున్నతర్వాత నాయకత్వలోటు ఎట్లాగూ ఏర్పడుతుంది కాబట్టి ఏకం గా జేడీయూను, తమ పార్టీలో విలీనం చేసుకునేందుకు కమల నాథులు వ్యూహాలు పన్నుతున్నా రు.

జేడీయూకు నష్టం

నితిష్‌కుమార్‌ రాజకీయాలనుంచి తప్పుకుంటే జేడీయూకు చాలా నష్టం. ఎందుకంటే బిహార్‌లోని 75శాతం దళిత ఓటర్లు ఆయనవైపే వుంటారు. నితిష్‌ ఏపార్టీలో ఉన్నాడనేది వారు పట్టించుకోరు. ఆయన్ను తమ నాయకుడిగా వారు చిత్తశుద్ధితో అంగీకరించడం వల్లనే నితిష్‌ తిరుగులేని నేతగా బిహార్‌ రాజకీయాల్లో వెలుగొందుతున్నారు. కుర్మి`కుశవహ వర్గాల ఓట్లు చీలకుండా గంప గుత్తగా జేడీయూకు పడేలా నితిష్‌ చేయగలుగుతున్నారు. వయసు, ఆరోగ్య కారణాల నేపథ్యంలో, ఈ రెండు వర్గాల మధ్య ఎప్పటికప్పుడు వచ్చే చీలికను అరికట్టే సామర్థ్యం నితిష్‌లో సన్నగి ల్లుతోంది. ఈ నేపథ్యంలో పార్టీకి నితిష్‌ వంటి క్లీన్‌ ఇమేజ్‌ వున్న నాయకుడు అవసరం. ప్రస్తు తం నితిష్‌కు ఎంతటి క్లీన్‌ ఇమేజ్‌ వుందో తనయుడు నిశాంత్‌కు కూడా అంతే ఇమేజ్‌ వుంది. మేనరిజం, హావభావాలు, అభిప్రాయాలు కూడా ఇద్దరివీ ఒక్కలాగానే వున్నాయి. కానీ వచ్చిన సమస్యల్లా వంశపారంపర్య రాజకీయాలకు నితిష్‌ వ్యతిరేకం. ఈ విషయంలో రాంవిలాస్‌ పాశ్వాన్‌, లల్లూ ప్రసాద్‌ యాదవ్‌ను గతంలో తీవ్రంగా విమర్శించారు కూడా. 2024 ఎన్నికల ప్రచా రం సందర్భంగా లల్లూ ప్రసాద్‌ యాదవ్‌నుద్దేశించి ‘ఈయన పిల్లల్ని కన్నాడు కానీ రాష్ట్రానికి చేసిందేమీ లేదని’ ఎద్దేవా చేశారు.

రాజీపడతారా?

ఇప్పుడు తనవరకు వచ్చేసరికి పార్టీని నిలబెట్టాలంటే తనయుడు నిశాంత్‌కుమార్‌కు పగ్గాలు అ ప్పగించక తప్పదు. ఈ విషయంలో నితిష్‌ రాజీపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రస్తుతం నిశాంత్‌కుమార్‌కు 50 ఏళ్లు. ఒకవేళ ఆయన రాజకీయాల్లోకి వస్తే, అంత చదువుకున్నా బయట ఏమీ అవకాశాలు లేక, మరోదారి కానరాక రాజకీయాల్లోకి ప్రవేశించాడని ప్రత్యర్థులు ప్రచారం చేయకమానరు! ఈవిధంగా నితిష్‌కు రెండువైపులా సమస్యలు పీడిస్తున్నాయి. నిజానికి గత ఏడాది నవంబర్‌ నుంచే నిశాంత్‌ రాజకీయాల్లోకి వస్తారన్న చర్చ మొదలైంది. ముఖ్యంగా రాష్ట్రంలో నేరాల రేటు పెరగడం, నితిష్‌ అస్థిర మానసిక స్థితి ఇందుకు ప్రధాన కారణం. 2024 నవంబర్‌ 15వ తేదీన మొట్టమొదటిసారి తండ్రి తనయుడు ఒక పెళ్లి వేడుకలో దర్శనమిచ్చారు. నితిష్‌కుమార్‌ పర్సన ల్‌ సెక్యూరిటీ ఆఫీసర్‌ తనయుడి వివాహం హర్యానాలోని రివారి జిల్లా భుర్తాల్‌ గ్రామంలో జరిగింది. ఈ వేడుకకు తండ్రి తనయులు హాజరయ్యారు. అప్పటినుంచే నిశాంత్‌ రాజకీయ అరంగే ట్రంపై ఊహాగానాలు మొదలయ్యాయి. 2025, జనవరి 8న భక్తియార్‌పూర్‌లో స్వాతంత్య్ర స మరయోధులకు నివాళులర్పించే కార్యక్రమంలో మళ్లీ ఇద్దరూ పాల్గన్నారు. ఈ సమరయోధుల్లో నిశాంత్‌ తాత కవిరాజ్‌ రామ్‌లఖన్‌ సింగ్‌ వైద్య కూడా వున్నారు. ఈ నేపథ్యంలో రాజకీయ రం గప్రవేశంపై అడిగిన ప్రశ్నలకు నిశాంత్‌ ‘‘మీరు మా నాన్నగారికి ఓటేయండి. మళ్లీ ఆయన్ను ముఖ్యమంత్రిని చేయండి’’ అనిమాత్రమే చెబుతున్నారు. మరోపక్క 2025 అసెంబ్లీ ఎన్నికల సీట్ల విషయంలో జేడీయూ, బీజేపీల మధ్య సుదీర్ఘ చర్చలు సాగుతుండటం గమనార్హం. ఇక మొత్తం మీద పార్టీ నాయకత్వం నిశాంత్‌కు బాధ్యతలు అప్పగించాలని కోరుతోంది. విచిత్రమేమంటే ఆర్‌జేడీ నాయకుడు తేజస్వీయాదవ్‌ కూడా నిశాంత్‌కు పార్టీ పగ్గాలు అప్పగించాలని కోరుతున్నారు. ఆర్జేడీ కూటమిలో ఉన్న కాంగ్రెస్‌ కూడా నిశాంత్‌ను రాజకీయాల్లోకి ఆహ్వానిస్తోంది. విచిత్రంగా భాజపా కూడా నిశాంత్‌ను రాజకీయాల్లోకి స్వాగతిస్తోంది.

