సమస్యలు పరిష్కరించాలని డిమాండ్
తాసిల్దార్ కు వినతిపత్రం అందజేత
కామారెడ్డి జిల్లా/జుక్కల్ నేటి ధాత్రి:
కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో ఆశ వర్కర్లు ఫిబ్రవరిలో జరిగే అసెంబ్లీ
బడ్జెట్ సమావేశంలో ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ.18,000/-ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలని ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. తమ సమస్యలు పరిష్కరించాలని ఆశా వర్కర్లు శుక్రవారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు… ఏఎన్ఎం ట్రైనింగ్ పూర్తి చేసిన ఆశ వర్కర్లకు, ఏఎన్ఎం పోస్టుల్లో ప్రమోషన్ సౌకర్యం కల్పించాలన్నారు. వెయిటేజీ మార్కులు వెంటనే నిర్ణయించాలని డిమాండ్ చేశారు. గత 15 రోజుల సమ్మె హామీలు కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టో లో పొందు పేర్చిన హామీలు ఫిబ్రవరి 9న జులై 30న డిసెంబర్ 10 న ఆరోగ్య శాఖ కమిషన్ చిన్న హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. డిసెంబర్ 10 న ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఆదివారం. పండుగలకు సెలవులు నిర్ణయించాలన్నారు. గత ప్రభుత్వం హామీలు ప్రకారం ప్రసూతి సెలవులు కల్పిస్తూ వెంటనే ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. ఎమ్మెల్యే లేకపోవడంతో జుక్కల్ ఎమ్మార్వో హిమబిందుకు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కార్యదర్శి సూర్య గొండ అజయ్, సిఐటియు నాయకులు, ఆశా వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.