కమిటిహాల్ కట్టించాలని వినతిపత్రం
పరకాల నేటిధాత్రి(టౌన్)
పరకాల మండల ఆర్ఎంపి పిఎంపి వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కమిటీ సభ్యులందరూ కలిసి పరకాల మున్సిపల్ చైర్మన్ సోద రామకృష్ణ ఆధ్వర్యంలో పరకాల మండల్ ప్రెసిడెంట్ దొమ్మటి బాబురావు మరియు ఆర్.ఎం.పి మరియు పి.ఎం.పి అసోసియేషన్ కమిటీ సభ్యులు పరకాల అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యేని మర్యాదపూర్వకంగా కలిసి పరకాల మండలానికి ఒక స్థలం ఇచ్చి కమిటీ హాల్ కట్టివ్వగలరని వినతిపత్రం కూడా ఇవ్వడం జరిగింది.దీనికి ఎమ్మెల్యే సానుకూలంగా హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఆర్ ఎంపీ,పిఎంపి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.