ఎవరి స్వార్థం వారిది

ఆర్జేడీ, కాంగ్రెస్‌లు నిశాంత్‌ ఆగమనాన్ని స్వాగతిస్తున్నా దీనికి పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడంలేదు. ఎందుకంటే నిశాంత్‌ రాజకీయాల్లోకి వస్తే, సామాజిక న్యాయ సమర్థక ఓటుబ్యాంకు, నిరుపేద అగ్రవర్ణాల ఓట్లు వీటికి పడవు. బీజేపీ వ్యూహాలు వేరు. పార్టీకి బలమైన క్యాడర్‌ వుంది కానీ, సుస్థిరమైన నాయకుడు లేడు. ఆలోటును నిశాంత్‌ తీరుస్తాడు. బీజేపీకి కేవలం అగ్రవర్ణ పార్టీగానే పేరుంది. నితీష్‌కుమార్‌ పుణ్యమాని, దళితులు, ఇతర వెనుకబడిన వర్గాల ఓట్లు కూటమికి పడటం వల్ల అధికారంలోకి రాగలిగింది. ఇక జేడీయూ ప్రధాన లోపం సంస్థాగత నిర్మాణం, బలమైన క్యాడర్‌ లేకపోవడం. ఈ లోటును బీజేపీ తీరుస్తోంది. ఇప్పుడు నితిష్‌ రాజకీయాలనుంచి ని ష్క్రమణ తర్వాత జేడీయూను విలీనం చేసుకుంటే, నాయకత్వలోటును భర్తీచేసుకోవచ్చుననేది బీజేపీ వ్యూహం. అయితే ముందుజాగ్రత్త చర్యగా గత ఆర్నెల్లనుంచి ఉపముఖ్యమంత్రి పదవిలో వు న్న సామ్రాట్‌ చౌదరిని నాయకుడిగా వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తోంది! ఈ పరిస్థితుల్లో నిశాంత్‌ రాజకీయాల్లోకి వస్తే చౌదరికి ఇబ్బందికరం. ఆయనకు ఇదెంతమాత్రం ఆమోదయో గ్యం కాదు. కానీ ఓటుబ్యాంకు పరంగా చూస్తే సామ్రాట్‌ చౌదరికి కొయిరి`కుర్మి జాతి ప్రజల్లోనే ఓటుబ్యాంకు వుంది. అదే నిశాంత్‌కు తండ్రి వారసత్వంగా కొయిరి`కుర్మితో పాటు దళితుల్లో మంచి పలుకుబడి వుంది. అందువల్ల నిశాంత్‌ రాజకీయాల్లోకి వస్తే భాజపా, సామ్రాట్‌ను నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేయగలదు. ఇందుకు బీజేపీకి కొన్ని అనుకూలాంశాలున్నాయి. మొదటిది నిశాంత్‌ మతపరమైన విశ్వాసాలు కలిగిన వ్యక్తి, అతని సిద్ధాంతాలు, బీజేపీకి అనుకూలంగా వుంటాయి. అందువల్ల ఆర్‌జేడీ విలీనమైతే నిశాంతే ముఖ్యమంత్రి అవుతాడు. ఒకవేళ నిశాంత్‌కు పాలనానుభవం లేదనుకుంటే, సా మ్రాట్‌ చౌదరిని ముఖ్యమంత్రిని చేసి, నిశాంత్‌ను ఉపముఖ్యమంత్రిగా చేయవచ్చు. ఆవిధంగా అతనికి అనుభవం వచ్చేవరకు వేచివుండి, ఈలోగా జేడీయూను వదలడానికి ఇష్టపడని వారిని కూడా క్రమంగా తమవైపు తిప్పుకోవచ్చు. ఇది బీజేపీ ప్రణాళిక.

భాజపాలో ఎల్‌జేపీ(ఆర్‌వీ) విలీనం తథ్యమా?

చిరాగ్‌ పాశ్వాన్‌ నేతృత్వంలోని ఎల్‌జేపీ (ఆర్‌వీ) కూడా భాజపాలో విలీనమవుతుందనేది బిహార్‌ రాజకీయాల్లో మరో కీలక ప్రచారం. చిరాగ్‌ పాశ్వాన్‌కు ముఖ్యమంత్రి పదవిపై మోజుండటమే ఇందుకు కారణం. ఇప్పటికే ఆయన తన ఉద్దేశాన్ని భాజపా పెద్దలకు చెప్పారని వార్తలు వచ్చాయి. ఈ పార్టీకి పాసీ తెగల్లో మంచి పలుకుబడి వుంది. ప్రస్తుతం ఇతర దళిత తెగల్లోకి కూడాతన పలుకుబడిని విస్తరించడానికి ఎల్‌జేపీ(ఆర్‌వీ) ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. ఇదే సమయంలో హిందూస్థానీ అవామీ మోర్చా (హెచ్‌ఏఎం) పార్టీ అధినేత జితన్‌రామ్‌ మంరీa కూడా తన పార్టీ బలాన్ని విస్తరించాలన్న యోచనలో వున్నారు. ప్రస్తుతం ఈ పార్టీకి ముసాహర్‌ కులం ప్రజల్లో గట్టి పట్టుంది. ఇదికూడా ఎన్డీఏలో భాగస్వామిగానే వుంది. ఈ నాయకులనుంచి ఎదురయ్యే అడ్డంకులు ప్రధానమైనవి కావు. నిశాంత్‌ రాజకీయాల్లోకి రావడం ఎన్డీఏ కూటమికి చాలా అవసరం. ఎందుకంటే నితిష్‌ లోపాన్ని నిశాంత్‌ మాత్రమే భర్తీ చేయగలడు!

