బాధిత మహిళ వరమ్మకు
జిల్లా పోలీస్ అధికారులు న్యాయం చేయాలి.*
హైదారాబాద్/వికారాబాద్,నేటిధాత్రి
వికారాబాద్ జిల్లా నవపేట పోలీస్ స్టేషన్ లో బాధిత మహిళ వరమ్మకు జరిగిన సంఘటన పట్ల సంబంధిత ఎస్ఐపై చర్యలు తీసుకోవాలని లేనిపక్షంలో ఎస్సై పైన చర్య కొరకు మహిళా కమిషన్ లో ఫిర్యాదు చేసి న్యాయ పోరాటాన్ని ప్రకటిస్తామని ప్రగతిశీల మహిళా సంఘం (పిఓడబ్ల్యు)రాష్ట్ర కార్యదర్శి వై గీత హెచ్చరించారు.ప్రజాసంఘాల ఆధ్వర్యంలో క్లబ్ ఫంక్షన్ హాల్ లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయా ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ నవపేట పోలీస్ స్టేషన్ లో జరిగిన సంఘటన పట్ల జిల్లా ఎస్పీ స్పందించి సమగ్రమైన విచారణ జరిపించి వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.పేదలు మహిళలు పోలీస్ స్టేషన్ కు పోవాలంటే విశ్వాసం కలిగేలాగా నమ్మకం కల్పించాలని అన్నారు. అనంతరం ఈ రౌండ్ టేబుల్ సమావేశం డిమాండ్లను ప్రకటిస్తూ
వరమ్మకు న్యాయం చేసి ప్రత్యర్థుల నుండి ఆమెకు రక్షణ కల్పించాలని పేర్కొన్నారు. నవపేట్ ఎస్సై పైన చర్య తీసుకోవాలని ఇలాంటివి పునరావృత్తం కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. తమ డిమాండ్లను వారం రోజుల్లో విచారణ చేసి చర్యలు తీసుకోవాలని లేని పక్షాన ప్రజాసంఘాల ఆధ్వర్యంలో న్యాయ పోరాటాన్ని ప్రకటిస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఏఐడీడబ్ల్యుఏ జిల్లా కార్యదర్శి అనసూయ,కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి మల్కయ్య, జన విజ్ఞాన వేదిక జిల్లా కార్యదర్శి పి యాదగిరి,సిపిఎం జిల్లా కార్యదర్శి ఆర్ మహిపాల్, ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వై మహేందర్ బి మల్లేష్, నాయకులు రాములు, పిడిఎస్యు జిల్లా నాయకులు గోపాల్, ప్రభాస్, గిరిజన సంఘం నాయకులు శ్రీనివాస్ నాయక్, అంబేద్కర్ సంఘం నాయకులు ఆనంద్, తదితరులు మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు శ్రీనివాస్, నవీన్ కుమార్, లక్ష్మయ్య, యాదయ్య పాల్గొన్నారు.