అతిబలవంతుడు రేవంతుడు.

సీఎంపై కొందరి ఏడుపెక్కువైంది? 

-కుర్చీపై కూర్చోవాలని ఆరాటమెక్కువైంది?

-పార్టీ కోసం పనిచేసే వాళ్లు తక్కువయ్యారు.

-పదవుల కోసం పాకులాడేవాళ్లెక్కువయ్యారు.

-ప్రతిపక్షాల మీద నోరు మెదపలేరు.

-ప్రతిపక్షాలను పల్లెత్తు మాటలనలేరు.

-ప్రతిపక్షాల విమర్శలకు కనీసం స్పందించరు.

-ప్రతిపక్షాల దాడిని చూసి మురిసిపోతుంటారు!

-ఎప్పటికప్పుడు ముసలం పుడితే బాగుండనుకుంటారు!

-కూర్చున్న కొమ్మనే నరుక్కునే కుట్రలు చేస్తుంటారు.

-సవ్యంగా సాగుతున్న పాలనలో పచ్చగడ్డి వేసి పొగపెడుతుంటారు.

-ఒకరి మీద ఒకరు పుల్లలు పెట్టుకుంటూ పార్టీ పరువు తీసుకుంటారు.

-రహస్య మంతనాలతో పార్టీని బజారుకీడుస్తుంటారు.

-అసంతృప్తుల అవతారంలో కోవర్డులౌతారు.

-అంతర్గత ప్రజాస్వామ్యం..కొంప కొల్లేరుకు మార్గం!

– కెలికి, గెలికి..కుంపట్లు పెట్టి!

-అప్పుడే కొంపలు మునిగిపోయినట్లు ప్రవర్తిస్తుంటారు ?

-ఏడాదిలోనే అంతగాకంగారెందుకు?

-పదేళ్లుగా ప్రతిపక్షంలో వున్నప్పుడు పార్టీని పట్టించుకోలేదు.

-కొట్లాడి కొట్లాడి అధికారం తెచ్చిన వాళ్లను ఓర్వలేరు.

-పడరాని పాట్లు పడి అధికారంలోకి తెచ్చిన సిఎంకు సహకరించలేరు.

-రేవంత్‌ రెడ్డిని నమ్మి ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం అందించారు.

-కాంగ్రెస్‌ను అధికారంలోకి తెచ్చేందుకు రేవంత్‌ నానా కష్టాలు పడ్డారు.

-పార్టీని నడపలేక చేతులెత్తేసిన వాళ్లు కూడా కుర్చీ కోసం ఆరాటపడుతున్నారు.

-పదవులు రాని వాళ్లను ఎగదోస్తున్నారు.

-ఎమ్మెల్యేలైన వారికే అసంతృప్తి వుంటే, ఏమీ కాని నాయకుల పరిస్థితి ఏమిటి?

-ఏడాదే పూర్తయింది..భవిష్యత్తుపై ఓపిక పట్టలేరా!

-దినదిన గండంగా మార్చి అలజడి మొదలుపెడతారా!

-అవకాశ వాద రాజకీయాలకు పాల్పడి పార్టీని ఆగం చేస్తారా?

-మళ్ళీ పార్టీ అధికారంలోకి రావాలన్న సోయి లేకుండా పోతుందా?

హైదరాబాద్‌,నేటిధాత్రి: 

 ఎవరు ఔనన్నా, ఎవరు కాదన్నా తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో అత్యంత బలవంతమైన నాయకుడు, పాలకుడు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. ఇందులో ఎవరికీ సందేహాలు అవసరం లేదు. ఆశ్యర్యం అసలే అక్కర్లేదు. నాయకులు ప్రజల్లో నుంచి పుడతారు అనడానికి ప్రత్యక్ష సాక్ష్యం సిఎం. రేవంత్‌రెడ్డి. అంచెలంచెలులగా ఒక్కొ మెట్టు, ఎక్కుతూ, రాజకీయాలను తన చేతుల్లోకి ప్రజల మెప్పు పొందుతూ వచ్చారు. మొత్తం తెలంగాణ రాజకీయాలను తనవైపు తిప్పుకొని తిరుగులేని నేతగా ఎదిగారు. ప్రజా సేవలో, నాయకుడిగా ఎదుగుదలలో ఎవరి ప్రమేయం లేదు. ఎవరి ప్రోద్భలం లేదు. ఎవరి వెన్నుదన్ను అసలే లేదు. స్వయం ప్రకాశిత శక్తిగా రేవంత్‌ రెడ్డి ఎదిగారు. ఇప్పుడున్న కాంగ్రెస్‌ పార్టీలో అలాంటి నాయకుడు ఏ ఒక్కరూ లేరు. అంతే కాదు తెలంగాణ ఇతర రాజకీయ పార్టీలలో అసలే లేరు. ఆయన ఏ పార్టీ నీడన రాజకీయాలు నేర్చుకోలేదు. ఆయన నాయకుడిగా ఎదిగిన తర్వాతే తెలుగుదేశంలో చేరారు. అంతకు ముందు ఆయన మొదటిసారి పోటీతోనే జడ్పీటీసి అయ్యారు. తర్వాత మళ్లీ వెంటనే ఎమ్మెల్సీ అయ్యారు. ఆ పదవి కూడా ఇండిపెండెంటుగా గెలిచారు. తన రాజకీయ చతురతను చూపించారు. చిన్న వయసులోనే రాజకీయ చాణక్యం ప్రదర్శించారు. అప్పుడు ఆయన ఒక రాజకీయ పార్టీని ఎంచుకున్నారు. అలా ఒక్కోమెట్టు ఎక్కుతూ, చిన్న వయసులోనే రాష్ట్ర స్దాయి నాయకుడయ్యారు. తెలుగుదేశం పార్టీలో సీనియర్లందరికీ కొరకరాని కొయ్యగా ఎదిగారు. ఆయన ఎదుగుదలను చూసి ఓర్వలేనితనం ప్రదర్శించిన నాయకులు కూడా వున్నారు. అయితే రాష్ట్ర విభజన తర్వాత తెలుగుదేశం ఉనికి ప్రశ్నార్ధం కావడంతో కాంగ్రెస్‌లో చేరారు. చేరుతూనే వర్కింగ్‌ ప్రెసిండెట్‌ అయ్యారు. ఆ వెంటనే తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ ప్రెసిడెంటు అయ్యారు. అలా మూడు సంవత్సరాలలో పార్టీకి పునర్వైభవం తెచ్చారు. కాంగ్రెస్‌ పార్టీని అదికారంలోకి తీసుకురావడానికి అష్టకష్టాలు పడ్డారు. అనేక కేసులను కేసులను ఎదుర్కొన్నారు. అనేక సార్లు జైలు జీవితం ఎదుర్కొన్నారు. నిర్భందాలు ఎదుర్కొన్నారు. అడుగడుగునా అవమానాలు ఎదుర్కొన్నారు. ఇక్కడ మరో విషయమేమింటే సహజంగా ఏ నాయకుడికైనా ప్రత్యర్ధి రాజకీయ పార్టీల నుంచి సవాళ్లను ఎదుర్కొంటారు. కాని రేవంత్‌ రెడ్డి స్వపక్షం నుంచి, ప్రత్యర్ధి పార్టీల నుంచి కూడా ఎదుర్కొన్నారు. వాళ్లందరూ చూస్తుండగానే ముఖ్యమంత్రి అయ్యారు. అందుకు ఆయన చేసిన కృషి అంతా ఇంతా కాదు. ఇటు సొంత పార్టీ నేతలను భుజ్జగించుకుంటూ, వారు చేస్తున్న అమానాలను ఎదుర్కొంటూ ముందుకు సాగారు. ఎలాంటి సమస్యలనైనా చిరునవ్వుతో స్వాతతించుకుంటూ వెళ్లారు. అంతే కాని ఎక్కడా బ్యాలెన్స్‌ తప్పలేదు. పార్టీని నిలబెట్టడంతో ఎక్కడా వెనుకంజ వేయలేదు. ధీరుడిగా ముందుకు సాగారు. పదేళ్ల తర్వాత పార్టీని అధికారంలో తెచ్చారు. అందుకే పార్టీ అధిష్టానం రేవంత్‌ రెడ్డి నాయక్వాన్ని మెచ్చి, నచ్చి ముఖ్యమంత్రిని చేసింది. ఇదీ రేవంత్‌ రెడ్డి ట్రాక్‌ రికార్డు. ఇలాంటి రికార్డు వున్న నాయకుడు ఎవరూ కాంగ్రెస్‌ పార్టీలో లేరు. పదేళ్ల కాలంలో కనీసం పార్టీ మా వల్ల బలపడిరదని చెప్పుకోగలిగిన నాయకుడు మరొకరు లేరు. పాలతో నిండిన కుండలో నీళ్లదంరూపోస్తారు. నా పాలతోనే కుండ నిండిరదని చెప్పుకుంటారు. కాని ముందు చిక్కని పాలు ఎవరు పోశారన్నది తెలియకుండా వుండదు. అలాగే కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానానికి ఎవరు పార్టీని సమర్ధవంతంగా నడిపి అదికారంలోకి తెచ్చారన్నది తెలియదా? ప్రతిపక్షంలో వున్నన్నప్పుడు పార్టీని బలోపేతం చేసి అధికారంలోకి తెస్తానని చెప్పిన నాయకుడు లేదు. అంతగా పార్టీ కోసం కొట్లాడిన నాయకుడు ఎవరూ లేరు. కాకపోతే సీనియర్లమని కొందరు, మాకు పిసిసి. అవకాశమివ్వాలని కొందరు కోరుకున్నారు. కాని వాళ్లలో ఏ ఒక్కరు నాకు పిపిసి ఇస్తే పార్టీని అధికారంలోకి తెస్తానని అధిష్టానానికి భరోసా కల్పించలేదు. అధిష్టానం నమ్మకాన్ని చూరగొనలేదు. ఎందుకంటే పుట్టింటి గొప్పదనం మేనమామకే చెబితే ఎలా వుంటుంది. అందుకే పాత తరం నాయకులకు పక్కన పెట్టి, రేవంత్‌ రెడ్డికి కాంగ్రెస్‌ పగ్గాలు అప్పగించింది. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా కాంగ్రెస్‌ పార్టీని అధికారంలోకి తెచ్చి రేవంత్‌ రెడ్డి చూపించారు. అయితే ఈ మధ్య ప్రభుత్వంలో లుకలుకలు అంటూ పెద్ద పదవి కోసం పోటీ పడుతున్న నాయకులు కొందరు లేనిపోనివి ప్రచారంలోకి వచ్చేలా చేస్తున్నారని కూడా తెలుస్తోంది. లేని వివాదాలు ముసురుకునేలా చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జిని మార్చినట్లు కొంత మంది పనిగట్టుకొని ప్రచారం సాగిస్తున్నారు. కాని అది నిజం కాదు. సిఎం. రేవంత్‌ రెడ్డిని కట్టడి చేయడానికి ఇన్‌చార్జిని మార్చినట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం అసలేలేదు. దీపాదాస్‌ మున్షీఇంత కాలం తెలంగాణకు అడిషినల్‌ ఇన్‌చార్జిగా వున్నారు. ఆమె కేరళ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జి. కాంగ్రెస్‌ పార్టీ ఇటీవల తెలంగాణతోపాటు, చాలా రాష్ట్రాలకు కొత్త ఇన్‌చార్జిలను ప్రకటించింది. అందులో భాగంగానే కొత్త ఇన్‌చార్జిని తెలంగాణకు పంపించారు. ఈ విషయాన్ని చిలువలు పలువలు చేస్తూ, కొంత ప్రచారం సాగిస్తున్నారు. కూర్చున్నచెట్టునే నరుక్కునేందుకు సిద్దపడుతున్నారు. కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో వుంటే ఆ నాయకులకు ఏదో ఒక పదవి వస్తుంది. కాని ఆ సత్యం మర్చిపోతున్నారు. లేనిపోని రాజకీయాలు చేయాలనుకుంటున్నారు. ఆ అంతర్గత ప్రజాస్వామ్యమే కాంగ్రెస్‌ కొంప ముంచుతుంది. కాంగ్రెస్‌ పార్టీని ఎవరూ ఓడిరచాల్సిన పనిలేదు. అసమ్మతి వాదులు నలుగురుంటే చాలు చెల్లాచెదురౌతుందని ఎప్పటి నుంచో నానుడి వుంది. దాన్ని మళ్లీ నిజం చేస్తారా? అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే అసంతృప్తి రాజేస్తారా? పార్టీలో గాని, ప్రభుత్వంతో గాని ఏదైనా సమస్యలుంటే చర్చించుకునే వేదికలున్నాయి. మంత్రుల తో ఇబ్బందులుంటే చెప్పుకునేందుకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వున్నారు. పార్టీ అధ్యక్షుడు మహేష్‌ గౌడ్‌ వున్నారు. ఇంకా చెప్పుకోవాలంటే పార్టీ అధిష్టానంవుంది. అక్కడ చెప్పుకోవాల్సిన విషయాలను మీడియా కంటపడేలా? ప్రజలు తెలిసేలా, ప్రతిపక్షాలకు ఆయుధం అందేలా సమాలోచనలు చేయాల్సిన అవసరం లేదు. పదేళ్లుగా కాంగ్రెస్‌ పార్టీ అధికారంలో లేదు. తెలంగాణ ఇచ్చింది కాంగ్రెస్‌ పార్టీ. ఓవైపు మేమే కొట్లాడి తెలంగాణ తెచ్చామని బిఆర్‌ఎస్‌ పదే పదే చెప్పుకుంటుంది. కాంగ్రెస్‌ మెడలు వంచి తెలంగాణ సాధించామని ఒకటికి పదిసార్లు చెప్పుకుంటుంది. మేం లేకపోతే తెలంగాణ వచ్చేదే కాదని బిజేపి అంటుంది. వాళ్లకు ధీటైన సమాదానం చెప్పడానికి మాత్రం ఏ కాంగ్రెస్‌ నాయకుడికి నోరు రాదు. మాటలు రావు. కాని మాకు అన్యాయం జరిగిందని చెప్పడానికి మాత్రం అన్నీ వస్తాయి. తెలంగాణ వచ్చిన తర్వాత ఈ పదేళ్లలో మేమే తెలంగాణ ఇచ్చామని చెప్పుకునే అవకాశం దొరకలేదు. చెప్పుకోవడానికి నోరు రాలేదు. 2014 ఎన్నికల తర్వాత స్దానిక సంస్దల ఎన్నికల్లోనూ చెప్పుకోలేకపోయారు. 2019 ఎన్నికల్లో మళ్లీ ఘోరంగా ఓడిపోయారు. ఆ తర్వాత కూడా చెప్పుకునేందుకు ముందుకు రాలేకపోయారు. కాని ప్రజలు గ్రహించారు. తెలంగాణ ఇచ్చిన పార్టీకి ఒక్కసారి అవకాశమిద్దామని కనికరించారు. ముఖ్యంగా తెలంగాణ గ్రామీణ సమజామంతా ఏకమైన కాంగ్రెస్‌ పార్టీని గెలిపించింది. అందుకు అందరూ కృషి చేశారు. ఏ ఒక్కరిదీ తక్కువ భాగస్వామ్యమేమీ లేదు. పై స్దాయిలో వున్న నాయకులకే అసంతృప్తి వుంటే కింది స్ధాయిలో జెండా మోసిన సామాన్య కార్యకర్తల కష్టం ఎవరు తీర్చాలి. వారికి పదువులు ఎవరు ఇవ్వాలి. పదేళ్ల పాటు పార్టీకి అండగా నిలిచి, జెండాలు మోసి భుజాలు కాయలు కాసిన కార్యకర్తలు ఎవరికి చెప్పుకోవాలి. ఆస్ధులు అమ్ముకొని పార్టీని నమ్ముకొని పని చేసిన వాళ్ల గోడు ఎవరికి వినిపించాలి. ఎమ్మెల్యే స్ధాయి నేతలకేనా అసంతృప్తి వుండేది? నిజానికి ఎమ్మెల్యేలు ఎంతో సంతోషపడాలి. లక్షలాది మంది వున్న కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తల్లో ఎమ్మెల్యేలు అయ్యే అవకాశం కొద్ది మందికే దక్కింది. ఎమ్మెల్యేలు అయిన వారు మంత్రి పదవి కావాలని కోరుకోవడంలో తప్పు లేదు. కాని అన్యాయం జరిగిందన్న కారణంతో పార్టీపై నెపం నెట్టేసి, అన్యాయం జరిగిందని వీధులకెక్కితే పార్టీ పరువు పోతుంది. ఇప్పటికే ప్రతిపక్షాలు కాచుకొని కూర్చున్నాయి. ఏడాది కాలంలో అజ్ఞాతంలోవున్న కేసిఆర్‌ కూడా వైఫల్యాలను ఎండగట్టాలని చూస్తున్నారు. బిజేపి ఈసారి గెలవాలని కాచుకొని కూర్చున్నది. మరో పదేళ్లయినా ప్రతిపక్షాలకు అవకాశమివ్వకుండా రాజకీయాలు చేయాల్సిన కాంగ్రెస్‌ నాయకులు ఇప్పుడే అసంతృప్తి జ్వాలలు రగిలించడం సరైందికాదు. పార్టీకి ఏ రకంగా మేలు జరగదు.

అన్న బెదిరింపులు..తమ్ముడి అర్థింపులు!!

`రెండు సంవత్సరాల క్రితమే విఆర్‌ఎస్‌ తీసుకున్న మహేందర్‌ రెడ్డి

`రాజీనామా చేసినా ఉద్యోగ సంఘంలో నాయకుడు చెలామణి

Vanga mahender reddy

`అటు రియలెస్టేట్‌ వ్యాపారం.. ఇటు రాజకీయం

`సులువుగా ఎమ్మెల్సీ కావాలనే దొడ్డి దారి రాజకీయం

`మొత్తానికి టిచర్స్‌ ఎమ్మెల్సీ అభ్యర్థి వంగ గెలవాలన్న తాపత్రయం

`అడ్డదారిలో ఆధిపత్య కుటిల ప్రయత్నం

`పిఆర్‌టియు అభ్యర్థి వంగా మహేందర్‌ రెడ్డి అసత్యాలు ప్రచారం

`అన్నను అడ్డం పెట్టుకొని గెలిచేందుకు పన్నాగం

`అబద్దాలు ప్రచారం చేస్తూ గెలిచేందుకు విచిత్ర విన్యాసం

`పిఆర్‌టియు యూనియన్‌ విస్తుపోతున్న సందర్భం

`అన్న సహకారంతో జరుగుతున్న మంత్రాంగం

`డిఈఓలు, ఎంఈఓలతో ఒత్తిడి రాజకీయాలు

`ఎలాగైనా మహేందర్‌ రెడ్డి గెలవాలని డిఈఓలు, ఎంఈవోలు ఆర్డర్లు

`సైలెంట్‌గా సాగుతున్న మహేందర్‌ రెడ్డి ప్రచారం

`చాపకింద నీరులా సాగిస్తున్న రాజకీయం

హైదరాబాద్‌,నేటిధాత్రి:

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా సాధారణ రాజకీయాలను మించిపోయాయి. ఉద్యోగ సంఘాలు కూడా టిక్కెట్లు అమ్ముకునే స్ధాయికి ఎదిగిపోయాయి. ఇది ఎవరో కాదు సాక్ష్యాత్తు ఓ టీచర్‌ ఎమ్మెల్సీ చేస్తున్న ప్రధాన ఆరోపణ. ఒక సామాన్యమైన ఉపాద్యాయుడు కోట్లు పెట్టి టిచర్‌ ఎమ్మెల్సీ టికెట్‌ కొనుక్కునే పరిస్దితి వుంటుందా? అప్పులు చేసినా సాధ్యమౌతుందా? కాని టిక్కెట్ల పంపిణీలో కోట్ల రూపాయలు చేతులు మారినట్లు కూడా స్వయంగా ఆ టీచర్‌ ఎమ్మెల్సీ మీడియా ముఖంగా చెబుతున్నాడంటే రాజకీయాలు ఎంత ఖరైదైపోతున్నాయో అర్ధం చేసుకోవచ్చు. ఒక సగటు ఉపాధ్యాయుడు కరీంనగర్‌ టీచర్స్‌ ఎమ్మెల్సీ టికెట్‌ కోట్లు పెట్టి ఎలా కొనుగోలు చేశాడు. దాని వెనుకు వున్న నిగూఢమైన రహస్యమేటి? రోజూ స్కూలుకు వెళ్లి పిల్లలకు పాఠాలు చెప్పే ఉపాధ్యాయుడు కోట్ల రూపాయలు సంపాదించడం సాద్యమా? అంటే కొన్ని సార్లు సాధ్యమే..కాని అసలైన ఉపాధ్యాయుడు కాదు…ఉపాధ్యాయ కొలువును అడ్డం పెట్టుకొని రియల్‌ వ్యాపారాలు సాగించి, ఫైనాన్స్‌ వ్యవహారాలు నిర్వహించే వారికి మాత్రమే సాధ్యం. అలా కరీంనగర్‌ ఉపాద్యాయ ఎమ్మెల్సీని పేరు పొందిన ఉపాద్యాయ సంఘం నుంచి వంగ మహేందర్‌ రెడ్డి ఎలా కొనుగోలు చేసి ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. ఈ ఎమ్మెల్సీ అభ్యర్ధి స్వయాన అన్న వంగ రవీందర్‌ రెడ్డి. ఆయన తెలంగాణ రెవిన్యూ అసోసియేషన్‌ రాష్ట్ర అద్యక్షుడు. ఈ వ్యవహారమంతా ఆయనే దగ్గరుండి నడిపిస్తున్నాడని అంటున్నారు. అందులో భాగంగా రవీందర్‌ రెడ్డి నాలుగు ఉమ్మడి జిల్లాలైన కరీంనగర్‌, మెదక్‌, నిజాబామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాలకు చెందిన డిఈవోలు, ఏంఈవోలపై పెద్దఎత్తున ఒత్తిడి తెస్తున్నారని సమాచారం. తన తమ్ముడు వంగ మహేందర్‌ రెడ్డి గెలుపుకోసం అందరూ సహకరించాలని ఆయన ఆర్డర్లు వేస్తున్నట్లు చెబుతున్నారు. డీఈవోలు, ఎంఈవోలపై ఒత్తిడి తెచ్చి, ఉపాద్యాయులకు వారితో ఫోన్లు చేయిస్తున్నట్లు కూడా చెప్పుకుంటున్నారు. ఈ విషయంపై భారతీయ జనతాపార్టీ ఏకంగా ఎన్నికల కమీషన్‌కు ఉత్తరంకూడ రాశారు. వంగా రవీందర్‌ రెడ్డి తన తమ్ముడు వంగా మహేందర్‌ రెడ్డి గెలుపుకోసం ఉపాద్యాయులు మీద తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నట్లు ఎన్నికల కమీషన్‌కు వివరించారు. ఇక అసలు విషయానికి వస్తే వంగా మహేందర్‌రెడ్డి ఉపాద్యాయ కొలువులో చేరినప్పటినుంచి పిఆర్‌టీయూ యూనియన్‌లో క్రియాశీలకంగా పనిచేయడం మొదలు పెట్టారు. అప్పటికే తన అన్న రవీందర్‌రెడ్డి కూడా ఆయన కొలువు చేస్తున్న శాఖలో నాయకత్వం ఎలా చేస్తున్నాడో చూసిన మహేందర్‌ రెడ్డి కొలువులో చేరిన కొద్ది రోజులకే నాయకుడయ్యారు. చదవు చెప్పడం గాలికి వదిలేశాడు. రేపటి తరాన్ని తీర్చిదిద్దాల్సిన మహేందర్‌ రెడ్డి యూనియన్‌ రాజకీయాలు మొదలు పెట్టారు. చదువు చెప్పాల్సిన అవసరం లేకుండా చేసుకున్నాడు.

అలా అంచెలంచెలుగా యూనియన్‌లో ఎదుగుతూ వచ్చారు. 2004 తర్వాత తెలంగాణలో వచ్చిన రియల్‌ బూమ్‌ను ఆసరా చేసుకున్నాడు. అటు ఉపాధ్యాయ వృత్తిని కొనసాగిస్తూనే రియల్‌ వ్యాపారం మొదలు పెట్టారు. రియల్‌ వ్యాపారాన్ని కూడా టీచర్లతోనే మొదలు పెట్టి, వ్యాపారాన్ని పెంచుకున్నాడు. అలా కొలువును గాలికి వదిలేసి వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నాడు. ఇక ఇదిలా వుంటే పేద ప్రజలకు చదువు చెప్పాల్సిన కొలువులో వుంటూ, వారి జీవితాల్లో వెలుగులు నింపాల్సిన బాధ్యత విస్మరించారు. సిద్దిపేటలో కార్పోరేట్‌ స్కూల్‌ ఏర్పాటు చేశాడు. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు తాను కొలువు చేసే చోట విద్యా కుసుమాలను వికసింపచేయాల్సిందిపోయి, తన ప్రైవేటు స్కూల్‌లో చదువు పేరుతో దోపిడీ మొదలు పెట్టాడు. అటు రియల్‌ వ్యాపారం, ఇటు ప్రైవేటు కార్పోరేట్‌స్కూలు, మహేందర్‌రెడ్డికి మరో సోదరుడి పేరు మీద కొన్ని కళాశాలలో పార్టనర్‌ షిప్‌లో పూర్తిగా విద్యా వ్యాపారం మొదలు పెట్టారు. అన్న రెవిన్యూ అసోసియేషన్‌ అధ్యక్షుడుగా వుండడం, ఎక్కడెక్కడ ప్రభుత్వ స్థలున్నాయో గుర్తించడం, వాటిని తమకు అనుకూలంగా మల్చుకోవడం, అక్కడ రియల్‌ వ్యాపారం చేయడం మొదలు పెట్టారు. అయితే తమ వ్యాపారాలపై ఎవరి కన్ను పడకుండా ఓ స్వచ్ఛంద సంస్ధను ఏర్పాటు చేశారు. ఈ సంస్ధనిర్వహణకు మరో వైపు పెద్దఎత్తున విరాళాలు సేకరించడం అలవాటు చేసుకున్నారు. కొన్ని సంవత్సరాలుగా ఆ సంస్థ నిర్వహణ కోసం అటు నిధులసేకరణను తోడు చేసుకొని రాజకీయాల్లోకి వచ్చేందుకు మార్గం వేసుకున్నాడు. కొన్ని స్కూళ్లలో వాటర్‌ ప్లాంటులుఏర్పాటుచేసి విద్యా వ్యవస్ధకు మేలు చేస్తున్నట్లు చెప్పుకుంటున్నాడు. రెండు సంవత్సరాల క్రితం తన ఉద్యోగానికి వాలెంటరీ రిటైర్‌ మెంటుతీసుకొని ఇక ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వ్యూహాలు మొదలు పెట్టారు. ఉద్యోగానికి రాజీనామా చేసిన తర్వాత కూడా వంగ మహేందర్‌ రెడ్డి ఎలా ఉపాద్యాయ సంఘం నాయకుడుగా వుంటారు. ఎలా ఉపాధ్యాయ ఎమ్మెల్సీకి అర్హుడౌతాడు. కేవలం ఎన్నికల కోసం కొద్ది రోజుల ముందు రాజీనామా చేశారంటే అదీ కాదు. రెండు సంవత్సరాల క్రితమే రాజీనామా చేశారు. అయితే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓడిపోతే ఆ కొలువును అలాగా వదిలేస్తారా? అంటే అదీ వుండదు. అదృష్టం వుండి గెలిస్తే ఎమ్మెల్సీ అవుతారు. లేకుంటే ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకొని మళ్లీ ఉపాద్యాయ కొలువులో చేరుతారు. ఇలాంటి జిత్తుల మారి రాజకీయాలు చాలా మంది చేస్తున్నారు. అందులో వంగా మహేందర్‌ రెడ్డి ఒకరు. తక్కువ సమయంలో, తక్కువ ఖర్చులో ఎమ్మెల్సీ కావాలనుకునే కొంత మంది ఈ దారిని ఎంచుకున్నారు. అటు అన్న రెవిన్యూ అసోసియేషన్‌ ద్వారా తన పలుకుబడిని ఉయోగిస్తున్నాడు. రవీందర్‌ రెడ్డిపై కూడా పెద్దఎత్తున ఆరోపణలున్నాయి. తన ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకొని కొన్ని వేల కోట్లు సంపాదించారనే అపవాదు వుండనేవుంది. సంపాదించిన ఆస్ధులను కాపాడుకోవాంటే తన తమ్ముడు ప్రజా ప్రతినిధి కావడం ఒక్కటే మార్గం అనుకున్నారు. ఇలా సులువైన మార్గంలో ఎమ్మెల్సీ కావడం రవీందర్‌రెడ్డికి దారి లేదు. తిమ్మిని బమ్మిని చేసి రికార్డులు మార్చి, ఆక్రమణదారులకు సహకరించి, సంపాదించిన సొమ్ముతో తమ్ముడితో రియల్‌ వ్యాపారం రవీందర్‌ రెడ్డి సంపాదించారు. అలా అన్నదమ్ములంతారూ అక్రమంగా సంపాదించిన సొమ్మును కాపాడుకోవాలంటే టీచర్స్‌ ఎమ్మెల్సీ ఒక్కటే మార్గమని ఎంచుకున్నారు. ఇది టీచర్స్‌ యూనియన్‌లోని సభ్యులే చెబుతున్నమాట.

ఓ ఎమ్మెల్సీ మీడియా సమావేశంలో పూసగుచ్చినట్టు చెప్పిన ముచ్చట. ఒక నిబద్దత గలిగిన గురువు విద్యార్టులకు విద్యతోపాటు విద్యా వ్యవస్ధలో రావాల్సిన నూతన ఆవిష్కరణల గురించి మాట్లాడతారు. ప్రభుత్వ విద్యా వ్యవస్ధ మేలు కోసం పనిచేస్తాడు. అలాంటి ఉపాధ్యాయులను ఎమ్మెల్సీలు చేయడానికి సంఘాలకు కూడా చేతులు రావడం లేదు. టిక్కెట్లు అమ్ముకునే యూనియన్లు వుంటే మహేందర్‌ రెడ్డి లాంటి టీచర్లే ఎమ్మెల్సీ కావాలని కలలు గంటారు. ముఖ్యంగా ఈ దారి ఎంతో సులువైంది. తాను ఉపాద్యాయుడై రేపటి తరానికి దారి చూపుతాననుకునే ఏ ఉపాద్యాయుడు తన వృత్తికి ద్రోహం చేయడు. కాని ఉపాద్యాయ కొలువు పొంది, రాజకీయాలను లక్ష్యంగా చేసుకునే కొంతమంది ఇలా ప్రభుత్వాలను మోసం చేస్తుంటారు. పదవులు అడ్డం పెట్టుకొని కొలువులు చేయకుండా రాజకీయాలు చేస్తుంటారు. లేనిపోని హమీలు ఎంతో చైతన్యవంతులైన ఉపాద్యాయులకే చెబుతుంటారు. సాటి ఉపాద్యాయులను కూడా మోసం చేస్తుంటారు. పాత పెన్షన్‌ విధానం తీసుకురావడం అసలు సాధ్యమా? ప్రభుత్వాలతోనే సాధ్యం కాని ఆ విదానం టీచర్‌ ఎమ్మెల్సీలతో సాధ్యమౌతుందా? దేశ వ్యాప్తంగా అమలౌతున్న కొత్త విధానంలో మార్పు చేయడానికి కేంద్ర ఒప్పుకుంటుందా? అది అమలు రాష్ట్ర ప్రభుత్వానికి సాధ్యపడుతుందా? కేంద్రం అంగీకరించకుండా జరుగుతుందా? విద్య అనేది రాష్ట్ర స్ధాయిలో వుండే అంశం కాదు. ఉమ్మడి అంశం. కేంద్రం జోక్యం లేకుండా ఎలాంటి నిర్ణయాల అమలు సాధ్యంకాదు. కాని తమ రాజకీయ భవిష్యత్తు కోసం, ఎన్నికల్లో గెలవడం కోసం ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడై వుండి, యూనియన్‌ సభ్యులను మోసం చేసేవారిని ఎలా ఎన్నుకుంటారో కూడా టీచర్లే ఆలోచించుకోవాలి.

Twitter WhatsApp Facebook Pinterest Print
error: Content is protected !!
Exit mobile version